ఇన్నాళ్ళూ..... సిగ్గూ, ఎగ్గూ లేకుండా బూతు చూపించడంలో, జర్నలిజాన్ని గంగలో కలపడంలో TV-9 ఛానెల్ ముందు ఉండేదని అనుకుంటున్నాం. దానికి పోటీగా ఇప్పుడొక ఛానల్ ఇరగదీస్తున్నది. దాని పేరు...తెలుగు దేశం పార్టీ వారి studio-N.
రాత్రి పొద్దుపొయ్యాక....మసాలా ప్రోగ్రాం ద్వారా సుఖిస్తున్న ఈ ఛానెల్ హెడ్లు...ఈ రాత్రి బులెటిన్ లో ఒక బుద్ధితక్కువ తక్కువ పనిచేసారు. ఈ విషయంలో కనీసం TV-9 కు ఉన్న ఇంగితం కందుల రమేష్ గారి బృందానికి లేకపోవడం శోచనీయం.
21-ఏళ్ళ కడప అమ్మాయి ఒక విధివంచిత. పెళ్ళిచేసుకుంటానని బాసచేసిన వాడు తనతో వ్యభిచారం చేయించి....సొమ్ము కూడబెట్టుకుని చివరకు పో..పొమ్మని మోసం చేశాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఆ ప్రియుడి ఇంటి ముందు దీక్షకు కూర్చుంటే...ఒక పొగరుబోతు పోలీసోడు...'జీవితాలతో ఆడుకుంటావా? వ్యభిచారం చేసుకుంటున్నావు...కదా..పోయి చేసుకో,' అని తనతో అన్నాడు. అందుకు వీడియో సాక్ష్యం ఉంది. ప్రియుడితో పెళ్ళైనా చేయండి లేదా వ్యభిచారం చేసుకోవడానికి లైసెన్స్ అయినా ఇవ్వండి....అని ఆ అమ్మాయి డిమాండ్ చేస్తున్నది.
బుధవారం రాత్రి TV-9 ఈ స్టోరీ ప్రసారం చేసింది. టీ.వీ.ఛానెల్స్ ఏదో మేలు చేస్తాయని ఇలాంటి ఆడవాళ్ళు స్టూడియోలకు వస్తారు. అలాగే ఆ పిచ్చితల్లి నిన్న ఆ ఛానల్ లో లైవ్ లో మాట్లాడింది. TV-9 సోదరులు...ఆ అమ్మాయి మొహం చూపించకుండా నల్ల క్లాత్ ఏర్పాటు చేశారు. ఆమెను పోల్చుకోవడానికి వీలు లేకుండా.... విజువల్స్ లో బ్లర్ చేశారు. ఇది జర్నలిజం మౌలిక సూత్రం. ఇది మరిచి ఆ అమ్మాయి మొహాన్ని చూపడం తుక్కు జర్నలిస్టులు చేసే పని...అని నా వ్యక్తిగత అభిప్రాయం.
అదే స్టోరీని ఒక రోజు అయ్యాక పట్టుకున్న studio-N మహానుభావులు కనీస మర్యాద పాటించకుండా...ఆ అమ్మాయి మొహం చూపి....డైరెక్ట్ గా బైట్ వేశారు ఈ రోజు రాత్రి. ఆ అమ్మాయి అసహనంగా కదలడం...వంటి అన్నీ విజువల్స్ చూపారు. ఇది చాలా అభ్యంతరకరం. సీనియర్ ఇన్ పుట్ ఎడిటర్ గా అక్కడ చేరిన మా బుడన్ భాయ్ డ్యూటీ లో లేనప్పుడు ఇది జరిగి ఉండవచ్చు.
'అయితే...ఏమయ్యింది...ఆమే లైసెన్స్ కావాలని అడుగుతుంది కదా...మీకెందుకు బాధ' అన్న సందేహం కొందరికి రావచ్చు. అయినా సరే...అది తప్పే. ఆమె వంచిత. చదువుకొని అభాగ్యురాలు. తీవ్ర నిస్పృహతో ఆమె ఆ డిమాండ్ చేస్తున్నది. ఇవ్వాళ విలేకరులు ఆమె మొహం లోకానికి చూపితే...రేపు ఆమె రోడ్డు మీద తలెత్తుకు తిరగలేని పరిస్థితి రావచ్చు. జులాయిల వల్ల ఆమె జీవితం మరింత దుర్భరం కావచ్చు. బాధిత...పిల్లలు, మహిళల విషయంలో ఛానెల్స్ కాస్త సంయమనం పాటించడం....కనీస మర్యాద, బాధ్యత, మానవత్వం.
Thursday, June 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
Itotally agree with you on this issue. Ramesh being a senior shouldn't have done this. This episode shows how low ppl can stoop to attain few TRP ratings. That channel also airs almost nude clips at 11.30 pm. Wake up before your own kids get spoilt by your content
ఆ అమ్మాయి విషయం ఒక్క Studio-N లేదా TV-9 కో కాకపోతే కందుల రమేష్ గారికో లేదా బుడాన్ గారికో ఆపాదించడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ముఖం చూపించి విషయాన్ని కాష్ చేసుకునే చానెల్స్ ఉంటె ఉండొచ్చు. అది అక్కడితో ఆగిపోలేదు. రాత్రి 11:౦౦ గంటలకు నేను N-TV చూస్తున్నా. అందులో మరీ దారుణంగా "అమ్మా నువ్వు ఎప్పటినుంచి వ్యభిచారం చేస్తున్నావు, నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు" అని పచ్చిగా అడుగుతుంటే చూడడానికి నాకు సిగ్గేసింది. ముఖం చూపించడం తో కొన్ని చానెల్స్ హద్దు మీరాయి అని అంటున్నారు. మరి ముఖం మీద "ఎవరితో ఉన్నావు (ఉన్నావు అంటే పడు...న్నావు అని అర్ధం).... అని సిగ్గు లేకుండా మన తెగులు మీడియా అడుగుతుంటే నోరు ఎళ్ళబెట్టుకుని చూస్తూ ఉండిపోయా. HRC లో అదే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మొదటి విజువల్స్ తీసింది NTV. మధ్యాహ్నం మొదలుపెట్టాలనుకున్న ఈ తంతు... కాస్త ఆలస్యంగా మిగితా చానెల్స్ లో కూడా వచ్చింది.
ఇన్నాళ్ళు మదమెక్కిన మగాళ్ళ వల్ల ఇబ్బంది పడింది ఆ అమ్మాయి
ఇక తెలుగు చానెళ్ళ TRP ల వల్ల బలయ్యేది ఆ అమ్మాయే
అయ్యా... తిలా పాపం తలా పిడికెడు....
Thirmal Reddy
thirmal.reddy@gmail.com
ఇలాంటి వాటికి మందు ఒక్కటే. వెంటనే ఒక పోస్టు కార్డు తీసుకుని ఆ చానెల్ ను ఉతికి అరేస్తూ ఒక జాబువ్రాసి పంపాలి. ఒక్క రోజున కనీసం ఒక పదివేల కార్డులు ఆ చానెల్ కు వెడితే, ఎంతటి కరుడు కట్టిన మీడియా మనిషి అయినా కొంచెం కదిలే అవకాశం లేకపోలేదు.
ఇలా బ్లాగుల్లో ఎన్ని వ్రాసి లాభం ఏమిటి. మహా ఐతే మనలాంటివాళ్ళు ఒక 50 మంది చూస్తారు, చూసి నిజమే అంటారు.
రామూగారూ, ఇలాంటి మీడియా దుశ్చర్యల గురించి వ్రాసినప్పుడల్లా, ఆ మీడియా వాళ్ళ చిరునామా, ఈ మెయిలు వివరాలు మీ వ్యాసంలోనే ఇవ్వండి. ప్రేక్షకుల స్పందన కొంతవరకన్నా వాళ్లవరకూ వెళ్ళే అవకాశం ఉన్నది.
చానేల్కే కాదు, ఇటువంటి కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తున్న ఉత్పాదకదారుకి కూడా ఈ స్పందన తెలియాలి.
కాబట్టి ఇకనుంచి ఆయా పత్రిక/చానెల్ చిరునామా వివరాలు, ప్రతి వ్యాసంలోనూ పొందుపరచమని మనవి.
మీరు మరీ పాత కాలం వారండీ శివ గారు. మా తోలు ఎంత మందమో మీకు తెలిసినట్లు లేదు.
నాకొక్క విషయం అర్థం కాదు. ఈ అమ్మాయిలు టీవీ ఛానెళ్ళు ఏ రకంగా తమ సమస్యలు పరిష్కరిస్తాయని వీటి ద్వారా జనంలోకి రావడం? ఛానెళ్ళకు, ఆ స్త్రీలకూ పబ్లిసిటీ తప్పించి? ఇటువంటి దీక్షలు ఏ మాత్రం విజయాన్ని సాధిస్తాయో వారికి తెలీదా? తెలిసే చేస్తున్నారా?
శ్యామల విషయంలో ఎంత హంగామా చేశాయి ఈ ఛానెళ్ళు? అసందర్భంగా ఆవిడ అభిరుచులు వగైరా అడిగి చెత్త చెత్త చేశారు గానీ ఒక్కళ్ళైనా రేపు నీ జీవితం గతేమిటని బాధ్యతా యుతంగా ప్రశ్నించారా?
తన వ్యక్తిగత సమస్యను తాను పరిష్కరించుకోవాలి తప్ప "నాకు వ్యభిచారానికి లైసెన్స్ ఇప్పించండి"అంటూ ఛానెళ్ళకెక్కితే తర్వాత ఆమెకి ఏం ప్రయోజనం?
..రేపు ఆమె రోడ్డు మీద తలెత్తుకు తిరగలేని పరిస్థితి రావచ్చు. జులాయిల వల్ల ఆమె జీవితం మరింత దుర్భరం కావచ్చు....ఇదంతా తెలీకే అమె మీడియా ఛానెళ్ళలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధమైందా?
ఇలాంటి సమస్యల్ని ముఖ్యంగా స్త్రీల సమస్యల్ని ప్రజల ముందుకు (వెధవ ప్రశ్నలు, విజువల్స్ తో)తీసుకురావడం తప్ప ఏ ఛానెలైనా ఏ సమస్యనైనా పరిష్కరించి కథ సుఖాంతం అయ్యేలా చేశాయా ..తెలుసుకోవాలని ఉంది. పరిష్కరించలేనపుడు వాటి జోలికిఎందుకు వెళతాయో కూడా తెలుసుకోవాలని ఉంది.(కేవలం రిపోర్టెడ్ స్పీచ్ తో మాట్లాడ్డం కాక మీకు మా ఛానెల్ అండగా ఉంటుంది.."అనడం చాలా సార్లు చూశాక ఈ మాట రాస్తున్నాను)
ఇలాటి సమస్యల్లో చిక్కున స్త్రీలు వాటిని ప్రజా సంఘాల ద్వారా పరిష్కరించుకోడానికి ప్రయత్నించాలే తప్ప మీడియా ముందుకు రావడం తెలివితక్కువ పని అని నా అభిప్రాయం! లేకపోతే మీరు చెప్పినట్లు వాళ్ళ సమస్య తీవ్రత పెరుగుతుందే కానీ తగ్గదు
ఎవరూ చూడని చానల్ చూడటం మొదటి తప్పు. బూతులు తిట్టుకుంటూ నేతలు చేసుకొనే సెల్ఫ్ ప్రమోషన్ ను అంగీకరిస్తూ ఒక అమ్మాయి చేసుకొనే బిజినెస్ ప్రమోషన్‌ను తప్పు పట్టడం రెండో తప్పు.
మనది ఎలాంటి తరం. వేదం సినిమా చూడటానికి పిల్లల్ని మల్టీ ప్లెక్స్‌లలో అనుమతించడం లేదని చాలా మంది తల్లి దండ్రులు గోకుల్, సత్యం లాంటి హాళ్ళకు వెళ్లి పిల్లలతో సహా చూసి వస్తున్నారు. ఇక్కడ దాపకరికాలు ఏవీ ఉండవు. ఒకడు దాస్తానన్నా(ఈటీవీ) ఇంకోడు ఊరుకోడు(ఎక్స్, వై, జెడ్).
టీవీయే సమస్య అయితే చక్కగా అమీర్ పేటకు వెళ్లి ఆఫర్ లో నాలుగు తెలుగు సినిమా డివిడిలు తెచ్చుకొని టైం పాస్ చేయండి. వార్తలు కావాలంటే గూగుల్ న్యూస్, ఈనాడు పేపర్ చూడండి. ఇంకా తీటగా ఉంటె హిందూ ఎడ్, ఆప్ ఎడ్ పేజీ చదువుకోండి.
విశ్వ మానవాళిని ప్రేమిద్దాం. ప్రేమదే జయం.
TRP's can make any channel to step down to any extent....(well my personal feeling!!!) AD-revenue...popularity...public reach...but as u c....audience are also lyk dat...channels show them....ppl c them....its obvious....common viewer is encouraging them!!!
so only media is not to b blamed...viewer is also liable to b blamed!! this is also my personal opinion...sorry if anything's wrong but truth is always disgusting!!!
I agree totally with Sujatha garu.It is an open secret that the Telugu news channels are sadistic and want to create sensation thus getting more viewers for a masala stories like love affairs,rapes etc.I fail to understand why the women who are cheated by men are coming into streets through media exposing their personal affairs which can be sorted out through police or court or the women's organisations!By exposing themselves and their personal stories they become very cheap in the society as the responsibility for the problem is fifty fifty.
Ramu garu why not a PIL in the High court on the behaviour of the news channels towards such stories as seen in some channelsexploitng the weakness and helplessness of the wounded women in the hands of crooked men?
JP.
I agree totally with Sujatha garu.It is an open secret that the Telugu news channels are sadistic and want to create sensation thus getting more viewers for a masala stories like love affairs,rapes etc.I fail to understand why the women who are cheated by men are coming into streets through media exposing their personal affairs which can be sorted out through police or court or the women's organisations!By exposing themselves and their personal stories they become very cheap in the society as the responsibility for the problem is fifty fifty.
Ramu garu why not a PIL in the High court on the behaviour of the news channels towards such stories as seen in some channelsexploitng the weakness and helplessness of the wounded women in the hands of crooked men?
JP.
I totally agree with Sujatrha garu.Infact the woman should not have gone to news channels as she is exposed to the society by dragginmg her personal affairs into the street through the media.Most of the Telugu news channels are sadistic and they create sensation for more viewers by telecasting the stories of women of love affairs,rape,harassment etc withouit any ethical,proffesional,moral and human values.The woman should have approached the court of law initially for her grievances without exposing her personal affairs to the media.Infact the responsibility of the both the people is fifty fifty.Ramu garu,why not a PIL against the behavuour and attitude of news channels towards women who are deceived in the hands of crooked men as the news channels are behaving immorally insulting the women with uncomfortable questions in the live shows.
JP.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి