'ఉత్తమ యాంకర్స్' గా మీరు ఎంపిక చేసిన ముగ్గురికీ (రోజా, సౌజన్య, రజనీకాంత్) మొత్తంమీద చిరు కానుకలు అందజేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇవి నిజంగానే చిరు కానుకలు కానీ...ఒక కొత్త సంప్రదాయానికి పెద్ద ఆరంభం అని అనిపించింది.
వీళ్ళ ఫోన్ నంబర్స్ పట్టడం, వీరికి ఉపకరిస్తాయని అనిపించే పుస్తకాలు వెతకడం, ప్రశంసా పత్రం కంపోజ్ చేయించడం, వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి అపాయింట్ మెంట్ తీసుకుని వారి ఆఫీసులకు వెళ్లి ఒక పూల గుత్తితో పాటు ఇద్దామనుకున్నవి ఇచ్చిరావడం....ఈ కార్యక్రమాలకు ఒక రోజు పట్టింది.
మంగళవారం నాటికి మూడు ఫోన్ నంబర్స్ దొరికాయి. ఆ రోజు ఫోన్ చేస్తే...సౌజన్య గారు గుంటూరులో ఉన్నానని, మర్నాడు వస్తానని చెప్పారు. కాబట్టి బుధవారం నాటికి కార్యక్రమాలు వాయిదా వేసుకున్నాను. ఆమె వచ్చి ఉంటారు కదా...అని సాయంత్రం అన్ని ఏర్పాట్లూ చేసుకుని హేమ, నేను ముందుగా i-news ఆఫీసుకు వెళ్లాం. ముందుగా ఫోన్ చేసాం కాబట్టి...రోజా గారు బైటికి వచ్చి బొకే, చిరు కానుక తీసుకున్నారు. పాపం...ఆమె టీ కోసం లోపలకు రమ్మన్నారు కానీ....మేము సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది.
'మరోలా అనుకోకండి. మేమేమో యాజమాన్యాల మీద ఎక్కువగా రాస్తున్నాం. భవిష్యత్తులో రాస్తాం. అప్పుడు సమాచారం మీరు ఇచ్చారేమో అన్న అనుమానం కలుగుతుంది కాబట్టి...మీ ఆఫీసులోకి వచ్చి మీ ఆతిధ్యం స్వీకరించలేక పోతున్నాం," అని ఫోన్ లో రోజా గారికి చెప్పాం. ఆమె బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతున్నారని అర్థమయ్యింది.
TV-9 స్టార్ యాంకర్ రజనీకాంత్ కు ఫోన్ చేస్తే...రాత్రి 9.30 తర్వాత కలవవచ్చని చెప్పారు. సరే కదా...అని ఆ Mahaa-TV ఆఫీసుకు వెళ్ళాం. దాని దారి తెలుసుకోవడానికి చాలా కష్టమయ్యింది. ఒక పదిహేను సార్లు ఫోన్ చేసాం...సౌజన్య గారికి. N-TV లో ఉండగా....రిపోర్టర్ గా హేమకు, యాంకర్ గా సౌజన్య గారికి పరిచయం ఉంది. హేమా ఫోన్ చేసినా లాభం లేక పోయింది. సెక్యూరిటీ మిత్రుడు చెప్పాడు...మేడం ఈ రోజు రావడం లేదని. రాత్రికి సౌజన్య గారు కాల్ బాక్ చేసి...సారీ చెప్పారు.
హేమ, నేను దగ్గరుండి మరీ కట్టించిన అందమైన బొకేలు పాడవుతాయి కదా....అనే బాధ కాసేపు తొలిచింది. ఇక ఈ ఉదయాన్నే...ఎస్.ఎం.ఎస్.ల మీద వ్యవహారం నడిపాను. ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ రమ్మన్నారు. కానీ...తాను సాయంత్రం 4 గంటల దాకా...రానని సౌజన్య మెసేజ్ పెట్టారు. ఇక లాభం లేదని...ముందుగా TV-9 కు వెళ్లి రజనీని కలిసి చిరు కానుక అందజేసి...ఒక రెండు నిమిషాలు మాట్లాడి...అటు నుంచి అటు Mahaa-TV కి వెళ్ళాను. అక్కడ సెక్యూరిటీ లో ప్యాక్ ఇచ్చి...సౌజన్య గారికి మెసేజ్ పెట్టి...గట్టిగా ఊపిరి పీల్చుకుని ఇంటికి వచ్చాను. ఇదొక తృప్తి కరమైన సంఘటన/ అనుభూతి.
ఈ పాట్లు తెలుసుకుని...'అన్నా...అంతచేసినోడివి...ఒక ప్రజెన్టేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేయవచ్చు కదా...' అని సోదరుడు క్రాంతి అన్నాడు. నిజంగా నా మదిలో అదే ఉంది. బ్లాగ్ ద్వారా.....మరికొన్ని పోటీలు నిర్వహించి...ఒక మంచి వాతావరణం ఏర్పరచాలని, ప్రతిభావంతులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. అందుకే....ముగ్గురికీ ఈ కింది మెసేజ్ ఇచ్చాను-క్రాంతి ఫోన్ రాకముందే.
"It is the smallest prize but the greatest beginning."
Thursday, June 10, 2010
Subscribe to:
Post Comments (Atom)
21 comments:
Ramu garu nxt time more categories include cheyyandi and make use of poll widget from blogspot.
Gr8 tradition started!
Raja
Extremely good gesture. Keep it up :-)
ఇక్కడ వాళ్ళ ముగ్గురి ఫోటోలు కూడా పెడితే బావుండేది.
రాము గారు, హేమ గారు,
మీ ఓపికకి హేట్సాఫ్. Keep going.
మీ
క్రిష్ణ
Congratulations! This is definitely a good, new beginning. I think this is the first of its kind.
Ramu...
Its good to know that atleast something has started in the right direction. Wish it would become a more formal setup soon. Also, are you thinking about those unsung heroes, as in the field reporters and desk copy editors/shift incharges. I know its not that easy and might take a lot of time to figure out their efficiency, but I say Rome Was Not Built In A Day. Appreciate your efforts.
ज़िंदगी की असली उड़ान अभी बाकी है
ज़िन्दगी की कई इम्तिहान अभी बाकी है
अभी तो नापी है मुठ्ठी भर ज़मीन आपने
आगे अभी सारा आसमान बाकी है
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
రాము గారు..! ముందుగా నమస్కారం, ఇంత బిజీ లైఫ్ లో కూడా మీరు బ్లాగ్ కోసం ఇంత టైం కేటాఇంచడం నిజంగా మీకు నా అబినందనలు. మీకు జర్నలిజం మీద ఉన్న మమకారం కనిపిస్తుంది నాకు మీ బ్లాగ్ లోని ప్రతి అక్షరం లో,నేను 2009 ప్రారంభం నుండి నుంచి మీ బ్లాగ్ చూస్తునాను.నేను మీడియా కు సంబందించిన వాడిని కాదు,కానీ నాకు మీడియా లో కొంత మంది సన్నిహిత మిత్రులు, ఆత్మీయులు ఉన్నారు. మీ బ్లాగ్ చదవడం స్టార్ట్ చేసాక.నాకు మీడియా లో పరిస్థితులు 80% అర్ధమయ్యాయి. కేవలం మీడియా మనుషుల గురించి బాస్ ల గురించే కాక, నీజాయితి తో మీడియా లో ఉంది ఇపుడు అనేక కష్టాలలో ఉన్న మీడియా మిత్రుల గురించి వారి కష్టాల గురించి రాయడం కూడా చాలా మంచి విషయం.తద్వారా వారికి మంచి జరుగుతుంది అనే మీ ఆలోచనకు నా హృదయపూర్వక అబినందనలు.మీ ఈ అక్షర యజ్ఞం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి..మీ మిత్రుడు...రమేష్.
రాము గారు..! ముందుగా నమస్కారం, ఇంత బిజీ లైఫ్ లో కూడా మీరు బ్లాగ్ కోసం ఇంత టైం కేటాఇంచడం నిజంగా మీకు నా అబినందనలు. మీకు జర్నలిజం మీద ఉన్న మమకారం కనిపిస్తుంది నాకు మీ బ్లాగ్ లోని ప్రతి అక్షరం లో,నేను 2009 ప్రారంభం నుండి నుంచి మీ బ్లాగ్ చూస్తునాను.నేను మీడియా కు సంబందించిన వాడిని కాదు,కానీ నాకు మీడియా లో కొంత మంది సన్నిహిత మిత్రులు, ఆత్మీయులు ఉన్నారు. మీ బ్లాగ్ చదవడం స్టార్ట్ చేసాక.నాకు మీడియా లో పరిస్థితులు 80% అర్ధమయ్యాయి. కేవలం మీడియా మనుషుల గురించి బాస్ ల గురించే కాక, నీజాయితి తో మీడియా లో ఉంది ఇపుడు అనేక కష్టాలలో ఉన్న మీడియా మిత్రుల గురించి వారి కష్టాల గురించి రాయడం కూడా చాలా మంచి విషయం.తద్వారా వారికి మంచి జరుగుతుంది అనే మీ ఆలోచనకు నా హృదయపూర్వక అబినందనలు.మీ ఈ అక్షర యజ్ఞం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలి..మీ మిత్రుడు...రమేష్.
"It is the smallest prize but the greatest begining."
Good work.
As Raja said, next time include more categories.
Kumar B
Nice Idea.....
hello sir ela unnaru.. ?
nako doubt vundandi tv9 lo kottha ga souji evarandi? raviprakash kemaina bandhuva?
Ramu garu,
where are you ??
missing you a lot.
rgds
krishna
బ్రదరూ , మీ బ్లాగ్ కి నేను regular visitor ని , బ్లాగ్ ఓపెన్ చేయగానే ఒక ఐదు - ఆరు పాపప్ యాడ్స్ వస్తున్నాయి , గూగుల్ యాడ్స్ తప్ప ఇతర ఆన్ లైన్ యాడ్స్ దండగ ,దాని వల్ల మీకు వచ్చే ఆదాయం నెలకు గట్టిగా వంద రెండు వందలు కూడా ఉండదు (అనుభవపూర్వకం గా చేబుతున్నా ), పైగా వాటి మూలంగా వైరస్,మాల్వేర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దీని వల్ల visitors కి ఇబ్బందే ,వాళ్ళు రావడం మానేస్తే మీ అసలు ఉద్దేశం నెరవేరదు ,దయచేసి ఈ యాడ్స్ ను వెంటనే తొలగించి గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేయండి .
@అజయ్ గారు...
నేను ఓపెన్ చేస్తే అలా రావడం లేదు సర్. యాడ్స్ ను అనుమంతించేలా నేనేమీ చేయలేదు. అయినా ఎందుకు వస్తున్నాయో తెలియదు. గూగుల్ యాడ్స్ తో లాభం లేదని బ్రదర్ తిరుమల్ రెడ్డి చెప్పారు. ఏమో చూద్దాం...
@శ్రీ కృష్ణ....
సర్, మీరు అన్నది నాకు అర్థం కాలేదు. నా మెయిల్ కు వివరంగా రాయరూ..
@క్రిష్ణార్జున్ గారు..
నా కుమారుడి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఉండి రాజమండ్రి వెళ్లాను. ఈ రోజే వచ్చాను.
@ప్రేమిక గారూ...
మీరు అంటున్న అభ్యర్థి నాకు తెలియదు...కనుక్కుంటాను.
@ మిగిలిన అందరికీ...
మీ అభినందనలకు థాంక్స్. మీ ప్రోత్సాహంతో ఇంకా మంచి పనులు చేస్తాను.
రాము
@premika garu
souji kadu aa ammai peru suzy. most beautiful ancor in ap ani tv9 vaadu tega publicity chestunnadu aa ammai ni .kani anchor ki undavalisina okka lakshanam kuda aa so called most beautiful anchor lo naaku kanapadaledu.
సుజీ సగం శరీరం చచ్చుబడిన పరిస్తితుల్లో ఉన్న మహిళ అని ఎవరో చెబితే విన్నాను. ఆమె పోరాటంను అభినందించాలి.
anchor suzy gurinchi news item
http://movies.sulekha.com/news/entertainment/sad-story-behind-beautiful-lady-anchor.htm
Raja
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి