Wednesday, June 23, 2010

ఒక మాజీ జర్నలిస్టు స్వీయ అనుభవాలు-II

MBA చదివి 'ఈనాడు జర్నలిజం స్కూల్'లో చేరి E-TV2 లో పనిచేసి తర్వాత గూగుల్ కంపనీలో చేరిన మాజీ జర్నలిస్టు తిరుమల రెడ్డి గారు. ఆయన జర్నలిజంలో తన అనుభవాలను మొదటి పార్టు లో మొన్న పంచుకున్నారు. "Inside Media" సిరీస్ లో ఇది మరొక భాగం. మీడియాలో వ్యక్తుల గురించి ఇది చక్కని విశ్లేషణ. మీడియాలో  పనిచేసి ఈ ఉద్యోగం నచ్చకో, మరొక మంచి అవకాశం వచ్చో ఈ రంగాన్ని వీడిన వారు తమ అనుభవాలు మాకు పంపండి. అబద్ధాలు, అతిశయోక్తులు కాకుండా....స్వీయ అనుభవాలు రాస్తే...మీ ఫోటో తో సహా పోస్ట్ చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం...రాము, హేమ
-------------------------------------------------------------

 (తిరుమల రెడ్డి, ETV-2 మాజీ జర్నలిస్టు)
జర్నలిజంలో మనుషులు, మనస్తత్వాల విషయానికి వస్తే స్థూలంగా నేను చూసింది మూడు రకాల వ్యక్తులను.  
ఒకటి- పాత్రికేయ వృత్తిలో అంతగా గ్లామర్ లేని రోజుల్లో చేరి, పగలు రాత్రి తేడా లేకుండా తక్కువ జీతానికే గొడ్డు చాకిరి చేసి, కులాలు గ్రూపు రాజకీయాలు నెరిపి ఇప్పటికి మంచి స్థాయిలోకి వచ్చినవారు. వీళ్ళు తమ మెదడు ఇంకా 1980 దశకం లోనే వదిలేసి బతికేస్తుంటారు. కొత్తగా మీడియాలోకి వచ్చేవారి టాలెంట్ని అస్సలు సహించలేరు. తమ ఈగోని సంతృప్తిపరిస్తే సరి, లేదా రెబెల్ అనే ముద్రవేసో లేక మరో రకంగానో పిల్ల జర్నలిస్టు బతుకు బస్టాండు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అంటే అవసరం లేకపోయినా డబల్ షిఫ్టు వేయడం, ఎమర్జెన్సీలో కూడా సెలవు ఇవ్వకపోవడం, జూనియర్ కింద పనిచేయించడం లాంటివన్నమాట. నిఖార్సయిన జర్నలిస్టుగా పేరుతెచ్చుకున్న చాలా మంది పెద్దలు ఇలాంటి కోవకి చెందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక రెండో రకం - పైన చెప్పిన పెద్దలకు రేపటి వారసులు. 30 ఏళ్ళ కింద బాసులు ఎలా ఉండేవారో ఇప్పుడు వీళ్ళు కూడా అదే టైపు. (అదో టైపు లెండి). సొంత వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి బాసుల సేవలో తరించడం వీరి దినచర్య. జర్నలిజం అనే పదాన్ని మర్చిపోయి బాసిజమే అసలు పాత్రికేయమని నమ్మే మనుషులు. ఇలాంటి వాళ్ళు అంటే ఆ బాసులకు చాలా ఇష్టం. ఇద్దరి కులమో, ప్రాంతమో ఒకటే అయితే ఇక తిరుగులేదు. నిన్నటి దాక నాతో కలీగ్గా ఉన్న మనిషి కాస్త బాసుకి ఏజెంట్గా మారిపోయి, 'నువ్వూ పెద్ద వాళ్ళని మంచిచేసుకో....' అనే సలహా ఇస్తే ఇక ఏమి చెప్పమంటారు? అంతటితో సరిపెట్టకుండా, బాసిజం ఎలా చేలాయిన్చాలో జూనియర్ల మీద ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ బాపతు. ఎవడయినా ఎదురు తిరిగితే, వీడు పనికిరాడు సార్.... అని పెద్దల దగ్గర నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంటారు. కరీర్ నాశనం చేస్తారు.

మూడో రకం - కొన్నాళ్ళు జర్నలిజం మోజులో.... ఇలా చేద్దాం, ఆ న్యూస్ కి  ప్రాధాన్యత ఇద్దాం, ఫలానా వార్తను మరింత బాగా ఇవ్వచ్చు... అని ఎంతో ఉత్సాహంతో పని చేస్తారు. వీళ్ళలో ఉత్సాహం త్వరలోనే ఆవిరైపోతుంది. కారణం... పైన చెప్పిన బాసులకు వీరు రాసే వార్తల్లో అన్నీ తప్పులే కనిపిస్తాయి (ఉదయం ఆఫీసుకు రాగానే బాస్ కి  నమస్కారం చేయకపోవడం అసలు కారణం) లేదా, బాసు ఏజెంట్లు వేసిన ఆర్డర్ పాటించకపోవటం లాంటి తప్పులు చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇష్టపడ్డ జర్నలిజానికి న్యాయం చేయలేక, ఉన్న ఉద్యోగం వదలలేక నిత్యం మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. అర్హతలున్నవారు మరో ఉద్యోగానికి మారిపోతే, అలాంటి అవకాశం లేనివారు ఉన్న ఉద్యోగం కాపాడుకోవడానికి పాట్లు పడుతుంటారు. వారిలో చాల మంది అనానిమస్ వ్యాఖ్యలతో మీడియా బ్లాగుల్లో  తమ గోడు ఇప్పటికీ వెళ్ళబోసుకుంటూనే ఉన్నారు. 

మొత్తం మీద, తెలుగు మీడియాలో నేను ప్రత్యక్షంగా ఉన్నది నాలుగేళ్లే
అయినా... ఓ జీవిత కాలానికి సరిపడా అనుభవం సంపాదించుకున్నా. పాలగుమ్మి సాయినాథ్ గారు చెప్పినట్టు... "There are two kinds of journalists. One kind are journalists, the other are 
stenographers". ఈ స్టేనోగ్రాఫర్స్ కి నిజమైన జర్నలిస్టులుగా పని చేసే 
అవకాశం రావాలని, "The Emperor Has No Clothes At All" అని 
నిర్భయంగా చెప్పే పాత్రికేయులు ఈ రంగంలోకి అడుగుపెట్టాలని 
కోరుకుంటున్నాను. 
తిరుమల రెడ్డి 
(ETV-2 మాజీ జర్నలిస్టు) 
ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ 
గూగుల్

10 comments:

Ramu S said...

తిరుమల్,
మీ విశ్లేషణతో ముందుగా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను కూడా ఇది గమనించాను. Well done. బాసుల ను పట్టడంలో ఆరితేరిన ఒక జూనియర్...అప్పట్లో 'ఈనాడు'నుంచి 'ఆంధ్రజ్యోతి'లో చేరాడు. 'ఈనాడు' లో ఉండగా తను రెండో రకం జర్నలిస్టు, ఇప్పుడు రాధాకృష్ణ పంచన చేరాక మొదటి రకం వాడిగా మారి పోయి సతాయిస్తున్నాడని...మీరు చెప్పిన కేటగిరీ లో మూడో రకం జర్నలిస్టు లు ఒకరిద్దరు వాపోతున్నారు. తనకు బుద్ధిబలం లభించు గాక.
రాము

katta jayaprakash said...

The bossism experienced by Thirmal Reddy is seen in every proffession,department and society.A minister has to folllow,listen and respect the CM.All the subordinates have to be in same frequency adopting the policies of their bosses.A sub inspector has to follow his boss DSP or SP and so on.There is nothing to get surprised at the bossism in our society.If one is not comfortable with the boss one can leave the job happily or get adjusted with the boss till a new job is found.For example late Marri Chenna Reddy had behaved so arrogantly in his career that almost all the IAS IPA officers of all ranks were just mute spectators of his bossism.Late Dr.Shiva Reddy ruled Sarojini Hospital like a king and a super boss even abusing the lower cadre staff but he was respected by all.Ofcourse bossism must include the proffessional,ethical,moral values to be respected,honoured and loved by all and it looks the bosses which are mentioned by Thirmal Reddy lack these qualities which made him to comment adversely on them and he is doing good service to the journalsitic proffession by bringing out the bad,ugly and worst of these media bosses.
JP.

ramasai said...

media is bosism, bosism is media
if we r unable to do it we have no option to choose other profession

self-respect has no place in media organizations

Raja said...

After reading this post i can say only one thing,'Telugu Media missed a dynamic journalist'.Tirumal reddy gari post sasesham ani bhavisthu,

Raja

Educational serbvices and help line said...

Can u some one please post the TRP ratings daily or atleast weekly. Please tell me how to know the TRP ratings

Educational serbvices and help line said...

Can u some one please post the TRP ratings daily or atleast weekly. Please tell me how to know the TRP ratings

kvramana said...

'గెలవటం సరే బతకడం ఎలా' అని ఒక పెద్దాయన అద్భుతమైన 'కావ్యం' రాశారు. రెడ్డి గారు అది ఒక సారి చదవాలి. ఇంత సెన్సిటివ్ గా వున్నందునే మీరు మీడియా లో ఉండలేక పోయారు. మీరు చెప్పిన మూడు రకాల వ్యక్తులు అంతటా వుంటారు. నాలుగేళ్ళు మాత్రం పనిచేసి మీడియా మొత్తాన్ని విశ్లెషించె ప్రయత్నం అంత బాగా లేదు. ముఖ్యంగా మీరు చెప్పిన మొదటి వర్గం పైన మీరిచ్చిన వివరణ దారుణం. మేమంతా కూడా (రాము తో పాటు) చాకిరీ చెసినవాళ్ళమే. కానీ 'మెదడు ఇంకా 1980 దశకం లోనే వదిలేసి బతికేస్తుంటారు' అన్న కామెంట్ అంత బాగా లేదు. మీడియా కు అంత గ్లామర్ లేని రొజుల్లొ ఉద్యోగంలొ చేరి, తక్కువ జీతానికి గొడ్డు చాకిరి చేసి, గ్రూపులతో సంబంధం లేకుడా రాజకీయల్లో తల దూర్చకుండా రెండో మూడో ఉద్యోగాలు మారి ఇవ్వాళ ఎందరొ జూనియర్స్ ను ట్రైన్ చేసిన వర్గం మీ ద్రుష్టికి రాకపోవడం విచారకరం. మీ అభిప్రాయాలు కొంత వరకు బాగానె ఉన్నా అందులో చాలావరకు మీరు మీ దురద్రుష్టం కొద్దీ రాంగ్ హాండ్స్ లో పడడం వల్ల ఏర్పరుచుకున్న అభిప్రాయలుగానే నాకు అనిపిస్తున్నాయి. నిఖార్సైన జర్నలిస్ట్ అంటే ఏంటి రెడ్డీ సాబ్?

Unknown said...

I agree with Ramana garu. Not good to make a tirade against all. There are always problems in the work environment. Its only losers who run away and start complaining. Fight it out then and there and if you can't, you have to just leave it there without carrying your grudges forward. Ramugaru, for some reason I feel that your blog is moving in the wrong direction. Please take care. Thank you

Thirmal Reddy said...

@kvramana
అంటే మీడియా నుంచి బయటకు వెళ్ళిన వారంతా సెన్సిటివ్ అంటారు. బూతులు తిట్టినా, సూటి పోటి మాటలు అన్నా, వివరణల పేరిట హింస పెట్టినా సరే స్పందించకుండా ఉండి, వ్యక్తిత్వాన్ని చంపుకుని ఉద్యోగం కొనసాగించి ఉంటె, మీరు నన్ను మెచ్చుకునేవారు కాబోలు. నేను సెన్సిటివ్ అవునా కాదా అనే సంగతి సరే, ఏదో ఒక రూపంలో (ఈ బ్లాగులో కూడా) తమ గోడు వేల్లబోసుకునే మిగితా జర్నలిస్టులను ఏమంటారు. ఇక నా నాలుగేళ్ల అనుభవం విషయానికి వస్తే, నేను మీడియా మొత్తాన్ని విశ్లేషించే ప్రయత్నం ఎక్కడ చేసానో నాకైతే
కనిపించలేదు. నేను చెప్పింది నా అనుభవాన్ని మాత్రమే. "మెదడు ఇంకా 1980 దశకం లోనే వదిలేసి బతికేస్తుంటారు" ఈ కామెంట్ అర్ధం "రాజుగారి పెద్ద భార్య మంచిది అని" అంతే కాని "చిన్న భార్య చెడ్డది అని కాదు". జూనియర్స్ ని ట్రైన్ చేసిన వారి గురించి నా మొదటి ఆర్టికల్లో పేరు పెట్టి మరీ ప్రస్తావించాను. గమనించగలరు. "నిఖార్సైన జర్నలిస్ట్ అంటే ఏంటి రెడ్డీ సాబ్?" అని అడిగారు... ఒక పని చేసేముందు, (అది వార్త రాయడం కావచ్చు, పీపుల్ మానేజ్మెంట్ కావచ్చు) నేను radical గా చేస్తున్నానా లేక emotional గా చేస్తున్నానా అని ఆలోచించే వారిని నేను నిఖార్సైన జర్నలిస్ట్ గా భావిస్తాను. ఇది నా వివరణ మాత్రమే. మళ్లీ ఇది కూడా మీడియా మొత్తాన్ని విశ్లేషించే ప్రయత్నంగా భావిస్తే... ఇక మీ ఇష్టం.

@Madhu

If those who run away and complain are losers, what about those who are referred in the above post who also ran away and started complaining about their previous companies. You said "Fight it out then and there" then and there", Sir, which era are you rooted into? People do a job for survival, not for a pass time and "then and there" doesn't work in fight for survival. I pity your logic. Coercive expression is not always a loser's expression.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com
mobile: 9848621931

vamshi said...

రెడ్డి గారు మీరు మీ ఈ టివి అనుభవాన్ని మత్రమే తెలిపరు.....కాని ప్రస్తుతం అన్ని ఛనళ్ల పరిస్తితి ఇంతె ఈ పరిస్తితి మారుతుందని నెను భావించడంలేదు......ఎందుకంటే నెను కూడా రెండు సంవత్సరాలుగా ఒ ఛనళ్లొ పనిచేస్తున్నా



వంశీ

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి