Wednesday, June 16, 2010

కెమెరా ముందు లైవ్ లో....అంత వీజీ కాదు బాబాయ్...

తనదాకా వస్తేగానీ తత్వం బోధపడదు. 'ఆ యాంకర్ ఇట్లా...ఈ యాంకర్ అట్లా....' అని కూల్ గా కంప్యూటర్ ముందు కూర్చుని రాసే నాకు నిన్న...మంగళవారం స్టూడియోలో కూర్చుని జీవితంలో మొదటి సారి లైవ్ లో కెమెరాను ఎదుర్కోవాల్సిన స్థితి ఏర్పడింది. 'ఇండియన్ స్కూల్ అఫ్ జర్నలిజం' డీన్ హోదాలో హెచ్.ఎం.టీ వీ లో....'మీడియాలో ఉపాధి అవకాశాలు' అన్న అంశంపై  మంగళవారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదింటి దాకా మాట్లాడాలని, కొన్ని కాల్స్ తీసుకోవాలని ఆ వ్యవహారాలు చూసే మిత్రుడు చెప్పారు...సోమవారం సాయంత్రం.

ఇక అప్పుడు మొదలయ్యింది దడ, ఎవ్వరికీ చెప్పుకోలేని టెన్షన్. క్లాస్ రూంలో లెక్చర్ దంచమంటే ఇంగ్లిష్ లేదా తెలుగులో ఒక రెండు గంటలు ఏకధాటిగా లాగించగలం కానీ...స్టూడియోలో కూర్చొని షో చేయడం మనకు కష్టమని నా ఉద్దేశం. గతంలో...ఒకటి రెండు ఛానెల్స్ వాళ్ళు...స్టూడియోలకు రమ్మంటే....నేను కుదరదన్నాను. అందుకు కారణాలు రెండు. ఒకటి, కెమెరా ముందు తడబడి పరువు పోగొట్టుకుంటామేమో అన్న భయం. రెండు, కంచిగరుడ సేవ చేయడానికి మనం వ్యతిరేకం.

స్టూడియోలలో కూర్చుని అన్యాయాలు, అక్రమాల మీద ఉపన్యాసాలు దంచుతూ....వెళ్ళే వాళ్లకు ఛానెల్స్ యజమానులు ఒక్క పైసా అయినా ఇవ్వరని, అది వారి తీట వ్యవహారమని తెలిసి నేను అవాక్కయ్యాను ఒక ఏడాది కిందట. అప్పటి నుంచి ఒక్కటే లెక్క పెట్టుకున్నాను...ఏ స్టూడియో కైనా ఫ్రీగా వెళ్లకూడదని. ఛానల్ వాళ్ళేమో...మన సొల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తారు...మనమేమో...పనీపాటా మానుకుని...స్టూడియోల చుట్టూ తిరిగి 'ఓహో...గోప్పోడ్ని అయిపోయా..' అని చంకలు గుద్దుకోవాలి?....ఇది మన ఒంటికి పడని ఎవ్వారం. 

స్టేజ్ భయం పోవడానికి ఖమ్మం జిల్లా వైరా స్కూల్లో వక్తృత్వం పోటీలకు పేరు ఇవ్వడం.... పెద్ద చెట్టుకింద పెట్టిన ఆ పోటీలో సారు పేరు పిలవగానే గుండె గుభేల్ మానడం...కాస్త ధైర్యం చేసి వెళ్లి మైకు పట్టుకోగానే బట్టలు తడవడం...మైకు కూయ్...మని విచిత్రమైన పిల్లికూత  చేయగానే గూబ గుయ్యి మనడం....గుండె అరికాల్లోకి జారి...నాలుక పిడచకట్టుకుపోవడం....చెప్పదలుచుకున్న నాలుగు మాటలు నాభి నుంచి బయలుదేరి ఎవడో కావాలని ఆపినట్లు గొంతు దగ్గర జాం అయిపోవడం....ఈ విచిత్ర సంకట స్థితి నుంచి తేరుకునే లోపు కోపిస్టి మాస్టారు మరొక అభ్యర్ధి పేరు పిలవడం....మిత్రులు...'క్లాస్ పరువు తీసావు....ఏమి పుట్టిన్దిరా నీకు' అని తిట్టడం...అన్నీ సోమవారం రాత్రి పడుకునేప్పుడు, మంగళవారం లేచాక గుర్తుకు వచ్చాయి. ఇంతలో...పుత్ర రత్నం స్కూల్ బస్ మిస్సయి ఇంటికి వస్తే....వాడి మీద ఎన్నడూ లేని వెర్రికోపంతో బలప్రయోగం చేసి, విసురుగా బండి తీసి స్కూల్లో దిగబెట్టి వస్తున్నప్పుడు అర్థమయ్యింది...'లైవ్ షో' మనసులో పనిచేస్తున్నదని.


సరే అని రోజుకన్నా ఓవర్ గా ముస్తాబై...హేమ జాగ్రత్తగా సెలెక్ట్ చేసిన డ్రస్ వేసుకుని ఆఫీసుకు బయలు దేరా. టీ.వీ.రంగం లో ఐదేళ్ళ అనుభవం ఉన్న హేమ కొన్ని టిప్స్ ఇచ్చింది, ధైర్య వచనాలు పలికింది. కారు రివర్స్ చేస్తుంటే...ఎన్నడూ లేనిది... వెళ్లి వెనక గోడను గుద్దుకుంది. డామేజ్ తీవ్రత చూద్దామని దిగుతుంటే...పక్కన వున్న టూ వీలర్ కిక్ రాడ్ తగిలి చీలమండలం కణుపు దగ్గర స్వల్ప గాయమయ్యింది. మా గుండె గారు కెమేరాకు భయపడి చస్తున్నారని, అందుకే...ఇలాంటివి జరుగుతున్నాయని బుర్ర వారు చెప్పారు.
ఈ షో గురించి ఆలోచించకుండా....ఎఫ్.ఎం.లో పాటలు వింటూ బయలుదేరా.

ఎలాగోలా సేఫుగా ఆఫీసుకు వచ్చా. సరే...ఇలాంటి ప్రోగ్రామ్స్ లో కొంత డాటా ఇవ్వడం బాగుంటుందని....మా సారు డాక్టర్ కే.నాగేశ్వర్ గారిని చూసి అర్థం చేసుకున్న వాడిని కాబట్టి....గూగుల్ వారి సాయంతో కొన్ని సర్వే లు, మా స్కూల్ ను బాగా ప్రొజెక్ట్ చేయడానికి ఉపకరించే పాయింట్స్ రాసుకున్నా. హేమ ఇచ్చిన ఇడ్లీలు తిందామని డబ్బా తీస్తే...అవి సహించలేదు. ఆ తెల్ల ఇడ్లీలు నాలుగూ...పచ్చని 'సాఫ్ట్ లాఫింగ్ బాల్స్' లా కనిపించి...'హ..హ.హ్హా..' అని నవ్వుతున్నట్లు అనిపించాయి. దెబ్బకు మూత మూసి కంప్యూటర్ ఆన్ చేశాను. సరే ప్రోగ్రాం లో పాల్గొనడం నుంచి  తప్పించుకోలేము కనుక....ఫీడ్ బాక్ తీసుకోవడానికని కొందరు మిత్రులకు మెయిల్ ఇచ్చా....చూడండహూ...అని.

ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసిన సోదరుడు చక్రపాణి అసలే.... యెటకారం డాట్ కామ్. ఏవో సటైర్లు వేస్తూనే వున్నాడు మన మన బట్ట తల, బట్టల గురించి...ఉదయం నుంచి.  మొత్తం మీద చాలా భారంగా మనం ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానే వచ్చింది. అప్పుడు నేను అభిమానించే ఒక సీనియర్ జర్నలిస్టు ఆఖరి నిమిషంలో చెప్పారు....కోటు వేసుకోవాలని. నా టెన్షన్ కనిపెట్టిన మిత్రుడు బ్రహ్మచారి గారి సహకారంతో టై, కోటు వ్యవహారం చూసుకుని, కాస్త రంగు అద్దించుకుని...స్టూడియోలో కూర్చుంటే....మళ్ళీ  వైరాలో చెట్టు కింద సీను కళ్ళ ముందు కదలాడింది. నిజానికది అశుభ
సూచకం కానీ....ఇప్పుడు గుండె, నాలుక పెద్ద గొడవ చేయలేదు. ఇది శుభసూచకం. ఎస్...స్టేజ్ ఫియర్ను జయించామన్న మాట. 

యాంకర్ కిరణ్ గారు చాలా ఫ్రెండ్లీ గా ఉండడం....ఇద్దరం కాసేపు ముందే మాట్లాడుకోవడం...వల్ల  అర్థగంట ప్రోగ్రాం రెండు నిమిషాలలో అయినట్లు అనిపించింది. నాకు కూడా మధ్యలో పెద్దగా ఇబ్బంది కలగలేదు. కొత్తవాళ్ళు కెమెరా ముందు పడే తడబాటు ఏదీ నాలో కనిపించలేదని....ఈజ్, ఫ్లో బాగానే వున్నాయని మిత్రులు అన్నారు. హమ్మయ్య....ఒక అనుభవం మిగిలింది. స్టూడియో నుంచి బైటికి వస్తుంటే...వాడు గుర్తుకు వచ్చాడు. సారీ ఫిదెల్...ఈ చెత్త టెన్షన్ వల్ల ఓపిక కాస్త నశించింది. 

బాగుందంటూ ఫ్రెండ్స్ నుంచి ఫోన్లు వచ్చాయి. ప్రోగ్రాం చేసి వెళుతుంటే....గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ గారు (ఒక పెద్దాయన) బలవంతంగా చేయి గుంజుకొని...'మీరు చాలా బాగా మాట్లాడారు...సార్. బాగుంది,' అని ప్రేమతో అన్నారు. తమ్ముడి ఇంట్లో నిన్న ఈ ప్రోగ్రాం చూసి  ఈ రోజు ఉదయం ఇంటికి వచ్చిన అమ్మ...వస్తూనే....షేక్ హ్యాండ్ ఇచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుని...'బాగుంది నాన్నా' అన్నది. ఏంటో...అదొక తృప్తి. 

23 comments:

Krishnarjun said...

Ramu garu,
so, you are also from Khammam dt. ?? I am also from Khammam.

I too had similar experience in the elecution competitions when i was studying at SR & BGNR Govt. degree college, Khammam.

we had missed this programme. you should have announced about your appearance in your blog.

mee
krishna

Krishnarjun said...

forgot to ask, howmuch do they pay for such guest appearances ??

just for academic / commercial interest.

rgds
krishna

Krishnarjun said...

Former Resident Editor of New Indian Express and Senior Journalist P S Sundaram passed away yesterday.

Raja said...

Ramu garu aa time munde mana blog lo announce chesinte bagundu kada?

mee experience chaduvutunte Barrister Parvateesham gurthochadu..

Twaralo malli meeru tv looki yekkalani korukuntu :)

Raja

సుజాత వేల్పూరి said...

కళ్ళకుకట్టినట్లు వర్ణించారే మీ టెన్షన్ అంతా! మొత్తానికి హాస్యం బాగా పండించారు!

అది సరే,మాక్కూడా కాస్త ముందు చెప్తే మేము కూడా చూసే వాళ్ళం కదండీ!

Vinay Datta said...

Prior announcement of the programme would have helped the visitors of the blog as the topic was jounalism. I don't get HM here in chennai. Any chances of watching it on youtube?

nareshnunna said...

Dear Ramu,

I believe that u r most beloved to many (don't show this post to Hema garu :-)), as u r childlike and also profound.

cheers,
naresh

Ramu S said...

కృష్ణ గారి కోసం...
సర్, ఆ రేట్ల వివరాలు స్పష్టంగా మనకు తెలియదు. అర్ధగంటకు ఒక ఎనభై వేలు కావచ్చు అనుకుంటా.

రాజ, సుజాత, మాధురి గార్ల కోసం...
ఏదో సరదాకు ఒక పోస్టు రాసా గానీ అండీ, దానికి అంత సీను ఉన్నదంటారా? ఇవ్వాళే అన్నారు...మరొక సారి మాట్లాడాలని. చూద్దాం.

నరేష్ గారి కోసం...
నరేష్ గారూ...మనసులో అందరికీ చిన్నోడు ఒకడు ఉంటాడు కదా సార్. వాడు యెంత యాక్టివ్ గా వుంటే, మనం అంత యాక్టివ్. ఇలా అక్షర రూపం ఇవ్వకపోతే...అంతా పెద్దరికమే కదా!
రాము

పానీపూరి123 said...

> సర్, ఆ రేట్ల వివరాలు స్పష్టంగా మనకు తెలియదు. అర్ధగంటకు ఒక ఎనభై వేలు కావచ్చు అనుకుంటా
ఒక ప్రక్కన 80 వేలు అంటున్నారు, ఇంకో ప్రక్కన రేటు విషయం స్పష్టంగా తెలియదు అంటూన్నారు?, మరి ఆ 80వేలు HMTV వారికి ఎవరు ఇచ్చారు?

Ramu S said...

పానీపూరి గారు..
డబ్బు వ్యవహారంతో మనకు సంబంధం లేదు. ఆ సెక్షన్ వేరు. మనం అలాంటి వాటిలో తలదూర్చం.
రాము

Saahitya Abhimaani said...

Congratulations on the eve of your first appearance in live TV. I too missed the programme as I was in Office at that time.

Krishnarjun said...

You can catch this video is on
http://www.hmtvlive.com/web/guest-public/38

VIDEO THAT YOU NEED TO CHECK ON THIS WEBSHEET IS ...

స్టూడెంట్ జంక్షన్ 15-06-2010 16:30PM

Ramu S said...

పానీపూరి గారు...
Indian School of Journalism is launched by Kapil group, the owners of the HM-TV. FYI
Ramu

నరేష్ నందం (Naresh Nandam) said...

బాగుంది రామూ గారూ..

ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్ కూడా ఓకే.

మీ కెమేరా వైపు ఎక్కువ సార్లు చూస్తే ఇంకా బాగుంటుంది.

మొదటిసారి కదా..
ఐఎస్‌జె బ్యాచ్ మొదలయేలోపు ఇంకో రెండు మూడు సార్లు ఎలాగూ లైవ్‌లోకి వస్తారు. అప్పటికి అలవాటవుతుంది లెండి.
(మనలో మన మాట.. ఒకసారి లైవ్‌లో కనిపించిన వారికి మళ్లీ మళ్లీ కనిపించాలన్న ఉత్సాహం ఉంటుంది.)

@Krishnarjun
TV Channels do not pay for guest appearances. But, there are always a chance for paid programmes where the Guest pay the channel something around 40-50k for 30min.

For others..
hmtv can be viewed around the world at http://hmtvlive.com or http://hmtv.co.tv

Raja said...

Thanks Krishnarjun for the link

Vinay Datta said...

@krishnarjun:

Thank you for the link.

@Ramu garu:

I've seen the programme. You presented everything well. Happy to know that the print media will be alive in the future.

The package about marketing, ADs, organizing is interesting.

Saahitya Abhimaani said...

Ramu garoo,

I tried to see the video in the HMTV website but in vain.

Is it possible that you can post excerpts of the video of the programme in You Tube in 3-4 parts, so that we can see.

Ramu S said...

శివ గారు,
అదొక పెద్ద గొప్ప ప్రోగ్రాం కాదు సారూ. మీకు మెయిల్ లో రాసినట్లు ఒక ప్రమోషనల్ కార్యక్రమం. ఒరిజినల్ యు-ట్యూబ్ లో పెట్టేంత సీన్ ఉన్న కార్యక్రమం కాదు. మీరు మరోలా అనుకోకండి.

నరేష్,
నిజమే, కెమెరా వైపు ఎక్కువగా చూడాల్సింది.థాంక్స్
రాము

katta jayaprakash said...

Really your expereince looks like a comedy of error!Anyhow good coverage of your first day experience of a live show.But sorry to miss it.I agree with Sujatha garu amd Madhuri garu that you should have informed to your bloggers first.Why such a negligence towards us Ramu saar?Hope you donot repeat it in future.
JP.

Krishnarjun said...

Siva gaaru,

once you click the link you need to wait for about 5 to 10 min for the video to buffer. try once again.
I tried downloading it but thesre is no option for downloading on HMTV website.

regards
krishna

Thirmal Reddy said...

I had a chance to see the live show. It was pretty good and never seemed like it was your first appearance on TV. The way you handled the callers' questions was smooth and answers were to-the-point. Some lacking was that you had not made a conscious effort to look at the camera. That's the biggest issue with any first timer going live. One's presence of mind is always shadowed by the fear of being watched over by an audience. Ofcourse, when there are no callers, an attempt can be made to speak more about the subject than just leaving the show to the anchor to manage. Nevertheless, it was a good experience and hope to see you more often. Ya, so the next time you're on air, I'll call to embarrass you.

Just Kidding :)

Thirmal Reddy
thirmal.reddy@google.com

Ramu S said...

తిరుమల్ భాయ్...
మీరు చూసారన్నమాట. మీ సూచనకు థాంక్స్. మీరంతా ఈ బిజినెస్ లో తలపండినవారు. నాకేమో కొత్త.
సరే...సార్...ప్రశ్న అడగండి. చూద్దాం. 'గూగుల్ లో చక్కగా పనిచేసుకోక...ఈ జర్నలిజం కోర్సు మీ కెందుకు సార్...." అని అంటాను.
రాము

ramnarsimha said...

Hai sir,

Its very funny.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి