Wednesday, June 16, 2010

తిరుమల స్కాం లో పాలుపంచుకున్న'ఆ విలేకరి' ఎవరు?

తిరుమలలో టికెట్స్ స్కామ్ లో ఒక 'ప్రముఖ' ఛానల్ విలేకరి హస్తం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు నిన్న రాత్రి అన్ని ఛానెల్స్ స్క్రాల్స్ (తెర మీద రీల్ లా తిరిగే అక్షరాలు) చూపించాయి. 

ఇది నాకు పెద్ద విచిత్రం అనిపించలేదు. ఆలయాలలో విలేకరుల  అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. కానీ...ఏ ఛానల్ ఆ 'ప్రముఖ' ఛానల్ పేరు గానీ, ఆ విలేకరి మహాశేయుడి పేరు గానీ చూపించలేదు/ చెప్పలేదు. తెలిసిన సత్యాన్ని జనాలకు చెప్పకపోవడం లేదా సమాచారాన్ని తొక్కిపట్టడం కూడా అనైతిక జర్నలిజమే. ఆ విలేకరి స్థానం లో వేరే అధికారో, నాయకుడో ఉన్నాడనుకోండి. 

అప్పుడు మన ఛానెల్స్...రెచ్చిపోయి...వాడి పేరు, ఊరు, భార్య పేరు, ఆస్తుల వివరాలు వంటి సమాచారాన్ని ఆఘమేఘాల మీద అందించే ప్రయత్నం చేస్తాయి. ఆ నిందిత నేతో, అధికారో కనిపిస్తే...గొట్టం మూతి ముందు పెట్టి...'దీనిపై మీరేమంటారు?' అని గద్దించి మరీ అడుగుతాయి. విలేకరి అవినీతి చేస్తే ఎందుకు ఉపేక్షించాలి? తనయుడు...తప్పు చేసినా...తొక్కిపారేసే భారతీయులను మనం తయారుచేయలేమా? 

మొత్తానికి...నిన్న రాత్రి...'ఎవరీ ఛానల్?', 'ఎవరీ విలేకరి?' అన్న దాని మీద దర్యాప్తు మొదలు పెట్టాను. దాని మీద సమగ్ర సమాచారం అందిస్తాను. ఈ లోపు....తిరుమల తతంగం తెలిసిన విలేకరులు...ఆ వివరాలు srsethicalmedia@gmail.com కు మెయిల్ చేస్తే...థాంక్స్. 

12 comments:

డి.వి.యస్.అబ్బులు said...

రాముగారూ,

"విలేకరి" కాదు "విలేఖరి" అన్నది సరైన పదమేమో! ఈ కామెంట్ ప్రచురించవద్దు. ఒకవేళ పొరపాటున టైప్ చేసి ఉంటే సవరిస్తారని రాసా, అంతే.

భవదీయుడు
అబ్బులు

Ramu S said...

అబ్బులు గారు...
'ఖరం' అంటే గాడిద కాబట్టి, విలేఖరి అని రాయవద్దని విలేకరి అని రాయమన్నారు జర్నలిజం స్కూల్ లో. అప్పట్లోనే నాకు ఒక సందేహం ఉండేది. 'కరి' అంటే ఏనుగు కదా అని. గాడిద కన్నా ఏనుగు నయం. అయినా..దీని వ్యుత్పత్తి నాకు తెలీదు.
ఇలా ఏమైనా తప్పులు కనిపిస్తే దయచేసి అలెర్ట్ చేయండి, సవరించుకుంటాను. థాంక్స్
రాము

డి.వి.యస్.అబ్బులు said...

రాముగారూ,

వ్యుత్పత్తి పదం నాకు సరిగ్గా తెలీదు గానీ, సంస్కృతంలో "विलिखितम्" అంటే వ్రాయబడినది అని అర్థం అనుకుంటాను. దానినుంచి పుట్టినదే "విలేఖరి" (వ్రాసేవాడు) అని నా అభిప్రాయం.

అబ్బులు

hai telugu news said...

కరి అయినా ఖరమైనా అయినా బండ చాకిరి చేసేవే. పాత్రికేయుడికి రెండు సరిపోయేవే. కరి లాగా కాస్త డిగ్నిటీ మెయింటెయిన్ చేస్తే, అప్పుడప్పుడు మావటిని కూడా భయ పెట్ట గలిగితే విలేకరి. ఖరం లాగా తలవంచుకోవడం అలవాటయితే, జీవితంలో వెనక్కి చూసుకుంటే ఏవీ మిగలక పొతే విలేఖరి.

Malakpet Rowdy said...

విలేఖరిని విలే + ఖరి అని విడగొట్టిందే కాకుండా ఖరి అంటే ఖరం అనే అర్ధం కూడా లాగారా జర్నలిజం స్కూలులో? ఏ స్కూలు సార్ అది? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నేను తెలుగు పండితుడిని కాకపోవచ్చుగాని విలేఖరిని వి-లేఖరి అని చెప్పుకోవచ్చేమో - లేఖరి అంటే లిఖించే మనిషి అని, విలేఖరి అంటే సమూలంగా/సమగ్రంగా ( తప్పా? తెలుగు పండితులే చెప్పాలి) లిఖించే మనిషి అని నాకర్ధమయ్యింది

Malakpet Rowdy said...

నాశనం - వినాశనం
ధ్వంసం - విధ్వంసం
నాయకుడు - వినాయకుడు
ప్లవము - విప్లవము
లేఖరి - విలేఖరి

hai telugu news said...

స్టార్ ప్లస్ పదేళ్ళయినా సందర్భంగా లోగో మార్చుకుంది. మన మాటీవీ కూడా తెలివిగా కొత్త లోగో లోకి వచ్చింది. తెలుగులో ఇంకా చెత్త లోగోలు ఉన్న చానల్స్ చాలానే ఉన్నాయి. జీ టీవీ , జీ న్యూస్, ఐ న్యూస్, ఎన్ టీవీ, ఎన్ స్టూడియో, మహా టీవీ, రాజ్ న్యూస్, హెచ్ ఎం టీవీ, ఆర్ టీవీ, భక్తీ టీవీ, జెమిని, తేజ, వీళ్ళంతా లోగో లు మార్చుకుంటే ఉత్తమం. కోట్లు పోసి చానల్స్ నడుపుతున్న వీళ్ళంతా కాస్త లోగోల మీద ఖర్చుపెడితే రిమోట్ శాంతిస్తుంది.

hai telugu news said...

భారత్ నంబర్ వన్ పత్రిక దైనిక్ జాగరణ్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. ఈనాడులో బ్లాక్ స్టోన్ పెట్టుబడిని కేంద్రం కాదన్నపుడు ఇదేదో వైఎస్ పవర్ అనుకున్నారు. తాజా ఉదంతం తో శక్తివంతమైన ప్రాంతీయ మీడియా లోకి విదేశీ పెట్టుబడులని కేంద్రం ఇష్టపడటం లేదని అర్ధం అయ్యింది.

jeevani said...

భరద్వాజ గారూ,

:))

ఈనాడు జర్నలిజం స్కూల్లో నేనూ విన్నాను. మాకు చెప్పింది బూదరాజు రాధాకృష్ణ గారూ. అయితే వ్యాకరణ పరంగా కాదు, మామూలుగా వినడానికి విలేఖరి బావుండదు ( గాడిద అర్థంలో, అని కరి రాయమన్నారు ) ఇది సౌలభ్యం కోస0 మాత్రమే అని గమనించగలరు.

Chandamama said...

తనయుడు...తప్పు చేసినా...తొక్కిపారేసే భారతీయులను మనం తయారుచేయలేమా?

జీవితంలోనా సినిమాలోనా.. ఆచరణ సాధ్యమయినా కాకపోయినా, వాక్యం మాత్రం అదిరింది.

ఆ విలేకరి ఎవరోబయట పెడితే మాత్రం ఏం ఒరుగుతుందని? ఇంతవరకు మీరు ఎన్నో విషయాలు వెలికితీశారు. ఏం జరిగింది, ఎవరు

ఎవరిపై చర్య తీసుకున్నారు?

ఇదేదో నిరాశావాదంతో రాస్తున్నది కాదు లెండి.

లైన్ ఎక్కౌంట్ రాతగాళ్లకు, పత్రికలలో పనిచేసే మామూలు కంట్రిబ్యూటర్లకు కూడా నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా దేశం మీదికి

తోలుతున్న వ్యాపార జర్నలిజం సంస్కృతిలో కింది నుంచి పైదాకా ఇలా కాక ఎలా ఉంటుంది? కిందిస్థాయి రాతకూలీలకు ఏ పత్రిక

సక్రమంగా జీతాలిస్తోందో దుర్భిణీలో చూడాలి మరి.

ఇది కూడా జరుగుతున్న వాస్తవమే. ఎవరినో దుయ్యబట్టడానికి కాదు. అప్పుడూ ఇంతే. ఇప్పుడూ ఇంతే. ఇప్పుడేమంటే టీవీల కారణంగా

అంతా బహిరంగమైపోతోంది. తేడా అల్లా ఇదే...

మీరు క్షేమంగా ఉండాలని ఆశిస్తూ...

Malakpet Rowdy said...

Oh, Jeevani garu

అయితే ఓకే!

Ramu S said...

Here I post the information sent by a journalist. According to him, 'ఆ విలేకరి' TV-9 రిపోర్టర్.
----------------------------

తిరుమల అక్రమార్కుడు టీవీ 9 విలేకరి. అతని పేరు వి. షణ్ముగం. ఇతనిది చిత్తూరు జిల్లా పాకాల. ఈ మధ్యనే చిన్న విలేకరుల అవినీతిపై స్టొరీ చేసాడు. రూ. 250 విలువయిన 4 సుప్రభాతం టిక్కెట్లను రూ. 40 వేలకు అమ్ముకున్నాడు. నా పరిశీలన ప్రకారం ప్రజాశక్తి విలేకరి తప్ప మిగతా వారందరికీ నెలకు కనీసం లక్హ అక్రమ ఆదాయం గిడుతోమ్ది. రూ. 2500 విలువయిన వస్త్రం టిక్కెట్టును ఓ లకారానికి అమ్ముకుంటారు. షణ్ముగం యెపేడబ్లూజె నాయకుడు కూడా.