Wednesday, June 16, 2010

TV-5 డేరింగ్ "డైమండ్ ఆపరేషన్"కు అభినందనలు...

TV-5 ఛానల్ లో బుధవారం సాయంత్రం ప్రసారమైన ఒక డేరింగ్ పరిశోధనాత్మక కథనానికి...ఆ ఛానల్ టాస్క్ ఫోర్స్ కు, ఇతర సిబ్బందికి ముందుగా అభినందనలు. ఇప్పటికే...ప్రథమ స్థానం కోసం TV-9 తో పోటీ పడుతున్న TV-5 మున్ముందు మరిన్ని ఇలాంటి అద్భుతమైన కథనాలు చేసి, ప్రసారం చేసి...చచ్చుపుచ్చుగా మారిన తెలుగు టీ.వీ.జర్నలిజానికి ఒక కొత్త ఊపు తేవాలని మా ఆకాంక్ష.
 అసలు కథ ఏమిటంటే....చిత్తూరు జిల్లాలో ఒక ముఠా చాలా పురాతనమైన పచ్చని వజ్రాన్ని అమ్ముతున్నట్లు TV-5 బృందానికి సమాచారం అందింది. బంగారు తాబేలు లో నిక్షిప్తం చేసి ఉన్న ఆ డైమండ్ క్రిష్ణ దేవరాయలు కాలం నాటిదని, దాని ఖరీదు వందల కొట్లలో ఉంటుందని ప్రాథమిక అంచనా. ఈ బండారం బైటపెట్టి...ఆ ముఠా ఆటకట్టించాలని హైదరాబాద్ నుంచి 'టాస్క్ ఫోర్స్' బృందాన్ని ఆ జిల్లాకు పంపిందీ చానల్ యాజమాన్యం. స్థానిక విలేకరులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు ఉన్నారు.

ఈ రిపోర్టర్లు ప్రాణాలకు తెగించి....ఆ ముఠా తో బేరానికి దిగారు. 'ఇది నిజమైనదో కాదో...అన్న అనుమానం మా యజమానికి వస్తుంది కాబట్టి...ఆయనకు పంపాలి' అని చెప్పి ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇదంతా వారు ఏర్పరుచుకున్న రహస్య కెమెరా బంధించినట్లు ఉంది. ఒక రాత్రి అంతా...ఈ ముఠా డేగ కళ్ళ పహారా మధ్య రిపోర్టర్లు యజమాని రాక కోసం అన్న మిషతో ఒక హోటల్ లో ఉన్నారు. ఒక మెరిక లాంటి పోలీసును వజ్రం ధర, నాణ్యత నిర్ధారించే నిపుణుడిగా రంగంలోకి దించారు. 

మర్నాడు...ఉదయం పోలీసులు ఆ ప్రదేశాన్ని రైడ్ చేసే విధంగా రంగం సిద్ధం చేసుకున్నారు జర్నలిస్టులు. అనుకున్న ప్రకారం అంతా సవ్యంగా జరిగి...పోలీసులు ఒక ఇంటి పై రైడ్ చేసి బంగారు తాబేలు లో ఉంచిన పచ్చని వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ వజ్రం ఒక టీ.టీ.డీ.ఉద్యోగో, మాజీ వుద్యోగో ఇంట్లో దొరకడం విశేషం.

ఈ జర్నలిస్టుల ధైర్యానికి నిజంగా జోహార్లు. 'ఆపరేషన్ గోవిందా' అన్న శీర్షికతో దీన్ని ప్రసారం చేశారు కానీ....ఆ కాపీ ని ఇంకా అద్భుతంగా రాయవచ్చేమో అనిపించింది. రిపోర్టర్లు చేసిన అద్భుత కృషి, ఈ స్టోరీలో నాటకీయత కథనంలో ప్రతిబింబించలేదు. బుర్ర పెట్టి చేస్తే...దీన్ని ఒక పూటంతా జనాన్ని కట్టిపడేసే స్టోరీగా మలచవచ్చు అనిపించింది. 

ముఠాతో కాంటాక్ట్ లోకి వచ్చిన దగ్గరి నుంచి...పోలీసులు రైడ్ చేసే దాకా...ఇది ప్రాణాలతో తెగించి పనిచేయడమే. ఈ క్రమం లో కథ కొద్దిగా బెడిసినా...రిపోర్టర్ల ప్రాణాలకు ముప్పు వస్తుంది. ఈ ఛానల్ టాస్క్ ఫోర్స్ లో ముఖ్యుడైన రామకృష్ణ అనే రిపోర్టర్ ఒక మూడు నాలుగు నెల్ల కిందట ఇలానే ప్రాణాలకు తెగించి ఇలాంటి ఆపరేషన్ చేశారు. 

We appreciate TV-5 for its wonderful investigative journalism.  బూతు బొమ్మలేమి చూపిస్తారు బాస్!....చేయండి...ఇలాంటి దమ్మున్న స్టోరీలు.
---------------------------------------------------
ముఖ్య వివరణ: TV-5 నిన్న ప్రసారం చేసిన కథనాన్ని చూసి నేను ఈ పోస్ట్ రాసాను. ఇది బ్లఫ్ స్టోరీ అనీ, టీ.ఆర్.పీ.రేటింగ్స్ పెంచుకునేందుకు ఆ ఛానల్ ఆడిన డ్రామా అని మర్నాడు కొన్ని ఛానెల్స్ లో వచ్చినట్లు కొందరు నాకు తెలిపారు. నిజంగా ఆ ఛానల్ అలా చేసి వుంటే...అది దారుణం, ఘోరం. ఎవరి మాట నమ్మవచ్చో, ఎవరిది నమ్మకూడదో తెలియనంతగా నైతికంగా దిగజారాయి ఛానెల్స్. తెర మీద కనిపించిన దాని ఆధారంగా ఈ పోస్ట్ రాసిన మేము.....ఈ కథనం వెనుక కథ కోసం కూడా ప్రయత్నిస్తాను. ఒక వేళ TV-5 దురుద్దేశంతో ఈ స్టోరీ ని కుకప్ చేసి వుంటే...ఆ పాపంలో మాకు భాగం లేదని మనవి.

12 comments:

DesiApps said...

great

చిలమకూరు విజయమోహన్ said...

ప్రాణాలకు తెగించి సాధించి ప్రసారం చేసినందుకు వారికి నా అభినందనలు.

katta jayaprakash said...

There are many scams,scandals and ills of the society which are being patronised,shared and operated by the leading politicians.Why not the same string operation on these subjects?Anyhow TV5 deserves compliments for it's daring operation on precious stone.Let us appreciate the good of any channel and hate the bad and worst.
JP.

sai said...

Sir,
ee operation motham bogus ani,adhi bangaram dhi kaadu ani,daani lo vajram ledu ani,TV-5,trp's kosam e pani chesindani,STUDIO-N lo morning bulliten lo vachindhi.ka saari nija nijaalento gamanistharani aashisthunaa.

katta jayaprakash said...

Surprised at the breaking news of Sai on the precious operation by TV5.Ramu garu,can you bring more light on this?
JP.

muralirkishna said...

Raamu gaaru

aaa story ki antaaa pedda medal avsarm ledu anukuntaa and aaa story gurunchi migataa channels lo emi vastundoo gamaninchandi sir konchem..

Tv5 meedane string operation chestunte inkaa aa channel inka vere varimeeda operation chese time undantaaraa..aina meeru aa channel choosi nerchukomani cheputunanru nd ee vishayam nerchukovaali andi..

mahila anchors laiginkamga vedinchatam ibbandi pettatam nerchukovalaa lekaaa bedricni dabbulu teesukovatam nerchukovaalaa cheppandi Master..

mee drusti konam marchandi..bootu bommalu choopiste parledu boote cheste?

ainaaa gogati lo tintuuu ventrukalu vachhai ani anukovatam endhuku

nenu anukovatam vaadi daggara kooda dabbaulu demand chesi untaaru vaadu icchi undadu so desanni samajanni kaapadataaniki vachhina veerulla telecast chesi untaaru ..adi kooda bluf story daaaniki meeru veera taaadulu wow raamu ji kya baatah hai...

Ramu S said...

డియర్ అల్,
నేను నిన్న రాత్రి వారు ప్రసారం చేసిన కథనం చూసి రాసిన పోస్ట్ ఇది. అది కట్టుకథ అయితే..నేను చేయగలిగింది ఏమీలేదు...దాన్ని ఖండించడం తప్ప. పోలీసులు, రిపోర్టర్ లు తెర మీద కనిపించి చెప్పిన దాన్ని బట్టి నీను ఆ పోస్టు రాసానని గమనించగలరు.
రాము

Unknown said...

Ramu garu. The news is wrong. That is a bogus story. I verified it. Another attempt by TV5 to garner TRPs. Don't know what all they do for ratings. Regards.

Ram said...

రాము గారు..! ముందుగా నమస్కారం, ఇంత బిజీ లైఫ్ లో కూడా మీరు బ్లాగ్ కోసం ఇంత టైం కేటాఇంచడం నిజంగా మీకు నా అబినందనలు. మీకు జర్నలిజం మీద ఉన్న మమకారం కనిపిస్తుంది నాకు మీ బ్లాగ్ లోని ప్రతి అక్షరం లో,నేను 2009 ప్రారంభం నుండి నుంచి మీ బ్లాగ్ చూస్తునాను.నేను మీడియా కు సంబందించిన వాడిని కాదు,కానీ నాకు మీడియా లో కొంత మంది సన్నిహిత మిత్రులు, ఆత్మీయులు ఉన్నారు. మీ బ్లాగ్ చదవడం స్టార్ట్ చేసాక.నాకు మీడియా లో పరిస్థితులు 80% అర్ధమయ్యాయి. కేవలం మీడియా మనుషుల గురించి బాస్ ల గురించే కాక, నీజాయితి తో మీడియా లో ఉంది ఇపుడు అనేక కష్టాలలో ఉన్న మీడియా మిత్రుల గురించి వారి కష్టాల గురించి రాయడం కూడా చాలా మంచి విషయం.తద్వారా వారికి మంచి జరుగుతుంది అనే మీ ఆలోచనకు నా హృదయపూర్వక అబినందనలు.మీ ఈ అక్షర యజ్ఞం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి..మీ మిత్రుడు...రమేష్.

Ramu S said...

వెన్నెల రాజ్యం గారూ...
థాంక్స్ అండీ. మీ స్పందనకు ధన్యవాదాలు. నేను ఆ పోస్టు చూసి చాలా బాధ పడ్డాను. మనసు చివుక్కు మన్నది. రెండు రోజులు చీకాకు అనిపించింది. నేను తప్పుడు పేర్లతో రాయను సర్. అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించను. ఆ నోట్ మిమ్మల్ని కించపరచడానికి రాయలేదు. సమాచారం కోసం రాసాను. నాకు అలాంటివి చాలా వస్తాయి. అలాంటివి పోస్టు చేయను, సమాచారం తీసుకుని వదిలివేస్తాను. అది మిమ్మల్ని నొప్పించి వుంటే సారీ.

నాకు జరిగిన డామేజ్ సవరించే విధంగా మీ దాంట్లో ఒక పోస్టు రాస్తే...ధన్యుడిని. ఒక చిన్న నోట్ అయినా పెట్టండి. మనం నిజంగానే ఒక సారి కలుద్దాం.
రాము

Unknown said...

Dear Mr. Ramu, you have forgot to mention the recent Chittoor ISI issue in your blog. TV-5 has got the reputation of giving wrong information that the common people has shown that they are ISI Agents. This shows the negligence of the Reporter. Before publishing or telecasting the information, they should thoroughly check the information.

Niranjan said...

Hi Freinds,
I want to ask people working in all TDP news papers channels why nobody has questioned about 7crores rupees which was caught by police. And the guy mr haribabu naidu was telling bullshit to the media and nobody questions..i was looking if any tdp channel newspaper covers this......but none did...had it been by anybody other than k batch person or some guy then he would have been grilled saying why did he carry high security plate number of VVIP and if he gave his vechicle to his friend to carry money..y did he send his father to carry money..is he his freiends servant to escort money...
how come he is carrying walkytalkies which r supposed to be carried by police alone if i know correctly....

y no body is asking this...
bye
Niranjan

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి