'Inside Media' సిరీస్ లో మొదటి భాగం ఇది. దీని రచయిత తిరుమల రెడ్డి గారు. ఆయన అనుభవాలు ఇక్కడ పంచుకుంటారు. మీడియాలో కొన్నాళ్ళు ఉండి...నచ్చక వేరే ఉద్యోగాలు వెతుక్కున్న వారు ఇలా స్వీయానుభవాలు పంపితే...ఫోటోతో సహా ఈ బ్లాగ్ లో ప్రచురిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ ఫోటోలు తిరుమల్, ఆయన సతీమణి సుమ గార్లవి.--Ramu, Hema
----------------------------------------------------------MBA (మార్కెటింగ్) చేసి చిన్నా చితకా ఉద్యోగాలు వెలగబెట్టి ఇది ఇక
నావల్ల కాదను కునే సమయానికి 'ఈనాడు జర్నలిజంస్కూలు' ప్రకటన నాలో కొత్త ఆశలు రేపింది. టీవీ జర్నలిజంలో మొదటి సారిగా డిప్లొమా అందిస్తున్నా మనే మాట ఆకర్షించింది.మీడియాలోకి అడుగుపెట్టే సమయానికి పాలగుమ్మి సాయినాథ్ లాంటి వారు మాత్రమే ఉంటారనే భ్రమ ఉండేది. ఈనాడు జర్నలిజం స్కూలు (2003) మొదటి టీవీ బ్యాచ్లో చేరినప్పుడు ఈ భ్రమ కాస్త గర్వంగా మారింది.
ఒక గొప్ప సంస్థలో పనిచేయబోతున్నా అనే ఆనందం ఉక్కిరిబిక్కిరి చేసేది. ఆర్నెల్ల శిక్షణ పూర్తయిన తరువాత డెస్క్ లో చేరగానే బుడన్ (అప్పుడు ఈటీవి-2, ఇప్పుడు Studio-N) గారి వద్ద పని చేసే ఆవకాశం దొరికింది. బుల్లెటిన్లో వార్త ప్రాధ్యానత నుంచి రన్ ఆర్డర్ తయారు చేసే వరకు అంతా ఆయనే నేర్పించారు.
నేను చేసే బుల్లెటిన్ లక్షల మంది చూస్తారనే ఆలోచన ఎంతో తృప్తినిచ్చేది. అయినా ఏదో తెలియని ఒత్తిడి నా మీద పడుతున్న భావన కలిగేది. ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు అని బుడన్ గారు అంటుంటే అర్ధమయ్యేది కాదు. MBA చేసి ఈ రంగంలోకి ఎలా వచ్చావు ?అని తరుచు ప్రశ్నించే వారు. అలా అయనతో (2004) ఎలక్షన్ బుల్లెటిన్ సమర్ధంగా నిర్వహించాను. బుల్లెటిన్ పూర్తైన తర్వాత పోస్ట్ మార్టెం పేరిట ఛానల్ కి హెడ్ స్థాయిలో ఉండే వ్యక్తి అనవసర వ్యాఖ్యలు చేయడం, అది నచ్చక బుడన్ గారు ETV-2 నుంచి వెళ్ళిపోవడం చకచక జరిగిపోయాయి. అప్పుడు మొదలైంది నా కష్ట కాలం.
సదరు హెడ్ గారు నన్ను నేషనల్ న్యూస్ లో పడేసి గంటకోసారి ఫోన్ చేసి న్యూస్ గురించి వాకబు చేసేవారు. సర్లే అనుకుంటూనే అక్షర ధామ్ పేలుళ్లు, ఇరాక్ ఫై అమెరికా దాడి లాంటి అంశాలు కవర్ చేసాను. ఇక్కడో ముఖ్య విషయం ఏమిటంటే, నేషనల్, ఇంటర్నేషనల్, అంశాలు కవర్ చేయడానికి మనకంటూ రిపోర్టర్లు ఉండరు. అంతా న్యూస్ ఏజెన్సీలపై ఆధారపడాల్సిందే. రాయిటర్స్ లో వార్త లేట్ అయితే బుల్లెటిన్ లో తేడా వస్తుంది. వెంటనే పైనుంచి అచ్చ తెలుగు బూతులు వినాల్సివచ్చేది. Marlon Brando, Hrishikesh Mukherjee ల మృతిఫై స్టొరీ చేస్తే "వాడి గురించి స్టొరీ ఎందుకు" అని ప్రశ్నించిన బాస్, మరుసటి రోజు అవే వార్తలు "ఈనాడు" మెయిన్ పేజీలో చూసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం నవ్వు తెప్పించింది. అయినా బండి నడిపించాలి. ఇందులో నాకు తెలిసొచ్చింది ఏమిటంటే మనకంటూ ఒక టీం ఉండాలి అని. అప్పట్నుంచి నాకు సరైన సపోర్ట్ ఇవ్వగల (బుల్లెటిన్లో మాత్రమే, ఇతరత్రా కాదు) జూనియర్లను తయారు చేసుకున్నా. ఇప్పుడు నా టీం సభ్యులంతా MAHA-TV, Zee-24, Saakshiలో సొంతగా బుల్లెటిన్లు చేస్తుండడం నాకు గర్వకారణం.
ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఆంధ్రావని జడిలో నేషనల్ న్యూస్ కొట్టుకుపోయేది. కొంత మనసు చివుక్కుమన్నా, నేషనల్ న్యూస్ సత్తా చూపే అవకాశం 2004 లో సునామి రూపంలో వచ్చింది. అంతర్జాతీయ వార్త కావడంతో, ఒక పది రోజులపాటు నిద్రాహారాలు మాని వార్తలు కవర్ చేసాము. జర్నలిస్టుగా నాకు అత్యంత సంతృప్తినిచ్చింది సునామి కవరేజ్. తరుచూ మారుతున్న సమీకరణాల్లో భాగంగా నన్ను ఆంధ్రావనికి మార్చారు. స్వతహాగా రాష్ట్ర వ్యవహారాలపై ఆసక్తి ఉండడంతో అక్కడా నా వంతు కృషి చేసాను. తేడాఅల్లా ఫీల్డ్ లో రిపోర్టర్లతో అనుక్షణం కాంటాక్ట్ లో ఉండాలి. అదో కొత్త అనుభూతి. ఏడాదిన్నర పాటు ప్రాంతీయ వార్తల్లో మునిగి తేలాను. అనుక్షణం అప్రమత్తతతో వ్యవహారం నడపాలి. అప్పటికి రెండు న్యూస్ చానెళ్ళు మాత్రమే ఉన్నా, మీడియా అవేర్నెస్ ఊపందుకుంది. ఈ క్రమంలో న్యూస్ బుల్లెటిన్ మీద పట్టు సాధిస్తూనే, నన్ను, నాలాంటి వాళ్ళను సాధించుకు తినే పెద్దలను తట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. పైగా, మనం కొమ్ముకాస్తున్న పార్టీ ఘోరంగా ఓడిపోయినా దాన్ని పక్కనపెట్టి, ఎదుటి పార్టీ తూతూ మంత్రంగా గెలించిందని చెప్పాలి.
ఇదెక్కడి జర్నలిజం రా బాబు, జర్నలిజం స్కూల్లో నేర్పిందేమిటి ఇక్కడ నాతో చేయించే పనేంటి అనే ఆత్మశోధనతో నలిగిన సందర్భాలు అనేకం. కాకపోతే పూర్తిగా న్యూస్ పైనే దృష్టి పెట్టాలనుకునే వారికి ఇలాంటి పెద్దల వ్యవహారం
చికాకు తెప్పిస్తుంది. జర్నలిజంలో పని సంతృప్తిని మాటేమో కాని, బాసుల
ఇగోలు సంతృప్తి పరచటంలో కూడా కొంత సమయాన్ని వెచ్చించాల్సి
వచ్చేది.
వీటన్నిటిని దాటుకుంటూ నాలుగేళ్ళు పూర్తి చేసాక, నేను ఇంత
చదువు చదివింది ఇలాంటి హర్రాస్మేంట్ భరించటానిక అనిపించి మళ్లీ ఉద్యోగ
ప్రయత్నాలు మొదలుపెట్టి చివరికి గూగుల్ సంస్థలో ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో
చేరాను. అయితే అక్కడితో నా యాక్టివ్ జర్నలిజానికి తెర పడినా, ప్యాసివ్
పాత్రికేయం అప్పుడప్పుడూ వెలగాబెడుతూనే ఉన్నా. నా జీవిత భాగస్వామి
(Sumalatha Reddy) కూడా ఫ్రీలాన్స్ యాంకర్ కావడంతో మీడియా
సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి.
తిరుమల రెడ్డి
(ETV-2 మాజీ జర్నలిస్టు)
ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్
గూగుల్
26 comments:
సునామి 2004 డిసెంబెర్ లో వచ్చింది.
@premade jayam
Tsunami mistake, My bad.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Very nice..
Thanq..
Very nice..
Thanq..
అన్నా నీ ఈటీవీ జీవితాన్ని ( మంచో చెడో )మనవాళ్లందరితో పంచుకోవడం బాగుంది. నీ టీంలో సభ్యుడిగా సంస్థ నుంచి నువ్వు ఎదుర్కొన్న ఎన్నో
సమస్యలకు నేనో ప్రత్యక్ష సాక్షిని. ఈనాడు జర్నలిజం స్కూల్ జర్నలిజం పాఠాలు నేర్పిస్తే...ఈటీవీలో పని చేసిన అనుభవం -జర్నలిస్ట్ ఎలా ఉండకూడదో ముఖ్యంగా జర్నిలిస్ట్ బాస్ ఎలా ఉండకూడదో తెలిపేలా చేసింది. ఆ సముద్రంలో ( ఈటీవీ )ఈదలేక నువ్వు ఎప్పుడో బయటపడ్డావ్..మేం కాస్త ఆలస్యంగా బయటకొచ్చాం. అంతే తేడా. ...
Tirumal gaaru,
Google లో job ఎలా సంపాదించావో చెప్పి పుణ్యం కట్టుకో గురూ. జీతాలు బాగానే ఉంటాయని ఆశిస్తాను.
మీ
క్రిష్ణ
Hello Thirmal garu,
Thanks for sharing your experiences. I don't know in present day circumstances who else will passionately dream about becoming a journalist. Especially after seeing experiences like yours.
Hi,
I appreciate the thought of sharing your experiences.I feel taht the apprenticeship experiences and implementing management's decisions (sides) is mandatory in any organization and in any profession.(Yahoo VS Google..)
As an accountable and responsible business, media has to follow certain standards..agree and hence this blog and teh discussions(!)
I was curious of one thing though!What would be your decision on quitting...in the scenario where..
google offers 15K/M verses ETV pays 90K/M..
Note: I am a Technical Architect (MBA,MS Comp Sc..Ph.D) and maji journalist in teh field even before ETV was started and was with eenadu group for close to 15 years..I moved to SW just for money..
it is very common in every field. unless we adjust at least to some extent we can not settle any where. we may have to keep on migrating until we are exhausted. i'm not supporting any 'X' TV, but my general view. but, one has decide on his/ her own on what will be the break even point for such adjustment. i hope Thirumal has crossed such point for sure.
....LUCKY
hi there
it is really heroic to expose such lapses behind the world of colors. but, i think Thirumal is a little late. else, he would have helped many like him to come out of such unbearable professions to explore the world of vast opportunities for their own existence (without compromising on their dignity and self respect)
Tirumalreddy and sumalatha garini i saw in some game show on tv(wow or yahoo or udayabhanu programme).Tirumal 'REDDY'anni rojulu etv lo undatam nijamgaane oka wonder.
Ramu garu next experience Phani garu rasthunnara :)
నేర్చుకోవడానికి ఈనాడు. సుఖపడటానికి బయట పడు.
నాకు తెలిసి ఈనాడు జర్న లిస్టు లంతా సెల్ఫ్ లేర్నింగే. బుడాన్ అది నేర్పించాడు. పలానాయన ఇది నేర్పించాడు అని చెప్పుకోవడం ఆత్మవంచనే. ఈనాడు అభిమానుల్లో నాలుగో వంతు ఇన్ బిల్ట్ జర్నలిస్ట్ లే. సాధనమున సిసలైన జర్నలిస్ట్ లు గా మారతారు.
@Phani
Thanks Phani. Keep up the spirits.
@Krishnarjun
ఏదో అదృష్టం కొద్ది దొరికింది సార్, కావాలంటే మిమ్మల్ని కూడా రిఫర్ చేస్తా
@ Sharath Sahiti
జర్నలిజం మీద మమకారం ఉన్నవారు ఇంకా ఉన్నారు, లేకపోతే మీడియా ఎప్పుడో కుప్పకూలిపోయేది
@ Sasanka
Sir, every management wants employees people to implement its decisions, but not at the cost of losing them or their faith. Some media house do exactly that and Google does exactly the opposite.
"Google offers 15K and ETV offers 90k per month"
As far as I know there is not a single journalist earning 90K per month in ETV. For reference you can look at the Eenadu Journalism School Ad that came up yesterday. Google pays a lot more than 15K per month (I can show you my payslip).
Also, if it was all about money that I'm working, I wouldn't have joined ETV2 in the first place because my first salary in ETV2 was Rs. 2000 per month and I had some job offers with 8000 per month salary at that time. And the reason for joining Google was a "Chance" and not a "Choice"
@Hearts RSReddy
Yes sir, there is a breaking point for everything, and I snapped after 4 years.
@ Raja
Yes Raja garu, I participated in a family show with my wife in Maa TV. మా ఆవిడ యాంకర్ అవడం మాటేమోగాని, టీవీ షోల్లో పాల్గొనే కొత్త బాధ్యత ఒకటి వచ్చి పడింది
@ Ramu
Sirjee, thanks so much so posting my article. నన్ను ఇట్లా పాప్లర్ డిసైడ్ జేసినందుకు మా ఇంటామె మస్త్ కుష్ అయింది.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
mobile: 9848621931
@Premade Jayam
సార్, బుడాన్ గారు నాకు నేర్పించారు లేదా మరొకరో నేర్పించారు.ఇందులో అబద్దమేమి లేదు. వారు నేర్పించారని చెప్పుకోవడం లో ఆత్మవంచన అంతకన్నా లేదు. మీకు అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నేను నా అనుభవం మాత్రమే చెప్పను, జనరలైజ్ చేసి ETV/Enaadu అంతటికి వర్తిస్తుందని చెప్పలేదు. I didn't care to address any experience of of any of my peer group, this is solely my perception.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
No need to publish this comment---Ramu garu mana blog ki chala mandi reguar readers unnaru (tirumal reddy garu, siva garu, madhuri garu,ramnarsimha garu,phani garu and many more),oka chinna get together lantidemanna arrange chesthe ela untundi? ee mechanical world lo oka sunday roju ,aathmiyamaina snehithulani kalisina feeling vosthundi ani naa feeling...think abt it
అన్నా నీ అనుభవాలు ఇంకాస్త విపులంగా చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే నీ టీమ్ లో ఓ మెంబర్గా చాలా సార్లు నీ అవస్థను దగ్గర్నుంచి చూసిన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. పెద్దలు వాళ్ల ఇగోలు సంతృప్తి పరచుకోవడానికి ఎలాంటి గేమ్స్ ఆడేవారో నీకు బాగా తెలుసు. నువ్వు చూసిన వాటితో పోల్చితే నువ్వు చెప్పింది చాలా తక్కువ.
Thirilmal Reddy's experiences and the response from the people is very interesting and educating the non media people to a large extent so that the behind the screen affairs of good,bad and ugly of the media channels are exposed.I request all the senior journalists who leave the parent or other organisations after a long inings in the media houses to come out and share their expereinces with the people to bring out the true picture of the media houses and give advice to them.It is true that one has to get adjusted with good understanding and faith if one wants to continue in the job and it applies to both the employees and employers so that there will not be any ill feelings.If any one desires to go for more perks and more comfortable life let them go but in a dignified manner with no ill feelings towards the employers but if one differs with the head of the institution on various matters let him come out with the bad and ugly side of the heads so that they can be taught lessons.
JP.
@ Kataa Jayaprakash
Sir, How can you ask the people who have worked so long to comeout and talk bad about their organisations? I don't mind if you criticize them without naming them. Don'tforget that the so called organisations were partly responsible for your growth. I request all the the ppl to refrain from naming persons. They too have a life and I feel that reputaions will get spoilt by that. Remember, we are not sure if the commkent is true or now and we have very little chance of verifying the accusations. I hope Ramu garu, who I think is a gentle man will take care of the matter. Regards
ఆన్నా.. మీ అనుభవాలను పంచుకున్నందుకు చాలా సంతోషం. అయితే మీరు చాలా విషయాలు దాచిపెట్టారేమో అనిపిస్తోంది. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి ఇక చించేద్దాం అని డెస్క్ లో పడిన తర్వాత అర్థమవుతుంది.. మనం ఏమాత్రం చించగలమో. పెద్దల సూటిపోటి మాటలు.. తప్పు జరిగినా లేకపొయినా వివరణలు రాసి ఇవ్వడాలు..అబ్బో.. చెప్పుకుంటూ పొతే ఒక పెద్ద పుస్తకం రాయవచ్చు కదా అన్నా.. మరి అంత తక్కువగా రాసారేంటి? మనం పేర్లు ప్రస్ఠావించాల్సిన అవసరం లేదన్నా.. కాని మీ పొస్ట్ చదివితే ఎక్కడో తగలాలి. ఈ వ్రుత్తి పైన ఎంతో గౌరవంతో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న వాల్లకు మన అనుభవాలు పాఠం కావాలి.. తర్వాతి పొస్ట్ అలా ఉంటుందని ఆసిస్తూ..
CLNRAJU
clnraju@gmail.com
ఆన్నా.. మీ అనుభవాలను పంచుకున్నందుకు చాలా సంతోషం. అయితే మీరు చాలా విషయాలు దాచిపెట్టారేమో అనిపిస్తోంది. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి ఇక చించేద్దాం అని డెస్క్ లో పడిన తర్వాత అర్థమవుతుంది.. మనం ఏమాత్రం చించగలమో. పెద్దల సూటిపోటి మాటలు.. తప్పు జరిగినా లేకపొయినా వివరణలు రాసి ఇవ్వడాలు..అబ్బో.. చెప్పుకుంటూ పొతే ఒక పెద్ద పుస్తకం రాయవచ్చు కదా అన్నా.. మరి అంత తక్కువగా రాసారేంటి? మనం పేర్లు ప్రస్ఠావించాల్సిన అవసరం లేదన్నా.. కాని మీ పొస్ట్ చదివితే ఎక్కడో తగలాలి. ఈ వ్రుత్తి పైన ఎంతో గౌరవంతో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న వాల్లకు మన అనుభవాలు పాఠం కావాలి.. తర్వాతి పొస్ట్ అలా ఉంటుందని ఆసిస్తూ..
CLNRAJU
clnraju@gmail.com
@newsforu
తమ్ముడు నీ వివరాలు స్పష్టంగా చెప్తే సంతోషిస్తా. నువ్వు ఎవరో పోల్చుకోలేకపోతున్న
@CLN RAJU
దాచి పెట్టింది ఏమి లేదు రాజు. ఒక పేజిలో ఎక్కువ మ్యాటర్ రాయడం ఇబ్బంది కాబట్టి అంతటితో సరిపెట్టా. నా రెండో ఆర్టికల్ నువ్వు చెప్పిన అంశం గురించే.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Its all Reddy politics ...They already have a media called shakshi.They want to promote , so they sparying dirt on others.
The one who forgets his 1st employer is good for nothing , he cant succesed in life. Life is not just money ..we should have some ethics also in this field.
Hope this blogger not entertain this kind of posts in future
శశాంక్...గారు..
దయచేసి కులం రంగు పులమకండి. 'ఈనాడు' లో వ్యక్తులు వందల మంది జర్నలిస్టుల కారీర్స్ నాశనం చేసారు. పడిన వాడికి తెలుస్తుంది బాధ. మొదటి యజమానిని మరవడం పై మీ అభిప్రాయం తప్పు. ఎథిక్స్ లేనిది యాజమాన్యానికి. కుల, ప్రాంతీయ రాజకీయాలు చేసి తొక్కి పారేసే వాళ్ళు అక్కడ అడుగడుగున వున్నారు. నీతికి అక్కడ విలువ లేదు. మనం దాని గురించి వగచడం దండగ. ప్రతిభగల వాళ్లను ఇబ్బంది పెట్టి బైటికి పంపిన వారిని ఆలస్యంగా అయినా తోలు తీయడం అవసరం.
రాము
@Shashanka
Though my name is Thirmal Reddy, I never realized that "reddy" would be one reason that will influence my career until I met some caste-blinded souls in ETV. For that matter these non-reddy bosses later joined Sakshi also. And to think of my experience on a caste basis doesn't even occur to me, thanks to the best schooling I had(BRJC Parsi High School, Secunderabad). Now that's what is called character out of education. Also, your so-called reddy media or sakshi doesn't have to depend on a novice like me to "spray dirt" (idiotic usage of true translated phrase), on a juggernaut like ETV.
If you read the article with eyes and mind wide open, I was talking about my experiences with journalism and people involved in it and I was not loathing about ETV2 or its editorial policies. With regards to forgetting my first employer, my dear highly learned friend, for your kind information, broadcasting and wide publicity, my first employer is journalism in ETV2 and not just the company ETV2. Now that I am passively involved in journalism in some form or the other even 3 years after quitting it, is reason enough for any sane person to believe that I respect it.
How I wish you could grow up soon and come out of your cocoon.
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
Brother Shashank, dont bring the caste dirt into this blog.If i have to say in typical eenadu style,Eenadu follows 'Ethical'caste biasing to protect the interest of the people.
Do you know who started cheap caste gimmicks in media?
1st emplorer pettina himsa jeevitantam gurthuntundi.yenno dreams tho edo cheyyalani 1st job lo join avtharu akkada asalu reality vere ga unte adi life long gurthuntundi.
sashank garu i hope repu meeru malli regional basis meeda comment cheyyarani.
Raja
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి