Wednesday, October 28, 2009

తెలుగు తల్లీ!....క్షమించు...మా...ఆంగ్ల తెగులు

కడప జిల్లా మైదుకూరులో ఒక తిక్క పంతులు గారు...ఇంగ్లిషు మాట్లాడని పసి వాళ్ళ మెడలో బోర్డులు తగిలించడంతో ఈ 'టింగ్లిష్ ఛానెల్స్"కు కడుపు మండింది. ఒక రోజు కాలక్షేపం చేయడానికి...మేత దొరికే సరికి...తెలుగు జనం భాషాభిమానాన్ని రెచ్చగొట్టేందుకు వీరు ఉపక్రమించారు. తెలుగుపై తెగ కన్నీళ్ళు కారుస్తూ October 27 రాత్రి ఇవి ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు తెలుగు భాషాభి మానులకు కన్నీళ్ళు తెప్పించి వుంటాయి. ఆ కథా క్రమం...ఎట్టిదనిన...
---------------------------------------------------------------
"మైదుకూరులో జరిగిన దానిని అమ్మకు జరిగిన అవమానంగా ట్రీట్ చేయాల్సి వుంది" అనే మాట తో TV-9 లో "అమ్మకి అవమానం" శీర్షికతో వచ్చిన చర్చకు స్టార్ యాంకర్ రజనీకాంత్ తెరలేపారు. పాపం అలవాటు అయ్యిందేమో గానీ..."ఇంసిడెంట్", "బ్యేస్", "ఓవరాల్", "ఇంప్రెషన్", "అడ్జస్ట్", "ఫారిన్ లాంగ్వేజ్", "డిబేట్" వంటి ఆంగ్ల పదాలు దొర్లాయి రజని నోటి నుంచి. 
ఒకానొక దశలో.."ఉపాధ్యాయుడిని తొలగిస్తే..పరిష్కారం సరిపోయింది అనుకుంటున్నారా?," అని రజని మంత్రి మాణిక్య వరప్రసాద్ గారిని ప్రశ్నించారు. ఆ వాక్యం.."ఉపాధ్యాయుడిని తొలగిస్తే..సమస్య పరిష్కారమయినట్లే అనుకుంటున్నారా?" అనో.."ఉపాధ్యాయుడిని తొలగించడం..సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారా?" అనో...అంటే బాగుండేదేమో!
ఇంకో గమ్మత్తు ఏమిటంటే...అదే సమయంలో ఆ ఛానల్ లో తెర దిగువ భాగంలో వస్తున్న స్క్రోల్ లో..."సీఎల్పీ భేటి నాకు సంభందించింది కాదు: డీ ఎస్" అన్న తెలుగు మాటలు వచ్చాయి.  "సంబంధించి" అన్నది సరైన మాట కదా?
ఇక ఇదే కార్యక్రమంలో అతిథి...మాణిక్య వరప్రసాద్ గారు...తెలుగు గురించి ఇంగ్లిష్ లో చాలా చక్కగా మాట్లాడారు. "ఆ పర్టికులర్ టీచెర్ అలా బిహ్యేవ్ చేసాడు," "ఓన్ లంగ్వాజ్ లో థింక్ చేస్తే ఆ కాపాసిటి వస్తుంది," "మాత్రు భాషలో మన కమ్యునికషన్ కెపాసిటీ పెరుగుతుంది"...వంటి టిన్ గ్లిష్ మాటలు చాలా మాట్లాడారు. 


ఇదే కార్యక్రమంలో 'పేరెంట్స్" తరఫున పాల్గొన్న ఒక సారు..."పిల్లలు నిక్షింతగా మాట్లాడలేక పోతున్నారు" అని ఒక ప్రకటన చేసారు. అది "నిశ్చింత" లేదా "నిక్షేపం" అయి వుండాలనుకుంటున్నాను. తెలుగులో కొత్తగా "నిక్షింత" అనే పదం వుంటే ఇది రాసినందుకు క్షంతవ్యుడిని.



అంతకు కాస్త ముందు...I-news లో తెలుగుపై జరిగిన చర్చలో రోజా అనే యాంకర్ గారు కూడా తెలుగును మాటి మాటికి దబ్బనంతో గాయపరిచారు. "తెలుగు నేలపై తెలుగుకు చోటు లేదా?" అని గట్టిగా ప్రశ్నిస్తూనే..."సారీ", "మీడియం స్కూళ్ళు", "యాక్షన్", "మానేజ్మెంట్", "పేరెంట్స్" వంటి ఆంగ్ల పదాలు దొర్లాయి. దాదా మాటల్లో చెప్పాలంటే.."ఓయమ్మా..రోజా..ఏందమ్మ..నువ్వు గూడా అట్లా చేస్తే ఎట్ల? ఫీలు కాబోకు ఇట్లా రాసానని. ఇక నుంచి మంచిగా తెలుగులో మాట్లాడు తల్లీ. నీకు తెలుగు ప్రేజలు రుణపడి వుంటారు తల్లీ."
ఈ కార్యక్రమంలో భాషావేత్త యార్లగడ్డ 1785 లో మెకాలే చేసిన ఇంగ్లిషు ప్రకటన ను యథాతథంగా చదివి వినిపించారు. తెలుగుపై కార్యక్రమం కాబట్టి ఈ ప్రకటనను...అనువాదం చేసి అందిస్తే బాగుండేది. ప్రత్యక్ష ప్రసారం---అదే నండి...లైవ్..---కాబట్టి ఇలా చేయడం కుదరలేదేమో!
ఈ i-news లోనే ఆ తర్వాత నోరూరే "బొమ్మిడాల పులుసు" మీద వచ్చిన శీర్షికలు (తెర కింద వచ్చి పోయే అక్షరాలు) ఇలా వున్నాయి.
"బొమ్మిడాల పులుసు ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు."
"బొమ్మిడాల పులుసు కు క్రేజ్ పెరుగుతున్నది"
"నాన్ వెజ్ ప్రియులు"
"బొమ్మిడాల రుచి సూపర్." ఇది తెలుగు పట్ల ఆ ఛానల్ కు వున్న చిత్తశుద్ధి.


ఆ తర్వాత కొద్ది సేపటికి TV-5 చూద్దును కదా...మన కందుల రమేష్ గారు మంచి చర్చ పెట్టారు. అందులో...దళిత వాది కంచె అయిలయ్య గారు, భాషావేత్త చే రా గారు పాల్గొన్నారు. రమేష్ గారు కూడా "సైంటిఫిక్ ఎంక్వయిరీ," "లింగ్విస్ట్" వంటి సాధారణ తెలుగు ప్రజలకు అర్థం కాని మాటలు వాడారు. 
ఇదే చర్చలో అయిలయ్య గారు వాతపెట్టినట్లు అడిగిన ప్రశ్న ఇది: "టీ వీ యాంకర్లు ఇంగ్లిషు పదాలు వాడటం లేదా?"
ఈ ప్రశ్నకు ముందుగా సమాధానం చెప్పి.. ఛానెల్స్ మహారాజులు ఖూనీ అవుతున్న తెలుగు గురించి కన్నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. మనం మాట్లాడేది సంకర ఆంగ్లం... మన పిల్లలు చదివేది ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళలో....మనం ఏడిచేది...ఇంగ్లిష్ సరిగా రావడం లేదే? అని... మనకు వున్నది ఆంగ్ల భాషా వ్యామోహం. ఇన్ని పెట్టుకుని...ఎందుకండీ ద్వంద్వ ప్రమాణాలు? పిల్లలకు జరిగిన తీవ్ర అవమానం....వారి హక్కులకు జరిగిన నష్టం గురించి పెద్దగా మాట్లాడకుండా...తెలుగు భాషపై టిన్ గ్లిష్ లో చర్చ జరపడం శోచనీయం. 

------------------------------------------------
నోట్: ఈ బ్లాగులో తెలుగు తప్పులు లేకుండా రాయాలనే ప్రయత్నిస్తున్నాము. లిప్యంతరణం (ట్రాన్స్లిటరేషన్) వల్ల ఒకొక్క సారి కొన్ని పదాలలో తప్పులు  వస్తున్నట్లు గమనించాము. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కాగలదని భావిస్తున్నాము. అప్పటి వరకు...తప్పులు భరించకండి. కామెంట్ రూపంలో తెలియచేసి పుణ్యం కట్టుకోండి...రాము, హేమ

13 comments:

Anonymous said...

చక్కటి విశ్లేషణ . చాల లోతుగా గమనించి వ్రాసారు .
అవును నిజమే . చప్పున తెలుగు మాట్లాడితే వాటిలో ముడో వంతు ఎంగిలిపీచు .
పక్క వాడి మీద పది ఏడ్చే మనం , మన నలుపు చూసుకోమే? ...( ఇది మిమ్మల్ని వుద్దేశించి కాదు )
తెలుగు ఎప్పుడో మృత భాష ఐపోయింది .

తల్లిదండ్రుల నుంచి రావాలి మార్పు . అందరు సమాజం లో మార్పు రావాలంటారు . కాని మనం కూడా సమాజంలో ఒకరమనే భావనే వుండదు .

తమిళ్ వాళ్ళ నుంచి ఇదే మనం నేర్చుకోవాల్సింది .

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Dear Ramu, Well Said about the Channels. Because of these new news channels and junk programs, we have removed tata sky and stopped watching tv.

Nalini said...

Telugu telisina valley teeveello kanapadalantey... journalistuley medianu nadapalantey... ayyey paneynaa... Ippudu media lo nadustunnadi cinema samskruti.

రవిచంద్ర said...

నేను నా బ్లాగు లో రాసేటప్పుడు కూడా సాధ్యమైనంతవరకు తెలుగులోనే ఉండాలని చూసుకుంటాను. కొన్ని సాంకేతిక అంశాలు వచ్చినపుడు, నాకు సమయానికి సరైన తెలుగు పదం తట్టనపుడు మాత్రమే వాడతాను.

jeevani said...

ఈ విషయంలో ఈనాడు వారిని అభినందించాలి. మేము డెస్క్ లో ఉన్నపుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా మటుకు ఇంగ్లిష్ రాకుండా చూసేవాళ్ళం. ఈ టీవీ న్యూస్ చూడక చాలా రోజులైంది. మరి ఇప్పుడు ఎలా ఉందో? ఇక మిగతా చానెళ్ళవారు వారికి ఉన్న దురదకు ఇంగ్లిష్ చానెళ్ళు పెట్టుకోవచ్చు. ఒక సంఘటనను మీతో పంచుకుంటాను. బహుశా రెండేళ్ళ కిందట వై.ఎస్. గారు అనంతపురం వచ్చారు. వేదిక మీద ఒక కళాశాల విద్యార్థినికి మాట్లాడేఅవకాశం ఇచ్చారు. ఆ అమ్మాయి కవితలు రాస్తుంటుంది. తెలుగును కాపాడేలా చర్యలు తీసుకోండి సార్ అంటూ చాలా ఉద్వేగంగా ఒకానొక దశలో ఏడుస్తూ మాట్లాడింది. వై.ఎస్. గారు తర్వాత లేచి వెరీగుడ్, నీ బాధను అర్థం చేసుకోగలనమ్మా, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సేవ్ తెలుగు అని ఇంకా ఇంకా ఇంగ్లిష్ లొ మాట్లాడేశారు. ఇది అందర్నీ బాగా నవ్వించింది. నేను వై.ఎస్. గారిని కామెంట్ చేయడం లేదు అని గమనించగలరు. రోజూ కోట్లాది మంది తలకాయల్లోకి దూరుతున్న టీవీ చానెళ్ళు ముందుగా మారితే సంతోషం.

Unknown said...

Hey Ram.....what is this? before criticising the channels,their names TV9, TV5, NTV, I NEWS ETC 2,etc are all in engliss Please dont go deep into the telugu.Even for ur blog,i shouls type apmediakaburlu. etc etc ....
yours xyz... aa aaa e eee...

మనోహర్ చెనికల said...

well said:
సరిగ్గా చెప్పారు


http://newjings.blogspot.com/2009/10/blog-post_27.html

Vasu said...

చాలా బాగా చెప్పారు.
ఇక్కడ వ్యాఖ్య రాద్దామని మొదలెట్టి, ఒక టపా రాసేసాను. వీలుంటే చూడండి. http://maanasasanchara.blogspot.com/2009/10/blog-post_28.html

రమణ said...

మంచి విషయాలు వ్రాశారు. నేను అప్పుడప్పుడూ ఆంగ్ల పదానికి తెలుగు సమానార్ధమైన పదం దొరక్కో, అలవాటు చేతో ఆంగ్ల పదాలను వాడటం జరుగుతుంది. మన తెలుగు వారితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు తెలుగు పదాలు మాట్లాడాలనేదే నా నిరంతర ప్రయత్నం.

Gopi Chand said...

ఇంకా కొన్నాళ్లు పోయాక కింద స్క్రోలింగ్ (ఇంగ్లీష్ ) అయ్యే వార్తలు కూడా ఇంగ్లీష్ లో వస్తాయ్ చూడండి. హతవిధీ

Unknown said...

DeR Mr. Ramu, Its very easy to make a comment on the people. The discussion was weather the punishment on the children is right or wrong. I dont think the people who participated in the discussion had said that they are very good in telugu. Its an human tendancy that while pronouncing we do make mistakes. Its better that all of us concentrate on atleast speaking only in telugu when ever we meet a telugu person.

Kumar

-- said...

forget about Tenglish. They are screwing up Telugu too.

In a live show with Konda Surkha, on Tv9, Rajanikanth to Surekha: సురెఖ గారు, హై కమాండ్ అందరిని "మూసుకు" కూర్చోమంటే, మీరు ఏమంటారు?

shankar panthangi said...

andari gurinchi bagane cheppavu kaani maa comments enduku pettaledu. edem bagaledu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి