Monday, February 22, 2010

వెరీ వెల్ డన్......TV-9---కంగ్రాట్స్.... రిపోర్టర్ సాయీ

చాలా రోజుల తర్వాత TV-9 మెరుగైన సమాజం కోసం జూలు విదిల్చింది. ముఖ్యమంత్రి రోశయ్య శిష్యుడైన ప్రకాశం జిల్లా చీరాల ఎం.ఎల్.ఏ., ఆయన సోదరుడు, పోలీసులు కలిసి సామాన్య జనాన్ని వేధించి, పీల్చి పిప్పి చేస్తున్న వైనాన్ని ఈ రోజు సాయంత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించి చర్చ జరిపింది ఈ ఛానల్.

"ముఖ్య మంత్రి కర్మభూమిలో రౌడీ రాజ్యం" శీర్షికన ప్రసారమైన ఈ కథనం చాలా చాలా బాగుంది. ఈ కథనానికి కారకుడైన బాధితుడు శ్రీనివాస్, కేసును చక్కగా డీల్ చేసిన టీ.వీ.-నైన్ విజయవాడ విలేకరి సాయి గార్లకు అభినందనలు. చదువుకున్నవాళ్ళు వ్యవస్థతో పోటీ ఎందుకని రాజీ పడకూడదని అసిస్టంట్ ప్రొఫెసర్ అయిన శ్రీనివాస్ నిరూపిస్తే, బూతు సహాయం లేకుండానే మంచి కథనాలతో జనం మదిని ఎలా దోచుకోవచ్చో సీనియర్ జర్నలిస్టు సాయి గారు చూపించారు.

బహుశా హైదరాబాద్ లో రోశయ్య అండ చూసుకొని కావచ్చు...ఈ ఎం.ఎల్.ఏ. బృందం చెలరేగి పోయి...సామాన్యులకు నరకం చూపిస్తున్నట్లు ఆ ఛానల్ ససాక్ష్యంగా ప్రసారం చేసింది. తమ మాట వినని వారిపై 'ఎస్.సీ., ఎస్.టీ.అట్రాసిటీస్ యాక్ట్' కింద దొంగ కేసులు బుక్ చేయించి, ఈ కేసు విచారణ అధికారి అయిన డీ.ఎస్.పీ. సహాయంతో వారిని ఇబ్బంది పెడుతున్నారని....పలువురు ఆ ఛానల్ కు మొర పెట్టుకున్నారు. 

మాజీ మంత్రి పాలేటి రామారావు వంటి వాళ్ళు కూడా ఫోన్ లైన్ లోకి వచ్చి...చీరాల పోలీసుల గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. పలువురు బాధితులు తమ ఆస్తులను నామ మాత్రపు రెట్లు చెల్లించి రాజకీయ రాబందులు ఎలా దోచుకున్నదీ వెల్లడించారు. దళితులు కానివారిని ఆ యాక్టు కింద, దళితులైన వారిని మావోయిస్టు అనే ముద్ర వేసి...పోలీసుల సహాయంతో ఎం.ఎల్.ఏ. సంఘం ఎలా ఇరుకున పెట్టేదీ ఈ కథనం లో ఉంది. సాయి బృందం స్టింగ్ ఆపరేషన్ ద్వారా....ఆ పోలీసు అధికారుల బండారం బట్టబయలు చేసింది.

ఇలా ఎం.ఎల్.ఏ.లు పోలీసులను పోషించి పనులు చేయించుకోవడం మన రాష్ట్రంలో కొత్త కాదు. సూర్యాపేట డీ.ఎస్.పీ.గా పనిచేసిన ఒక అగ్రకుల వ్యక్తిని అక్కడి నుంచి బదిలీ చేయించడానికి నాకు తెలిసి ముగ్గురు ఎస్.పీ.లు నానా పాట్లు పడ్డారు. అయినా అతన్ని కదిలించ లేక పొయ్యారు. అక్కడి రాజకీయవేత్త, ఆ పోలీస్ అధికారి వాడుకున్న ఆయుధం కూడా...ఈ ఎస్.సీ., ఎస్.టీ.అట్రాసిటీస్ యాక్టే. నిజంగా దళితుల పాలిటి వరప్రసాదం అయిన ఈ చట్టాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారని అప్పటి ఎస్.సీ. కమిషన్ ఛైర్మన్ నాగార్జున వాపోయారు. దళితులకు నష్టం జరగకుండా చూస్తూనే ఈ చట్టంపై పూర్తి స్థాయిలో సమీక్ష జరపడానికి ఇంతకు మించి మరొక అవకాశం దొరకదు. 


వ్యవస్థ పోలీసుల మీద పూర్తిగా నమ్మకం కోల్పోతున్న దశలో TV-9 స్టింగ్ ఆపరేషన్ చేసి సమాజానికి మేలు చేసింది. దుర్మార్గులైన రాజకీయ నేతలు, వారి చెంచాలైన పోలీసుల నుంచి బాధితుడు శ్రీనివాస్ కు ఇతరులకు వెంటనే రక్షణ కల్పించాలి. మాటలతో జనాలను, జర్నలిస్టులను బురిడీ కొట్టిన్చానని భ్రమ పడే కొణిజేటి రోశయ్య తన ఇలాకాలో జరుగుతున్న ఈ దారుణంపై జవాబు ఇవ్వాలి. దీనికి నైతిక బాధ్యత వహించాలి.

15 comments:

kvsv said...

మంచి కదనాలకు మీ మద్దతు వుంటుందని మీ ఆర్టికల్ ద్వారా మరోసారి తెలియచేశారు థాంక్ యు వెరీ మచ్..అలానే ఈ అట్రాసిటి యాక్ట్ విపరీతంగా దుర్వినియోగం అవుతూ వస్తోంది ఒక మంచి చట్టం ఈ విదంగా స్వార్థపరుల చేతిలో పది అమాయకులు బలి కావడం కోకోల్లోలుగా జరుగుతూ వస్తోంది దీనిపై చర్చ చాలా అత్యవసరం...

Anonymous said...

It's a worthy sting operation by TV9 and Sai and his courageous team deserves compliments.It is an open secret that there are many allegations against the MLA and his family but so far none could touch the files of complaints by our so called efficient and most able IPS officers.What happened to their best academic career and their success in their interviews while getting selected for IPS?What happened to their noble answers to render service with sincerity,dedication which made them successful in getting IPS?Is it not bogus,fictious an an action in the drama of IPS selections?Even if the lower cadre officials are licking for money thrown by the politicians why these IPS people are deaf,dumb and blind to the corrupt practices of their cadre?Does it mean they are also sharing the currency notes thrown at the lower cadre?What happened to regional IG?It is a big shame for IPSand it's association to coperate,coordinate and help the MLA and give a clearance to his traffic of illegal,criminal and unethical acts.
Not only TV9 other channels to have taken up the serious case and telecast it today.Let us wait for the reaction of Rosiah for his close friend and his athma.

JP Reddy

Krishna K said...

చీరాల నియోజకవర్గం లో, చాలా ఏళ్ళు ఉన్నవాడిగా ఆ mla కుటుంబ నేపధ్యం తెలిసినవాడిగా, నిజానికి TV9 చూపినంచినది చాలా తక్కువ.
ఆయన తండ్రి చేనేత రంగానికి చెందిన వాళ్లను ఓ ముగ్గురను (అందులో ఒకరు మహిళ) పట్టపగలు బరిశె తో పొడిచి చంపి, జడ్జి కి లంచం ఇచ్చి శిక్ష నుండి తప్పించుకొని, అప్పటినుండి నాటు సారా కాసుకొంటూ బతికేవారు.
ఆ ఊరిలో ఉన్న యానాదులను వెట్టిచాకరి కింద వాడుకొని, నా హింసలు పెడుతుంటే అప్పట్లో బలహీనవర్గాల సమాక్య ఒంగోలు లో ఆ కుటుంబం మీద పెద్దేత్తున ధర్నాలు అవీ చేసిన మాట కుడా నిజం.
ఇక ప్రస్తుత MLA గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది, మాజీ మండలాదక్ష్యుడు, చలా సౌమ్యుడు గా పేరున్న, మంచి కుటుంబ నేపధ్యం ఉన్న రొండా పట్టాభి ని (తన కంటే వయసులో పెద్దవాడు అన్న గౌరవం కూడా లేకుండా) కొడితే ఆ కేసు కు ఇంతవరకూ కాశయ్య అండతో మోక్షం లభించలేదు.
కాశయ్యకు, ముఖ్యంగా ఆయన కుడిభుజంగా ఉండే మనవడికి అడిగినంత మామూలు ఇవ్వటంతో (రెండుకోట్ల నజరానా) ఇంత నేర ప్రవుత్తి ఉన్న కుటుంబమయినా, MLA టికెట్ తెచ్చుకోగలిగారు.
అందుకనే రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవం ఉన్నవాడు అయ్యాడు, రాష్ట్రం ఓ గాటిన పడుతుంది అన్న నా మిత్రుల మాటలు విని నవ్వు వచ్చింది నాకు, తన సొంత నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా ఈ మాఫియాను (సారా, భూ, గుండా గిరి) పోషిస్తూ వాళ్లకు అండగా నిలబడిన రోశయ్యా మన రాష్ట్రాన్ని బాగు చేయగలిగినది అని.
ఏది ఏమయినా, ప్రస్తుతం ఆ కుటుంబాన్ని కాదని ఏ అధికారి, నాయకుడు చీరాల నియోజకవర్గం లో మనలేని పరిస్తితి (రాయలసీమ కంటే దారుణంగా) ఉన్న మాట నిజం.
చూడాలి TV9 కథనం మన (కళ్లున్న కబోది) ముఖ్యమంత్రి ని ఏమయినా కదిలిస్తుంది ఎమో? (నాకయితే అనుమానమే!!)

Anonymous said...

Congratulations to T.V9, Reporter Sai and his Team. Good Job.

Anonymous said...

N TV is also claiming that they brought out the issue. Which is true?
http://www.youtube.com/watch?v=IOfOZjiYXnU

Saahitya Abhimaani said...

I am quite surprised to hear that Rosayya is closely linked to these goondas. Good story. Thank you TV9.

If media exposes this kind of rascals, general public would definitely appreciate.

Anonymous said...

ramu garu ekanudi regularu ga niga team work cystudi kotha team form ayeidi

Anonymous said...

రోశయా ఈ కుటుంబానికి దగ్గరే కాదు, ప్రతి దందాలో తన వాటా తనకు చెందుతూ వస్తుంది కనీసం దాదాపు పది ఏళ్లుగా. అది ఆ ప్రాంతం లొ అందరికీ తెలిసిందే.
ప్రతిఘటన సినెమా లో కాశయ్య కేరెక్టర్ మన ప్రస్తుత ముఖ్యమంత్రి లో ఉన్న ఇంకో కోణాన్ని ఆ రోజులలో చూసే తనను దృష్టిలో పెట్టుకొనే క్రియేట్ చేసారని ఆ రొజులలోనే చెప్పుకొన్నారు. (చాలా మంది) జనాలకు తెలియని అపరచితుడి లాంటి, ఓ గుండా మన ముసలి రోశయ్య లో ఉన్నాడై ఆయన్ని (దగ్గరగా) తెలిసిన వారి ఎవరికయినా తెలుసు.

ఇంకా TV9 బయటపెట్టలేకపోయిన విషయం ఏమిటి అంటే, ఆ కుటుంబం వానపిక్ భూ సేకరణలో గుండా గిరి ద్వారా సహాయం చేసి, బాలినేని ద్వారా జగన్ వర్గం అండ సంపాయించాడు అన్న విషయం.

Anonymous said...

రోశయా ఈ కుటుంబానికి దగ్గరే కాదు, ప్రతి దందాలో తన వాటా తనకు చెందుతూ వస్తుంది కనీసం దాదాపు పది ఏళ్లుగా. అది ఆ ప్రాంతం లొ అందరికీ తెలిసిందే.
ప్రతిఘటన సినెమా లో కాశయ్య కేరెక్టర్ మన ప్రస్తుత ముఖ్యమంత్రి లో ఉన్న ఇంకో కోణాన్ని ఆ రోజులలో చూసే తనను దృష్టిలో పెట్టుకొనే క్రియేట్ చేసారని ఆ రొజులలోనే చెప్పుకొన్నారు. (చాలా మంది) జనాలకు తెలియని అపరచితుడి లాంటి, ఓ గుండా మన ముసలి రోశయ్య లో ఉన్నాడై ఆయన్ని (దగ్గరగా) తెలిసిన వారి ఎవరికయినా తెలుసు.

ఇంకా TV9 బయటపెట్టలేకపోయిన విషయం ఏమిటి అంటే, ఆ కుటుంబం వానపిక్ భూ సేకరణలో గుండా గిరి ద్వారా సహాయం చేసి, బాలినేని ద్వారా జగన్ వర్గం అండ సంపాయించాడు అన్న విషయం.

Anonymous said...

Kudos to TV9
Great job
you guys took a daring step and brought out the true colors of a goonda MLA. This news would send ripples in the political cirles for some time and as usual would die down
i have doubts about the SP of Prakasam, he just gave a standard statement.
i feel sorry for the innocent people
one news paper aptly captioned the MLA as "China Bombay Dawood"( chiral is also called china Bombay)

Anonymous said...

రోశయ్య అధికారం లో ఉన్నంత కాలం ఆ కుటుంబాన్ని (వాళ్లు తన వైశ్య వర్గాన్ని కొట్టబొయినా కూడా) ఎవ్వరూ, (S.P. కాదు D.G.P.) తల్చుకున్నా ఎమీ చేయలేరు.

వీళ్ల అకృత్యాలను బయటపెట్టిన మీడియా వాళ్లు కాని, సామాన్య జనాలు కాని, ఇంకా వెరే కేసులలో ఇరుక్కోవటమో, ఎదో ఓ రకంగా మర్డర్ అవటమో జరిగినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.

rOSayya is very much in bed with them from beginning and the speculation is, he was the one who was giving some of the ideas about how to grab govt. and seeling land. One can only imagine the unconditional support our beloved C.M. is giving to this fellow by looking how bold he is to attack on media.

Anonymous said...

Dear Ramu, how far it is journalistic to telecast a story without the version of the accused. in the 120 minute live 'expose' of the MLA the channel did not bother to take the version of the MLA. Today the MLA made several allegations on the story, but that too was taken in the negative way. moreover, there is every reason to believe that there is a motive behind the 'expose' of the MLA, if theere is no motive why have these channels ignored the news about a case against TDP MLA Revant Reddy in uppal police station, what about minister silpa mohan Reddy landgrabbing these cases were also on the land grabbing by the MLA and minister. The news channels are doing only 'natak' and are not serious in exposing the land grabbing MLAs. it is a known fact that the war is for control over cable network in Chirala which is a tam town.

Anonymous said...

is it that Ravi Prakash didnt get his share in the MLA's fraud?

Anonymous said...

ఆ MLA కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా నాటు సారా కాసుకొని, పందులను దొంగలించి బతికే స్థాయి నుండి, ముఖ్యమంత్రిని కూడా లెక్క చేయని స్థాయికి వచ్చి, సినెమాలు, నవలలో కూడా చూపించని స్థాయిలో అన్ని రంగాలలో ఒకప్పుడు ఎంతో ప్రశాంతమయిన నియోజకవర్గం మరియు స్వాతంత్ర సంగ్రామంలో దేశం అంతా గర్వపడేలా చెప్పుకొన్న సత్యాగ్రహ ఉద్యమం చేసిన ప్రాంతాన్ని, సామాన్య ప్రాజానీకం తో ధన, రాజకీయ అంతకంటే కండ బలం తో రోజూ ఆడుకొంటూ ఉంటే, కారణాలు ఏమయినా భయపడకుండా బయటపెట్టగలిన జర్నలిస్ట్ లు, మీడియా వాళ్లు ఉన్నందుకు గర్వ పడకుండా, అతని మీదే ఎందుకు వెరే వారిమీద ఎందుకని లేదు అంటూ రంధ్రాన్వేషణ చేయటం అవసరమా?

సరే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా?
ఎన్ని నియోజకవర్గాలలో మండలాధికారులు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ప్రొద్దున లేవగానే , ఆఫీసులకు పోకుండా MLA సోదరుని దగ్గరకు హాజరుకు వేయించుకోవటానికి ప్రతిరోజు బారులు తీరుతారు?
కోస్తా ప్రాంతం లో ఏ నియోజకవర్గం లోనయినా, పోలీసు దగ్గరకు వెళ్లితే అదీ DSP స్థాయి అధికారిదగ్గరకు ఇక్కడ కాదు అక్కడకు వెళ్లి చెప్పుకోండి అని ప్రతి కేసు విషయం లో అనే పరిస్థితి ఉంది?
తమ మాట వినలేదని పోలీసు స్టేషన్ ముందే పోలీసు కానిస్టెబుల్ ను కోడితే అడిగే ధైర్యం పోలీసులే చేయలేదంటే ఒక్కసారి అర్ధం చేసుకోండి అక్కడ అరాచక పరిస్థితి?

ఇక అటు పక్క స్టొరీ అంటూ ఏమి ఉంటుంది, ప్రతి దాడి తప్ప? తమ మీద చిన్నప్పటినుండే మర్డర్ కేసులు, ప్రస్తుతం వందల కేసులు ఉన్నాయి అని బహిరగంగా చెప్పుకొనె వారిదగ్గర నుండి ఏ మీడియా అయినా ఎటువంటి వాదనను తెలుసుకోగలుగుతుంది?

రోసయ్యను బ్లాక్ మెయిల్ చేస్తూ తన అవినీతిని బయట పెడతాము అని , రాబోయే కాలం లో మంత్రి పదవి పొందినా ఆశ్చర్యం లేదు !!

Kishore said...

ఎందుకండి ఇదంతా. చివరికి ఏమయిందో చెప్పండి? MLA కి శిక్ష పడిందా? పోనీ పడే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి