Tuesday, June 1, 2010

ABN-ఆంధ్రజ్యోతి ప్రయోగం: 'యథాప్రజా....తథారాజా'


చూడు....రామా....'సత్యం' శక్తి మరీ అంతగా తగ్గిపోవడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నావు? దయ్యాలు వేదాలు వల్లించడం, రాక్షస సంతతి జనాలకు సుద్దులు బోధించడం. సత్యసంధులు సత్యాన్ని, క్షుద్ర గణం దాని స్వాభావిక భావజాలాన్ని బోధిస్తే పెద్దగా సమస్య ఉండదు కానీ...మీ మానవ లోకంలో సత్యం మాట్లాడాల్సిన వాళ్ళు కిమ్మనకుండా ఉంటున్నారు. ఇదే అదనుగా భావించి...క్షుద్ర సంతతి తెగ రెచ్చిపోతోంది. ఇలా రోల్స్ రివర్స్ కావడం వల్లనే 'సత్యం' ప్రభావం సన్నగిల్లింది....అర్ధమయ్యిందా?...అని గీతా చార్యుడు రాత్రి ఉషశ్రీ గొంతుతో కలలో రెండు సార్లు బోధించాడు--ఎన్నడూలేని విధంగా విచిత్రంగా.
---------------------------------------------------------------------
అసలు విషయం ఏమిటంటే...HM-TV వాళ్ళు 'దశ-దిశ' పేరిట నిర్వహించిన కార్యక్రమం క్లిక్ కావడం తో...వేమూరి రాధాకృష్ణ గారు కూడా తన ఛానల్ ABN-ఆంధ్రజ్యోతి తో ఇలాంటి ప్రయోగం మొదలుపెట్టారు. సోమవారం రాత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు లో 'యథాప్రజా....తథారాజా' అనే ఒక బహిరంగ చర్చ నిర్వహించారు...మన వేమూరి. ఇది నిజంగా మంచి ప్రయత్నం.

దాదాపు మూడు గంటల పాటు ఆద్యంతం...పరమ గందరగోళంగా సాగిన ఈ కార్యక్రమం...ముమ్మాటికీ ఒక మంచి ప్రయోగమే. అవినీతి రక్కసి దునుమాడడానికి వారు వీరనకుండా అంతా ఉపక్రమించాల్సిన సమయమది. వేమూరి దీన్ని సరిగ్గా గుర్తించారు.  ఇది జనంలోకి వెళుతుంది.

వేమూరి సభా మర్యాదలు నేర్చుకోవడానికి కూడా ఉపకరించే ప్రోగ్రాం ఇది అని చెప్పుకోవచ్చు. 'ఆగమ్మా..', 'అట్టగాదు', 'చెప్పయ్యా', 'ఏయ్..విను', 'ఆగు సుబ్బా రావ్...నువ్వాగు...' వంటి మాటలు రాత్రి లైవ్ షోలో అనడం కొద్దిగా ఎబ్బెట్టుగా దురహంకారంగా అనిపించినా....అవి సరిజేసుకోదగ్గ మాటలే.

ఈ 'కొత్త ప్రయోగం' నుంచి....'We will build up a big campaign. We will evolve a mechanism..' అని వేమూరి తన సదుద్దేశాన్ని ప్రకటించారు. ఇంతకూ చర్చ నియాంశం ఏమిటంటే.... మున్సిపల్ ఎన్నికలలో రాజకీయ నాయకులు మందూ, డబ్బూ పంచకుండా...మినిమం ప్రచారం (టీ.వీ.లకు, పత్రికలు మాత్రం యాడ్స్ ఇవ్వాలట) చేసి ఎన్నికల ఖర్చు తగ్గించడం. దీని వల్ల అవినీతి తగ్గి రామ రాజ్యం ఏర్పడవచ్చన్నది వేమూరి ఆశ అనుకుంటా. అది భేషైన ఆలోచనే.

వేమూరి  ఇచ్చిన మైకు ఆసరా చేసుకుని కొందరు నేతలు...జనాలను (వోటర్లను) కుమ్మేయ్యడానికి ప్రయత్నించారు. 'మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మందు, డబ్బు గురించి కాకుండా...మేము మేము మీ ఉపయోగానికి ఏమి చేయాలో అడగండి,' అని ఒక యువ నేత సూచన చేశారు కూడా.

వేమూరి తెలివిగా...ఈ ప్రకారం అక్కడ భాషన్స్ ఇచ్చిన నేతలతో ఒక తీర్మానం లాంటిది చేయించాలని పలు సార్లు ప్రయత్నించారు కానీ...నేతలు నసగడంతో అది కుదరలేదు. 'ఇంత మంచి టాపిక్ పై మీ లీడర్స్ ను మీరు ఒప్పించాలేరా?' అని ఒక రెండు మూడు సార్లు వేమూరి గద్దించారు కూడా. మద్యపానం పై ఒక మహిళ లేవనెత్తిన మంచి పాయింట్ ను మన జర్నలిస్టు సారు సరిగా హాండిల్ చేయలేక...మధ్యలో..."అసలు...మద్యపాన నిషేధం ఇక్కడ సబ్జెక్టు కాదు...' అని ఆ అంశానికి కత్తెర వేశారు.
మందుకు-మన నేతలకు-ఎన్నికలకు-అవినీతికి లింకు వుందని కదా 'ఆదిత్య' ప్రవచనం. ఇప్పుడు...అది సబ్జెక్టు ఎందుకు కాలేదు? మందు విషయం వదిలేసినా...పత్రికలు-రాజకీయ పార్టీలు-కులగజ్జి-అవినీతి నైనా ఒక సబ్జెక్టు చేస్తే బాగుండేది. 

జనాలను మోసం చేసే 'పెయిడ్ న్యూస్' పైనా, అలా డబ్బు పొంది వీర ఎం.డీ.లుగా వెలిగిపోతున్న వారిపైనా చర్చ జరిపి...మీడియా-పొలిటికల్ అవినీతి గురించి కూడా రచ్చ చేస్తే...జనం వేమూరికి వీర తాడు వేస్తారు. మొత్తం మీద బహిరంగంగా ఇంత మంచి విషయంపై చర్చ జరుపుతున్న వేమూరి గారికి, వారి జట్టుకు "అల్ ది బెస్ట్."

2 comments:

Anonymous said...

It is very nice that RK Aditya has learnt the good things of HM TV and started a variety programme for the people and hope more such programmes are expected from all the media houses reflecting and reacting to the peoples problems with a sincere and non commercial efforts without resorting to any gimmicks to earn revenue by targeting a few people and threatening them to expose for money.

JP.

ANALYSIS//అనాలిసిస్ said...

నిరంకుశత్వంలో అయితే " యథా రాజా -తథా ప్రజ" , ప్రజా స్వామ్యంలో అయితే " తథా ప్రజ -యథ రాజా "

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి