గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో విజయ దశమి పర్వ దినాన...ఏదో దయ్యం పట్టినట్లు ఈ బ్లాగ్ ఆరంభించాను. మీడియాలో పరిణామాలు రికార్డు కావడం లేదు, అక్కడి మంచి మనుషుల అద్భుత కృషి ప్రపంచానికి తెలియడం లేదు, అక్కడి బాసుల ఆకృత్యాలకు చెక్ లేదు, అక్కడి ప్రతిభావంతులు అవమానంతో కుళ్లిపోతున్నారు లేదా భరించలేక వేరే జాబులకు వెళ్ళిపోతున్నారు, అక్కడి ఓనర్ల రాజకీయాలు-కుల ఆధిపత్యం-రొచ్చు ఎవ్వడూ ప్రశ్నించడం లేదు, జనం బాధలు రాసే జర్నలిస్టుల బాధలను హై లైట్ చేయడానికి ఒక ఫోరం లేదు. ఈ పరిస్థితిలో..... నిజాయితీతో పేరుపెట్టి, ఫోటో వేసుకుని మరీ.....కేవలం సత్యాలు రాయాలన్న సంకల్పంతో ఈ బ్లాగ్ ఆరంభించాం. ఈ బ్లాగ్ వల్ల...' కాస్త సంతృప్తి లభించడం' అన్న ఒక్క మాట తప్ప ఒక్క ప్రయోజనమూ లేదని తెలిసిపోయింది. పైగా...నేను ఒక పది కోట్లు అక్రమంగా సంపాదించానని, పది మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసానని ఉత్తరాల రూపంలో ప్రచారం చేసే దౌర్భాగ్యుడొకడు/దౌర్భాగ్యురాలు ఎదురయ్యాడు(రు). ఇలాంటి మాటలు గుండెకు గునపంలా గుచ్చుకున్నా....ఇలాంటివి బ్లాగ్ లోకం లో మామూలే...డోంట్ వర్రీ...అని వెన్ను తట్టే e-తెలుగు మిత్రులందరికీ కృతఙ్ఞతలు.
అప్పటి దాకా...మిత్రుడిగా భావించిన వారు...ఒక గూఢచారిగా చూడ్డం మొదలెట్టారు...నేనీ బ్లాగ్ ఆరంభించాక. మనసులో మాట...మనసులోనే సమాధి చెయ్యాలి...సత్యం మాట్లాడి మన అవకాశాలు దెబ్బ తీసుకోకూడదు...అన్న భావం జీర్ణించుకున్న సమాజం ఇది. ఈ విషయంలో నేను వృత్తిలో వుండగా కూడా రాజీ పడలేదు...కెరీర్ దెబ్బతిన్నా. జర్నలిస్టు సమాజంలో సత్యానికి కట్టుబడకపోతే...ఇంకెవరు ఆ పనిచేస్తారు?

పీహెచ్ డీ పని మానేసి ఈ బ్లాగ్ ఉజ్జోగం ఏమిటని...హేమ ఒక డజను సార్లు అడిగింది. 'ది హిందూ' లో అద్భుతమైన ఉద్యోగం వదలడానికి రీసెర్చు ప్రధాన కారణం. N-TV తర్వాత రెండు మూడు ఛానెల్స్ కు ఆమె అప్లై చేస్తే....ఇంటర్ వ్యూ అయికూడా ఉద్యోగం రాలేదు. ఆమె చేసిన మంచి జర్నలిజానికి మంచి పొజిషన్ రావాల్సింది, కానీ....కుదరలేదు. బ్లాగ్ మహిమే ఇదని కొందరు మిత్రుల అభిప్రాయం.
దాంతో అనుకుంటా.....ఆమె మొహమాటానికి పోస్టులు ఎడిటింగ్ చేస్తున్నది తప్ప...మనస్పూర్తిగా సహకరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆమె గనక ఎడిటింగ్ లో సహకరించకపోతే....ఈ బ్లాగ్లో పలు పోస్టులు నీతికి, ప్రొఫెషనలిజం అన్న మాటలకు దూరమై పోయేవి. అందుకే...మీ అందరికన్నా ముందు హేమకు ప్రత్యేక ధన్యవాదాలు. She is a very good editor. ఒక మాట ఎక్కువ దొర్లినా...పట్టుకుంటుంది. అలాగే...నేను పోస్టు రాయాలన్నప్పుడు మెషిన్ ను వదులుతున్న...మైత్రి, ఫిదెల్ లను మరిచిపోవడం భావ్యం కాదు.
ఎంతో పారదర్శకతతో, మంచి పెంచేందుకు, పంచేందుకు ఈ బ్లాగ్ నడుపుతున్నాం. సత్యం, న్యాయం, ధర్మం మాత్రమే ప్రాతిపదికగా నడుపుతున్నాం. కులం, మతం, ప్రాంతం...వంటి సంకుచిత భావాలకు దూరంగా ఉండి పోస్టులు రాయాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే...లక్ష హిట్స్ గురించి ఒక మాట మీకు చెప్పాలి. బ్లాగ్ ఆరంభించిన ఆరు నెలల తర్వాత ఆ స్టాట్ కౌంటర్ సెట్ చేశాం--కశ్యప్ గారి సహకారంతో. అప్పుడు స్టార్టింగ్ రీడింగ్ 30,000 గా సెట్ చేశానని గమనించగలరు.
ఈ పోస్టులలో కొందరు జర్నలిస్టు మిత్రుల ఆరోగ్యం, పిల్లల పరిస్థితి గురించి ఇతరులను అలెర్ట్ చేయగలిగాను. ఆ సమాచారం ఎంతో ఉపకరించింది...చాలా మందికి. అది మాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. 'అన్నా...కొత్త పోస్టులు ఏవీ?' అని అడిగే జర్నలిస్టు మిత్రులు కోకొల్ల తయారయ్యారు ఇటీవలి కాలంలో. ఈ బ్లాగ్ లోకంలో మంచి మిత్రులు లభించారు...ముఖ్యంగా బెంగుళూరు లో బ్యాంకు ఉద్యోగి-శివ గారు. బ్లాగ్ ను అగ్రిగేటర్లతో లింక్ చేయవచ్చని సలహా ఇచ్చిన-సుజాత మేడం. దొరికిన కొంత సమయాన్ని సాహిత్యం కోసం కేటాయిస్తూ...మంచిగా మాట్లాడే..వేణువు వేణు. వీలు దొరికినప్పుడల్లా ఫీడ్ బాక్ ఇచ్చే జీ-హెడ్ శైలేష్ రెడ్డి గారు....ఇలా ఒకరేమిటి...వందల మంది నేను కలిసినప్పుడు నా గురించి కాకుండా...బ్లాగ్ గురించి మాట్లాడుతున్నారు.

పోస్టులు చదువుతూ ఆదరిస్తున్న ఫాలో అవుతున్న వారికి, దేశ విదేశాలలో చదివి కామెంట్స్ రాస్తున్న అందరికీ కృతఙ్ఞతలు. మీ బ్లాగ్ చదువుతున్నాం...బాగుంటున్నాయి...అని ఉస్మానియా జర్నలిజం డిపార్టుమెంటు కు వచ్చి కొందరు చెప్పడం కూడా కొద్దిగా ఆనందం అనిపించింది.
నేను కొంత కటువైన సత్యాలు రాసినా నన్ను ఏమీ అనకుండా....పెద్ద మనసుతో....నా పని నేను చేయడానికి సహకరించిన సీనియర్ జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక థాంక్స్. ఉదాహరణకు...TV-9 మీద అన్ని కటువైన పోస్టులు రాసినా...రవి ప్రకాష్ మంచి స్టోరీ ఐడియా పంపితే...రిప్లై ఇవ్వడం భలే అనిపిస్తుంది. జర్నలిస్టులం...కక్షకు పోకుండా....పోస్టు పోస్టే...రిలేషన్ రిలేషనే అనుకుంటే బాగుంటుంది. అందరం చేయాల్సింది...సత్య శోధన. అందుకే...సత్యం పరమావధిగా పోస్టులు రాస్తానని, ఈ క్రమంలో తప్పులు దొర్లితే....చెంపలేసుకుని నాకు నేను సరిచేసుకుంటా అని మరొక్క సారి మాట ఇస్తూ....
సత్యమేవజయతే...
రాము
Note: ఇక నుంచి పేరులేని వారి, అనామకుల కామెంట్స్ ప్రచురించబోవడం లేదు. గమనించగలరు.

29 comments:
>>ఇక నుంచి పేరులేని వారి, అనామకుల కామెంట్స్ ప్రచురించబోవడం లేదు. గమనించగలరు.
మంచి పని చేశారు. లాగిన్ తప్పనిసరి చెయ్యండి.
అభినందనలు.
Congratulations. Keep up the good job.
ntv abn godavalemo kani swaroopanandha matram donga swamiji ney endhukantey nijamga swamiji itey abhashenti athaniki innova carenti aaa saradha peetam peru tho antha place enti.avanni avasarasma oka sanyasiki.. nizam ga nijayiti parude ithey ninna dharna cheyali kada kani paripoyadu adey athanii adigina edo oka kahani vinipisthadu ina madya lo ee donga swami bhagupaddadu e erendu chanels valla. emaina kani ntv ni mechukovali endhukantey neney devudini peru tho donga swamulani bhaitapeduthunnaru.
అభినందనలు. అజ్ఞాత అభిప్రాయాలూ అనుమతించకపోవడం మంచిది. కనీసం పేరు, మెయిల్ ఐడితో సైనాఫ్ చేసినా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. కోటి హిట్లు, లక్ష సభ్యుల స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నా.
ఏదో దయ్యం పట్టినట్లు ..అబ్బ, ఈ ప్రయోగం ఏమిటండీ?దాన్ని వెనక్కి తీసుకోండి! మీ బ్లాగ్ మొదలుపెట్టాక, తర్వాత మాకు మీడియా పట్ల ఉండే అపోహలు తొలగిపోయాయి చాలా వరకూ!
అనతి కాలంలోనే ఇందరి అభిమానాన్ని చూరగొన్నారంటే కారణం..మీరు ప్రజాపక్షం కావడమే! నలుగురి తరఫునా మీడియాను ప్రశ్నించడమే!
మనఃపూర్వక అభినందనలు!
అనాకమ వ్యాఖ్యలను అనుమతించకపోవడం మంచి నిర్ణయం!
sir u for got to announce the best anchor.
Annayya Ramu
Congratulations. What you have done is fantastic. I don't want to get into the debate of content and quality but the very effort to sustain the blog is good.
I would also like to congratulate you for taking the decision to keep away the anonymous postings. I think you should also consider keeping away the pseudonyms. Let us all get engaged in a healthy discussion...openly without hiding our faces.
I would also like to suggest, at least at this point, to use all your controls to avoid postings which are based on your personal reactions. I know this is your blog and you have a right to post what you want, but now that you have so many friends following it, it is not fair to impose your personal views on all the friends. In fact, I stopped visiting the blog after I saw your post on cricket analyst Mr Venkat. Knowing that he is/was associated with Deccan Chargers, his prediction on the fate of the team did not surprise me. But, the posting congratulating Mr Venkat on predicting the Chargers' victory was a shocker for me. Let me also put a disclaimer here...this is my personal view and I found some bias in the post and Mr Venkat's prediction.
Anyway, on reaching one lakh hits and hundreds following the blog, I think it's time to take the blog to the next level, where it becomes a true platform for professional issues.
Regards
K V Ramana
sir once please announce the best anchor.....
Chitti gaaru,
I've already announced the results and the three winners are going to get their prizes
Ramana,
Anna thanks for your comment. His predictions in other games like Table Tennis also came true on many occasions. More than that I am impressed by his comments on some sports related issues. That is why I did a post on him. Let the bygones be bygones.
I always value your comments.
cheers
Ramu
mi yokka situki maa yokka abhinandanalu. nenu matram prathi roju tappakunda mi site chusthanu. kani rojuki oka post matramey kakuda inka ekkuva post cheyyalani koruthunnanu. miru laksha hitlu sampadinchadaniki kevalam 8 nelalu pattindi inkoka laksha hits kosam 4 nelalu vechi vundandi.
congrats and best of luck
Congratulations Ramugaru and hemagaru.. keep up the good work
Dear Ramu, It really amazes me with the pace at which you keep this blog updated. Congrats to you and your blog and Hema garu is better off not taking jobs where she is seen through the glass of this blog. If the world is still a livable place, someday this blog itself will earn her a good job for the integrity you people are striving for.

Ramu Garu,
This is the blog has introduced me to the inside affairs of the telugu journalism.
Keep Going.. Best of Luck..
Sarat
మీ బ్లాగ్ ని తరచుగా చదువుతాను, చాలా మంచి సమాచారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదములు.
> అనామకుల కామెంట్స్ ప్రచురించబోవడం లేదు
మీకు inside info కోసమన్నా, అనామకుల వ్యాఖ్యలను ఆదరించండి
అభినందనలు రాము గారు
వేన వేల అభినందన మందారాలు అందుకోండి తొలుత.
బ్లాగు ఒక్కటున్న పదివేల శత్రువులవుతారని మీ అనుభవం
నాలుగు ప్రజాస్యామ్య కంబాలూ శిధిలమయిన చోట
మీ బోటి బ్లాగు భాస్కరుడొక్కరున్న చాలన్నది నాబొంట్ల విన్నపం
వెంకట సుబ్బారావు కావూరి
Congratulations sir. I go through this blog everyday. It's providing a very intelligent insight into telugu journalism. Keep going.
Bhayya,
Congtatulations. vijayadasami naadu start chesina pani vijayavantangaa mundukeltunnadi. Internet on cheste nee blog chadavande shutdown cheyalemu. search engine ki GOOGLE,Smart phoneski I-phone Telugu Blogski AP MEDIA KABURLU. go ahead thiruguledu. Charitra chebutunnnadi NIJAM CHEPPINA SAHASULANU URIKAMBAM EKKINCHAARU,AINA KOODA NIJALA VELLADI AAGALEDU. YOU are doing a great job continue it
---narender javvaji,SI
వెదికి చదివే బ్లాగులలో మీదీ ఒకటి. మనఃపూర్వక అభినందనలు.
అభినందనలు.
నేను కూడా అనుకున్నా ఇంత ఓపిక ఎక్కడిది వీళ్ళకు అని.
మేడం కెరీర్ ను త్యాగం చేయడం అన్నింటి కన్నా గొప్ప.
సత్య నిష్ఠ మీద మీరు చేసే ప్రయోగాలకు మరిన్ని అభినందనలు.
మీరు ఓడిపో కూడదని మనస్పూర్తిగా కోరుకుంటూ
శ్రీనివాస్.
విన్నపం: తెంగ్లిష్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోండి.
congrats and best of luck....i read ur blog every day....
మీ అందరికీ చాలా కృతఙ్ఞతలు. మీ ఆదరణకు థాంక్స్.
నరేందర్ భయ్యా...
థాంక్స్. 'ఎందుకు వచ్చిన గొడవ...ఇది' అనుకోవడానికి కారణం...కొందరు చేసే దారుణమైన ఆరోపణలు అన్నా. అవినీతి, అమ్మాయిల..కు సంబంధించిన ఆరోపణలు చేసి కుంగ తీయాలని చేస్తుంటారు ఈ నెట్ ప్రపంచంలో. అది చాలా అసహ్యంగా అనిపిస్తుంది.
అందుకే...ఒక SI గా, మిత్రుడిగా నన్ను దగ్గరి నుంచి చూసావు కాబట్టి, నేనేమిటో తెలుసు కాబట్టి...నాపై ఆరోపణలు చేసే వాడికి నీ ఫోన్ నంబర్ ఇస్తా...
సి యు
రాము
Congratulations!
Hema garu and Ramu garu
With regard to entertaining anonymous, I second 'paanipoori123'.Moreover, many people found it comfortable to comment as anonymous. They said that this being a proper platform for them, it is helpful for them to fearlessly pour out their problems. Not everybody can be the female anchor who lost her job.
మాధురి గారూ...
అనానిమస్ లు ఇంతవరకూ ఒక్క నాణ్యమైన సమాచారం గానీ, తీరైన వ్యాఖ్యగానీ చేయలేదు. పేరు చెప్పకుండా....ఇష్టం వచ్చింది రాసే/ తిట్టే వారిని ప్రోత్సహించక పోవడం మంచిది అనిపించింది. పేరు పెట్టి పబ్లిక్ గా కామెంట్ రాయడం ఇష్టం లేని వారు నా మెయిల్ కు తమ భావాలు పంపవచ్చు. నేను అవి...బాగుంటే....కామెంట్స్ లో నా ఐ.డీ.తో పోస్ట్ చేస్తాను.
నా ఐడి: srsethicalmedia@gmail.com
thanks
Ramu
రాము గారు నమస్కారము.
మీ ప్రయత్నము అభినందనీయము.వేయి పూలు వికసించనివ్వండి.అలాగే విభిన్న భావాలు సంఘర్శించనివ్వండీ.
మన:పూర్వక అభినందనలు రామూగారూ. టెక్నాలజీ రాజధానిగా పేరొందిన ఈ బెంగుళూరులో అడపా దడపా పడుతున్న వానల వల్ల నాకు ఇంటర్నెట్ రావటాంలేదు. అందుకనే ముందుగా స్పందించలేకపోయాను.
మీరు చేస్తున్న కృషి అనితర సాధ్యం. ఇలాగే మీడియా గురించిన బ్లాగ్ మీదే అనుకుంటాను. మీ కృషి ఇలాగే కొనసాగించండి. మీరు నడుపుతున్న బ్లాగు, మరింతమందికి స్పూర్తిదాయకమై మీడియా గురించిన బ్లాగులు మరిన్ని తయారయ్యి, పూర్తి మీడియాకు నిస్వార్ధంగా/నిస్పక్షపాతంగా మార్గదర్శనం చేయగల స్థాయికి చేరాలి. మనం అప్పుడప్పుడూ మీడియా ఆబుడ్స్మాన్ అని మన చర్చల్లో కలలు కన్నాం. ఇలా మనం బ్లాగుల్లో మీడియా గురంచి చేసే చర్చలే ఆ ఆబుడ్స్మాన్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. మీడియా గురించిన బ్లాగుల్లో ఎదైనా కార్యక్రమం గురించి వ్రాస్తే ఆ చానెల్/వార్తా పత్రిక వెంటనే అటువంటి సద్విమర్శకు స్పందించి జవాబు చెప్పుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి