Wednesday, June 2, 2010

ఇంతకూ కొమ్మినేని గారు చేసింది తప్పా? ఒప్పా?

*మాజీబాసు గుట్టు రట్టు చేయవచ్చా?

*కొమ్మినేని రైటా..రాంగా?

*చర్చకు విశ్లేషణ ఇది 



తన మాజీ బాసు, 'ఆంధ్రజ్యోతి' అధిపతి వేమూరి రాధాకృష్ణ గురించి N-TV స్టూడియోలో కూర్చుని...ఆ ఛానెల్ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస రావు (కే.ఎస్.ఆర్.) చేసిన వ్యాఖ్యలు సబబేనా? అన్న అంశంపై చర్చ ప్రారంభమయ్యింది.  ఇది 'వర్క్ ఎథిక్స్' కు విరుద్ధమా....కాదా? అన్న సంశయం తలెత్తింది.

మొండిఘటం, తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, గెలిచినా ఓడినా మనదే పైచేయి కావాలి...అన్న పిడివాద ధోరణి నరనరాన జీర్ణించుకున్న జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ గారని నానుడి. వేమూరి సైతం దీన్ని దర్జాగా అంగీకరిస్తారు. దీన్ని నిజానికి పూర్తి నెగిటివ్ అంశంగా పరిగణించనక్కర్లేదు, కొద్ది డిగ్రీల తేడాతో చాలా మంది ఇలాగే ఉంటారు.
ఆ బాడీలాంగ్వేజ్, పెడసరపు మాట ధోరణి తో పాటు వేమూరి ఆంధ్రజ్యోతి పునరుద్ధరణలో చూపిన తెగింపు...పైన అనుకున్న మాటలకు సాక్ష్యాలు. 

అందుకు భిన్నంగా...కొమ్మినేని గారు నికార్సైన జర్నలిస్టు. కొద్దో గొప్పో ఎథిక్స్ ఉన్న మనిషి, తాను చేసింది అద్భుతంగా నవ్వుతూ సమర్ధించుకోగల నేర్పరి. ఇప్పుడు వస్తున్న జీతానికి నాలుగు రాళ్ళు ఎవరైనా ఎక్కువ ఇస్తే.... తనకు పెద్దగా నచ్చని వ్యక్తి దగ్గరైనా పనిచేయడానికి ఆయన వెనుకాడరంటారు.  ఎందుకంటే...ఆయన పూర్తి ప్రొఫెషనల్. అక్కడ ఉన్నన్ని రోజులు...నిజంగానే కష్టపడి ఆ సంస్థ కోసం పనిచేస్తారు. గరళాన్నైనా దిగమింగుకుని కార్యం సాధిస్తారు, సాధ్యమైనంత వరకు ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తారు. తన పని తాను చేసి....'బాబూ...నా పని నేను చేశా. మీ పత్రిక/పేజీలు  మీ ఇష్టం,' అన్న డైలాగ్ ఒకటి వేసి వెళ్ళిపోతారు. ఈ ధోరణి తప్పని ఎవరూ అనలేరు.

ఇలాంటి కొమ్మినేని గారు....లైవ్ షో లో కూర్చుని...మాజీ బాస్ పై వృత్తిపరమైన వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? రెండు లక్షలో, మూడు లక్షలో జీతం ఇస్తున్న ఆసామి తరఫున అవాకులు చెవాకులు పేలడం సరైనదేనా? ఇది 'వర్క్ ఎథిక్స్' ను ఉల్లంఘించినట్లు కాదా? అన్న కీలక ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. N-TV ఓనరో, మరొకరో ఇలా ఆరోపణలు చేస్తే...అనుకోవాల్సిన పనిలేదు కానీ...కొమ్మినేని లాంటి వారు ఆత్మసాక్షి గా అలా చేసారా? లేక ఒత్తిడి వల్ల చేసారా? అన్న అనుమానం కలుగుతున్నది. 

నిన్న సాయంత్రం కొమ్మేనేని-సురేష్ లైవ్ షో చూసినా వారికి తెలుస్తుంది...కొన్ని విషయాలు మాట్లాడడానికి కొమ్మినేని ఎంత ఇబ్బంది పడ్డారో!

"వేమూరి నైజం, మనస్తత్వం, బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?" అని సురేష్ చాలా కసిగా అడగ్గానే...కొమ్మినేని కొద్దిగా ఇబ్బంది పడ్డారు.  ఆరంభంలోనే-"ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు..." అని మొదలు పెట్టారు. "నాకు తెలిసి నేను ఏ తప్పూ చేయలేదు, నైతికంగా పతనం కాలేదు," అని చెప్పుకొచ్చారు. 

తనతో పాటు రిపోర్టింగ్ లోకి వచ్చిన వేమూరి ఎదుగుదల...అనైతికమైనదే అని కొమ్మినేని ఒక దశలో స్పష్టంగా చెప్పారు. వివాదాలకు చాలా దూరంగా ఉండాలనుకునే...కొమ్మినేని గారు సహజసిద్ధమైన దాటవేత  కోసం
ప్రయత్నించారు కానీ....ఆ సురేష్ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగడంతో...క్రమంగా చిట్టా విప్పారు. ఆ చర్చ అంతా చూస్తే....'నేను సీనియర్ ను అయినా నేను ఇక్కడ, ఇలా ఉన్నా. అతని చరిత్ర నాకు, నా బోంట్లకు తెలుసు. తను బాగా సంపాదించి కొవ్వెక్కి...నా అంత నీతిమంతుడు లేడని ఇతరుల మీద బండలు విసురుతున్నాడు,' అని కొమ్మినేని చెప్పకనే చెప్పారు. పత్రిక యజమానిగా...తెలుగు దేశం విషయంలో వేమూరి తనను మందలించిన విషయాన్ని కూడా కొమ్మినేని లైవ్ లో ప్రేక్షకులకు వివరించారు!

సరే...ఈ గొడవ వల్ల కొన్ని మంచి విషయాలు బైటికి వచ్చాయి, అది కొందరికి సంతోష దాయకం. కొమ్మినేని లాంటి సీనియర్ తో ఏ యజమాని అయినా చాలా కీలక విషయాలు షేర్ చేసుకుంటారు, మనసులో మాటలు చెబుతారు...సీనియర్ అభిప్రాయం తెలుసుకుందామని. ఇలాంటి వారితో ప్రభుత్వంలో కొన్ని పనులు కూడా చేయించుకుంటారు. తాను 'ఈనాడు' లో ఉండగా ఆ పత్రిక కోసం తన వృత్తిని వాడుకోలేదని కొమ్మినేని అనలేరు. 'రేపు...తనకు పడని మాజీ బాస్ పరువు పంచనామా చేయాలని లైవ్ షో లోకి వెళ్లి కొమ్మినేని ఇలానే రహస్యాలు లీక్ చేస్తే?' అన్న ప్రశ్న ఇప్పుడు చాలా మందికి ఉదయించవచ్చు. 

ఇంకొక విషయం...ఈ షో లో కొమ్మినేని చాలా తెలివిగా...రామోజీ రావు గారు చాలా గొప్ప మనిషి అన్నట్లు, ఆయన విలువలకు పెద్ద పీట వేస్తారన్నట్లు మూడు సందర్భాలలో చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే...కొమ్మినేని గారు...త్వరలో 'ఈనాడు' కు అప్లికేషన్ పంపుతున్నారేమే...అని అప్రయత్నంగా నాకు అనిపించింది. 

కొమ్మినేని గారు చేసింది....తప్పా? ఒప్పా? అనేది ఈ పాటికి ఆయనకు ఆయన మనసు చెప్పి వుంటుంది. ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి. కొమ్మినేని ఇలా వేమూరి బండారం బైట పెట్టడం మంచిదనేది ఒకటి. పెద్ద గీత, చిన్న గీత రూల్ కొమ్మినేని గారు పాటిస్తే బాగుండేదేమో!  అనేది ఇంకొకటి. 

జర్నలిజాన్ని బ్రష్టు పట్టిస్తూ...జర్నలిజం విలువలంటే ఏమిటో కూడా తెలీకుండా...పొలిటికల్ పబ్బం గడుపుకుంటున్న, ప్రశ్నార్ధకపు గతం గల ఒక ఆసామి ఒక వైపు....అత్యంత స్వార్ధపరుడైన, ఒంటి నిండా దురహంకారం గల జర్నలిస్టు ఒక వైపు.

మొత్తం మీద...ఈ వివాదం పై వేమూరి ఎలా స్పందిస్తారా...అని రాత్రి వరకూ ఆ దిక్కుమాలిన కుల పంచాయితీ చూస్తూనే ఉండాల్సి వచ్చింది. వేమూరి,  మూర్తి లైవ్ లో కనిపించారు చివరకు. "నరేంద్ర నాథ్ (ఎన్-టీవీ అధిపతి) కు వ్యతిరేకంగా కొమ్మినేని వార్తలు రాయించాడు," అని చెప్పిన వేమూరి...తన మీద N-TV లైవ్ షోలో మాట్లాడిన సురేష్, కొమ్మినేని ల సంగతిని వారి మనస్సాక్షికి వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు. "వారు నా దగ్గర పనిచేసారు. ఐ పిటీ దెమ్. వారి పరిస్థితి చూసి అయ్యో అనిపించింది," అని చెప్పారు.

"మూర్తీ..నువ్వు N-TV లో పనిచేసావు. ఆయన (నరేంద్రనాథ్) గురించి లైవ్ లో మాట్లాడమని నేను చెప్పానా? నేను అలా చెప్పను," అని వేమూరి అన్నారు. నరేంద్రనాథ్ తో 'పేస్ తో పేస్' ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడకు వెళ్లి...ఈ పంచాయితీ గురించి మాట్లాడడానికి సిద్ధమని, తాను మాత్రం మడమ తిప్పేదిలేదని, స్వపర బేధం లేకుండా వార్తలు ప్రసారం చేస్తామని వేమూరి బహిరంగంగా ప్రకటించారు.

7 comments:

Saahitya Abhimaani said...

"వర్క్ ఎథిక్స్" అనగానేమి?

నేను చాలా కాలంగా ఒక సంఘటనకోసం ఎదురు చూస్తున్నాను. ఒక చానెల్ స్టింగు ఆపరేషన్ చేయబోతుంటే, మరొక చానెల్ మొదటి చానెల్ ప్రయత్నాన్ని మొత్తం వీళ్ళు స్టింగు చేసి చూపాలని. ఎందుకు అంటే పార్ల మెంటులో డబ్బులు పారబోసిన సంఘటన గుర్తు ఉండే ఉంటుంది. ఆ సంఘటన ఒక చానెల్ జరిపిన స్టింగు ఆపరేషన్ కు క్లైమాక్స్. కాని ఆ చానెల్ ఆ ఆపరేషన్ ఎందుకు ఎవరి ప్రోద్బలంతో చేసింది అని చాలా చర్చ జరిగింది కాని. మీరు అన్నట్టుగా వాళ్ళు "వర్క్ ఎథిక్స్" ఎక్కువగా అనుసరించటం వాళ్ళ కాబోలు నిజాలు బయటకు రాలేదు లేదా రానివ్వలేదు.

రాజకీయ నాయకుల్లా ఇక ఇప్పుడు చానెళ్ళ వాళ్ళు కూడా(జర్నలిస్టులు అన్న పేరు కావాలనే వాడటం లేదు) నలుగురిలో చాకిరేవులు మొదలెట్టారు. బాగున్నది. ప్రేక్షకులకు మంచి వినోదం.

Anonymous said...

Ramu garu...
Yajamani chesina dongatanam gurinchi yeppatiki bayata pettaka povatam work ethics avutundaa..? Radha krishna donga panulloo kilakamaina Jayaprada vyavaharam gurinchi Kommineni Prastavincha ledu. Let the clash of interests bring out the truth.

Anonymous said...

it is true that every journalist have to follow some work ethics. but when devils daring to challenge every system and all norms, one cannot sit as a spectator. the socalled devil mr rk says that every journalist must think, before taking large paypacks, where it is coming. i want to ask one straight question was rk thought about money invested in his venture, where it came? greatest hypocrat on this earth is mr rk. he must know his back when fingering others.

sravan

Saahitya Abhimaani said...

For all the ills of the electronic media, the main reason is the rating system. The rating system should be streamlined with proper reflection of viewership and the quality of Viewers who are viewing. There are some party rags in print media. Howsiever sales these rags have, there is no credit. Like that in electronic media also viewership should be quantified by including the status, education and other ingredients so that the rating shall be from balanced viewers but not from those who see TVs just to kill time and because they have nothing else to do.

Ramu garoo, I have been requesting you to inform all of us who are quite illiterate about the rating system. Hoping to see such informating article in the blog soon, instead of the wrangles between equally bad channels.

Anonymous said...

@shiva,

I guess most of the reputed advertising agencies don't just go by the ratings. They do do by the quality of viewers.

Why is that ETV2, which stands at no.3 in ratings could bag more ads from Hindustan Unilever, Maruthi Suzuki, Bajaj etc..

And TV5 which stands at no.2 gets ads like XXX Detergent soap, 'narala Balahinathaku mandulu' etc?

చదువరి said...

"చర్చకు విశ్లేషణ ఇది" అని అన్నారు గానీ, ఈ టపా అచ్చు మన పత్రికల్లో వచ్చే విశ్లేషణ లాగా ఉందండి:

-ఒక శీర్షిక, రెండు మూడు ఉపశీర్షికలు
-విశ్లేషణలో భాగంగా కొన్ని వార్తలు ("..స్వపర బేధం లేకుండా వార్తలు ప్రసారం చేస్తామని వేమూరి బహిరంగంగా ప్రకటించారు." లాంటివి)
-తప్పో ఒప్పో తేల్చకుండా శీర్షికలో ఇచ్చిన ప్రశ్నను ప్రశ్నగానే వదిలెయ్యడం.
-ఒకే వ్యాసంలో ఒకదానికొకటి వ్యతిరేకమైన (కాంట్రడిక్టరీ) విషయాలు రాయడం (ఉదా: కొమ్మినేని గారు నికార్సైన జర్నలిస్టు. కొద్దో గొప్పో ఎథిక్స్ ఉన్న మనిషి, తాను చేసింది అద్భుతంగా నవ్వుతూ సమర్ధించుకోగల నేర్పరి. ఇప్పుడు వస్తున్న జీతానికి నాలుగు రాళ్ళు ఎవరైనా ఎక్కువ ఇస్తే.... తనకు పెద్దగా నచ్చని వ్యక్తి దగ్గరైనా పనిచేయడానికి ఆయన వెనుకాడరంటారు.)

Anonymous said...

indulo tappu emundi...media coverage ki evairainaa ateetulaa?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి