Thursday, October 22, 2009

"వ్యక్తిగత జీవితాలపై" ఒక వివరణ...

పాఠకుల అభిరుచులకు సంబంధించి నాకు మంచి విషయాలు బోధపడుతున్నాయి. రాధాకృష్ణ గారు రాసిన ఒక దిక్కుమాలిన వ్యాసం గురించో ("బాలగోపాల్ స్మృతి వ్యాసం ఖూనికి గురైన వైనం")...ఒక పసలేని టీవీ ప్రోగ్రాం ("గోడమీది పిల్లి వాటం...స్టోరీ బోర్డు") గురించో కష్టపడి విశ్లేషిస్తే స్పందించని పాఠకులు....ఇతరుల జీవితాలలోని ఒక విషాద ఘట్టం గురించి (శ్రీనివాస్ మరణం) రాస్తే ఇష్టం వచ్చిన కామెంట్స్ రాస్తున్నారు. సంతోషం.

శ్రీనివాస్ మరణం గురించి ఎందుకు రాయాల్సివచ్చిందో వివరిస్తాను. తెలుగు మీడియా లో చాల మంది బాస్ లు ఆడ పిల్లలను ఆకర్షించో..బెదిరించో కామ దాహం తీర్చుకోవడం ఎక్కువగా వుంది. సోమాజిగూడ లో కార్యాలయం వున్న ఒక పత్రిక ఆఫీసు లో ఐదో ఫ్లోర్ లో ఒక బాస్ గారు దుకాణం పెడితే... ఫస్ట్ ఫ్లోర్ లో మరొక మగధీరుడు చొల్లు కార్చుకుంటూ ఆడ పిల్లలతో కాలక్షేపం చేసే వాడు. నీను దీనికి ప్రత్యక్ష సాక్షిని. కలీగ్ భార్యను ట్రాప్ చేయడం లాంటి దుర్మార్గాలూ వున్నాయని అంటారు. అవి బలంగా వినిపించే వార్తలు కాని నాకు అవి ధ్రువ పడలేదు.

ఒక ఛానల్ లో ఒకానొక గౌరవనీయ జర్నలిస్టు కొడుకు ఎడిటర్ హోదాలో కొత్త గా వచ్చే యాంకర్ లకు వార్తలు చదివే అవకాశం ఇచ్చేవాడు. అమాయకపు అమ్మాయి తెర మీద కనిపించిన కొన్ని రోజులకు...ఆమె యాంకరింగ్ ను ఆపించేవాడు. అప్పటికే తన యాంకరింగ్ గురించి బంధు మిత్రులలో ప్రచారం చేసుకున్న ఆ అమ్మాయి...కంగారుగా సార్ దగ్గరకు వెళ్లి...ఇదేమిటని అడిగితే..."అవకాశాలు ఒట్టి పుణ్యానికి రావు మరి" అని తన కామ దాహం తేర్చుకునే వాడని ఆ దుర్మార్గుడితో కలిసి పనిచేసిన వారి కథనం. సినిమా పరిశ్రమలో ఇలాంటివి జరుగుతాయని అంటారు కాని...ఈ జబ్బు టీవీ పరిశ్రమకూ పాకింది. అది నాకు చాలా బాధ కలిగించింది.

ఇక టీవీ-నైన్ రంగ ప్రవేశంతో వ్యవహారం ముదిరినట్లు అందరూ చెబుతారు. అందులో ప్రముఖుడే...తన దగ్గర పనిచేసే వీడియొ ఎడిటర్ భార్యతో కలిసి కాపురం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆమె అప్పట్లో యాంకర్. అది వారి వ్యక్తిగత విషయమే..ప్రశ్నించడం కొద్దిగా ఇబ్బంది కరమైన సంగతే. పలుకుబడి, హోదా వున్న వేరే ఎవరైనా..ఇతరుల భార్యను తెచ్చి పెట్టుకుంటే..ఇదీ చానల్ నానా యాగీ చేయదూ?

ఈ లోపల అదే చానెల్ లో ఇద్దరు స్టార్ యాంకర్ల గురించి చాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అందులో మగ వివాహిత న్యూస్ ప్రజంటర్...మరొక సహోద్యోగితో సహజీవనం సాగించడం...ఆ వ్యక్తే..తర్వాత ఆసిడ్ దాడికి గురికావడం లోక విదితమే. ఏ ఛానల్ లో చూసినా..ఇలాంటి వ్యవహారాలు చాల సాధారణం అయ్యాయి. బాస్ గారు తాను వుంచుకున్న మేడం గారు చెప్పినట్లు నడుచుకోవడంతో కొందరు మంచి జర్నలిస్టుల కెరీర్లు నాశనం అయ్యాయి. ఇది మరింత బాధాకరం.

పెద్ద వాళ్ళు..ఎవరి ఇష్టం వారిది..ఎవరి మాన సంరక్షణ బాధ్యతా వారిదే...అనే వాదన వినడానికి బాగుంటుంది, కాని...ఈ ముసుగులో సెక్స్ దోపిడీ కామ్ గా జరిగిపోతున్నది... ఫ్రెండ్స్. ఈ తంతు ఇలా వుండగా...కొందరు బ్రోకర్ గాళ్ళు చానల్స్ పెట్టారు. కొందరు యాంకర్లను వారు వాడుకుంటున్న తీరు చాల బాధాకరం. ఇవన్నీ ధ్రువ పడని వార్తలు కాబట్టి...కన్ఫొర్మ్ కావు కాబట్టి వాటిని చర్చించడం నాకు ఇష్టం లేదు. కర్ణ కర్ణిగా సీనియర్ జర్నలిస్టుల నుంచి విన్న మాటలు వింటుంటే...ఇది జర్నలిజమా...పడుపు వృత్తా.. అనిపిస్తున్నది.

ఈ నేపధ్యం లో...శ్రీనివాస్ మరణం చాలా మందిని కలచివేసింది. పెళ్లి అయి ఫీల్డ్ లో వున్న అమ్మాయిలను బుట్టలో వేసుకునేందుకు...బాస్ లు యత్నించడం..చాలా సార్లు వారు సఫలీకృతులు కావడం ఒక విషాదం. భార్య చేతిలో దగా పడిన ఒక భర్త....."ఆమె..ఆమె ప్రియుడు (అంటే.. టీవీ చానల్ బాస్ గారు) కలిసి నాకు ఆక్సిడెంట్ చేయించారు" అని మొత్తుకుంటే...పాపం శ్రీనివాస్ మూగగా బాధపడి..మూడు సార్లు ఆత్మహత్యా యత్నాలు చేసుకుని కన్నుమూసాడు. ఏ రకంగా చూసినా..ఇది గర్హనీయం అని పిస్తున్నది నాకు.

ఒక పాటేర్న్ ఉన్నది ఈ తరహా వ్యవహారాలలో. ఛానల్ లో సంసార పక్షంగా వుంటూ పనిచేసుకు పోతున్న స్త్రీ ల భర్తలు...వారి మొబైల్ ఫోనులో కాల్స్ లిస్టును..ఎస్.ఎం.ఎస్. లిస్టును చెక్ చేస్తూ...ఇంటరాగేట్ చేసే వరకూ పరిస్థితి వెళ్ళింది. భవిష్యత్తులో...సిన్సియర్ మహిళా జర్నలిస్టులు వచ్చి ఈ రొంపిలో పనిచేయలేని దుస్థితి వస్తున్నది.

అసలే జర్నలిస్టులు. పైగా మగ వెధవలు, బాస్ లు. వీరి నికృష్ట చేష్టల వల్ల టీవీ చానెల్స్ లో పనిచేస్తున్న అక్కలు, చెల్లెళ్ళు ఇబ్బంది పడకూడదని...పరిస్థితుల మూలంగా మౌనంగా భరిస్తున్న ఒకరిద్దరికైనా నేను సహకరించాలన్నది నా ప్రయత్నం. నీచ నికృస్ట వెకిలి అనాగరిక బాస్ లను "రాఖీ" సినిమాలో లాగా పెట్రోల్ పోసి తగలపెట్టలేను కాబట్టి రాతలతో బెదర కొడతాను.

ఇరవై ఏళ్ళ జర్నలిజం జీవితంలో నీతిగా బతికిన నేను...దగా పడిన మరో జర్నలిస్టు నా భార్య మా "ఎథికల్ కమిటీ" సభ్యులం. చర్చించుకొనే రాస్తాం. వంద శాతం ఎథికల్ ఫ్రేమ్ వర్క్ లోనే బ్లాగ్ వుండాలన్నది మా తలంపు. అర్థం చేసుకుని..మీ అభిప్రాయాలు రాయండి. అలాగే..వృత్తిలో మృగాళ్ళతో బాధ పడుతున్న వారి వివరాలు అందించండి. వారిని కలిసి అండగా నిలిచే ప్రయత్నం చేద్దాం.

9 comments:

బృహఃస్పతి said...

కామెంట్స్ తో మీ రాతలను ఖండించే వాళ్ళు వేళ్ళపై లెక్కించే గలిగేట్టుంటే, వ్యాఖ్యానించకుండా మీరు వెలికి తీసే కఠోరసత్యాల ద్వారా మత్తు వదిలించుకునే వారు వందలకొద్దీ ఉంటారు.

కామెంట్స్ కి వెరవకుండా మీ పయనాన్ని కొనసాగించండి.

కాకతీపుత్ర said...

ప్రజా జీవితంలో ఉన్నవారి వ్యక్తిగత జీవితం కూడా వార్తే అన్న సంగతి మన పాత్రికేయ మిత్రులు మర్చిపోకూడదు. పదిమందికి ఆదర్శంగా ఉండే ఈ వ్రుత్తిలోకి ప్రవేశించినవాళ్ళు... పది మంది చెవులు కొరుక్కునే పాడు పనుల జోలికి పోకుండా ఉంటె మంచిది కదా... పవిత్రమైన ఈ వ్రుత్తిలోకి ప్రవేశించి.. పవిత్రంగా ఎందుకు ఉండలేకపోతున్నారు..???

ఎవరైనా ఓ ప్రముఖుడు వెలగబెట్టే రాసలీలల గురించి గొంతు చించుకుని మరీ చెప్పే మనం... ఆ 'పాడు'పనులు చేస్తుంటే లోకం కళ్ళు మూసుకోవాలా...?

రాము గారు..! మీరు చేస్తున్నది తప్పేం కాదు. పవిత్రమైన ఈ వృత్తికి కళంకం తెచ్చే నీచులను ఎండగట్టండి. మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..
All the best..

cp said...

i am not a journalist but i am a socialist
Ramu sir you are dealing with toughest issue in the society
hates off to your brave heart
please educate the people

విజయ క్రాంతి said...

ఇదే నేను మీ గత పోస్ట్ లో కూడా చెప్పను . ఒక సారి టీవీ చూస్తే మనకు సులభంగా అర్థం అవుతుంది ... ఎలా వాళ్ళు ఒకరి పర్సనల్ లైఫ్ ని వాడుకుంటారో.
మీ ప్రయాణం కొనసాగించండి ...పేరు కూడా చెప్పలేని వారి వ్యాఖ్యలను పట్టించుకోకండి.

దయచేసి వర్డ్ వెరిఫికేషన్ తీసివేయ గలరు .

Ramu S said...
This comment has been removed by the author.
Anonymous said...

good keep up the good work and write ur thoughts here.no body to care,,,cheers

pavan said...

Ramu gaaru,

Ee blog modati saari chaduvutunnanu.
Nenu eppudu kooda humour content unde blogs ne choosthanu.
Mee blog serious gaa unna chaala sensible gaa undi. Chadavatam modalu pettaka enno vishayalu telusukuntunnanu ane feeling kalugutundi naaku.
Very good blog andi. keep going.

Unknown said...

Good Post, Please Keep up the Good work...

Anonymous said...

you said that your wife was also 'daga padindhi'. Can you explain how she was ditched and who was behind? c

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి