Monday, October 26, 2009

జర్నలిస్టు కావడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదా?

"ఈ దేశంలో...డాక్టర్ కావడానికి...ఎం.బీ.బీ.ఎస్., ఇంజినీర్ కావడానికి బీ.ఈ., లాయర్ కావడానికి ఎల్.ఎల్.బీ., టీచర్ కావడానికి బీ.ఈడీ. డిగ్రీలు కావాలి. కానీ రాజకీయ నాయకుడు కావడానికి గానీ, జర్నలిస్టు కావడానికి గానీ ఏ క్వాలిఫీకేషన్ అవసరం లేదు."  


--మీడియా మీద, రాజకీయ నేతల మీద, వారు చలాయించే అధికారం మీద కడుపు మండే రచయితలూ, నిర్మాతలు, డైరెక్టర్లు ఎన్నో సినిమాలలో, టీ.వీ.సీరియళ్ళలో, కథలలో ఈ డైలాగ్ చాలా సార్లు అటు మార్చి ఇటు మార్చి వాడుతుంటారు. కొందరు మేథావులూ విసురుగా ఈ మాట అంటుంటారు. వీరి కడుపు మంటకు ఒక అర్థం వుందేమో అని అనిపిస్తున్నది ఈ జర్నలిజాన్ని దగ్గరి నుంచి తరచి చూస్తే. తప్పుగా అనుకోకపోతే...ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుందాం.

మీ కులం "K" అనుకుందాం. మీకు అర్జంటుగా జర్నలిస్టు కావాలని వుంటే...చాలా వేదికలున్నాయి ఇప్పుడు. మీ వూళ్ళో కాస్త డబ్బు వున్న "పెద్ద కే" దగ్గరికో "చిన్న కే" దగ్గరికో వెళ్లి మీ కోరికను తెలియజేయండి. "ఈనాడు" లాంటి సంస్థలో వెంటనే ఇప్పించలేరు గాని బంజారా హిల్స్ లో వున్న వేరే కొన్ని ఛానెల్స్, పత్రికలలో ఒక రెండు రోజులు అటూ ఇటుగా ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేయగలరు. రాష్ట్రం పసుపు మాయం గావాల్నని పుట్టుకొచ్చిన ఛానెల్స్ లో ఒక జాబు మనదే.



మీరూ "TV-9" రిపోర్టర్ల మాదిరిగా కెమెరా ముందు కనిపించవచ్చు. రెచ్చిపోయి జర్నలిజం చేయవచ్చు. కులానికి వ్యతిరేకంగా ఉపన్యసించవచ్చు. మీ ప్రతిభా పాటవాలు నచ్చితే..మనోల్లది ఏదో ఒక సంస్థకు మారి ఏ యూనిట్ మేనేజర్ గానో, జర్నలిజం స్కూల్లో పాఠాలు చెప్పే పనో ఇప్పించుకుని వెళ్లిపోవచ్చు. అప్పుడు జర్నలిజం మీద సాధికారికంగా మాట్లాడవచ్చు.  ఒక ప్రణాళిక ప్రకారం వృత్తిలోకి మనలాంటోల్లను ప్రవేశపెట్టుకోవచ్చు. మన జాతి కీర్తి ప్రతిష్టలు దేశవిదేశాలకు పాకే ఏర్పాటు చేయవచ్చు.  అరరే..మంది తెలంగాణా న? సారీ ర భై. మల్లి కలుద్దం.



అదే...మీరు "R" అయితే...కేర్ ఫుల్ గా అదే బంజారా హిల్స్ కు వచ్చెయ్యండి. మనను డిగ్రీ గిగ్రీ అడిగే దమ్మున్నోడు ఎవడాహ! మీ పూర్తి పేరు సెక్యురిటిలో మనోనికి చెప్పండి. డైరెక్టుగా...గాజు లిఫ్టులో అర్జంటుగా పైకి రావాల. అక్కడసలే మనోళ్ళు తక్కువైనారని ఫీలవుతా వున్నారు అబ్బాయా. ఇన్నాళ్ళు...మనోళ్ళకు... దినాం చాకిరి చేసినా...మంచి ఉజ్జోగాలు రాలేదు. ఇదే..మాంచి తరుణం. కొన్నాళ్ళు ముందు వచ్చి వుంటేనా...ఇంకో మంచి పోస్ట్ ఇచ్చావాడు..మన అన్న. సరే...ఇప్పటికైతే నీ ఇష్టం వచ్చిన పొలిటికల్ బీట్ తీసుకుని మైకు పట్టుకుని జల్ది పో. "బీట్" అంటే...ఎరకలేదా...మారుతి వ్యాన్ డ్రైవర్ చెప్తడు. పో..పో..


అదే గనక...మీరు "B" క్యాటగిరి వారే అయ్యారనని చెప్పి అనుకోండి. మీహుకు యేహ్మి పర్వాలేదు. మన వారు...అన్ని చోట్ల బహు పెద్ద స్థానాలలో తిష్ట వేసి వున్నారు. వారదరున్నూ పండితులే. అందరున్నూ..రోజులు బాహోలేక కుతకుత లడుతున్నప్పటి కిన్నీ మీకు ధోకా లేదు. కాకపోతే...జర్నలిజం డిగ్రీ గిగ్రీ లేకపోయినా...తప్పులు లేకుండా రాసే డొక్క సుద్ధి ఒకటి ఏడ్చింది కనుక..మన వారు మీ బాగోగులు చూచుకుంటారు. పధ్ధతి ప్రకారం వారిని ముందుగా అపాయింట్మెంట్ అడిగి..మీ ఇంటి పేరు, గోత్రం గట్రా చెప్పి వెళ్లి కలవండి. మీకు శుభం కలుగుతుంది. మిమ్ము నియమింపజేసేందుకు...మన వారు...వేరే వారిని పనికిరాని వారిగా చిత్రీకరించి.."కే" బాస్ నో.."ఆర్" బాస్ నో ఒప్పించి వారి ఉద్యోగమూ పీకించి మిమ్ము నియుక్తులను చేసేందుకు కొంత వ్యవధి అవసరము. ఈ లోపు సమీపము లోని చిత్రశాలలో 'పాండవ వనవాసం' చూసి రండు. అదన్న మాట సంగతి.

OK. You know bit English? Then there is no problem. Send two applications to Chennai.

ఇక..మీరు.."V" అయితే...కాస్త లేటైనా..అదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్.12 కొచ్చి చిన్న గల్లిలోకొస్తే పని కావచ్చు. షాప్ లో నష్టం రావటం వల్ల జర్నలిజం డిగ్రీ లేదని మీరు చెప్పాలి అన్తే. అదే..."BC" అయితే..మనకూ ఒక వేదికుంది..జరా చూసుకొని ముందుకు పోవాల. ఎటొచ్చి..మిగిలిన జనానికైతే డిగ్రీ లేకుండా మరి చాన కష్టం. ఉర్దూ వస్తే...తోడ అడ్జస్ట్ కర సక్త. 

పైదంతా నడుస్తున్న చరిత్ర. అక్షర సత్యం. ఈనాడు...పత్రికలూ...ఛానెల్స్ సాక్షిగా పాకుతున్న కనిపించీ...కనిపించని క్యాన్సర్ రోగం. కులాల పోషణ మధ్య జర్నలిజం నలిగి నుజ్జునుజ్జు అవుతున్న దారుణ దృశ్యం. లౌకిక వాదులు గెంటి వేయబడుతున్న దయనీయ స్థితి. "K", "R", "B" ల ఆధిపత్యం పెరగడం..పెచ్చుమీరడం...వల్ల మీడియాలో సైతం 'రిజర్వేషన్" కావాలని అణగారిన వర్గాలు సమంజసం గానే కోరుతున్న వైనం.


కులం కార్డు మెడలో వేసుకుని సిటీకి వస్తే...చివరకు 'కంట్రీబ్యుటర్" ఉద్యోగమైనా...ఊళ్ళో ఛానల్ స్ట్రిన్ గర్ జాబైనా దొరకటం ఖాయం...ఈ రోజుల్లో.  విలేకరి అన్న కార్డు దొరికితే..తర్వాత సంగతి తర్వాత. ముందైతే..ఒక దున్నుడు దున్నుకోవచ్చు.   


ఇంత మంచి అవకాశాలు వుంచుకుని బీ.సీ.జే., ఎం.సీ.జే. కోర్సు చేయాలనడం టైం వేస్టు అన్న భావన వృత్తిలో వుంది. పైగా..కోర్సులలో చేరితే...అనవసరంగా...'మీడియా..లాస్...ఎథిక్స్" అనీ..పిచ్చి పిచ్చి విషయాలతో పాటు కొన్ని నీతీ నియమాలు నూరి పోస్తారని కొన్ని యాజమాన్యాల భావన. అందుకే...విశ్వ విద్యాలయాల డిగ్రీలు నాలుక గీసుకునేందుకైనా పనికిరావని...ఊరి బైట సొంత స్కూల్ లో బ్యాచుల మీద బ్యాచులు ఒక కర్మాగారం నుంచి వుత్పత్తి చేస్తున్న ఒక పెద్ద మనిషి బైటికి గట్టిగా చెప్పే మాట.



మొత్తం మీద...బేసిక్ శిక్షణ కోసం దాదాపు అన్ని ప్రధాన పత్రికలూ, ఛానెల్స్  సొంతంగా జర్నలిజం స్కూళ్ళు తెరిచాయి. కావలసిన వాళ్లకు సీట్లు ఇచ్చి...ప్రతిభకు పట్టం కట్టి..వారిని తమ అవసరాలకు తగ్గట్లు తీర్చి దిద్ది మీడియాలో వాడుకుంటున్నారు. వర్షాకాలం చదువులు చెప్పి...విద్యార్థులకు జర్నలిజం కన్నా..వేరే..విషయాలు బాగా నూరిపోసి పంపుతున్నారన్న అపవాదూ వుంది. ఇప్పుడు వారంతా..అచ్చువేసిన ఆంబోతులు. జర్నలిజాన్ని కుమ్మి పారేస్తారు. అందుకే మరి...ఈ రక్తపాతం.

10 comments:

Anonymous said...

మన ప్రబుత్వాలే స్కూల్ మొదటి రోజునే నీ కులం చెప్పి మరీ చేరటానికి లేదు, నీ బాబు IAS అయినా, అడుకొన్నేవాడు అయినా, వాటికంటే నీ కులమే ప్రాముఖ్యం అని చెబ్తుంటే, ప్రైవేట్ వ్యాపారాలలో ఒకటి అయిన మీడియా లో వాటి ప్రాముఖ్యత ఉండకూడదు అని ఎలా ఆశిస్తారు.
ఇక రొండవది మీరు అలోచించాల్సింది ఏమిటి అంటే ఏ వ్యాపార అధిపతి అయినా అత్యంత ప్రతిభావంతులు తమ సంస్థలో పని చేయాలనే కోరుకుంటాడు, కులం తో నిమిత్తం లేకుండా, తమ సంస్థ ప్రగతి కోసం, అలాంటిది ఆ అధిపతులే తమ కులం వాళ్లకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే, వాళ్లు ఎన్ని ఎదురు దెబ్బలు తిని ఇదే సేఫ్ మార్గం అనుకోబట్టే కదా? సంస్థ అధిపతులు ఇలాంటి conclusion కు రావటానికి journalists కారణం కాదంటారా? తమ కులం వాడు ఇంకో చానెల్ లేక పత్రికో పెట్టగానే సొంగ కార్చుకొంటూ ఇంతకముందు తమని గౌరవం గా చూసిన సంస్థలను వదలి వెళ్ళిన journalists మీకు తెలియదా? ఇలాంటి దెబ్బలు తిని తిని చివరకు ఓ మాదిరి talented అయినా సరే మనదగ్గర నాలుగు కాలాలు పనిచేసే మన కులం వాడో, మన ప్రాంతం వాడో ఉండటం మంచిదిలే అని సంస్థ అధిపతులు అనుకోవటం లో వాళ్లను తప్పు పట్టగలరా?
ఇక journalism లో ఉన్న వాళ్లుగా ఈ కులాల గొడవేమిటి అని మీరు వాపోతున్నారు అనుకొందామనుకొంటే, journalism ఏమీ ఆకాశం నుండి ఊడిపడిన profession ఎమీ కాదు కదా!!
మన ప్రాణాలు కాపాడాల్సిన వైద్యం లో కులం వారిగా రిజర్వేషన్లే కాక, కులం వారిగా ప్రమోషన్ లు, విశ్వవిద్యలయాల కులపతులు, ఉప కులపతులను వాళ్ల వాళ్ల సామర్ధ్యం కాకుండా కులం అధారం గా నియమించటం, ఇక దేశ రక్షణ కు సంభంధించిన ప్రాజెక్ట్లలో, ఆఖరికి ఉపగ్రహాలు పంపే సంస్థలలో ప్రతిభ కాకుండా కులం అధారం గా ప్రమోషన్లు. MLA టికెట్స్ నుండి, మంత్రుల వరకు కులం అధారం.
ఎమైన అంటే దిష్టి బొమ్మలకు కులం అంటగట్టి కేసులు పెడతాం అని బ్లాక్మెయిల్స్, ఇలాంటప్పుడు సంస్థ అధిపతులు తమ కులం వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వటాన్ని తప్పు బడటం, గొంగళి లో అన్నం తింటూ, అన్నం తో పాటు వచ్చే వెంట్రుకల గురించి బాధ పడటం కాదా?

Vinod said...

అందరు దొంగలే. కుల రాజకీయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తుంది. రిజర్వేషన్ పెట్టడం ఒక దరిద్రమయిన ఆలోచన. Correct qualification అవసరం అని పెడితే బావుంటుంది.
>>మీడియాలో సైతం 'రిజర్వేషన్" కావాలని అణగారిన వర్గాలు సమంజసం గానే కోరుతున్న వైనం.
అణగారిన వర్గాలంటే ఏ ఉద్దేశ్యం లో? రిజర్వేషన్ పెడితే వేరే ఎదవలు వచ్చి ఇవే వెలగపెడుతారు. It won't help at all.

Anonymous said...

telugulo ela rayalo kooda home pagelone cheppeste pola...

వెంకట రమణ said...

తెలుగులో వ్రాయడానికి సహాయం కోసం http://etelugu.org/helpcenter చూడండి.

kvramana said...

I don't agree with two basic parts of this posting:
1. Today, media is absolute business. Look at the way the Engish media houses are managing them. It's absolute, cut throat business and one organisation where I worked earlier calls the edition we bring out a 'product'. They refuse to call it an edition. "How is the product" is what the bosses ask on a daily basis. So, the media (read business) houses know how to run them since the objective is to make profits. If you are talking about pure play journalism, I agree with what you are saying. But, can you tell us how many media houses focus on society without the objective of making money. So, if an organisation wants to hire a 'K', a 'R' or a 'B' at the cost of their business, it is their decision. And I think you are underestimating the business acumen of these owners.
2. You talked about BCJ and MCJ or some form of formal training. Brother, in that Eenadu School batch of ours, how many were BCJs and MCJs when we joined? Don't you think most of our batchmates were successful or are successful as professional journalists? And what makes you think that a BCJ or an MCJ grad will be a good journalist? Several MCJs worked as trainees with me and I can't give you the specifics, but most of them were useless.
If you say that only socially conscious should become journalists, I am all for it.
Regards
Ramana

సుజాత వేల్పూరి said...

సో, ఈ గజ్జి ఇందు గలదందు లేదని సందేహమే వలదన్న మాట. మరి "పేరు చివరకులం తోకలు కత్తిరిద్దా"మంటారేమిటి మెరుగైన సమాజానికి ముళ్లబాటలు వేసే వాళ్ళు?

అర్క said...

నేను రమణగారితో ఏకీభవిస్తున్నాను. మీడియాలో కుల ప్రభావం అన్ని రంగాల్లో ఉన్నట్లే ఉంది. ఇది సృజనాత్మకరంగం కనుక కొంచెం ఎక్కువ ఉండచ్చు. కానీ చిట్టచివరికి నిలిచేది ఆర్థికప్రాధాన్యతలే. ఆఖరుగా మనకెంత ననష్టం? మనకేం లాభం? అనే రెండు ప్రశ్నలే అన్ని నిర్ణయాలనూ ప్రభావితం చేస్తాయి.
నేను మీ బ్లాగును అయిదారు రోజుల క్రితమే చూసాను. దాదాపుగా అన్ని టపాలూ చదివాను. నిదానంగా ప్రారంభ ఉద్దేశ్యాలనుంచి దూరంగా జరుగుతున్నారేమో అనిపిస్తోంది. మీరు రాస్తున్న అంశాలలో చాలా తక్కువశాతం యువ జర్నలిస్టులకి పనికి వచ్చేవిగా ఉన్నాయి. మిగిలినవన్నీ వాళ్ళని "ఇక్కడ నైపుణ్యానికీ, సృజనాత్మకతకూ చోటులేదు తమ్ముడూ. కేవలం పాత్రికేయ వృత్తిని అమ్ముకోదల్చుకుంటేనే ఇక్కడకు రా." అని చెబుతున్నాయి. అందరూ చెడిపోయారు కనుక నేను కూడా చెడిపోయి తీరాల్సిందే అని అనిపించేలా రాస్తున్నారు. ఇది అంత మంచిది కాదేమో ఒక్కసారి ఆలోచించండి.

S.Ramu said...

ఆర్క గారూ,
"బాల వినోదం చూద్దామూ...బాలల్లారా...రారండో..." తరహాలో..."యువకులారా...రారండి...ఈ జర్నలిజంలో చేరండి..." అని వెన్ను తట్టి ప్రోత్సహించడం, ఎగ తోయడం ఈ బ్లాగ్ వుద్దేశ్యం కాదు. మీడియాలో ద్వంద్వ ప్రమాణాలు, చెత్త, కుళ్ళు, దుర్గంధాల గురించి రాసి...మంచి జర్నలిస్టులను, మంచి కథనాలను ప్రశంసించడం ఒక పని గా పెట్టుకున్నాను. పీడించే బాస్ లను మాత్రం ఎండగట్టాలని వుంది. లాభం, నష్టం చుట్టూనే మన లెక్కలు సాగితే..కష్టమే మరి. చూద్దాం..ఇంకా బాగా ఉపకరించే విశ్లేషణలు అందిద్దాం.
రాము

అర్క said...

రాము గారూ, మీకు తెలియదనో, మీకు చెప్పేంత జ్ఞానం అనుభవం ఉన్నాయనో కాదు గానీ మీ బ్లాగులో మీరనుకొనే పాజిటివ్ ఫోకస్ ఇంకా పెంచాల్సిఉంది. పీడించే బాస్ లను ఒక కంట కనిపెట్టి, నీ వెధవ్వేషాలు మేం గమనిస్తున్నాం, జాగ్రత్త అని చెప్పాలనే ప్రయత్నం చాలా మంచిది. అనుమానం లేదు, నాకున్న కొద్దిపాటి అనుభవంలో అది అవసరం కూడా. కానీ ఒక్కసారి మీ బ్లాగును మీరే ఒక పాత్రికేయుడిగా విశ్లేషించుకోండి. మీరనుకున్న మంచి టపాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయనే ఒక యువ జర్నలిస్టుగా నా బాధ. (మంచి రెండు రకాలని మీకు తెలుసనుకుంటాను. ౧)విషయపరంగా మంచి, ౨)ప్రజంటేషను పరంగా మంచి; వ్యక్తుల్లో అయితే ౧)వ్యక్తిత్వపరంగా మంచి, ౨)వృత్తి నైపుణ్యంపరంగా మంచి.) లోపాలను ఎత్తిచూపడం అవసరమే. బయటవాళ్ళకి ఈళ్ళంతా ఎదవలే అనిపించే విధంగా టపాలు వ్రాసి ఎవరిమెప్పు పొందుదామని? మీలాంటి వారికి ఆ విధంగా వచ్చే గుర్తింపు ఆత్మసంతృప్తి ఇవ్వలేదనే నేను విశ్వసిస్తున్నాను. మన వృత్తిలో ఉన్న వత్తిళ్ళు బయటవాళ్ళకు తెలియాలి, వాటిని ఎదుర్కొంటూ కూడా మంచి పాత్రికేయుడిగా ఎలా ఉండొచ్చో నాలాంటి యువపాత్రికేయులకు తెలియాలి. అప్పుడు మీలాంటి వారు మీ అమూల్యమైన సమయం వెచ్చించి రాస్తున్న టపాలకు సార్థకత.
సహృదయంతో అర్థం చేసుకుంటారని విశ్వసిస్తూ,

Ramu S said...

మిత్రమా,
మీ బాధ యిప్పుడు కాస్త బోధ పడింది. ముందుగా."ఆణి ముత్యాలను సూచించండి...ప్రొఫైల్ చేద్దాం" అన్న పోస్ట్ చదివండి. సహకరించండి. నా పోస్టులు చూస్తుంటే...అంతా యెదవలే అనిపిస్తున్నదా? నిజానికి...అంతా కాకపోయినా...చాలా వరకూ ఎధవలె వున్నారు ఇక్కడ! నమ్మించి గొంతు కోసే వారు, ఇతరుల కెరీర్లు నాశనం చేసే వారు, మిత్రత్వానికి అర్థం తెలియని దుర్మార్గులు ఎక్కువ వున్నారు సార్. కొన్ని రోజులలో మీకే తెలుస్తూంది..ఈ చేదు నిజం. మీరు చేసిన సూచనను...విశ్లేషించుకొని తప్పక నాకు నేను మెరుగు పరుచుకుంటాను. మీలో మంచి తెలుగు, భావ వ్యక్తీకరణ సామర్ధ్యం ఉన్నాయి. మీరు వృత్తిలో వున్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నాను.
మీ రాము

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి