ప్రస్తుతం టీవీ జర్నలిజంలో కాస్త చిత్తశుద్ధితో క్రైమ్ రిపోర్టింగ్ చేస్తున్న వారిలో టీవీ-ఫైవ్ లో వున్న మహాత్మ ఒకరు. చాలా సాత్వికుడు అయిన మహాత్మ ఎం.ఎస్సీ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) చేసిన తర్వాత 2003 లో 'ఈనాడు జర్నలిజం స్కూల్' లో చేరారు. కష్టపడి ఒక స్థాయికి వచ్చారు. తను పని చేసిన చోట తాను నమ్మిన ఒక బాస్ తనను మోసం చేసినట్లు మహాత్మ భావిస్తున్నారు. ఆ బాస్ కు ఆవేదనతో మహాత్మ రాసిన లేఖను ఇక్కడ యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. ఆ బాస్ మరో విధంగా భావించకుండా స్పోర్టివ్ గా తీసుకొని దీనికి స్పందిస్తే...సంతోషం. ఆ స్పందననూ పోస్ట్ చేస్తాను. మన వుద్దేశ్యం ప్రేమను పంచడమే...సామరస్యంగా బతకడమే..
-------------------------------------------------------
స్నేహం నుంచి పుట్టిన శత్రువుకి ఉభయకుశలొపరి...
శత్రువు కుశలం ఎందుకు కోరుకున్తున్నాడని అనుకోవచ్చు.
నాతో యుద్ధానికి దిగినవాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే 'యుద్ధనీతి' నాది. దొంగదెబ్బ కొట్టే 'కుటిలనీతి' కాదు.
పులి ఒక్కదేబ్బకే చావదు. దెబ్బతిన్న పులి 'దెబ్బ' ఎలా ఉంటుందో లోకానికి తెలుసు. ప్రస్తుతం నేను దెబ్బతిన్న పులిని..
నేను నిన్ను వ్రుత్తిపరంగానే వ్యతిరేకించాను. నిలదీసాను. ఎదురుతిరిగాను. సవాల్ విసిరాను.
కానీ నువ్వు వ్యక్తిగతంగా దెబ్బకొట్టావు.
ఇంతకి ఇంతా అనుభవిస్తావు అని ఆడంగి శాపనార్ధాలు పెట్టను.
కానీ ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు. నువ్వు చేసింది ఎంత పెద్ద నేరమో అనేది.
నాదారి నేను చూసుకుందాము అనుకున్న రోజు వెళ్లనీయలేదు. ఇప్పుడు నాకేదారి లేకుండా చేసావు.
నువ్వెంత పాపానికి ఓడిగాట్టావో నీకిప్పుడు అర్థంకావడం లేదు. అర్థమయ్యేసరికి నీదగ్గర ఒక్కరూ ఉండరు.
నేను నీ శ్రేయస్సు కోరాను. కానీ నువ్వు నా పతనం కోరావని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ బాగు కోసం నీ మీద జరుగుతున్న ప్రచారాన్ని, నిందలను నీ దృష్టికి తెచ్చాను. నిలదీసి అడిగాను. ఎందుకు...??? నువ్వు ఎవరితో తిరిగితే నాకేంటి..??? అలా అనుకోలేదు నేను. ఎందుకంటే... నిన్ను నేను నా జీవితంలో అందరికంటే ఎక్కువగా ఇష్టపడ్డాను. అలాంటి నావాడి మీద నిందలను సైతం సహించలేకపోయాను. అందుకే.. నిందకు సైతం ఆస్కారం లేకుండా నువ్వు ఉండాలని కోరుకున్నాను.
కానీ నువ్వు మాత్రం.. నేనే నీమీద దుష్ప్రచారం చేస్తున్నానని అనుకున్నావు. ఇన్నాళ్ళుగా నీమీద సాగిన దుష్ప్రచారం ఖండించినందుకు నువ్వు నాకిచ్చిన బహుమానం అనుకున్నాను. ఆ తర్వాత... ఒక అధముడిని అందలం ఎక్కించడం నచ్చక నీమీద కోపంతో 'బాలు' వెళ్ళిపోయాడు. కానీ నువ్వు దానికి నేనే కారణమని అనుకున్నావు. అంతేకాదు.. అలాగే ప్రచారం కూడా చేసావు. విషం నూరిపోసామని నువ్వు మామీద విషంకక్కావు. అయినా నేను నిన్ను ఏనాడు శత్రువుగా భావించలేదు.
చివరికి నీ వివక్షాపూరిత నాయకత్వాన్ని ముంబాయి ఉగ్రవాదుల దాడి విషయంలో నిరూపించుకున్నావు. జైపూర్ పేలుళ్ళ సంఘటన రోజే నేను అడిగాను. వెళ్తానని. అవసరం లేదు అన్నావు... అహ్మదాబాద్ ఘటనలోనూ అంతే.. నేను అవసరం అనుకుంటే అలస్కా నుంచి అండమాన్ వరకు సైబీరియా నుంచి సైప్రస్ దీవులవరకు ఎక్కడికైనా వెళ్లడానికి నేను సిద్ధం అనే విషయం నీకు తెలుసు. అయినా ముంబైకి రమేష్-తోపాటు మరో రిపోర్టర్ అవసరం అనుకున్నప్పుడు నన్నెందుకు పంపలేదు..?? అని నాకు నేను అనుకున్నానేగాని నేను ఎవరితోనూ అనలేదు. నన్ను ఆఫీసు లో చూసిన ప్రతి ఒక్కరూ అడిగారు.
మిమ్మల్ని పంపలేదు ఎందుకని..??? దీన్ని కూడా నువ్వు నీ విషపు దృక్కోణం నుంచే చూసావు. రమేష్'ని ఎందుకు పంపావని నేను అన్నట్లుగా చిత్రీకరించావు. అయినా సహించాను. ఇక నీతో ఉండటం 'శుద్ధదండగ' అనుకుని ఢిల్లీ వెళ్లిపోడానికి సిద్ధపడ్డాను. అప్పటికీ నీమీద నాకెలాంటి శత్రుత్వం లేదు. ద్వేషం తప్ప. కానీ.. చివరికి నువ్వు ఇలా.. నా జీవితం మీద దెబ్బ కోడతావని అనుకోలేదు. అవకాశాలు వచ్చినప్పుడు వెళ్ళకుండా చేసి.. బయటికి వెళ్ళాక అవకాశం లేకుండా చేయాలని చూసావు. చూస్తున్నావు కూడా.. నా వ్యక్తిత్వాన్ని చాలా దారుణంగా చిత్రీకరిస్తూ బయట ఎంత దుష్ప్రచారం చేసావో నాకు నిన్న అర్థమైంది.
ఇప్పటికీ నేను నిన్ను శత్రువుగా భావించడం లేదు. కానీ నువ్వు నన్ను శత్రువుగా భావించి నీకు సమఉజ్జీని చేసావు. నా స్థాయిని పెంచావు. నీమీద ఇప్పుడు.. ఇప్పుడు నిజంగా జాలి కల్గుతోంది. రేపటి నీ పతనం నా కళ్ళముందు కనిపిస్తోంది. నేనిప్పుడు కెరటాన్ని. పడిలేచిన కెరటం ఎలా ఉంటుందో నీకు తెలుసు.
ఇట్లు...
నీ శత్రువు (నీ భావన మాత్రమే)
కొడియార్ మహాత్మా విద్యాధర్
Monday, October 19, 2009
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
asalu manushulu nenu manishinee ane bhavana marchipoyi pravartistunnaru. kani oka vishayam ardhamaindi. telugu news channels lo panicheyyalante evaro okari panchana cheri chemchagiri cheyyalannamata...
డియర్ ఫ్రెండ్స్... ఇక్కడ ఎవరినో బ్లేం చేయడం నా ఉద్దేశం కాదు. అతన్ని నేను ఇప్పటికీ నేను రాముడిగా భావించే ఆ వ్యక్తి ప్రతిష్ట దిగజారడం చూడలేక.. ఇకనైనా మారతాడనే సదుద్దేశంతోనే ఈ లేఖను బహిర్గతం చేసాను. అతన్ని అభిమానించే ఎవరికైనా బాధ కల్గిస్తే అన్యదా భావించకూడదని కోరుకుంటూ...
మీ...
మహాత్మ..
wonderful blog
enjoyed reading all the posts
looking forward to newer ones
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి