నిజమే, బావిలో కప్పలా ఆలోచించాల్సిన పనిలేదు. అన్ని రంగాలలో బాసుల రూపురేఖా విలాసాలు ఒక్కటే అయినా అందర్నీ ఒకే గాటన కట్టడం...అశాస్త్రీయం అన్నది కూడా నిజమే. అయినా...మీడియాలో...బాసులందు పుణ్య బాసులు వేరు అనుకోవడానికి లేకుండా వుంది తాజా పరిస్థితి.
బాసులు యాసులైతే...సృజనాత్మకత ఎలా దెబ్బ తింటుందో, కింది ఉద్యోగులు ఎలా మానసికంగా దెబ్బతింటారో...నిన్న మాట్లాడుకున్నాం. 'నమస్తే...సర్..' అని కనిపించిన ప్రతి సారీ వినయంగా అనలేదని, తన గుడ్డి ఐడియాలు....బాగున్నాయని పొగడలేదని....ఎంతో ప్రతిభగల వాళ్ళను మీడియా బాసులు పనికిరాని వారిగా ముద్రవేసి ఇళ్ళకు పంపించిన సంఘటనలు చాలా వున్నాయి. ఈ బాధలు పడలేక మంచి జర్నలిస్టులు పూర్తిగా ప్రొఫెషన్ నుంచి తప్పుకుని....చిన్నా చితకా పనులు చేసుకోవడం పరోక్షంగా వృత్తిలో నాణ్యతను దెబ్బతీసింది. ఇలా దెబ్బతిన్న సీనియర్లు ఎక్కడ కనిపించినా....తరిగిపోతున్న విలువలు, జర్నలిజంలో అనైతికత గురించి వాపోతుంటారు. మీడియా లో నిర్దిష్టమైన 'ప్రమోషన్ పాలసీ' ఉండకపోవడం వల్ల పెద్ద చిక్కు వస్తున్నది. ఆ తీవ్రత దృష్ట్యా నే ఈ పోస్టులు రాయాల్సివస్తున్నది.
ఇతర రంగాలో బాసులు బుర్రతక్కువ వాళ్ళు అయితే, కిరాతకులైతే......నష్టం పరిమితంగా ఉంటుంది. మహా అయితే...వారి నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. కానీ ఒక సిరా చుక్క...వేన వేల మెదళ్ళకు కదలిక నిస్తుంది. ఇక్కడ నాణ్యత లేని బాసుల వల్ల సమాజం మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. సమాజం సెన్సిటివిటీని వీరు తమ చెత్త నిర్ణయాలతో చంపేస్తారు, విలువలను మార్చేస్తారు, 'ఈ రోజుల్లో ఇది మామూలే...నీ పిచ్చి గానీ,' అనే ధోరణి పెంచుతారు. ఇది ఇప్పటికే జరుగుతున్నది. ఈ పేరా మళ్ళీ చదివి ఒక క్షణం ఆలోచించండి...సమస్య తీవ్రత మీకు అర్థమవుతుంది. ఇది కనిపించని మహా ఉపద్రవమని మీకు ఇంకా ప్రభావశీలంగా ఎలా చెప్పాలో తెలియడంలేదు.
ఈ రోజు కష్టపడకుండా...ప్రతిభ వల్ల కాకుండా...కులాన్నో, ప్రాంతాన్నో, బంధుత్వాన్నో ఆసరాగా చేసుకుని బాసై కూర్చున్న వాడి వల్ల మీడియా రంగంలో జరిగే నష్టం గురించి చూద్దాం. మీడియా ఏమిటి ఇలా అఘోరించింది? అని మాటల్లో, రాతల్లో కన్నీరు కార్చేవారు తేలిగ్గా తీసుకోకుండా....అర్థం చేసుకోవాల్సిన విషయం.
పునాది గట్టిగా లేని, వృత్తిలో పెద్దగా నలగని బుర్రతక్కువ బాసు త్వరితగతిన ఫలితాలు ఆశిస్తాడు. అంతా...క్విక్ గా కావాలి. వాడు యాజమాన్యాన్ని సంతృప్తి పరచాలి. అప్పుడుగానీ...వాడి పరపతి పెరగదు. ఎథిక్స్ వంటివి పట్టించుకుంటే...కుదరదు. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. మీడియాలో ఇది ఇంకా ఎక్కువ ప్రమాదకర స్థాయికి చేరింది. ఇందుకు ఒక కేస్ స్టడీ ఇక్కడ ప్రస్తావనార్హం.
ఒక రియల్టర్ పెట్టిన ఛానల్ అది. అందులో ఒక 30, 35 ఏళ్ళ మీడియా అనుభవం ఉన్న సీనియర్ ఒకరు. ఆయన పేరు A అనుకుందాం. చాలా కష్టపడి కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి ఆయన. ఇంకొకడు...ఒక 16 ఏళ్ళ సీనియర్. వీడు B. నిజాయితీపరుడైన ఈ A రోజూ ఆఫీసుకు వెళ్లి...అన్ని పేపర్స్ చదివి...టీ.వీ.లు చూసి...సొంత ఆలోచనలు జోడించి....ఒక 20, 30 స్టోరీ ఐడియాలు లిస్టు అవుట్ చేస్తాడు. అందులో...ప్రజోపయోగమైన అంశాలు చాలా వుంటాయి. అది నికార్సైన జర్నలిజం.
మరీ అంత పెద్దగా కష్టపడకుండా....అప్పటికే అక్రమంగా సంపాదించి....'tricks of the trade' బాగా వంట పట్టించుకున్న B ఆఫీసుకు వచ్చి నేరుగా ఛైర్మన్ గారి చాంబర్ కు వెళ్లి...కాసేపు జోగి..."ఈ రోజు చూడండి...సార్...అద్భుతమైన ఐడియా వచ్చింది..." అని చెప్పి వస్తాడు. ముద్దుల మీదనో, హీరోయిన్స్ వేసుకునే లో దుస్తుల మీదనో పచ్చి బూతు ప్రోగ్రాంలు చేసి ఛైర్మన్ కు, జనాలకు కనువిందు కలిగిస్తాడు. సహజంగానే ఇప్పటి సమాజం B బెటర్ అని అంటుంది. ఇలాంటి B లు మీడియాను శాసిస్తునందువల్లనే...మీడియాలో విపరీత ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. పొగడ్తలతో యాజమాన్యాలను ఖుషీ చేసే ఈ రకపు జర్నలిస్టు జాతి విస్తరిస్తున్నది.
అలాగే...మరొక ప్రముఖమైన ఛానెల్ లో చేరి బాసు స్థాయికి ఎదిగి ఒక్క సారిగా నేలకూలిన ఒక కేబుల్ టీ.వీ.రిపోర్టర్, చెన్నై లో చిన్న పాటి ఉద్యోగి నుంచి ఛానల్ లో జనాలను వేధించుకు తినే స్థాయికి ఎదిగిన మరొకడు...ఇలా ప్రొఫెషనలిజం లేని వారి వల్ల మీడియాకు, సమాజానికి జరుగుతున్న నష్టం కొలవడానికి వల్ల కాదు.
ఏ పనీ చేయలేని చెత్తగాళ్ళ చివరి మజిలీ...రాజకీయాలు...అంటారు. ఆ నానుడి మారింది...అలాంటి వాళ్ళ తక్షణ మజిలీ మీడియాగా తయారయ్యింది. ఇలాంటి మీడియా బాసులను ఉద్యోగులు ఎలా తట్టుకోవాలో...మరొక పోస్టులో చూద్దాం.
7 comments:
‘ఏ పనీ చేయలేని చెత్తగాళ్ళ చివరి మజిలీ...రాజకీయాలు...అంటారు. ఆ నానుడి మారింది...అలాంటి వాళ్ళ తక్షణ మజిలీ మీడియాగా తయారయ్యింది’- భలే చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ ప్రస్థానం పైరవీల, రాజకీయాల వైపే!
Hi Ramu gaaru,
I regularly follow your blog.
This comment has nothing to do with this post..Indeed this is not a comment at all. I dont know how to reach you .So followed this way..excuse me for this.
I know a foundation called Spandana foundation. They are doing some good activities in Education and other activities.
Right now they are conducting a big Indian singing event called "Spandana Super Singer contest" in USA.
Can you help to get proper media coverage back there in AP.
This is a non profitable organization and has good track record. http://www.spandana.org/
You can mail me your views at vara.9960@gmail.com
Dear Ramu
What you have mentioned in this post is absolutely right. There is no dispute on anything you have mentioned here. But, what is the way out? I can't right everything here but I have first hand experience with some of those bosses. Ethics, professionalism...alright but how will you survive? You have rightly mentioned that there are people who took up some odd and petty jobs since they were not able to adjust with their bosses. Once they vacate the place, the boss is getting someone else who is willing to dance to his tunes. What are we achieving with this? That is precisely the reason the media houses have a majority who can not even pronounce a word properly. Did i mention to you that a popular anchor in a Number One channel the other day kept repeating that "there has to be a PULISTOP to what Jagan is doing now'. If he does not even know that there is something called a FULL STOP, what do you expect? Is he not the leading anchor today? Your blog wrote about/rated him recently as a popular anchor.
I have an opinion on this...the employee, who is quality conscious is definitely not at fault in this episode. It is the management's readiness to promote its own sidekicks sacrificing the quality. It is easy for anyone to say that the ethics and morals should take importance over survival and keeping a job as long as they are not facing the situation. It is not that easy. I appreciate the debate but it should be directed at influencing the managements but not at the employees.
Ramana
రాము గారు,
నాకు ఇంకో విషయం అర్థం కాదు, ఒక ఛానల్ లో ఇవ్వాళ ఒక టాపిక్ మీద ప్రోగ్రాం వస్తే, వేరే ఛానల్ లో కొద్దిగా అటూ ఇటూగా అదే టాపిక్ మీద ప్రోగ్రాం వస్తూంటుంది. ఇది ఎలా సాధ్యం ??
మా office లో నా జూనియర్స్ అంతా పార్ట్-1 పోస్టింగ్ చదివి నా ముందే చప్పట్లు కొట్టి " మా బాసు ఇంతే, మా బాసు ఇంతే " అని అల్లరి చేసారు.
మీ
క్రిష్ణ
Ramu garu, I have been following your blog for sometime but recently I have noticed that you are getting carried away by things. Please concentrate on what you were doing previously. Now the blog had become more like a gossip tabloid. Please look into it. Regards
ఈనాడు పై నేరుగా రాసిన మీరు... ఈ పోస్ట్ లో ఎందుకు a , b అని వాడారు... ఈనాడు పై విషం కక్కడమే మీ లక్ష్యమా... ఈనాడులో మీరు కోల్పాయింది ఏమైనా ఉందా.. త్రాష్టుడు వంటి పదాలు వాడటం ఇంకా దారుణం... మే విచక్షణ తో మీరే ఆలోచించండి?
-మహర్షి
మహర్షిరావు గారు,
పేర్లు పెట్టి రాయలేము ఇలాంటివి. వాడు త్రాస్టుడే కాదు...పున్డాకోరు, థగ్గు, నీచుడు, నిక్రుస్టుడు...ఇంకా అన్ని శాపాలు, బూతులు. వాడి చేతిలో వందల మంది ఇబ్బంది పడ్డారు, పడుతున్నారు. నేను వాడి వల్ల కోల్పోయింది ఏమీ లేదు...నా వల్ల వాడు కోల్పోయింది చాలా వుంది. 'ఈనాడు' పై విషం కక్కడం నా లక్ష్యం కాదు. ఎవడు తప్పు చేసినా, ఉద్యోగులను ఇబ్బంది పెట్టినా...విషం కన్నా...ఇంకా ప్రభావశీలమైనది వుంటే అది కక్కుతాను. ఇలాంటి వెధవల గురించి రాసేటప్పుడు విచక్షణ, వివక్షలు అవసరం లేదని నా ఉద్దేశం. నేను ఆధారాలు లేనిదే ఇలాంటి వ్యక్తుల మీద అలాంటి పదాలు వాడను సార్. నా బాధ అర్థం చేసుకోండి. పరిశ్రమలో చాలా మంది చస్తూ బతుకుతున్నారు సార్...ఈ బాపతు గాళ్ళ వల్ల.
రాము
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి