Saturday, October 24, 2009

'సూర్య' బ్యానెర్ వార్తలో వ్యాఖ్యలు...విశ్లేషణలు...

"ఇక్కడ 'వై'...అక్కడ... ఎస్" అన్న శీర్షికతో ఈ రోజు (అక్టోబర్ 24) 'సూర్య' దినపత్రిక లో ప్రచురించిన బ్యానర్ స్టొరీ ఒకే సారి చాలా భావాలు కలిగించింది. అది చదివితే..ఒక కథ చదివినట్లు...ఒక మానసిక నిపుణుడి కాలం చదివినట్లు..ఒక సంపాదకీయం చదివినట్లు...ఒక మంచి లేఖ చదివినట్లు..అనిపించింది. పేజి మేక్ అప్ చాలా బాగుంది కాని...వాడిన పదజాలం హాస్యాస్పదంగా వుంది.

బ్యానర్ స్టొరీ మొదటి పేరా ఇలా వుంది: "మనసులో గూడు కట్టుకున్న భావాలు ఎంత తొక్కి పెట్టినా ఒక్కోసారి అవి బయట పడుతూనే వుంటాయి. ఒక సారి అసంతృప్తి అంటూ మొదలైతే దాన్ని అణుచుకోవడం కష్టం. అవన్నీ  ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో మనసు నుంచి తూటాల్లా దూసుకు వస్తుంటాయి. దానికి మానసిక శాస్త్రమే చదవాల్సిన పని లేదు. ఇప్పుడు జరిగిందీ యిదే."

ఇవన్నీ పొంతన లేని మాటలు. వాక్యాలు సరిగా అతకలేదు.
ఇంతకూ "సూర్య ప్రధాన ప్రతినిధి" గారు ఇక్కడ చేస్తున్నది...జగన్ మానసిక విశ్లేషణ. చెప్పదలుచుకున్న మాట సూటిగా చెప్పకుండా...ఈ ఊకదంపుడు ఉపోద్ఘాతం ఏల? ఇక తర్వాతి వాక్యం: 
"ముఖ్యమంత్రి పీఠం పై మనసు పారేసుకుని, ఆ కల సాకారం కోసం రెండు నెలల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమాన్ని సాగిస్తున్న జగన్, తాను కూడా వాటికి అతీతుడిని కాదని నిరూపించారు." ఇక్కడ 'వాటికి' అంటే "వీటికి?". ఇవే కాకుండా చాలా సంపాదకీయ వ్యాఖ్యలతో సాగిపోయింది బ్యానర్. జగన్ పై అభాండాలు, అనుచిత వ్యాఖ్యలు ఇందులో చాలా కనిపించాయి. రిపోర్టర్ గారు జగన్ మీద ఏది తోస్తే అది రాసిపారేశారు.


'ఈనాడు' లో ఉద్యోగులను తన రాతలు, చేతలు, మాటలతో దడదడ గడగడ లాడించిన ఒక పరమ భయంకర జర్నలిస్టు కీలక భూమిక పోషిస్తున్న 'సూర్య' లో ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యమే. ఆ పక్కనే ప్రచురించిన ఒక ఇంట్రో లో "తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు పోరాటం చేస్తానంటూ (జగన్) ప్రతిపక్ష నేత అవతారమెత్తారు," అన్న మాట వున్నది. ఇలా...ఆ కుర్ర రాజకీయ వేత్తకు "అసమ్మతి వాది" అన్న ముద్ర వేయడం బాగోలేదు.

ఇక్కడే 'సీ ఎం పదవిపై తగ్గని ప్రేమ" అని ఒక ఉప-శీర్షిక పెట్టారు. ఇది కూడా..రాతగాడి భావనను..అతగాడి పై రుద్దడమే. ఈ తరహా కామెంట్లతో కూడిన వార్త...సంపాదకీయ పేజిలో వేస్తే కాస్త అర్థం వుంటుంది. కాస్తో కూస్తో బుర్ర వున్న పెద్ద స్థాయి వుద్యోగులు వార్తల నాణ్యతపై కాకుండా...వుద్యోగులను పీడించి, వేధించి, హింసించి ఆనందం పొందటంలో నమగ్నమైతే..ఇలాగే వుంటుంది మరి. నూకారపు సూర్య ప్రకాష్ రావు గారికి శుభం కలుగు గాక!

7 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

గత 50 రోజులుగా జగన్ సి.ఎం కావాలని జరుగుతున్న సంఘటనలన్నీ మీరు మర్చిపోయినట్టున్నారు . అవన్నీ ఎవరి ప్రోద్భలంతో జరిగాయి.ఈ రోజు జగన్ స్టేట్మెంట్ చూసే వుంటారు. "నేను ఆ పదవిని ఆశించలేదని". మరి ఆశించనపుడు ఆ సంఘటనలను అప్పుడే ఖండించవచ్చు కదా!?
అప్పుడే ఖండించ వుంటే జగన్ పై ఇన్ని అభాండాలు పడేవి కాదు. ఇవన్నీ జగన్ కు తెలియదు అంటారా ? లేక మీకు కూడా తెలియదు అంటారా. జనం చూస్తూనే వున్నారు ఎవరి మనసులో ఏముందో. జగన్ ఖచ్చితంగా ఆ పదవి ఆశించారు .... కుదరక ఇప్పుడు మాట మార్చారు అంతే.

ANALYSIS//అనాలిసిస్ said...

గత 50 రోజులుగా జగన్ సి.ఎం కావాలని జరుగుతున్న సంఘటనలన్నీ మీరు మర్చిపోయినట్టున్నారు . అవన్నీ ఎవరి ప్రోద్భలంతో జరిగాయి.
ఈ రోజు జగన్ స్టేట్మెంట్ చూసే వుంటారు. "నేను ఆ పదవిని ఆశించలేదని". మరి ఆశించనపుడు ఆ సంఘటనలను అప్పుడే ఖండించవచ్చు కదా!?
అప్పుడే ఖండించ వుంటే జగన్ పై ఇన్ని అభాండాలు పడేవి కాదు. ఇవన్నీ జగన్ కు తెలియదు అంటారా ? లేక మీకు కూడా తెలియదు అంటారా. జనం చూస్తూనే వున్నారు ఎవరి మనసులో ఏముందో. జగన్ ఖచ్చితంగా ఆ పదవి ఆశించారు .... కుదరక ఇప్పుడు మాట మార్చారు అంతే.

Ramu S said...

శ్రీను గారు,
మీరు మంచి అంశం టచ్ చేసారు కానీ నా బాధను సరిగా అర్థం చేసుకోలేదు. జగన్ పదవి ఆశించవచ్చు, దాని కోసం ఒక పెద్ద వుద్యమం చేసి వుండవచ్చు. పదవి ఆశించి భంగపడినంత మాత్రాన మీరు అతనికి "అసమ్మతివాది" "ప్రతిపక్షనేత తరహా" వంటి ముద్ర వేస్తారా? వార్తకు, కామెంట్ కు తేడా తెలియకుండా...నోటికి వచ్చింది విలేకరులు రాయవద్దన్నది నా సూచన. విలేకరి గారు ఆ తరహా లీడ్ ను సంపాదకీయం పేజిలో రాసి వుంటే బాగుండేది. ఒక పధ్ధతి లేకుండా...మన భాష్యాలు మనం మొదటి పేజిలో ప్రచురిస్తే బాగుండదని నా అభిప్రాయం.
థాంక్ యూ
రాము

Anonymous said...

ramu garu,
suryaloo neenu pani chesanu. akkada items raayatam undadu. vadatame. chairman garu oka point chebite, Sarma ane chemcha aha oho antadu. oka reporter daanni telugu chestadu. aanaka chairman gari story ani bhayapadi daanni inkevvaroo muttukooru. siggu vadileesina pedda journalist okadu ee tatangam anta choosi aa rojuki pabbam gadupukuntadu.

విశ్వామిత్ర said...

మీడియా యాజమాన్యపు తీరుతెన్నులని నూటికి నూరుపాళ్ళు ఖండించాలి. వారి విధానంలో మార్పు రావాలి. కాని మీరు నాణేనికి ఒకవైపే రాస్తున్నారు. కవరేజ్‌కి రావాలంటే మంచి గిట్టుబాట్లు ఉంటేగాని పెన్ను/కెమేరా కదపని జర్ననిస్టులు ఎంతొమంది ఉన్నారు. వారిగురించి కూడా ఒకమాట రాస్తే సమపాళ్ళలో ఉండేదికదా ! !

Anonymous said...

ikkada jarigina varta visleshana, dani pai a patrika maji employee comment chadivaka papam ayana sarva svatantraga vyavaharinch, journtalistic niyamalu patinche samshtalo independentga pani chestunaanta build up undi. yajamanyala guidance lekunde nadiche samshtalu unte pl. prakatinchagalaru. Alage management chepinadaniki vyatirekanga vastavaalanu matrame rase journalistla perlu kuda list ivandi. Inspiring ga untundi. Toti journalistlani vimarsinche mundu kasta atma vimarsa chesukunte baguntundi. Kasta vade bhasha mida drushti pedite baguntundi. Idi yellow journalism blogni cheyadalchukunnara? kasta decency patiste baguntundi. E commentni positivega pariseelistarani bhavistunna.

Ramu S said...

మిత్రమా,
ఒక ఎల్లో వార్త గురించి నేను రాస్తే...ఎల్లో బ్లాగ్ అన్నట్లు మాట్లాడారే! ఎక్కడ భాష సమస్య వచ్చింది మీకు?--నాకు తెలియజేయండి. వార్త విషయంలో నా విశ్లేషణ కన్నా..అక్కడ పనిచేసే జనాలను పీడించే ఒక దుర్మార్గపు మనిషి గురించి రాసింది మిమ్మల్ని బాధించి వున్నట్లు వుంది. 'ఈనాడు'లో వుండగా తను ఎందరిని హింసించింది...ఇప్పుడు ఎందరి వుద్యోగాలకు ఎసరు పెడుతున్నాదీ...తెలిస్తే మనిషులమైన మనం అందరం బాధపడతాం. తన సంగతి తర్వాత చూద్దాం. మీకు..విశ్లేషణలో ఇబ్బంది వుంటే తెలియచేయండి. ఆ వార్త మీదనే మరో విశ్లేషణకు వెళ్దాం. ఆ మహానుభావుడి తరఫున వకాల్తా పుచ్చుకుంటే...ఎవ్వరం ఏమి చేయలేం.
నిజమే..మీరన్నది. యజమానుల మాట విననిదే జర్నలిస్టులు పనిచేయలేరు. అదే వార్తను అదే..లైన్లో ఎలా రాయాలో ఆ పత్రికలో మనం అనుకుంటున్న జర్నలిస్టును అడగండి. ఆయన రాసి చూపిస్తారు.
సీ యు
రాము

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి