ఒక రోజు "ఈనాడు" తనదైన ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకమైన..పెద్ద వార్త ప్రముఖంగా ప్రచురిస్తుంది. ఆ మర్నాడే...'సాక్షి' దినపత్రికలో "ఏది నిజం?" పేరిట ఒక చేయి తిరిగిన జర్నలిస్టు ఆ వాదన ఎందుకు తప్పో ససాక్ష్యంగా ఒక పేజీడు వ్యాసంలో ఉతికిపారేస్తాడు. 'ఈనాడు' ఏ దురుద్దేశ్యంతో ఆ వార్త రాసిందో...వివరిస్తూ...వివిధ సందర్భాలలో 'ఈనాడు' అదే టాపిక్ పై ప్రచురించిన వ్యాసాల క్లిప్పింగులను తన వాదనకు సాక్ష్యం గా ప్రచురిస్తాడు...ఎడిట్ పేజి లో.
ఈ "కౌంటర్ జర్నలిజం" గతంలో పెద్దగా లేదు. 'సాక్షి' పుట్టుకొచ్చాక 'ఈనాడు' ధాటిని తట్టుకోటానికి జగన్ బృందం ప్రయోగించిన 'అక్షర యుద్ధం' అది. 'ఈనాడు' కూడా 'సాక్షి' కౌంటర్ వ్యాసాలకు వ్యతిరేకంగా మరికొన్ని వ్యాసాలను ప్రచురించింది. కాని...అది ఒక నెట్ ఎడిషన్ కే పరిమితమయినట్లు సమాచారం.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే...ఈ 'ఏది నిజం' కాలాన్ని 'సాక్షి' లో అద్భుతంగా నిర్వహిస్తున్నది...'ఈనాడు' ప్రొడక్టే. చాకు లాంటి ఈ జర్నలిస్టును...'ఈనాడు' ఎలాంటి పదోన్నతులు ఇవ్వకుండా... దెబ్బతీసింది. అతన్ని ఇద్దరు సీనియర్ల అధీనంలో వుంచి మగ్గబెట్టారు. అక్కడ వుక్కపోతను తట్టుకోలేక పోతున్న ఆ జర్నలిస్టును 'సాక్షి' క్యాచ్ చేసింది. అతనికి 'ఏది నిజం' తో పాటు కొన్ని ప్రత్యేక కథనాలు రాసే బాధ్యత అప్పగించారు. 'ఏది నిజం' ప్రభావంతో...'ఈనాడు' లో విశృంఖల వార్తా కథనాలు తగ్గాయని జర్నలిస్టులు అనుకుంటున్నారు. అది నిజమో కాదో చెక్ చేసుకోవాల్సి వుంది.
ఇన్నాళ్ళు..ఛానెల్స్ కూడా రెచ్చిపోయి వ్యవహరించేవి. తామూ ప్రసారం చేసిందే వేదం అన్నట్లు ప్రవర్తించేవి. ఇంకా ప్రవర్తిస్తున్నాయి. వీటికి ముకుతాడు వేసే యంత్రాంగం లేదు. ఇప్పుడు...పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఛానెల్స్ పుణ్యాన 'కౌంటర్ జర్నలిజం' టీ వీ రంగంలోనూ ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది. మొన్న ఈ మధ్య...సంచలనం ఇంటి పేరుగా గల TV-9 తిరుపతి లో జూ ఉద్యోగులు మందుతో మజా చేసుకుంటున్న దృశ్యాలను ఎడా పెడా ప్రసారం చేసి...ఇంకేముంది తిరుమల పవిత్రత మటాష్ అయ్యింది అని గుండెలు బాదుకుంది. ఇన్నాళ్ళు...అది తప్పుడు వార్త అయినా..కొట్టుకుపోయేది. కొత్తగా వచ్చిన "ఏ బీ ఎన్--ఆంధ్ర జ్యోతి' ఛానల్ వారు..అది తప్పుడు వార్త అని నిరూపిస్తూ TV-9 అతిని బైట పెట్టారు.
ఆ మర్నాడే..నిమ్స్ వైద్యుడి పై TV-9 బురద చల్లిన సందర్భంలోనూ కొన్ని ఛానెల్స్ ఆ ఛానల్ అతి ఉత్సాహాన్ని ఎండగట్టాయి. ఇలాంటి వ్యతిరేక వార్తలు ఏ చానెల్ కైనా చెంప పెట్టులంటివి..వాటిని గుణ పాఠాలుగా తీసుకుంటే మంచిది. కానీ...."ఒక ఛానల్ లో ఇలా తప్పుడు వార్త వచ్చింది" అని ఈ ఛానెల్స్ దాపరికానికి పాల్పడుతున్నాయి. అంతకన్నా...ఫలానా ఛానల్ లో వచ్చిన వార్త అని దాని పేరు చెప్పి మంచి విశ్లేషణతో పరువు పంచనామా చేస్తే బాగుంటుంది. జనం వెర్రిబాగుల వారు కాదు...వారికి సత్యం తెలుసుకొనే హక్కు ఉంది కదా!
ఇది నిజంగా అహ్వానించదగిన జర్నలిజం. తప్పు చేసిన వాడిని మందలించి పాఠం నేర్పే నాగరికపు జర్నలిజం. ఇప్పుడైనా..ఛానెల్స్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాయి. అసలు..అన్ని ఛానెల్స్....మిగిలిన ఛానెల్స్ తప్పులతో పాటు తామూ తెలిసీ తెలియక చేసిన తప్పులను కూడా ఎత్తి చూపే కార్యక్రమాన్ని వారానికి ఒక్కటైనా ప్రసారం చేస్తే బాగుంటుంది.
కొన్నాళ్ళు..చానెల్స్ ఇలా కాట్లాడుకుని...విసిగి వేసారి..చివరకు ఒక 'కోడ్ అఫ్ కాండక్ట్' ను రూపొందించుకోవాలని...దాన్ని తు.చ.తప్పకుండా ఆచరించాలని ఆశిద్దాం. అంతకంటే మనం చేయదగినది ఏమీ లేదు.
7 comments:
channels okalni okallu dummethipoyadam manchi ani meeru antunnaru. kani edi nijamo edi abaddhamo teliyaka janalu confusion ki lonavara, for eg- eenadu-sakshi counter journalism. edi nijamo ela telsukodam?
Eenadu has lost its credibility. Edi nijam is the real nightmare to Ramoji. His bureaus have no guts to cook policy items now. His leader writers have no courage to counter Edinijam even in their "pen counter". They had closed their internet shop long ago.
Hats off to the writer of Edinijam, Jagan and Sakshi for creating a unique concept in journalism.
Why media is taking a stand even in giving news is an old question. Everybody is doing it. But, if a new entrant questions the reasoning behind taking such stand and publishing their own false versions, there is no answer from those news papers blindly supporting Mr Naidu. Ramoji cannot answer the questions raised in the counter journalism. Media's stories has to be reasonably questionned. Counter journalism is good for people.
Edi nijam gurinchi matladitey Eenaduku pakka tadustondi. Okka item ku kooda answer ledu. Sakshi vadu dorikinappudu vootiki parestunnadu... Eenadu vollappaginchi vootikinchu kuntondi. Edi nijam peru chaki revu ani peditey baaguntundi.
AJ vadu TV9nu target chestadaa... Nijalu cheputadaa... what a foolish thought? Dongalu... dongalu... medianu panchu kuntunnaru. Ido type goodu putani. Andukey Aj vadu rojuu Jagan mida rastunnadu. Vadiki Sakshiki fight petti Eenadunu paiki toyyalannadi CBN plan laa kanipistondi. Ido vedhava politics.
Eenadu tappula kuppa. Akkada dammunna writer okkadu kuda ledu. Satta vunna reporterlu leru. Alanti manchi lakshanalu vuntey paiki ranivvaru. Core Committee is the biggest liability to Ramoji. After his demise... (papam saminchu gaka) who can save that organization?
Who is that writer? I'm a fan.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి