Thursday, June 24, 2010

పూనా బ్లాగ్ దంపతులతో...మాటామంతీ....

కనిపించిన ప్రతి ఒక్కరినీ, అవసరం ఉన్నా...లేకపోయినా, నవ్వుతూ పలకరించడం...వాళ్ళు ప్రతినవ్వు విసిరితే...'హౌ ఆర్ యు' అని అడగడం మనకో అలవాటు. వాళ్ళు 'హౌ ఆర్ యూ'కు స్పందిస్తే...ఒక రెండు మాటలైనా మాట్లాడడం మనకు ఇష్టం. 
 
రోడ్డు మీద పోతూ...దీనంగా, ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నవారిని....'బీ చీర్ఫుల్. థిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్,' అని ఉత్సాహపరిచిన సందర్భాలు అనేకం. అలాగే...ఒక అరవై ఏళ్ళు దాటిన వారు దారి వెంటనో, ప్రయాణంలోనో కనిపిస్తే....'మీరు నేర్చుకున్న జీవిత పాఠాలు ఏమిటి?', 'జీవితంలో చాలా ముఖ్య మైనది ఏమిటని మీకు స్వానుభవం లో తేలింది?', 'డబ్బు వల్ల సుఖం వస్తుందా?', 'జీవితం సుఖంగా ఉండాలంటే కావలసినవి ఏమిటి?,' వంటి సవాలక్ష ప్రశ్నలు వేసి...సమాచారం రాబడతాను. ఇలా సీనియర్లను కలిసి మాట్లాడితే అదొక తృప్తి.

ఈ బ్లాగ్ ల పుణ్యాన...గత ఆదివారం నాడు పూణే కు చెందిన అలాంటి సీనియర్ సిటిజెన్ ఫణి బాబు గారిని, వారి సతీమణి లక్ష్మి గారిని కలుసుకున్నాను. PHANI BABU-MUSINGS అనే బ్లాగ్ లో మంచి ప్రవాహంలా సాగే తెలుగు చదివి...ఆయన రాస్తున్న స్వానుభవాలకు ముచ్చటపడి...ఆయన్ను కలవాలని ఎప్పుడో అనుకున్నాను. ఆయన రాతలను బట్టి అర్థమయ్యింది...అయన సతీమణి కూడా 'ఇదీ సంగతి' పేరిట ఒక బ్లాగ్ నిర్వహిస్తున్నారని. వీరిద్దరి తెలుగు ఫ్లో మీరు ఒక్కసారి చవిచూడండి...తప్పక ఆనందిస్తారు.

తనను ఒక పెళ్ళిలో 'లక్ష్మి మొగుడు' అన్నారని 'నొచ్చుకుంటూ' అయన ఒక పోస్ట్ రాయడం, అది 'ఉత్తి ఉడుకుమోత్తనం' అని ఆమె కడిగిపారెయ్యడం...మీరు చూడవచ్చు లేటెస్ట్ పోస్టులలో. అది నిజ్జంగా  భావ ప్రకటన స్వేచ్ఛనో, మాచ్ ఫిక్సిన్గో ఆ పోస్టులు చదివి మీకు మీరు నిర్ణయించుకోవాలి. వారిద్దరి మధ్య ఉన్నది తూ.గో., ప.గో. పోరాటమని, ఇంట్లో దేని మీద ఈయన బ్లాగులో పోస్టు కుమ్మేస్తారో అని కుటుంబ సభ్యులు జడుస్తున్నారని....ఒక గంటన్నర వారితో ఉన్నాక నాకు అర్థమయ్యింది. 
65 ఏళ్ళ ఫణిబాబు గారు నాకు ఒక 20 ఏళ్ళ తుంటరి మిత్రుడిగా అనిపించారు. అయన సమయస్ఫూర్తి, చలాకీతనం, హాస్యప్రియత్వం, ముక్కుసూటితనం...నాకు నచ్చాయి. చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తిగా అనిపించారు. "ఐ యాం మాడ్ ఆఫ్ గోదావరి," అంటూ మొదలుపెట్టి...42 ఏళ్ళ పాటు పూణే లో ఉద్యోగ రీత్యా ఉన్న తాను గోదావరిని తనవి తీరా చూసేందుకు రిటైర్ అయ్యాక...రాజమహేంద్రి కి వెళ్లి కిటికీ తలుపులు తీస్తే గోదావరి కనిపించేలా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఒక ఏడాదిన్నర ఎంజాయ్ చేసిన విధానం చెప్పారాయన. ఈ పై ఫోటోలో ఇద్దరు బ్లాగ్ దంపతులు, వారి బుల్లి మనవడు అగస్థ్య నాతో పాటు ఉన్నారు.

ఫాదర్స్ డే రోజు...మా నాన్నే చాలా గొప్ప అని పోస్టు రాసాక ఆయనను నేను కలిసాను. వాళ్ళ పిల్లలను ఆయన పెంచిన విధానం, వారి ఇష్టాలకు ఆయన ఇచ్చిన విలువ గురించి తెలుసుకున్నాక...'అద్భుతమైన తండ్రి,' అనిపించారు...ఫణి బాబు గారు. ఉన్న కాసేపట్లో...ఆయన తన జీవన చిత్రాన్ని ఆవిష్కరించి...ఎన్నో విషయాల మీద తన అభిప్రాయాలు చెప్పారు. ఏమాటకు...ఆ మాటే....మా సంభాషణలో నా వాటా ఒక ట్వెంటీ పెర్సంటే! అయినా...నాకు ఆనందమే అనిపించింది. "నేను ఎక్కువ మాట్లాడతానని మా ఇంటావిడ (ఫణి గారి ట్రేడ్ మార్క్ సంబోధన) అంటూ వుంటుంది," అని కూడా ఆయన బోసి నవ్వుతో చెప్పారు. 

బ్లాగ్ వల్ల తాము ఎంత తృప్తిని అనుభవిస్తున్నది వారిద్దరూ తెలిపారు. బ్లాగ్ చేతిలో ఉందికదా అని ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం బాధిస్తుందని, యాత్రా విశేషాలు రాసే ఒక బ్లాగర్ పై వచ్చిన విమర్శలు చివరకు ఆమె రాయడం ఆపే వరకు వెళ్ళడం బాధాకరమని చెప్పారు. 'సాహిత్యాభిమాని' శివ గారిని కలిసినప్పుడు కూడా ఇలాగే చాలా ఆనందం అనిపించింది నాకు.

బ్లాగ్ మితృలారా....మీరు కూడా హైదరాబాద్ వస్తే...నాకు ఒక్క ఫోన్ కొట్టండి. లేదా మెయిల్ ఇవ్వండి. మనం సరదాగా కలుద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం. ఒక మంచి స్నేహ సామ్రాజ్యాన్ని ఈ నెట్ ప్రపంచంలో నెలకొల్పుదాం. నా రాతల మీద కోపం ఎందుకు ఉందో చెప్పిన వారికి ఒక హైదరాబాద్ బిర్యానీ....పోస్టులు బాగున్నాయని చెప్పే వారికి ఉస్మానియా బిస్కట్ ప్లస్ చాయ్. ఆర్ యూ రెడీ?

43 comments:

Sudhakar said...

You might have to spend a lot on usmania biscuits for sure :-)

Sudhakar
sodhana.blogspot.com

critic said...

ఫణిబాబు,లక్ష్మి గార్లను మీరు కలుసుకున్న విశేషాలు బావున్నాయి. మీరన్నట్టే... వారి బ్లాగుల్లో రాసే శైలి మంచి ప్రవాహంలా సాగుతుంది.

జ్యోతి said...

అంటే మిమ్మల్ని విమర్శిస్తేనే లాభం అన్నమాట.. :)
ఫణిబాబుగారు, ఆదిలక్ష్మిగారి టపాలు చదువుతుంటే మన కుటుంబ సభ్యులే మన ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలాగే అప్పుడెప్పుడో మర్చిపోయిన విషయాలు కూడా గుర్తొస్తాయి..

Thirmal Reddy said...

ఫణిగారి బ్లాగు బాగు బాగు. కంప్యూటర్ స్క్రీన్ మీద ఉండే కర్సర్ గురించి రాసిన కింది వాక్యం చదివి నవ్వు ఆపుకోలేకపోయాను

"ఎంత మెల్లిగా నొక్కినా, ఆ బాణాకారంది కర్సరో సింగినాదమో ఏదో అంటారు, ఎప్పుడూ లొంగదు! అస్తమానూ పారిపోవడమే!"


Thirmal Reddy
thirmal.reddy@gmail.com

ఆ.సౌమ్య said...

బావుందండీ. మీ ఉద్దేస్యం చాలా మంచిదే. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం మనందరికీ మంచిదే. హై వస్తే మిమ్మల్ని తప్పక కలుస్తాను.

ఫణిబాబుగారి గురించి చెప్పిన కబుర్లు ముచ్చటగా ఉన్నాయి.

Ramu S said...

Thanks. You all are welcome.
Cheers
Ramu

durgeswara said...

aite hydarabad vaste makaamku digulu ledannamaata maaku .

Raja said...

ramu garu mee phone number evvandi..oka dozen osmania biscuits ready cheskondi

Raja

Ramu S said...

Raja gaaru
బిర్యాని ఇప్పించి చేతులు దులుపుకోవచ్చు అనుకున్నాను. బిస్కెట్స్ అయితే...సమస్యే. మళ్ళా మళ్ళా బిస్కెట్స్ తిని, చాయ్ తాగాలనిపిస్తుంది. అయినా సరే...ఇది నా ఫోన్ నంబెర్.
9553586111 or 9347474547
వర్కింగ్ అవర్స్ లో మొదటి నంబర్లో, బేవార్స్ టైం లో రెండు నంబర్స్ లో దొరుకుతాను.
రాము

Ramu S said...

దుర్గేశ్వర్ గారు,
నేను మకాం గురించి మాట్లాడానా? కూర్చోని బిర్యాని తినడం, చాయ్ తాగడం గురించి చెప్పా. అయినా మీరు అంటున్నారు కాబట్టి...అది కూడా చూద్దాం.
రాము

Anonymous said...

"65 ఏళ్ళ ఫణిబాబు గారు నాకు ఒక 20 ఏళ్ళ తుంటరి మిత్రుడిగా అనిపించారు"- మహ చక్కగా వర్ణించారు! అప్పుడప్పుడు మా ఇంటావిడ చివాట్లేస్తూంటుంది -'అసలు జీవితంలో ప్రతీదీ అంత లైటుగా తీసికుంటారే'అంటూ.హాయిగా బ్రతికినంతకాలం, నవ్వుతూంటే ఏ రోగమూ దగ్గరకు రాదని నా ఉద్దేశ్యం.పళ్ళు కూడా లేకపోవడంతో 'బోసినవ్వు' అనికూడా అనిపించుకోవచ్చు! ఉద్యోగంలో ఉన్నప్పుడూ ఇదే తంతు.మేము మొన్న పూణె తిరిగి వస్తుంటే,నేను రిటైర్ అయి 5 సంవత్సరాలు గడిచినా, మా ఫాక్టరీలో ఇంకా పనిచేస్తున్న ఒకతను పలకరించి ' we miss you a lot' అన్నారు. ఇంతకంటె గొప్ప ట్రిబ్యూట్ ఎక్కడుంది? మరీ స్వంతడబ్బా అనుకోకండి! బై ద వే ఈసారి కలిసినప్పుడు, 80% మీరూ, 20% నేనూ మాట్లాడదామని,అనుకుంటున్నాను(ఇప్పటివరకూ!).

ramnarsimha said...

Very nice..

Thanq..

Ramu S said...

ఫణి గారు...
మీ కామెంట్ కు థాంక్స్. మీరు ఇది చదివినందుకు చాలా సంతోషం. అది కుదరదు...మీకే 80 శాతం మనం ఎప్పుడు కలిసినా.
I really enjoyed every bit of our conversation.
As you rightly said, your former colleague's comment is the real reward.
Cheers
Ramu

katta jayaprakash said...

Your idea to have personal interactionis very as it givs a new dimension to the blog as different opinions wil be expressed on various issues while sitting together.Biryani and biscuit policy will definetely drain your purse.So better share among the friends without hitting only one.
In this connection I would like suggest that the print media also must conduct a gettogether of all the readers who contribute to the leters to the editor columns so that there would be a good rapport betweeen the readers and the newspaper atleast once in a year as an annual gathering.
JP.

Vinay Datta said...

Oh, the offer is only for bloggers, I missed it. Otherwise I'd have double played.....vote for biriyanit and make my liitle fellow opt for OU biscuit.

Ramu S said...

మాధురి గారూ..
మీకు కూడా ఈ సదుపాయం విస్తరిస్తున్నాం..don't worry.
ramu

Kiran Teja Avvaru said...

రాము గారు చాల బాగ రాశారు నాకు వీలుంటే ఇద్దరి బ్లాగులు చదివి తరిస్తాను...నేను సైతం మీతో కలిసి మీడియా పైన వున్న అపోహని నివారించడంలో సహాయపడగలను ..!

Raja said...

Ramu garu

mandi ekkuva aithe majjiga palachanavtundantaru, tea scheme kuda alage ayyettundi :)

oka sunday roju bloggers meet pettandi ramu garu.be the first one here too!

Ramu S said...

రాజ గారు...
బ్లాగర్స్ మీట్ చాలా మంచి ఆలోచన. తప్పకుండా ఆ పనిచేద్దాం. ఇప్పటికే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్న మిత్రులు/మిత్రురాళ్ళతో ఈ విషయం మాట్లాడతాను.
రాము

పానీపూరి123 said...

ఎప్పుడన్న బిర్యాని తినాలనిపిస్తే మీ పోస్ట్‌లు బాగోలేదు అని చెబితే సరిపోతుందన్నమాట :-)

ఈ బ్లాగ్‌లో ఫోటోకన్నా, మీ profile pic లోనే మీరు smartగ ఉన్నారు. ఆ ఫ్రెంచ్ cut, మీ వయస్సే తెలియనివ్వడం లేదు :-)

Saahitya Abhimaani said...

".......ఒక మంచి స్నేహ సామ్రాజ్యాన్ని ఈ నెట్ ప్రపంచంలో నెలకొల్పుదాం......."

కొన్ని కొన్ని బ్లాగుల్లో జరిగే రసాభాస చూస్తుంటే, నిజమే అటువంటి సామ్రాజ్య స్థాపన అవసరం ఎంతైనా ఉన్నది.

Saahitya Abhimaani said...

ఫణి బాబుగారు ఎంత స్నేహశీలి అంటే, నేనెప్పుడో "పూనేలో ఉన్న మా అబ్బాయి" అని వ్రాసిన సమాచారంతో నాకు వెంటనే మెయిలు ఇచ్చి మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, అతని ఫోన్ నెంబరు ఇవ్వండి అతనితో మాట్లాడుతాను అని ఆదరంగా అడిగి తీసుకున్నారు.

మా అబ్బాయే వాడి పని వత్తిడివల్ల ఇంతవరకూ ఆయన్ని కలవలేకపోయాడు.

ఫణిబాబుగారు తనకు ఒక ఉత్తరం చేత్తో వ్రాసి పంపమన్నారు ఈమధ్యనే. కాని ఆ పని ఎంత అసాధ్యమో వ్రాయటానికి కూచోగానే తెలిసింది.

ఫణిబాబుగారూ! త్వరలో, తప్పకుండా మీకు నా స్వంత చేతి వ్రాతతో వ్రాసిన జాబు పంపుతానండి, నమ్మండి.

Ramu S said...

పానీపూరి గారు...
థాంక్స్ సర్. మీరు బాగా చెప్పారు.
ఈ ఫ్రెంచ్ కట్ విషయంలో ఇప్పుడు హైదరాబాద్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నది. పైన బొచ్చు లేదు కాబట్టి...ఫ్రెంచ్ దాన్ని భర్తీ చేస్తుందని నేను అంటుంటే...ఆ తెల్ల పిల్లి గడ్డం ఏమిటని ఎక్స్పార్టీ వాదిస్తున్నది. చూద్దాం, త్వరలో ఒక డెసిషన్ తీసుకోవాలి...సార్.
రాము

Malakpet Rowdy said...

మీ రాతలు బాగుండవు కానీ పోస్టులు చాలా బాగుంటాయి సార్

( ఇప్పుడు నాకు బిస్కట్ + చాయ్ + బిర్యానీ )

అన్నట్టు ఆ పానీపూరీ మాటల్ని అస్సలు నమ్మద్దు. పొగడ్తలతో మిమ్మల్ని బోల్తా కొట్టించి రెండు బిర్యానీలు కొట్టేసే ప్రయత్నమది :))

Ramu S said...

రౌడీ గారు,
ఓకే సార్. ముందు బిర్యానీ తిని, తర్వాత ఉస్మానియా బిస్కట్ నంజుకుంటూ ఇరానీ చాయ్ తాగుదాం, రండి. పానీపూరీ, వెన్నెల రాజ్యం, ప్రసాద్ గాడు (ఒక జర్నలిస్టు), మీరు, నేను కలిసి ఈ పని చేద్దాం సార్. ఖర్చు నాదే.
చీర్స్
రాము

నరేష్ నందం (Naresh Nandam) said...

>>పానీపూరీ, వెన్నెల రాజ్యం, ప్రసాద్ గాడు (ఒక జర్నలిస్టు), మీరు, నేను కలిసి ఈ పని చేద్దాం సార్.

ఏంటి..
నన్ను వదిలేశారే?
ఎంత ఒకే కప్పు కింద పనిచేస్తే మాత్రం నాకు ఉండదా (బిస్కట్ + 'కప్పు' చాయ్ + బిర్యానీ)?

హైదరాబాద్‌లో బ్లాగర్స్ మీట్‌ అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఇ-తెలుగు, ఇండిబ్లాగర్స్.. ఇలా కొన్ని సంస్థలు ఎరేంజ్ చేస్తూనే ఉన్నాయి. మనకు ఓపిక, తీరిక ఉన్నప్పుడు హాజరవ్వచ్చు.
ఇక ఎపిమీడియా ఫాలోవర్స్(118 ప్రస్తుతం) తలుచుకుంటే మరో వేదిక సిద్ధం. మీతో ఐతే కొంత మంచి చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది.

చూద్దాం.. మనోడి(అభ్యాస్) శ్రీనగర్ కాలనీ ఆఫీసు రెడీ అయ్యాక పెడదామా?


ఫణిబాబు గారి బ్లాగు పోస్టులకు నేనిప్పటికే పేద్ద ఫ్యాన్. ఇక లక్ష్మి గారి "జీవితపు ప్రయాణంలో తాకిన కొన్ని అలలు" నన్నెలా తడుపుతాయో చూడాలి.

మాలా కుమార్ said...

మీరు చేసిన పరిచయం బాగుందండి .

Thirmal Reddy said...

@Ramu

నన్ను మర్చిపోకండి, నాకైతే అప్పుడే బిర్యాని ఘుమఘుమలు నోరు ఊరించేస్తున్నాయి. ఇంతకి apmediakaburlu బ్లాగు సభ్యుల పరిచయం ఎప్పుడు.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Ramu S said...

Hi Tirumal,
What is this boss, you want biryani? It means...you dislike my posts? OK come on, lets have discussion on it.
Cheers
Ramu

sai said...

sir,
mee posts meeda gud comments echina vaalaki kooda biryani thinipinchandi.leka pothe mana vaalandaru biryani kosamaina mee posts baagalevu ani cheputaaru

Raja said...

ramu garu 'cheers' antunnaru,yedanna hidden items unnaya? ;)

Ramu S said...

సాయి గారు...
నిజమే సర్. ఈ స్కీం కు కొంత కాలపరిమితి నిర్దేశించాలి. లేకపోతే, కొంప కొల్లేరు అయ్యేట్టుంది.
రాజా గారూ...
ఛీ..ఛీ..ఛీ...అలాంటిదేమీ ఉండకపోవచ్చు.
చీర్స్
రాము

Ramu S said...

నరేష్...
రౌడీల మధ్య కుర్రోడివి ఎందుకులే అని...కలపలేదు. నరేష్, నిజంగానే ఒక గెట్ టుగెదర్ పెడదామా? ఒక ఆదివారం కలవడం, మాట్లాడుకోవడం, భోజనం చేయడం, వెళ్ళిపోవడం...ప్లాన్ చేద్దాం.
రాము

శరత్ కాలమ్ said...

నేను ఆగస్టులో ఇండియా వస్తే రావచ్చు. వస్తే కనుక తప్పకుండా మీకు అనే ఏంటి బ్లాగ్లోకం అందరికీ తెలియజేస్తాను. మనకు ఏ ఆనందం వచ్చినా మనస్సులో ఆగదు కదా. మీ పోస్టులు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు కాబట్టి నా క్యాటగిరీ తెలియదు గానీ బిర్యానీలు, ఇరానీ చాయ్ లు నోరు ఊరిస్తున్నాయి. బిల్లు మాత్రం మీదే. పుకడ్కి తిన్నప్పుడు వచ్చే మజా వేరు లెండి! మేము అటు రావడం సరే, మీరు ఇటువైపు (యు ఎస్ కు) ఎప్పుడు వస్తున్నారు? మా ఫ్యామిలీ జూలైలో ఇండియా వెళుతున్న శుభసందర్భంలో అదే అదనుగా మా ఇంట్లో ఓ ఎల్ జి బి టీ సమావేశమూ, కె బ్లా స సమావేశమూ + అ బ్లా స (అమెరికా బ్లాగర్ల సంఘం) సమావేశమూ పెట్టి పండుగ చేసుకుంటే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను. ష్. మా ఆవిడకి ఎవరూ చెప్పకండి - ఈ కుట్రలన్నీ తెలిస్తే జులైలోనే తనతో పాటుగా నన్ను ఇండియాకి లాక్కెళుతుంది.

Ramu S said...

శరత్ గారు,
ఆగస్టులో ఎప్పుడు వచ్చేది కచ్చితంగా చెప్పండి. అందరం సరదాగా కలుద్దాం. మీకు రెండు బిర్యానీలు, అర డజను ఉస్మానియాలు, ఒక రెండు ఇరాని చాయ్ లు. బిల్లు నాదే. నేను లాస్ట్ ఇయర్ అటు వచ్చాను సార్. మయామి, వాషింగ్టన్ లలో దాదాపు నెల పాటు ఉన్నాను. మీరు రండి, ఒక మంచి మీట్ పెడదాం.
బై ది వే, అప్పటికల్లా మీ పుస్తకం రాకపోతే...ఇక్కడ ప్రింట్ బాధ్యతా నాకు ఇవ్వండి.
రాము

Vinay Datta said...

look, there are more comments when you offered biriyani, biscuit, chai.

sandatlo sademiya.

ఆ.సౌమ్య said...

అయ్యో క్రితం యేడాది వరకు నేను హైదరాబాదులోనే ఉన్నానండీ....ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని ఓ వందసార్లు కలిసుండేదాన్ని, బిర్యానీలకోసమైనా, చెప్పారు కాదేం!

శరత్ గారిలాగే మీ పోస్టులు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు. కాబట్టి ఈసారి నేను హై వచ్చినప్పుడు చాయ్, బిస్కట్లు....అల్లాటప్పా బిస్కట్లు కాదు, చార్మినార్ దగ్గర దొరికే చాంద్ బిస్కట్లు, ఇంకా బిర్యానీ రెడీ చేసేసుకోండి.

premade jayam said...

బ్లాగ్ ప్రపంచం మేధో చర్చ కన్నా ఆప్యాయత లతో కూడిన పలకరింపుల కోసం ఎక్కువగా తపించి పోతోందని కామెంట్ లు చెబుతున్నాయి.

rākeśvara said...

పూణే బ్లాగరు అంటే వెంటనే ఫణిబాబుగారు అనుకున్నా, అన్నట్టే అయ్యింది। ఆయన చేతఁ ఇక్కడ రాజమండ్రిలో బ్లాగు మొదలుపెట్టించిన ఘనత నాకు ఇవ్వకపోయినా, నేను దానిని లాక్కుంటున్నాను।
లక్ష్మమ్మగారు సొంత బ్లాగు మొదలుపెట్టారని ఇప్పటివఱకూ తెలియదు। సంతోషం।

నరేష్ నందం (Naresh Nandam) said...

మీరు రెడీ అంటే..
నేను సిద్ధం!
సతీష్ కూడా ఓకే.
వచ్చే వారంలో తను శ్రీనగర్ కాలనీ ఆఫీసు స్టార్ట్ చేస్తాడు.
నిన్న అదే అనుకున్నాం.. ఎప్పుడైనా.. అక్కడ మీట్ అవచ్చు.. అని!
15రోజుల ముందే సమావేశం వివరాలు ఇస్తే ఎక్కువ మంది హాజరయే అవకాశం ఉంటుంది.

Ram said...

ramu garu nenu post chesina comments ravadam ledu enduku...? give ur mail id sir. i wil send it 2 ur mail..ok..

Ramu S said...

డియర్ Rameshborn2win,
మీ కామెంట్ ఒక్కటి కూడా నాకు రాలేదు. నేను కామెంట్స్ సహజంగా కిల్ చెయ్యను. మీరు ఎంతో కొంత సమయం వెచ్చించి రాస్తారు కాబట్టి...గౌరవంగా వాటిని పోస్ట్ చేస్తాను.
నా మెయిల్: srsethicalmedia@gmail.com

Cheers
Ramu

Raja said...

ramu garu july lo bloggers meet almost confirm anukunta :)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి