Monday, June 21, 2010

TV-9 రవి ప్రకాష్ కు ఒక నాయుడి గారి హితవు....

నోట్: చేయితిరిగిన జర్నలిస్టులా ఉన్న ఒకాయన...సింగమనేని శ్రీనివాస నాయుడు అనే పేరు మీద ఈ కింది వ్యాసం పంపారు. అది నిజం పేరో కాదో చెప్పలేం. ఇది TV-9 రవిప్రకాష్ ను ఉద్దేశించినట్లు అనిపించింది. ఆ ఛానల్ లో ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో ఈ లేఖలో కొన్ని అభ్యంతరకర పదాలు తొలగించి ఇక్కడ అందిస్తున్నాము. ఎవ్వరినీ నొప్పించడం దీని ఉద్దేశం కాదు...రాము, హేమ--------------------------------------------------------  ఒక చరిత్రను ఎన్ని సిరాలతో రాయవచ్చునో `మెరుగైన సమాజం' కోసం పరితపించే రవిప్రకాష్ కు తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియకపోవచ్చునేమో..? అలాగే `పరుల' అవినీతిపైన ...పరుల కుల తత్వంపైన అలుపెరుగకుండా పోరాడే రవిప్రకాష్ కు ఈ మధ్య కాలంలో అనుకోకుండా వరుస గా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  తెలుగు విజువల్ మీడియా కు నామకరణం చేసి, చరిత్ర సృష్టించిన చెరుకూరు రామోజీ ని తలదన్నే అద్భుతమైన ఐయిడియాలతో...tv 9 పేరిట తాను సృష్టించిన సంచలనాలతో పాటే..అప్రతిష్ట ను మూటగట్టుకున్న రవిప్రకాష్ ఇప్పుడు డిఫెన్సు లో పడ్డాడు. తాను పట్టిందల్లా బంగారమనుకునే రోజులు హఠాత్తుగా మాయమైపోయి...గడ్డుకాలం ఎదురవడంతో...బిత్తర చూపులు చూసే రోజులు వస్తాయని ఆయన బహుశా అనుకుని ఉండకపోవచ్చు...కానీ....కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవం అదే. సంచలనాల పేరిట అడ్డగోలు రిపోర్టింగ్ ను ఆయుధంగా చేసుకుని, అడపాదడపా అరుణారుణ సాగరుడి మార్కు బూతు 30 మినిట్స్ ప్రోగ్రామ్స్ తో ఆంధ్రదేశం లోని అలగా వ్యవహారాలని బుల్లి తెరమీద కెక్కించి...ఇప్పటి వరకూ నెట్టుకొచ్చిన టీ.ఆర్.పీ. రేటింగ్ కు ఒక్కసారిగా చిల్లు పడటం రవిప్రకాష్ ఆందోళనకు అసలు కారణం.. 
దానికి తోడు...కనక వర్షం కురిపిస్తాయనుకున్న tv 9 గుజరాతీ, మరాఠీ చానల్స్ నెత్తిన చెంగేసుకుని చాప చుట్టేయడంతో రవిప్రకాష్ లో అంతర్మథనం మొదలైంది..రిపోర్టర్ల భుజాల మీద వార్తల తుపాకులెక్కుపెట్టి ఆయన సాగించినట్టుగా అభియోగాలేదుర్కున్నఎన్నో వివాదాస్పద వార్తకధనాలకు..కొందరు నిజయితీపరులైన రిపోర్టర్లు ఆ తర్వాత సభ్యసమాజంలో ఎంతగా పలుచనైపోయారో వేరే చెప్పనక్కర్లేదు. tv 9 సాగించిన ఈ దూకుడు వార్తకథనాల ప్రసారానికి `మంత్రసాని తనం' ఒప్పుకున్న ఆలపాటి సురేష్ లాంటి సీనియర్ జర్నలిస్టులకు డోర్స్ చూపించి చేతులు దులుపుకున్న రవిప్రకాష్,, ఆయన స్థానం లో తీసుకొచ్చి కుర్చోపెట్టిన రెడ్డి గారికి ఎలాంటి విశ్వసనీయత ఉందని మీడియా లోకానికి చెప్పదలుచుకున్నారో వేరే చెప్పనవసరం లేదేమో...
ఒక్కటిమాత్రం నిజం..నిలబడి మంచినీళ్ళు తాగే e tv మార్కు జర్నలిజాన్ని అపహాస్యం చెస్తూ రవిప్రకాష్ బృందం సాగించిన తిక్కరకం జర్నలిజానికి కాలం చెల్లిపోయింది.. మార్కెట్లో ఉన్న తెలుగు చానల్స్ అన్నింటిలో ఈ వేల్టికీ అద్భుతమైన రిపోర్టింగ్ చేయగల సమర్దులున్నారు..అంతకి మించి సుస్పష్టమైన స్క్రిప్ట్ ఇవ్వగల దక్షులైన డెస్క్ జర్నలి స్టులు ఉన్నారు.. ఈలాంటి వారి సంఖ్యా బహు స్వల్పంగా ఉన్న tv 9 ఇకమీదట కుడా అదే రకం TRP హవా కొనసాగిస్తుందని అనుకోవటం భ్రమ..
 ఒక వేళ అలాంటి భ్రమలే రవిప్రకాష్ కు ఉంటె...లేదా ఆ గ్రూప్ చైర్మన్ శ్రీని రాజు కు ఉంటె...అర్జెంట్ గా ఉన్న టీం ను శుద్ధి చేసుకోవటం అవసరం. మెరికల్లాంటి టీం మెంబెర్స్ ని బయటకి పంపేస్తే... tv 9 రేటింగ్ అమాంతం పెరిగిపోతుందని విపరీతంగా ఊదర గొట్టి..కాస్తో కూస్తో పని చేసే జూనియర్స్ కి ఉద్వాసన పలికించిన తెలుగు రాని ఆకుల గారు కూడా...హఠాత్తుగా చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్ అవతారమెత్తి ...ఫేస్ బుక్ స్టేటస్ మెసేజ్ లో...తాను కొన్నాళ్ళు మిత్రులేవరికీ అందుబాటులో ఉండనని చెప్పుకుని అదృశ్యమవ్వాల్సిన ఆపత్కాలం దాపురించిందంటే...ఇది కచ్చితంగా రవిప్రకాష్ కాల పరీక్ష కి నిలబడాల్సిన సందర్భమే. నిజాన్ని ఒప్పుకుని...నిర్భీతిగా రవి అడుగులు వేస్తె అది ఆయనకు మంచే చేస్తుంది..కానీ..దానికి కావలసినదల్లా...ఆయన చేయాల్సింది...తన వెంట ఉన్న `భట్రాజు' లను సాగనంపి ...నికార్సైన జర్నలిస్టులను తిరిగి తన దగ్గరికి ఆహ్వానించటం...చూద్దాం.. రవి ఏమి చేస్తారో..!!!!!...
సింగమనేని శ్రీనివాస నాయుడు, మాజీ జర్నలిస్టు

15 comments:

ramnarsimha said...

Sir,

Thanks..for your information

Unknown said...

అయ్యా అల్లుడు మా అమ్మయికి అన్యాయం చేశాడయ్యా...
టీవీనైన్ దగ్గరికి వెళ్లండి

ఇదీ రవిప్రకాష్ విజయం

సార్ మా కాలనీలోకి వరద వచ్చేసిందండి..
..టీవీనైన్ కి ఫోన్ చెయ్యండి..

ఇదీ తెలుగు మీడియా విజయం

బాబూ మీ చానల్లో స్క్రోలింగ్ చూసి మా అబ్బాయిని దక్కించుకున్నాం

ఇదిరా జర్నలిస్టులు కాలర్ ఎగరేయాల్సిన సమయం
ఇదే రవిప్రకాష్ సాధించిన మహత్కార్యం

ఏనాడైనా
ఏ ఒక్క ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా సామాన్య పౌరుడికి గొంతునిచ్చిందా?

అమాత్యులకి, అయ్యగార్లకి, అవినీతిపరులకి, సొంత కులస్తులకి, సొమ్ములిచ్చినవారికి తప్ప సగటు మనిషిని ఎవరైనా ఎక్స్ పొజ్ చేశారా?
ఏ మీడియా మేనేజిమెంట్ ఐనా అందుకు ఒప్పుకుందా?

వైయస్, బాబు, చిరు, కేసీయార్ లకి మించిన ప్రజాభిమానం రవిప్రకాష్ కి ఉందని మీకు తెలుసా?
తెలుగు మీడియా చరిత్రలో ఇది ఎప్పుడైన జరిగిందా?
ఇది తెలుగు జర్నలిస్టులకు గర్వకారణం కాదా?

తెలుగు మీడియాని టీవినైన్ హిమాలయాల ఎత్తుకి తీసుకు వెళ్లింది.
పద్నాలుగు న్యూస్ చానల్స్ ప్రపంచంలో ఏ ప్రాంతీయ భాషకి ఉన్నాయి?
దీనికి స్పూర్తి ప్రదాత రవిప్రకాష్

ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి
నెత్తురు మరిగే నిప్పులు కక్కే సైనికులారా రారండి

అబ్బు, హైదరాబాద్.

Sudhakar said...

టీవీ 9 వికారాల గురించి ఇంతకంటే మనం ఏమీ చెప్పలేము. ఈ యాడ్ చూడండి. ఏదో నైట్ క్లబ్ యాడ్ లా వుంది.

http://img205.imageshack.us/img205/9440/tv9madness.jpg

మెరుగైన సమాజానికి అద్భుతమైన వార్తల కంటే అందమైన యాంకరు భామలు అవసరం అని రవి భావిస్తున్నారేమో మరి.

Saahitya Abhimaani said...

నాయుడుగారి స్పందన ఒక కోణం ఐతే అబ్బుగారి ప్రతిస్పందన మరొక కోణం. ఈ రెండిటి మధ్య ఒక సమతౌల్యం సాధించగలిగితే చానెల్ ను ప్రజలు ఒక ఆరోగ్యకరమైన మీడియా గా ఆదరించే అవకాశం ఉన్నది.

రేటింగులకోసం ఎగబడటం తగ్గించి వార్తా ప్రసారాలను కంగారు, హడావిడి, లేకుండా నిస్పక్షపాతంగా చేయటం మొదలుపెడితే బాగుంటుంది.

ఏంఖర్ల వేష భాషలు సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లైవులో మాట్లాడే ఒక్క రిపోర్టరుకి కూడా మాట్లాడటం చేతకావటం లేదు(ఈ చానేలే కాదు అన్ని చానెళ్ళ గతి ఇంతే) "ఐతే" "ఈ నేపధ్యంలో" అనే మాటలు ఎన్ని సార్లు వాడుతున్నారో లెక్కలేదు. ఊరికే తడబాటు, మాటలకోసం వెతుక్కోవటం ఎక్కువ ఐపోయింది. లైవులో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తమ హావ భావాలు ఎలా ఉండాలి అన్న విషయం వాళ్లకి కొంత తరిఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఊరికే చేతులుతో నాగయ్యగారిలాగా గాలిని కోస్తూ మాట్లాడటం, తల అటూ ఇటూ తాడిస్తూ చెప్పిందే చెప్పటం చూడటానికి చికాకుగా ఉంటాయి.

చదువరి said...

ఓహోహో! సుధాకర్ గారూ, భలే యాడ్ చూపించారు. సిగ్గుమాలిన జర్నలిజాన్ని రోడ్డుకీడ్చిన టీవీ౯.

ఇక నేకెడ్ టీవీ రావడమే మిగిలింది. అదంటూ వస్తే గిస్తే అది రవిప్రకాషు పుణ్యమే కాగలదు. అబ్బు గారు చెప్పినట్టు తనకున్న ’వైయస్, బాబు, చిరు, కేసీయార్ లకి మించిన ప్రజాభిమానా’న్ని నిలబెట్టుకునేందుకు ఆయన చేస్తాడు కూడా! ’ప్రజాభిమానపు’ మత్తు అలాంటిది మరి.

sai said...

in one way wat news maker said is right.y should v always see the negative side of them.they r many positive things and lets appriciate them

katta jayaprakash said...

TV9 proved that PERUGUTA VIRUGUTA KORAKE.I have stopped viewing this channel due to it's unproffessional attitude.It has no media SAMSKRUTHI that's why it's SAMSKRUTHI channel was closed within a short period.
JP.

శ్రీనివాస్ said...

సుధాకర్ గారు , చదువరి గారు ఆ యాడ్ లో ఉన్న సుజి కింది పోటోలో ఉన్న సుజి... ఒక యాక్సిడెంట్ లో తన కాళ్ళు పోగొట్టుకున్న సుజి గురించి ఆ యాడ్ ఇచ్చారు .... జనాలు వేరేలా అర్ధం చేసుకుంటున్నారు.

http://picasaweb.google.co.uk/sahaayafoundation412/HrudayaSpandanaGr8AchievementOfSahaaya#5280651750073951378

శ్రీనివాస్ said...

btw ఆ మైక్ పట్టుకుని మాట్లాడుతుంది నేనే .. కృష్ణుడు... విజయానంద్, కమల్ కామరాజు , శేఖర్ లను కూడా చూడవచ్చు.

Unknown said...

ఇక బ్లాగర్ స్పందించాల్సిన సమయం వచ్చింది.సుజి ఎవరు? ఆమెను టీవీనైన్ ఎందుకు ప్రోత్సహిస్తోంది? ఇక్కడ ఏదో రహస్యం ఉంది. చెప్పండి.. ప్లీజ్..
అబ్బు, హైదరాబాద్

seenu said...

hello viewers...
regarding suzi,she was a former singareni employee' daughter,once lived in Bellampalli of Adilabad.she faced a serious accident while they were going shirdi tour...she is unable move her lower body...and need support for every moment. her story published all most every journal.she suffered much and recovered by her own will power.she designs home furnishings and won international awards too..once she came to tv9 for live...and raviprakash offered her to anchor any her own concept.she agreed and doing celebrity interviews...to encourage her much publicity given through hoardings...and the celebs whom she interviews are so generous and cooperating her. she cannot move...there is lot of pain behind her smile...thats why she called beutifull anchor of the world...
suzy is really beutifull... aint she? pl dont pull her instead support and encourage others like suzy...they may atleast smile in some times...(sorry suzi...infact she may not like this posting about her...)
ds

seenu said...

hello viewers...
regarding suzi,she was a former singareni employee' daughter,once lived in Bellampalli of Adilabad.she faced a serious accident while they were going shirdi tour...she is unable move her lower body...and need support for every moment. her story published all most every journal.she suffered much and recovered by her own will power.she designs home furnishings and won international awards too..once she came to tv9 for live...and raviprakash offered her to anchor any her own concept.she agreed and doing celebrity interviews...to encourage her much publicity given through hoardings...and the celebs whom she interviews are so generous and cooperating her. she cannot move...there is lot of pain behind her smile...thats why she called beutifull anchor of the world...
suzy is really beutifull... aint she? pl dont pull her instead support and encourage others like suzy...they may atleast smile in some times...(sorry suzi...infact she may not like this posting about her...)
ds

చదువరి said...

ఆ ప్రకటన ద్వారా టీవీ9 కనబరుస్తున్న వ్యాపారతత్వం పట్ల, రవిప్రకాషు ప్రచారధోరణి పట్లా నిరసనగా పై వ్యాఖ్య రాసాను -ఆ టీవీ సంస్కృతి తెలుసు కాబట్టి.

అయితే, అసలువిషయం ముందే తెలిసి ఉంటే అంత కటువుగా రాసి ఉండేవాణ్ణి కాదు.

Sudhakar said...

సుజి విషయం మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఆ ప్రకటన అలా ఎందుకు ఇవ్వాలి ? ప్రతీ దానిని కవ్వించి మరీ కాష్ చేసుకోవాలా? ఇలాంటి మానవ సంబంధిత విషయాలను కూడానా? అదే యాడ్ ను సూటిగా రాయటానికి బాధ ఏమిటో నాకర్ధం కాలేదు. అవసరం లేనిచోట నోయిస్ చెయ్యటం ఈ ఛానళ్లకే చెల్లింది. హృదయ విదారక బాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపించటం వగైరాలు.

సుజి తొందరగా కోలుకోవాలని, ఆమెకు మెరుగైన సమాజాన్ని ఇవ్వక పోయినా, మెరుగైన జీవితాన్ని మీడియా ఇస్తుందని ఆశిస్తున్నాను.

శరత్ కాలమ్ said...

ఛానళ్ళల్లో అందమయిన, చాలా అందమయిన వ్యాఖ్యాతలు మనకెందుకు లెండి. సన్నాసులం కదా. మన మనస్సు చలించకుండా, స్ఖలించకుండా అనాకారులను మాత్రమే ఏంకర్లుగా పెట్టాలని రవి ప్రకాశ ను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు చూచువారికి చూడముచ్చటగా వుంటుంది. అయినా మనకు వార్తలు ముఖ్యం కానీ, మొఖాలు ముఖ్యమా చెప్పండి. అమాత్రం దానికి టివి లు ఎందుకంటారూ. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఆల్ ఇండియా రేడియో వార్తలు వింటే ఈ అందమయిన బాధలు వుండవు కదా. ఫోటో అంటే ఏదో బూతు ఫోటోలా వుంటుదేమో అనుకొని ఆఫీసులో బిక్కు బిక్కుమనుకుంటూ తెరిచిచూసాను. తుస్సుమనిపించారు కదా. నిజవే. అత్యంత అందవికారమయిన ఏంకర్ల గురించి ప్రచారం చేయాలి కానీ అందమయిన ఏంకర్లని గురించి ప్రచారం చేస్తే ఎలా? హన్నా. తప్పు కాదూ. మనస్సు మూసుకోవాలంటే కష్టం కదా.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి