Saturday, June 5, 2010

స్వేచ్ఛాభావాల యాంకర్....శుభమస్తు!

ఒక రోజంతా కసరత్తు చేసాక....అర్థమయ్యింది....Mahaa-TV కి, ఆ యాంకర్ కు సయోధ్య కుదరదని. ఇందులో...కనీసం అపాయింట్మెంట్ లెటర్ అయినా ఇవ్వకుండా సుద్దులు చెబుతున్న ఆ ఛానెల్ యాజమాన్య స్థాయి వ్యక్తుల మనస్సాక్షిగా ఆ యాంకరే  విజేత. కల్లాకపటం, లోకం పోకడ తెలియని, తెలిసినా...మన ప్రయత్నం మనం చేద్దాం...అనుకునే ఇలాంటి పిల్లలు ఇంకా ఉన్నారా? అని ఆశ్చర్యం వేసింది...ఈ కేసు పూర్వాపరాలు చూశాక.

"ఆమె ఒక మంచి యాంకర్. మంచి యాంకర్ ను కోల్పోయాం.." అని Mahaa-TV యాజమాన్యం, "నేను చేసిన దాంట్లో తప్పుఉన్నదని నేను అనుకోవడం లేదు. ఇంత జరిగాక నేను వెళ్లి అక్కడ ఉద్యోగం అడుక్కుని పనిచేయలేను," అని ఆ యాంకర్ అనడంతో థర్డ్ పార్టీ మొత్తుకోళ్ళు, మధ్యవర్తి ప్రయత్నాల వల్ల లాభంలేదని అర్థమయ్యింది.    

'భావప్రకటన స్వేచ్ఛ' అని రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి అమాయకంగా దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే కష్టమని, రెండు ముఖాల ఈ సమాజ సర్పం నిజం మాట్లాడితే కాటేస్తుందని, మానభంగాలు-యాసిడ్ దాడి రేంజు సమస్యలు తప్ప ఒక ఆడపిల్లకు ఇలా జరిగిన అన్యాయంపై.....మహిళా యాక్టివిస్టులు నోరుమెదపరని, జర్నలిస్టు సంఘాల మాదిరిగా..జర్నలిస్టుల ఆత్మ చచ్చి చాన్నాళ్ళు అయ్యిందన్న మాట నిజమే అని ...ఈ విషయంలో బోధపడింది.

ఇరు పక్షాలతో మాటామంతీ జరిపాక...ఈ వ్యవహారాన్ని మనం ఇంతటితో వదిలెయ్యడం మంచిదని అర్థమయ్యింది. ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న ఆ యాంకర్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం. Prospective employer (Note: I thank the reader who alerted me about the wrong usage of this word) ఆమె తమ గురించి కూడా బ్లాగులో రాస్తుందని భయపడకూడదని...తనకు అవకాశం ఇవ్వకుండా ఉండకూడదని కూడా కోరుకుందాం. ఈ ఉదంతం నేర్పిన పాఠంతో ఆ యాంకర్ ఇకనైనా "diplomatic" గా బతకడం ఆరంభిస్తుందని భావిద్దాం.

40 comments:

Anonymous said...

She's my best friend...She'll definitely have a very bright future...i wish her all d best!!

critic said...

మంచిమనసుతో మీ ప్రయత్నం మీరు చేశారు. ఆమెకు మంచి జరగాలని కోరుకుందాం!

Thirmal Reddy said...

I don't think it's a good idea for her to even think of continuing with the same company. Let her pursue her own endeavours. Fortunately enough, there are other opportunities in abundance. Wish her all the best and yes, I suggest her to be "diplomatically" outspoken.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Raja said...

''ఈ ఉదంతం నేర్పిన పాఠంతో ఆ యాంకర్ ఇకనైనా "diplomatic" గా బతకడం ఆరంభిస్తుందని భావిద్దాం''

Ramu garu blogging lo kuda diplomacy maintain chesthe, mana manassakshini manam mosam chesukunnate.


Raja

Ramu S said...

మహర్షి రావు గారూ...
సర్, మీర్ పంపిన కామెంట్ పెట్టలేక పోతున్నాను. 'బలుపు' వంటి పదాలు వాడడం బాగోలేదు. మీ అభిప్రాయాలు....అలాంటి మాటలు వాడకుండా కూడా రాయవచ్చు కదా. నేను చేసిన ఒక ప్రయత్నాన్ని ఇష్టం వచ్చిన పదజాలంతో రాసారు. అది కూడా బాగోలేదు.
థాంక్స్ ఫర్ యువర్ టైం
రాము

Unknown said...

I wish her all the best. God bless here but I still have my reservations writing about the company I work in. Regards

Sitaram said...

krovvidi Nagesuresh says...

డియర్ ఫ్రెండ్!
నాదొక చిన్న మాట. మీడియా కానీ, మరే ఇతర సంస్థలో గానీ బాసుకీ, బంటుకీ ఏదో ఒక చిన్న విషయంలో చిక్కులు వస్తూ ఉంటాయి. వాటిని వీలయితే సర్దుకు పోవాలి లేకపోతె
ఉద్యోగం నుండి తప్పుకోవాలి. ఈ సందర్భంగా నేను మీ ద్వారా అందరికీ తెలియ చేసేది ఒక్కటే......... "క్రికెట్ మ్యాచుల సందర్భంగా ఇక్కడి ఒక 'ముసలాయన' టోయ్...టోయ్ అంటూ సెక్సీ ఫోటోలు చూపాలని ఒత్తిడి చేస్తాడని...దీనికి బ్లూ ఫిల్మ్స్ చూపడానికి పెద్ద తేడా లేదన్నది తన అభిప్రాయమని...ఇలా ఒక నాలుగు అంశాల మీద ఆ అమ్మాయి తన అభిప్రాయాలు రాసుకుంది," అని సెలవిచ్చారు. అలాగే ఇది భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధం అనికూడా చెప్పారు.
ఐతే కొన్నిసార్లు మనము అవతలి వ్యక్తీ చెప్పింది
సరిగ్గా తెలుసుకోకపోవడం కూడా అయి ఉండవచ్చు. ఏదిఏమైనా సంఘంలో ఒక పెద్ద వ్యక్తిని అలా దూషించడం, దానిని మీరు సమర్దించడం కూడా చాల తప్పుగా నాకు అనిపిస్తూ ఉంది. అవతలి వారిని దూషిస్తూ అది భావ ప్రకటన స్వేచ్చ అనడం తప్పు. అడగగానే అవకాసం ఇచ్చి ఆదరించి అన్నం పెట్టిన సంస్థను, సదరు సంస్థ తాలూకు వ్యక్తులనీ గురించి చులకనగా రాయడం అనైతికంగా నేను భావిస్తున్నాను. మీ బ్లాగ్ లో ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియక మీకు పంపిస్తున్నాను. దయచేసి నా అభిప్రాయాన్ని బ్లాగ్ లో ఉంచగలరు.
క్రొవ్విడి నాగసురేష్

hai telugu news said...

ఆమె ఏ పాప్యులర్ బ్లాగ్ లో కామెంట్ చేయలేదు. సొంత డైరీ లాంటి బ్లాగ్ ఒకటి రన్ చేస్తోంది. దాన్ని చదివి ఇష్యూ చేసినవాడు దడిగా. సరదాగా తీసుకొని అమ్మాయికి నచ్చ జెప్పి తీసివేయిస్తే సరిపోయేది. ఇప్పుడు పెద్దరికం మట్టిలో కలవలేదా. సాధించింది ఏమిటి?

అమ్మాయికి కూడా ఒక సలహా. ఫెమినిస్ట్ సాహిత్యం చదవడం తగ్గించు అమ్మా. చాలా జీవితం ఉంది నీకు. మార్క్సిజం లాగే ఇదీ అంటువ్యాధి. దీనికి అలవాటుపడితే అన్నీ తప్పుల్లాగే కనబడతాయి. జీవితం ఉప్పులేని పప్పు అవుతుంది.

srinivas

Saahitya Abhimaani said...

@Telugu News You made a very good comment, ".......మార్క్సిజం లాగే ..... అంటువ్యాధి. దీనికి అలవాటుపడితే అన్నీ తప్పుల్లాగే కనబడతాయి......." I like this comment.

Coming to the issue on hand, this episode is not strange for me. Even after 60 years of freedom (for the Politicians of the country!!), the so called "press freedom" has not translated into freedom for the Journalists. At present, free press means, Free Press Baron and nothing else.

Anonymous said...

రాము గారు ఈ విషయం లో మీ ప్రయత్నం బాగుంది, కాని నాకు సంఘటన వెనక పూర్వాపరాలు తెలియవు కనుక వారు అలా చేసి వుంటే... ఈమె ఇలా రాసి వుంటే అంటూ ఏమి వ్యాఖ్యానించలేను. ఇంకా ఆమె బ్లాగు కూడా కనీసం చదవలేదు. విషయం అది కాదు డిప్లొమసి మీద మీరు వెలిబుచ్చిన అభిప్రాయం పై నా స్పందన!
తన కన్నా బలవంతులు తప్పు చేస్తె అది తప్పు అని చెప్పడం (తీపి పూత రాసినా రాయకపోయినా ) బలహీనులకి సంకటప్రాయమే! అయినా తద్ఫలితం నుండి ఉపశమనం దొరుకుతుంది అనుకున్న సందర్భంలో (ఉదాహరణ కి మరొక ఉద్యోగం దొరికే పక్షంలో ఇప్పటి యజమానులని విమర్శించడం) నిర్మొహమాటంగా నిఝం చెప్పడం....... లేని పక్షంలో గమ్మున ఊరుకోవడం .... ఇదేమి డిప్లోమసి??? సరిపడినంత ఆదాయ వనరులు ఉన్నప్పుడు ఒకరికింద పని చేయాల్సిన ఆంగత్యం లేనపుడు తలబిరుసుగా మాట్లాడడం... పేదరికం తోనొ మరొక అవసరం తోనొ ఎదుటివారి కి భయపడి రావలిసి వుండడం వలన నిజం చెప్పకపోవడం... ఇదేమి డిప్లొమసి??? నిజం ఎలా చెప్పినా అది నిజమని ఒప్పుకోలేని వారి వద్ద అణగిమణిగి వుండమనడం అదేమి డిప్లోమసి???

Anonymous said...

రాము గారు ఈ విషయం లో మీ ప్రయత్నం బాగుంది, కాని నాకు సంఘటన వెనక పూర్వాపరాలు తెలియవు కనుక వారు అలా చేసి వుంటే... ఈమె ఇలా రాసి వుంటే అంటూ ఏమి వ్యాఖ్యానించలేను. ఇంకా ఆమె బ్లాగు కూడా కనీసం చదవలేదు. విషయం అది కాదు డిప్లొమసి మీద మీరు వెలిబుచ్చిన అభిప్రాయం పై నా స్పందన!
తన కన్నా బలవంతులు తప్పు చేస్తె అది తప్పు అని చెప్పడం (తీపి పూత రాసినా రాయకపోయినా ) బలహీనులకి సంకటప్రాయమే! అయినా తద్ఫలితం నుండి ఉపశమనం దొరుకుతుంది అనుకున్న సందర్భంలో (ఉదాహరణ కి మరొక ఉద్యోగం దొరికే పక్షంలో ఇప్పటి యజమానులని విమర్శించడం) నిర్మొహమాటంగా నిఝం చెప్పడం....... లేని పక్షంలో గమ్మున ఊరుకోవడం .... ఇదేమి డిప్లోమసి??? సరిపడినంత ఆదాయ వనరులు ఉన్నప్పుడు ఒకరికింద పని చేయాల్సిన ఆంగత్యం లేనపుడు తలబిరుసుగా మాట్లాడడం... పేదరికం తోనొ మరొక అవసరం తోనొ ఎదుటివారి కి భయపడి రావలిసి వుండడం వలన నిజం చెప్పకపోవడం... ఇదేమి డిప్లొమసి??? నిజం ఎలా చెప్పినా అది నిజమని ఒప్పుకోలేని వారి వద్ద అణగిమణిగి వుండమనడం అదేమి డిప్లోమసి???

WitReal said...

Do you really really really believe that the girl's actions are correct??

plzzzzzzzzzz don't be a hypocrite here.

If you really believe that she is correct, then you would not have made the 21st comment on previous post -- ఆమెకు వేరే ఛానల్ లో వచ్చే వుద్యోగం ఈ బ్లాగ్ మూలంగా పోతుందేమో అని నా భయం. --

or you can still get away saying that, the journalist community supports her actions bur media bosses are inhuman. :) :)


I saw her blog & found it to be kiddish. Plzzzzzzzzz. don't take up arms to support such kids.

new found lime light, good money & plenty of job opportunities are reasons for such kiddi-pan.


@ Malkpet Rowdy: boss, she gets some mileage by writing filth in her blog. But the channel cant do the same. If they do, they lose some mileage. you see, its not like the fight between you & marthanda/krishna

@ Sarat Kalam: The girl needs a lot of counselling. If there is some HR manager there, he has to tell her the "limits". She needs to be told the basic - very basic - thumb rule of team-work that "praise in public & criticise in private". How can she write like that about 'toi toi old man" & babu????? what happens to the professional reputation that these two men (it doesn't matter even if they are professional pimps) built for them?????

my verdict:
she deserves to be dismissed with immediate effect. She should be given a conduct certificate, with an enclosure of her "publicly available" blog post of Apr17.

Sudhakar said...

With out mentioning the blog or anything, why should we open this much discussion here. I find myself blind even to understand this. This is really not the spirit of blogging or freedom. Do you really think the people media doesnt know who is she and what is her blog? It is people like us doesnt know heck of this :-)...

I wanted to comment on this, but do not know the context fully, so considering it as a private conversation.

Saahitya Abhimaani said...

@సుధాకర్! మీరు చెప్పినదాంతో నేను ఏకీభవిస్తాను. వాళ్ళ యాజమాన్యానికి తెలిసిపోయిన బ్లాగు చిరునామా ఇక్కడ మనాకు తెలియకపోవటం శోచనీయం. రామూగారూ. ఆ బ్లాగేమితో తెలపండి, మేమూ చూస్తాము. అక్కడ వ్రాసిన విషయం ఏమిటో తెలుస్తుంది.

Sudhakar said...

I do agree with WitReal. I crawled over links and found her blog some how now. May be she is right in her feelings but there is something called corporate etiquette when it comes to deal with the company you are working for. The blogger should have kept the blog private. By making it a public blog, she not only ruined the image of the organization she is working for (she considers 100% working loyal) but created an embarrassing situation. This only shows lack of maturity in blogging.

Blogger can only support the incidents like Gaurav Sabnis or Rashmi Bansal (IIPM Blog incident) where freedom of speech is directly linked to a cause and not intended to spoil their working organization's image.

It is shocking to see anyone making cheap comments against the same organization they work for. We better leave the org and do whatever in the case of revealing bitter facts...

Malakpet Rowdy said...

Witreal,


It would have been a different story if she had worked for a Corporate Company which has nothing to do with the Freedom Of Speech.

The company she was workin for is a Media House, that vouches for UNCONDITIONAL Freedom of Speech.So, there lies the difference!

Ramu S said...

sarada4u.blogspot.com

You can observe that she didn't mention her channel name in her posts. As you pointed out, she can't get away with it.

Ramu

Malakpet Rowdy said...

Moreover, I dont understand why that company would take the Blogs so seriously - arent the Telugu blogs meant mainly to kill time?

Saahitya Abhimaani said...

".....మనం అడిగే questions కు జమున ఏడవాలని anchor ని కోరటం జరిగింది. పాపం Anchor ఎం చేస్తాడు వాళ్ళు అడగమన్నది అడగాలి ,ఇక్కడ కూడా అతనికి freedom ఉంటుందంటే ఉండదు PCR లోకి వచ్చి ఇలా అడుగు ,ఇది అడుగు, ఇంక అడుగు,చ్ఛీ............ఎంటండి మేము అడగమన్నవి ఎందుకు అడగలేదని దెప్పి పోడుస్తుంటారు ......"

ఇలా ప్రోద్బలం చేసి బలవంతపెట్టి ప్రశ్నలు అడిగించటం అదీ ఆ వచ్చిన అతిధి ఎడవాలాట!!! ఇదేమి జర్నలిజం. పైగా ఇలా చేస్తున్నారు అని బ్లాగులో వ్రాసుకుంటే ఉద్యోగం పోవటమా. నిజమే రామూగారూ. తానూ పని చేస్తున్న చానెల్ పేరు వ్రాయలేదు, మారా చానెల్కు వచ్చిన నష్టమేమిటి, ఊరికే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడువుకోవటం తప్ప!

ఎంఖర్ తానంతట తానుగా కార్యక్రమాన్ని జరప గల శక్తి కలవారినే నియమించుకోవాలి. ఇలా సైగలతో, తిట్లతో, హేడ్ఫోన్లలో ఆదేశాలతో జరిపించేవి ఎటువంటి కార్యక్రమాలు? సినిమా దృశ్యాలకి ఇటువంటి దర్సకత్వ ప్రాద్యాన్య వార్తా ప్రసారాలకు తేడా ఏమిటి!! పైగా వీటికి రేటింగులు కూడాట!!

Ramu S said...

శివ గారూ...
నా బాధ అర్థం చేసుకున్నందుకు థాంక్స్. మీడియాకు, కార్పోరేట్ సంస్థలకు మధ్య తేడా వుంది. సత్యం అని నినదించే వారు...ఉద్యోగాలు ఊడపీకడం నచ్చలేదు. తన భావాలు రాసేటప్పుడు తన ఫోటో పెట్టుకోకుండా వుంటే...అమ్మాయికి అంత సమస్య వచ్చేది కాదు. ఏది ఏమైనా...ఇదొక వింత సమస్య. ఆ అమ్మాయికి అక్కడ చేయడం ఇష్టం లేదు కాబట్టి...పరిష్కారం కోసం ఇబ్బంది పడనక్కరలేదు.

Saahitya Abhimaani said...

@Malakpet Rowdy! If you want to give a statement on your behalf you are free. But do not give any sweeping statement equating everybody. I do agree there are many who blog to kill time, but not all. You should know that.

@Ramu! Even in Corporates, many a time the Employeee/Execuitve is fee to express opinion. But there is a thin line between the need to publicly air the views or to express them in internal forums. Mostly in Corporates the differences of opinion are sorted out across the table and if such sorting is not possible, there too this kind of sackings take place.

But, Media harping itself as the so called "fourth estate" I doubt, whether it can afford to be so downright dictatorial in its approach towards the Employees it consists of. If collectively they claim a right to Freedom of Expression or Free Press, they should recognize the right of individuals the group of which as a wholesome is called "Media". The Media Barons should not think that they are separate from their Journalist/Reporter/Cameraman Employees and should be sportive enough to accept the facts. If the Journalist/Reporter of any Media organisation is able to work without fear or favour, its good for that organisation as it would earn good name. But at the same time, the managements should be cautious and alert to weed out elements of vested interest who might try to exploit the freedom of expression concept to air their prejudiced views or party leanings.

In this episode, instead of dispassionately counseling the erring (in their view) Employee, they took a hasty and extreme step of pushing the lady out. That organisation does not seem to be having any HR concept as such.

కిరణ్ said...

కామెంట్స్ చెసిన వాళ్ళంతా ఒక ముఖ్యమైన విషయాన్ని ఇగ్నోర్ చేశారేమో అనిపించింది. ఆ యాంకర్ తన బ్లాగ్ లో తను పని చేస్తున్న ఆర్గనైజేషన్ గురించి రాయడం తప్పా.../ఒప్పా అనే విషయంతో పాటు ఆమె అలా రాయడానికి కారణమైన పరిస్తితులు,....అంత నిస్పృహ కలిగించిన విషయాలేమిటో ఓసారి ఆలోచించాలి. నేటి న్యూస్ చానెళ్ళ పనితీరు...టీఆర్పీల కోసం అవి ఫాలో అవుతున్న పద్దతుల మీద చర్చ జరగాలి. చిన్నచిన్న విషయాలకు బ్రేకింగ్ లు ఇస్తూ సంచలనాత్మకంగా మార్చి జనాలను ఆకర్షించాలనుకునే చీప్ ట్రిక్స్ పై దృష్టి పెట్టాలి. పేరుకు న్యూస్ చానెల్స్......కానీ వార్తలు లేని కరువు తీర్చుకోడానికి కాబోలు రకరకాల కార్యక్రమాలు వండుతున్నారు. సరే ఇవి awareness కోసమో..,infotainment గానో పని చేస్తాయనుకుందాం ...... కానీ ఆ పరిధి దాటి చాలా దూరం వెళ్తున్నాయి. దాదాపు అన్ని చానెల్స్లో అసలు క్రైం కంటే మరింత క్రూరంగా చిత్రీకరించిన క్రైం ప్రోగ్రాంస్, కక్కుర్తిగా వేసే హాట్ సాంగ్స్ ప్రోగ్రాంస్ ఉంటున్నాయి. ఇష్యూ ఏదన్నా కానీ దానికి రిలేట్ అయిన అమ్మాయిల హాట్ పిక్స్, విజువల్స్ వేసి వదలడమే. "ఏం జర్నలిస్ట్లు మాత్రం మగాళ్ళు కాదా కాస్త వేడి పెంచండి విజువల్స్ లో " అన్నారొక గౌరవనీయులైన సీనియర్ జర్నలిస్ట్. /
నిజాలను నిజాలుగా అందివ్వడమేగాక, సమాజానికి మీడియా ఏదో మేలు చేస్తుందనుకుంటూ ఈ రంగంలోకి వస్తున్న మాలాంటి కొత్త తరం జర్నలిస్ట్ లకు కంపరమేస్తొంది. భ్రమలు వీడుతున్నాయి. ఏదో ఒక పార్టీకో , వర్గానికో కొమ్ము కాయడం, మిగిలిన వాళ్ళపై ప్లాండ్ గా బురదజల్లడం...... టీ ఆర్ పీ లకోసం......పనికిమాలినచెత్తంతా మసాలా దట్టించి బుర్రలు పాడు చేయడం......, ఇదేగా మీడియా చేస్తొంది. అలాగని రాముడు మంచి బాలుడిలాగా కార్యక్రమాలు ఉండాలనేది నా ఉద్దెశ్యం కాదు. సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఇంకా మెరుగైన స్తితిలోకి నడిపించాలని నా అభిప్రాయం. మీడియా సమాజానికి మేలు చెయ్యకపోతే మానెయ్...కీడు చెయ్యకపోతే చాలు. /
ఇక ప్రస్తుత అంశానికొస్తే..... తన ఆర్గనైజేషన్ గురించి ఆమె రాసుకున్న దాంట్లో వారికి నిజాలు కనిపించలేదా?....... ...అంత నిస్పృహ కలిగించిన విషయాలేమిటో ఆలోచించలేకపోయారా........ ?ఆశ్చర్యమేస్తొంది./
@ WitReal ......praise in public & criticise in private....మీడియా లోపల భావ ప్రకటనా స్వేచ్చ ఎంతవరకుందో మీకు తెలీదా? సమాజానికి కలిగిస్తున్న నష్టంతో పోలిస్తే వాళ్ళ రెప్యుటేషన్ పోవడం పెద్ద విషయం కాదు.......
కార్పొరేట్ డైనమిక్స్ తో ఎడ్జస్ట్ అయిపోయి, పేరుకే జర్నలిస్ట్ ల్లాగా బ్రతుకుతున్న చాలా మంది .....ఇప్పటి సీనియర్ జర్నలిస్ట్ లకు.....కౌన్సిలింగ్ కావాలి. అయ్యా లౌక్యం కాదు కావాల్సింది...... మీడియాకి ....నిజాయితీ,,సూటిగా పోగల ధైర్యం,కచ్చితత్వం కావాలి.

మంచు said...

అవిడ అన్ని పొస్ట్లు చదివాను.. తను దాదాపు సంవత్సరం నుండి ఈ జాబ్ అంటే చిరాకు వస్తుంది, ఐ హేట్ థిస్ జాబ్.. ఎప్పుడు మారిపొదామా అని వుంది అంటూ రాస్తుంది .. ఈ సంవత్సరకాలం లొ ఆవిడకి ఎక్కడా వుద్యొగం దొరకలేదొ.. ఎక్కడకెళ్ళినా తను పరిస్తితులతొ ఇమడలేదొ మరి. పైన తెలుగు న్యూస్ గారు చెప్పినట్టు ఆ అంటువ్యాదికి అలవాటుపడితే అన్నీ తప్పుల్లాగే కనబడతాయి...

అసలు ఒక కంపెనీ లొ పనిచేస్తూ, నెలనెలా జీతం తీసుకుంటూ , యజమానిని లేక పనిచెస్తున్న సంస్థ పరువుతీస్తూ వుంటే ఎవరు ఒప్పుకుంటారు.. అంత ఎందుకు మన ఇంట్లొ పనిమనిషి అలా చెస్తే మనం వప్పుకుంటామా ? ఆ అమ్మాయికి అంత ఇస్టం లేక పొతే బయటకు వెళ్ళి రాసుకొవాలి.. ఆ మాహా టివి పొజిషన్ లొ నేను వున్నా అదే పని చేద్దును.. మీడియా లొ పనిచేసినంత మాత్రాన unconditional Freedom Of Speech ఉంటుంది అని నేను అనుకొవట్లా.. ఇంతకు ముందు ఆ అమ్మయిమీద కొద్ది జాలి అంటూ వున్నది కానీ గత ఒక సంవత్సరంగా తను తన ఉద్యొగం గురించి రాసిన పొస్ట్లు చదివాక నాకు అనిపించింది ఒక్కటే .. she deserves it ...

if anyone wants to really help her, think of providing some counseling to her.. otherwise you will have to fight with her bosses forever..

Malakpet Rowdy said...

Alrite alrite I m sorry Siva garu

I take my words back. As of myself it's correct that I m on Telugu blogs only to kill time. Hope I m clear now


However I still feel that she didn't deserve this kind of punishment for her blog posts

Raja said...

i agree with siva garu.'That organisation does not seem to be having any HR concept as such'

but its more like a mutual termination. the anchor was about to quit,instead she was fired

Raja

WitReal said...

I agree with Malakpet that it is pure time pass.

For all those serious readers/writers/commentators:
If you are really really really serious, then get to the core of the matter and then take up arms.

or else, you would be wasting your time in raising slogans, giving great gyan on freedom of speech etc for absolutely rubbish/awkward/kiddish matter.

I confess, I never wasted my time so cheaply than reading her blog...

now that the link is given above, go and read the blog entry on 31Dec2008. She wrote something about a boss, giving enuf clues on his identity.

So much to the freedom of speech and the freedom of press.


అన్నా రాము:
ఆమె తన పేరు, తన కంపెనీ పేరు చెప్పకపొయినా, తన ఫోటొ ఇవ్వదం మరియు ఇతర క్లూస్ ఇవ్వడం ద్వారా టైంపాస్ మరియు మైలేజీ తెచ్చుకుంటున్నదని గమనించగలరు.

అలా కాదు, ఇది దంతేవాడ బ్లాగు..ఇక్కడ కార్మికుల హక్కులే తప్ప సంస్థ ప్రయొజనాలని పట్టించుకొము అని మీరు తీర్మానిస్తే, మా లాంటి టైం పాస్ గాల్లు ఇటువైపు వచ్చి మీ టైము వేస్టు చెయ్యము.

WitReal said...

This is not a comment. No need to publish.

when you wrote: Prospect employee

did you mean: Prospective employer?

Ramu S said...

Hi WitReal,
Thanks boss. I've corrected it. Its my mistake.
Please feel free to alert me abt typos
Cheers
Ramu

Malakpet Rowdy said...

Well Well Well ..

Step back ..

What I understood from this post was - She was fired because she exposed the channel's dirty tricks played on the anchors and NOT because of what she wrote before. So When I talked about the Freedom of Speech I was referring to that - my stance was - Its not proper to fire an employee if s/he exposes your short comings.

Malakpet Rowdy said...

రమూ గారూ

మరో విషయం. ఇక్కడ మహిళా సంఘాల పాత్ర ఏమిటో నాకర్ధం కాలేదు. ఇక్కడ గొడవ ఒక ఏంకర్ కి, తన మేనేజ్మెంట్ కీ. ఇక్కడ ఆడ అయినా మగ అయినా విషయం ఒకటే. She wasn't fired on the basis of her feminine gender. ఆమె ఆడపిల్లకాబట్టీ ఇది అన్యాయం అనే వాదన సముచితంగా ఉండదేమో?

Ramu S said...

Mr.M.Rowdy,
Irrespective of the nature of her writings, women bloggers should have raised their voice on this incident. None of them seems to have cared this girl. When a women blogger is subjected to humiliation, women activists must come to her rescue, I believe.

Ramu

Malakpet Rowdy said...

When a women blogger is subjected to humiliation, women activists must come to her rescue
___________________________________

I slightly disagree - I would rather say

When a women blogger is subjected to humiliation ON THE BASIS OF GENDER, THEN women activists must come to her rescue.

Here, the issue is not about her gender.

If all the males fight if a Male is subject to humiliation, If all the Biharis fight if Dhoni loses captaincy and if all the Muslims fight if Osama is killed then the issue is no more wrong vs right - its my group vs yours

మంచు said...

Raamu gaaru

Do you really think she was subjected to humiliation ? ... I don't think so

చదువరి said...

"..women bloggers should have raised their voice on this incident." - Far more surprising than your appeal to రావుగారు and రెడ్డిగారు.
This is an issue between an employer and an employee. How come gender seeps into this?

WitReal said...

@ Kiran:
>> మీడియా లోపల భావ ప్రకటనా స్వేచ్చ
>> ఎంతవరకుందో మీకు తెలీదా?

why do you want to save "భావ ప్రకటనా స్వేచ్చ" using someone (like media boss) else's money?

you can do like Ramu (this blog owner).

you can wash the dirty linens in public.

But...But....But....
dont do that while eating their money.
dont cry, if they rebuff you with a dismissal.

got the point???

we dont need to take up arms to save this girl who did this stupid mistake.

period.


@Malak
>> Its not proper to fire an
>> employee if s/he exposes
>> your short comings.

I agree. But there is a 'proper' way for doing anything. History (experience) is a measure of a person's attitude. Thats what your next employer check, when he considers you for employment.

btw, did she expose shortcomings or Business Secrets ;)

@ Ramu:
>> Irrespective of the nature
>> of her writings, women bloggers
>> should have raised their voice

oh, phlueeze..
if i start a porno blog & had some altercation with someone, will you all come and support me?

Dont waste your blog space in taking up issues of this kind. If someone errs, they will meet their consequences.

I'd support you if you take up the issue of "కనీసం అపాయింట్మెంట్ లెటర్ అయినా ఇవ్వకుండా సుద్దులు చెబుతున్న ఆ ఛానెల్ యాజమాన్య"

sai said...

sir,

blog adress cheputara ippudainaa?

Ramu S said...

sai garu
I've already disclosed it.
this is for you
sarada4u.blogspot.com

కిరణ్ said...

@WitReal ...1.praise in public & criticise in private దీనికి మీడియాలో అవకాశం లేదంటున్నాను.
2.using someone (like media boss) else's money?........వేరే ఏ ఫీల్డ్ అయినా....మీరు చెప్తున్నది వర్తిస్తుందేమో. వాటికి సామాజిక బాధ్యత గురించి ఆలోచించాల్సిన సందర్భాలు చాలా తక్కువ,. కానీ మీడియాకు సామాజిక బాధ్యత ఉందని నమ్ముతాను. అక్కడ ఇన్వెస్ట్ చ్సేసింది ఎవరైన కావచ్చు. మేం డబ్బులు పెట్టాం కనుక మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే ఊరుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
డబ్బులు తింటున్నాం కాబట్టి ఇష్యూస్ లేవనెత్తకుండా ఉండాలా......strange:)
అందుకేగా మీడియా బ్లాగ్స్ లో ఎనానిమస్ పోస్టింగ్ లు ఎక్కువగా ఉంటాయి.ఎక్కడ ఉద్యోగాలు ఊడతాయో అనేకదా చాలా మంది భయం./
నూరుపాళ్ళూ న్యూస్ బిజినెస్ గానే మారింది కనుక మీరు చెప్పిందే కరెక్ట్. కానీ మెరుగైన సమాజం కోసం అని ఒకరు...., మీ పక్షం అని మరొకరు...,నిజాయితీ అని కచ్చితత్వం అని ఇంకొకరు...,ప్రజల పక్షం అని ఊదరగొడుతుంటే కొన్ని సార్లు భ్రమ పడుతున్నాము.

Vinay Datta said...

I posted a comment supporting the views of Suresh garu and Chaduvari garu. I don;t understand why it was not published.

If I've to support a woman only because she's another woman...I'm sorry. I can't do it. Ramu garu addressed only women bloggers but I'm intervening though I'm not a blogger. There is an etiquette, may not be corporate, but a human etiquette. You cannot call your boss 'an old man' publicly and insult him. Media is not made of machines, it too has people with ego. Had I faced a similar proplem, I'd never have done the way she did. I'd have left the job stating the reasons. But I'd never put down anybody like that.

First and foremost, I'd not continue to work without an appointment letter. This, definitely is, a cause of concern.

WitReal said...

కిరణ్ అన్నా:

1. praise in public... అని చెప్పింది Teamwork కొసం. అది సర్వకాల సర్వావస్థలందు పాటించవలసిన basic courtesy.

2. మీ రెండో పాయింటు మళ్ళీ చదువుకోండి. మీకే తప్పు అనిపిస్తుంది.

>> వేరే ఏ ఫీల్డ్ ... సామాజిక బాధ్యత గురించి
>> ఆలోచించాల్సిన సందర్భాలు చాలా తక్కువ,.
>> కానీ మీడియాకు సామాజిక బాధ్యత

తప్పు.

>> మేం డబ్బులు పెట్టాం కనుక మా ఇష్టం
>> వచ్చినట్టు చేస్తాం అంటే ఊరుకోవాల్సిన
>> అవసరం లేదని నా అభిప్రాయం.

Correct.
But దానికీ ఒక పద్దతీ - పాడు వుంటాయి.
don't start abusing them on public forums. It is a punishable offence.

ఆ సదరు బ్లాగరు బాస్ ని "f$%k off" అని రాసింది. చివరకు ఆ పని ఆమె చేయవలసి వచ్చింది!

>> కనుక మీరు చెప్పిందే కరెక్ట్.
మొదట కరెక్టు కాదన్నారు. ఇక్కద కరెక్ట్ అంటున్నారు.
I'm confused. ;)


>> మెరుగైన సమాజం కోసం అని ఒకరు....

Branding brother! (ఆ కాప్షన్ రాసినవాడు కొన్ని లక్షలు ఫీజ్ వసూల్ చేస్తాడు.)



నా వరకు ఈ వాదన ఇక్కడితో ముగిస్తున్నా. మరీ idealistic gaa వాదిస్తున్న అందరికి: దేశ కాల పరిస్థితులను బట్టి మారటం నేర్చుకోకపోతే, మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి