Tuesday, June 1, 2010

జర్నలిస్టుల గుట్టు జర్నలిస్టు లే రట్టు చేసిన వేళ...

జూన్ ఒకటో తారీఖు తెలుగు జర్నలిజం చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగిన రోజు. జర్నలిస్టు ల నిజస్వరూపాలపై బహిరంగ చర్చ జరగడం, వారి గుట్టు బుల్లి తెర మీద అక్షరాలుగా రట్టై ప్రత్యక్షమవడం మొదలైన రోజిది.

తెలుగుదేశంపై కాస్త ఆపేక్ష అనేది తప్ప మరొక అభాండం తన మీద ఏమీలేని సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు గారు... బ్లాక్  మెయిల్  జర్నలిజాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు పోయాడని అపవాదు ఎదుర్కుంటున్న మరొక సీనియర్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ బండారాన్ని లైవ్ షో లో బైట పెట్టారు. కొమ్మినేని గారు N-TV చీఫ్ ఎడిటర్ కాగా, వేమూరి వారు ఆంధ్రజ్యోతి పత్రిక, ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ అధిపతి. 


స్వరూపానంద సరస్వతి స్వామి దొంగతనంగా రికార్డ్ చేసిన  టెలిఫోనిక్ సంభాషణ ఆధారంగా N-TV పై, ముఖ్యంగా ఛానల్ సీ.ఈ.ఈ.రాజశేఖర్ పై, ABN-ఆంధ్రజ్యోతి ఉదయమే ఒక 'స్టింగ్' కథనం ప్రసారం చేయడంతో రెండు ఛానెల్స్ మధ్య పంచాయితీ షురూ అయ్యింది. సాయంత్రానికి అవి పరస్పర దూషణలకు దిగాయి. 

ABN ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ శివప్రసాద్, బ్యూరో చీఫ్ మూర్తి ల 'స్త్రీ లోలత్వం' పై N-TV పెద్ద అక్షరాలతో స్క్రోల్స్ నడిపింది. వారిద్దరూ N-TV ఒక స్థాయికి రావడానికి ఆరంభంలో కృషిచేసిన వారే. ఇప్పుడు వారిద్దరూ ABN కు వెళ్ళినా వారి సన్నిహితురాళ్ళుగా ముద్రపడిన వారు మాత్రం N-TV లోనే ఉన్నా ఈ ఛానల్ ఈ విషయాన్ని హై లైట్ చేయడం విశేషం.

'శివ ప్రసాద్ ఎవరి చావుకు కారణమో మీడియాలో ఎవరికి తెలియదా?' అన్న స్క్రోల్ కూడా కాసేపు నడిచింది. ఈ వివాదంపై ఈ బ్లాగ్ గతంలో విస్తృతంగా రాసింది. అయితే...ప్రస్తుత వివాదానికి, వీరి వ్యక్తిగత జీవితాలకు సంబంధం లేని అంశంపై N-TV స్క్రోల్ల్స్ నడపడం దారుణం.

N-TV ఛానల్ ఓనర్ నరేంద్ర చౌదరి పంచలోహ విగ్రహాలు అమ్ముకున్నాడని, కట్నం కోసం భార్యను చంపిన ఆరోపణ ఎడుర్కొన్నాడని, ఛానల్ సీ.ఈ.ఈ. రాజశేఖర్ ముష్టి ఐదు వేల కోసం కక్కుర్తి పడి దొరికిపోయి, ఉద్యోగం పోగొట్టుకున్నాడని ఎవరినో ఉటంకిస్తూ ABN వాళ్ళు స్క్రోల్స్ రన్ చేయడం వల్ల N-TV వాళ్ళు కౌంటర్ ఎటాక్ కు పాల్పడినట్లు అర్థమయ్యింది. ఇలా ఓనర్లు, జర్నలిస్టుల బండారాలు బైట పడడం మంచిదేనా? ఇది మంచి పరిణామమా? కాదా? అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. 

ఈ వ్యక్తిగత పంచాయితీల గొడవ ఇలా వుండగా...N-TV లో సురేష్ అనే యాంకర్ కొమ్మినేని గారిని లైవ్ లో ఇంటర్వ్యూ చేశాడు. ఇది చాలా బాగుంది. ఎవరికీ దొరక్కుండా ఒంటికి నూనె పూసుకుని వచ్చే కొమ్మినేని గారు ఆకుకు అందకుండా, పోకకు చిక్కకుండా తనకు ఒకప్పటి సహచరుడు, ఆ తర్వాత తన యజమాని స్థాయికి ఎదిగిన వేమూరి పై విమర్శలు చేశారు. కొమ్మినేని గారి భాషలో చెప్పాలంటే...."ఇవి విమర్శలని కాదు...ఒక రకంగా విమర్శలే. విమర్శలనడం కన్నా...ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పడం."

అప్పటికే తనకు ఇల్లు ఉన్న కారణంగా జర్నలిస్టు హౌజ్ సైట్ తీసుకోలేదని తన గురించి చెప్పడం ప్రారంభించిన కొమ్మినేని గారు పలు సంఘటనలు వివరిస్తూ వేమూరి రాధాకృష్ణ 'రుజువర్తనుడు, గౌతమబుద్ధుడు అని నేను అనుకోవడం లేదు,' అని స్పష్టం చేశారు. వేమూరి చేసిన పనులు చట్టవిరుద్ధమైనవి అయినా కాకపోయినా, నైతిక విరుద్ధమైనవని చెప్పారు. 

ఆంధ్రజ్యోతి లో పొలిటికల్ బీట్ దొరకడం వేమూరి కెరీర్ లో 'టర్నింగ్ పాయింట్' అని కొమ్మినేని చెప్పారు. వేమూరి వారి గ్రానైట్ లావాదేవీలు, ధర్మల్ యూనిట్ గురించి కూడా ఆయన చెప్పారు. ఎన్.టీ.ఆర్., లక్ష్మీ పార్వతులు వేమూరిని ఇంటి ఛాయలకు రావద్దని చెప్పడం... పత్రికలో సమ్మె సందర్భంగా వోనర్ కు రిపోర్టర్ రాధాకృష్ణ ఒక నెల జీతం అప్పుగా ఇవ్వడం...తాను ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు కు ఆగ్రహం కలిగించే వార్తలు రాసినందుకు తనను (కొమ్మినేనిని) వేమూరి విసుక్కోవడం...ఇవన్నీ లైవ్ లో చెప్పారు కొమ్మినేని. 

అదండీ సంగతి...ఇంకా అనేకానేక మంచి విషయాలు నొచ్చుకుంటూనే చెప్పిన కొమ్మినేని గారు...వేమూరి ని కుల సంఘం ఎలా ఆదుకుందీ చెప్పకపోవడం ఒక లోటుగా అనిపించింది. జర్నలిజం లో కులం పాత్ర పై కూడా పనిలో పనిగా చర్చ జరిగితే బాగుండేది. ఇంత మంచి పాయింట్ పై ఆ యాంకర్ సారు కూడా ప్రశ్న అడగకపోవడం విడ్డూరం.
------------------------------------------------------------------------------
Note for freshers:
ఈ పై పోస్టులో కొమ్మినేని గారు అంటే ఎవరో మీకు తెలియక పోవచ్చు. ఆయన తెలుగు జర్నలిజం లో ఒక చేయితిరిగిన జర్నలిస్టు. 1978 లో జర్నలిజం లోకి వచ్చారు. 'సీనూ...' అని రామోజీ గారు పిలిచే ఈయన 'ఈనాడు' లో 24 ఏళ్ళు పనిచేసారు. ఇంటి నుంచి వస్తూ రెండు బాక్స్ లు తెచ్చుకుని తన తిండి తాను తినాలని అనుకునే వ్యక్తి ఆయన. రెండు మూడు పుస్తకాలు కూడా రాసారు. కిరణ్ రాకతో 'ఈనాడు' లో 'సీను' ప్రభ తగ్గింది.


ఉన్నట్టుండి...శ్రీనివాస రావు గారిని ఢిల్లీ కి బదిలీ చేయడంతో ఆయన నొచ్చుకుంటూనే కొన్ని రోజులు పనిచేసారు. వేమూరి పత్రికలో చేరారు. అక్కడ నాలుగున్నర ఏళ్ళు పనిచేసారు. ఆ తర్వాత టీ.వీ.రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచి N-TV లో చేరారు, తర్వాత TV-5 కు వెళ్లి మళ్ళీ N-TV కి వచ్చారు. జర్నలిజం లో కొత్త పిల్లలను, అందునా...ఒక వర్గానికి చెందిన వారిని మాత్రమే, బాగా ప్రోత్సహిస్తారని, ఒక కులం వారి పత్రికలు/ఛానెల్స్ లో మాత్రమే కే.ఎస్.ఆర్. పనిచేస్తారని గిట్టని వారు అంటారు కానీ...అవి పెద్దగా నమ్మశక్యంగా అనిపించవు.

7 comments:

Anonymous said...

మీరు బాగా రాసారు... ఇద్దరు దొంగలు కొట్టుకుంటే మంచి మజా వస్తది.... ఇంతకీ మీరు కొమ్మినేనిని పోగిడారా... తిట్టారా?
-మహర్షి

సుజాత వేల్పూరి said...

విదేశాల్లో పిల్లలు చూడకూడని ఛానెళ్ళను బ్లాక్ చేసే (ఇప్పుడు ఇక్కడ కూడా)సదుపాయం ఉందట. అలా బ్లాక్ చేయాల్సి వస్తే అవి ఏ బ్లూ ఛానెళ్ళో కాక, తెలుగు వార్తా ఛానెళ్లే అనడంలో నాకెలాంటి సందేహమూ లేదు.

ఒకళ్ళ వ్యక్తిగత జీవితాలు మరొకరు బయట పెట్టుకుంటూ..సంస్థ పాలసీల వెంట పరుగులు తీస్తూ నిబద్ధత అనేది మచ్చుకైనా చూపించకుండా......ఆహా! చిన్నప్పుడు రెండ్రోజులకోసారి మంచినీళ్ళొచ్చే రోజుల్లో మా వీధిలో ఉండే పంపు దగ్గర చూశా ఇలాంటి పచ్చి మాటలు...పిచ్చి ఆరోపణలు! మళ్ళీ ఇక్కడ!

Anonymous said...

Thank God! NTV and ABN are not available on Tata Sky. We are happy with ETV2 and TV9.

Anonymous said...

Thank God! NTV and ABN are not available on Tata Sky. We are happy with ETV2 and TV9.

Anonymous said...

మరి ఆ వర్గం వారికే మొచ్చింది ఈ మధ్య తానా నుంచి ఆంధ్రవరకు వారి లో వారే బరి తెగించి కొట్టుకుంట్టున్నారు. ఆ వర్గం లో కొంత డిగ్నిఫైడ్ గా నటించే మానవ వాదులు, హేతువాదులు ఇతరులకు సలహాలు ఇవ్వటం మాని వారి వర్గానికి కొంచేం పెద్దరికం వహించి వారిని వారు ఉద్దరించుకుంటె బాగుంట్టుంది. 20సం|| అధికారం రుచి చూసిన ఈ వర్గం వారు ఎంత జుగుప్సాకరం గా దిగజారి ప్రవర్తిస్తున్నారు టి.వీ. ల సాక్షిగా. ఒక పెద్ద చిన్న మంచి మర్యాద క్రమశిక్షణ అన్నదే లేదు అన్నగారే ఉండిఉంటె ఎలా ఉండెదో!

Unknown said...

dear ramu,

as i was free today i watched both channels for some time n as a common man n also as a person who has contested recent muncipal elections, i was very happy when the discussion turned towards paid articles.

the demand , mind u not d request from the so called marketing personnel whatever term u call them is nothing less than black mailing.the reporters express their helplessness n say that though they send news n articles they will not be published unless we pay for paid articles. They will simply come n say that our management has fixed targets if u don't pay they will not be able to publish any articles.

If u pay they will highlight any candidate , despite his draw backs or his incompetence or negative points.

They r not bothered about the good and bad qualities of the candidates . they will forget the basic principle of the journalism that it is their responsibility to let the people know n report impartially about the candidates in fray.
I was also shocked to hear one senior journalist amarnath commenting during discussion that we should over look the minor aberrations or acts of contributors here n there but we should not condone the mistakes of managements. I really do not understand this statement . After all whether it is contributor or management or editor , all of them belong to same profession. Todays contributor is tommorows journalist. the day the system of contributors is introduced the standards of journalism have gone down.A person will be given a visiting card n he will be asked to support himself . Can u tell me what r the salaries of contributors n how r they maintaining them selves with the said meagre salaries. Are the managements not encouraging the unethical journalism r reporting by these so called contributors.district editions n zone pages are one more reason for these falling standards.
any way we r happy that some discussion started n we r doubly happy that managements of two channels have started to expose each other in public , by proving they r not less than any corrupt or unethical persons whom they have been trying to expose all these days.

Anonymous said...

ఏది ఎలా ఉన్నా కాలక్షెపం బాగా ఉంది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి