Monday, June 28, 2010

కర్నూలు లో బైట పడిన విలేకర్ల భూభాగోతం

*'The Hindu' శ్రీనివాసులు, 'I-news' అంకం రవి హస్తం?
*దొరికిపోయిన మరో 12 మంది కలం వీరులు
*ABN-AJ పరిశోధనాత్మక కథనం
* అన్ని జిల్లాల్లో భూ గుట్లు తేల్చాల్సిన తరుణమిది 

ఊళ్లలో విలేకర్లు మాఫియా స్థాయికి చేరుకున్నారని...భూ భాగోతాలలో వీరి అదృశ్య హస్తం ఉందని గతంలో ఈ బ్లాగ్ లో మేం ప్రస్తావించాం. కర్నూలు జర్నలిస్టులు 14 మంది సిండికేట్ అయి 2004 లో అధికారులు, పోలీసుల సాయంతో అసైన్డ్ భూమి కొని, దాన్ని భార్యల పేరు మీదకు బదలాయించి GPA ద్వారా దాన్ని ఒక సంస్థకు అమ్మి డబ్బు చేసుకునేందుకు చేసిన యత్నాన్ని ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ ఈ రోజు బట్టబయలు చేసింది. దానికి ఆ ఛానల్ పెట్టిన శీర్షిక--"దెబ్బకు ఠా...జర్నలిస్టుల ముఠా."

ఈ ముఠా లో... 'హార్డ్ కోర్ టాక్' పేరిట అన్యాయాలు, అక్రమాల గురించి మేథావులతో రోజూ ఐ-న్యూస్ లో చర్చల మీద చర్చలు దంచి కొట్టే అంకం రవి, ఎన్నో స్కాంలు బైటికి తెచ్చిన సత్యనారాయణ రాజు (ప్రస్తుతం TV-5), సంసార పక్షం లాంటి 'ది హిందూ' విలేకరి శ్రీనివాసులు వంటి వారు ఉండడం విశేషం. 
N-TV రిపోర్టర్ చంద్రశేఖర్ ఈ వ్యవహారం లో కీలక పాత్ర పోషించినట్లు ఛానల్ తెలిపింది. 

గణేష్ నగర్ లోని ఆ భూమి హక్కుదారును తానని ఒక దళితుడు కోర్టు చుట్టూ తిరుగుతుంటే...ఈ జర్నలిస్టులు అధికార గణం అండతో 85 సెంట్ల ఈ భూమిని సెంటు 11,714 రూపాయల చొప్పున ఆరేళ్ళ కిందట కొన్నారని, ఆ పక్కది, ఈ పక్కది కలిపేసుకుని దాన్ని ఇప్పటికి 114 సెంట్లు చేసారని కూడా ఆ ఛానల్ తెలిపింది. భూముల ధరలు పెరగడంతో డెవలప్ మెంట్ కు ఇచ్చి సొమ్ము చేసుకోవాలని ఆశపడి జర్నలిస్టులు దొరికిపోయారని, తమ సంస్థకు చెందిన సత్తెన్న అనే జర్నలిస్టుకు గతంలోనే ఉద్వాసన పలికినట్లు కూడా ప్రకటించింది. 

ఆ ఛానల్ కథనం ప్రకారం--ఈ భూ వివాదంలో పాలు పంచుకున్న జర్నలిస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
N-TV                    జి.చంద్ర శేఖర్
I-News                 అంకం రవి
The Hindu            డి.శ్రీనివాసులు
Saakshi                 బాల కోటేశ్వర రావు 

I-News                  సత్తెన్న 
Saakshi                 డి.హుస్సేన్ (photographer)
Eenadu                 మురళి (photographer)
Times of India (ex) వీరభద్ర రావు
Andhrajyothi         ఎం.వి.రామారావు

Andhra Prabha      గిడ్డయ్య
TV-5                      సత్యనారాయణ రాజు
Vaartha                  మౌలాలి
Vaartha                  టి.మద్దిలేటి

Prajashakti             గోరంట్లప్ప

అయితే...ఈ కథనం చూసి ...జర్నలిస్టుల కోటా కింద ప్రభుత్వ భూమి తీసుకున్నరేమో అని ముందుగా భావించాం. అయితే...ఈ జర్నలిస్టులలో పలువురు అప్పటికే మరొక చోట ప్రభుత్వ భూమి కారుచౌకకు తీసుకుని ఉన్నట్లు ఈ ఛానల్ చెబుతున్నది.

ఇప్పుడు జర్నలిస్టులు....ఈ ఛానల్ ఓనర్ వేమూరి రాధాకృష్ణ ఎక్కడైనా భూ ఆక్రమణలకు, పైరవీలకు తెగపడ్డారేమో  చూసి...పట్టుకుని...ప్రతి పరిశోధన చూసి సత్తా నిరూపించుకోవాలి. నిజంగానే ఈ పోటీ అభినందనీయం. ఈ ఛానెల్స్, పత్రికలు దీనిపై వెంటనే దర్యాప్తు జరిపి నేరం రుజువైతే...ఈ కలం వీరులను వెంటనే సస్పెండ్ చేయాలి. వీరికి మరే మీడియా సంస్థ ఉద్యోగాలు ఇవ్వకుండా....ఒక మంచి సందేశం ఇవ్వాలి. అయితే...భూ కబ్జాకోర్లు, నీతిమాలిన రియల్టర్లు యజమానులుగా ఉన్న ఛానెల్స్, పత్రికలు వీరిపై చర్య తీసుకుంటాయని అనుకోవడం భ్రమే. 'ది హిందూ' మాత్రం వెంటనే స్పందించే అవకాశం వుంది.
Note: దీనిపై... ఆరోపణలు ఎదుర్కుంటున్న జర్నలిస్టులు ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమైనా వుంటే...మాకు రాయవచ్చు. మీరు బహిరంగంగా తప్పు ఒప్పుకోవడానికి లేదా మీ వాదన వినిపించడానికి దీన్ని ఒక వేదికగా వినియోగించుకోవచ్చు.

12 comments:

VENKATA SUBA RAO KAVURI said...

విశ్యశనీయ సమాచారం ప్రకారం స్కాములొ ఉన్న విలేకరులందరూ హైదరాబాదు బయలుదేరారు. ఇక్కడ యేదో ఒక టీవీ యాజమాన్యాన్ని పట్టుకుని మంగళవారం నాడు లైవ్ పెట్టించే ప్రయత్నం మొదలయినట్లు తెలిసింది. బహుశా ఎన్లోగాని ఐలొగాని కావచ్చని వూహిస్తున్నాను.
వెంకట సుబ్బారావు. కావూరి

ramnarsimha said...

Sir,

My heartly congratulations to "ABN-

ANDHRAJYOTHY"..

katta jayaprakash said...

AS ABN has started a campaign against the illegal,unethical and unproffessional ways of the journalists I am sure more such scandals will be unearthed by the channel.It is astonishing that The Hindu staffer is also one of the partners of the scandal as he is well paid.This story of Kurnool journalists is only a tip of iceberg as there are many such hidden stories on the journalists of the state including the journalists who are on various beats in the Hyderabad.Iam sure more and more new stories will be seen on ABN as more number of people will feed the channel with various stories.Infact no proffession is free of these scandals,corruption etc but a journalist, like a doctor who treats a disease, should also treat the society from various diseases but unfortunately the journalist himself is suffering with many chronic diseases and he needs some other to treat him or her.
JP.

premade jayam said...

అ. వాళ్ళంతా డబ్బులు పెట్టి ప్రభుత్వ భూమి కొన్నారు.
ఆ. ఎకరానికి పదకొండు లక్షలు పెట్టారు.
ఇ. 2004 లో భూమికి అంత బూం లేదు.
ఈ. ఏ పర్పస్ మీద భూమి ఇచ్చారో abn చెప్పలేదు.
ఉ. రైతు ఎక్కడినుంచి వచ్చాడు? సాగు చేసుకుంటున్న వ్యక్తీ 12 ఏళ్ళు అనుభవదారు అయితే భూమి సొంతం అవుతుంది. కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు. sc st చట్టం ఎందుకు ప్రయోగించలేదు?
ఊ. వాళ్ళు ఎంతవరకు గీత దాటారు. మీడియా యజమానులకు లేని మడి వీళ్ళే ఎందుకు కట్టుకోవాలి.
ఎ. నివాసానికి ఉద్దేశించిన జర్నలిస్ట్ కాలనీ లో రాదా కృష్ణ పేపర్ ఆఫీస్ పెడితే అందులో ఏమి లొసుగు లేదా.
ఏ. రాము చేతకాక నిజాయితీ పరుడా. చేతనై మడి కట్టుకున్నాడా. ఉదాహరణలు రెండు.
ఐ. ఏదైనా ఫైన్ కడితే రేగ్యులరైస్ చేయడం దివంగత వైఎస్ నేర్పించారు. వీళ్ళు కూడా ఫైన్ కట్టి మళ్ళీ సభాపతుల్లా పవిత్రులు కావచ్చు కదా.
ఒ. రాదా కృష్ణ యుద్ధం కుళ్ళిపోయిన విలేకరుల మీదా. కుళ్ళి పోయిన విలేకరులు ఉన్న టీవీ చానల్లు, పత్రికల మీదా.
ఓ. రెండోదే అయితే తన పేపర్ కూడా కుళ్ళి పోయిందని రుజువు అయ్యింది కదా.
ఔ. మొదటిదే అయితే తన అద్దానికి ఏం చెబుతాడు. సి బ్లాక్ సీఎం చాంబర్ గోడలకు ఏం చెబుతాడు.
అం. ఇది కేవలం సబ్బుల కంపెనీల అవాక్కయారా యాడ్ లాంటిదే. యుని లీవర్, ప్రాక్టార్ అండ్ గ్యాన్ బుల్ ... సచ్చినట్లు వాటిలోంచే కొనాలి.

katta jayaprakash said...

Let there be an enquiry by the Revenue officials in the real estate episode for the facts to come out.Let the journalists who are involved in the land deal come out with documents to prove their legality in acquiring the land so that they can challenge ABN for the story and file a defamation case againt it.Now the ball is in the court of the journalists of Kurnool.Let there not be any unwanted,bitter and poisonous coments or criticism personally on any one.
JP

Vinay Datta said...

when are you publishing about the journalist involved with the TTD tickets?

katta jayaprakash said...

According to the news of Deccan Cjhronicle 14 journalists were given five cents of land for housing purpose out of 17 plots in Ganeshnagar,Kurnool by the Revenue officials.The journalists have given power of attorney to a builder to build a complex on these plots..During the enquiry by the Revenue officials it was found that the builder has encroached 35ft road and five cents of other's land.
JP.

పానీపూరి123 said...

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jun/30/main/30main21&more=2010/jun/30/main/main&date=6/30/2010

నరేష్ నందం (Naresh Nandam) said...

జర్నలిస్టుల తెర చాటు భారతాలు
(తెర)ముందున్నోళ్లకు నయా నాలెడ్జ్ గుళికలు
బయటకు తెచ్చే కొద్దీ మిర్చిమసాలాలు
ఫీల్డులో ఎవరికి తెలియదు మిత్రుల లీలలు

"డబ్బు కన్నా భూమికి అభివృద్ధి రేటెక్కువ"
రియాల్టర్లతో ఉన్నప్పుడు తెలివి కొంత రాదా?
"ఉపయోగించని జ్ఞానం ఎంతున్నా దండగ"
ధనలక్ష్మిని నట్టింటికి తెచ్చే అవకాశం చేదా?

మనకు అంటకుండా
పక్కోడిపై బురద జల్లగలమా?
నిఘా అద్దాల వెనుక
నేత్రాలు బయటకి రావా?

ఇంకెంత మంది మేకప్పులు కడిగేస్తుందో
రాధాకృష్ణుడి కొత్త సాంప్రదాయం
ఇక మీడియా బాబులు ఒక్కచోట చేరితే
అనుమానపు లుక్కులు ఖాయం


-------------------------
రాము గారు మళ్లీ పిల్లి గడ్డం పెంచుతున్నారోచ్!
(బహుశా ఫణిగారి లాంటి పేద్ద మిత్రులు గుర్తు పట్టటం కోసం కావచ్చు) ;)

Saahitya Abhimaani said...

"...............ఇప్పుడు జర్నలిస్టులు....ఈ ఛానల్ ఓనర్ వేమూరి రాధాకృష్ణ ఎక్కడైనా భూ ఆక్రమణలకు, పైరవీలకు తెగపడ్డారేమో చూసి...పట్టుకుని...ప్రతి పరిశోధన చూసి సత్తా నిరూపించుకోవాలి............"

I do not like the above statement. Unless our scams are brought out broadly into public by somebody, we shall not go into investigative mode that too on who has shown our scams!!!??? This is not the way journalists should work and it is not the spirit of investigative journalism. Ramuji, yet tu......!!!??

Ramu S said...

అవును శివ గారు,
బాగా పట్టుకున్నారు.
ఆ వాక్యం రాస్తున్నప్పుడు నేను కూడా కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యాను. నేను చెప్ప దలుచుకున్నది..Pot calling the kettle black.

Ramu

Ramaraju said...

idhemee bagaledhandi. enthaseapoo mee telangana journalistula avineethi gurinchea chepithe maa andhravallam eamaipovali. Ikkadaa kabjaala sangathulu pushkalamga unnai. Vizagloni kondharu badaa journalistula vivaralu theeyandi. Ouraa anipinchakapothea choodandi.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి