Friday, April 23, 2010

'ఆంధ్రజ్యోతి'పై...'సూర్య'ప్రతాపం: అక్షర యుద్ధం

"నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష..." అన్నట్లు ఉంది 'ఆంధ్రజ్యోతి' పై 'సూర్య' పత్రిక చేసిన ఎదురు దాడి. ఇది... "నువ్వు గులక రాయి వేస్తే...నేను బాంబు వేస్తా"... అన్నట్లు ఉంది. వేమూరి రాధాకృష్ణ గారు తమకు సరిపడని వారిపై అడ్డ దిడ్డంగా అక్షర బాణాలు వదులుతారు, వాక్యాలతో ఉరి వేస్తారు, శీర్షికలతో గొంతు కోస్తారు, ఫోటోలు-కార్టూన్లతో ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ఇప్పుడు నూకారపు వారు యథాతథంగా ఆ విద్యనే వేమూరి వారిపై ప్రదర్శించి...తెలుగు నాట జర్నలిజం ఎంతగా దిగజారిందో చూపించారు.... 'సూర్య' పత్రికలో. 

ఒక సెటిల్ మెంట్ లో భాగంగా...కాళేశ్వర్ బాబా మనిషి...'సూర్య' అధిపతి నూకారపు సూర్యప్రకాశ రావుతో చేసిన సంభాషణను 'ఆంధ్రజ్యోతి' పేపర్ మొన్న 'మీడియా మాఫియా' శీర్షికన వేసింది, ఆ పత్రిక ఛానల్ కూడా సూర్య ప్రతాపాన్ని దునుమాడింది. జర్నలిజం ఎంతగా దిగజారిందో అని 'ఆంధ్రజ్యోతి' చాలా బాధపడిపొయ్యింది.


దీనికి స్పందిస్తూ....'సూర్య' చెలరేగిపోయింది. మొదటి పేజీ లో సింహభాగం వేమూరిని బద్నాం చేయడానికి కేటాయించారు. మూడు పెద్ద స్టోరీలు వేసారు. వాటి శీర్షికలు: 
1) బడుగుల బడబాగ్ని: అది 'అంధ'జ్యోతి 
2) వక్రభాషల అక్రమార్కుడిపై సూర్యాగ్ని 
3) బడుగుల పత్రికపై అగ్రకుల విషం 


"బాబా ముసుగులో కాళేశ్వర్‌ చేస్తున్న ఆగడాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చిన ‘సూర్య’ దిన పత్రికపై అగ్రవర్ణాలకు చెందిన ఆంధ్రజ్యోతి కుట్రపూరిత కథనాలు ప్రచురించడం పట్ల బడుగులు భగ్గుమంటున్నారు. ‘సూర్య’ చైర్మన్‌పై ఆంధ్రజ్యోతి ప్రచురిం చిన కథనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏకమవుతున్నారు. ఆంధ్రజ్యోతి ప్రతులను తగలబెట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు," అని రాసారు. "తమ అభిమాన పత్రిక ‘సూర్య’ అధిపతి నూకారపు సూర్యప్రకాశరావుపై ఆంధ్రజ్యోతి పత్రిక బురద చల్లడాన్ని బడుగులు సహించలేకపోయారు," అని వివరించారు. ఒక విషయానికి కావలసినంత ట్విస్టు ఇవ్వడం ఎలాగో నేర్చుకోవచ్చు ఇక్కడ. 

'సూర్య' ప్రచురించిన ఒక వార్త లీడ్ ఇలా వుంది:
"బీసీలు పత్రికలు పెట్టడమే నేరమా?.. సమాజంలో 85 శాతం ఉన్న బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలపై గర్జించడమే పాపమా? కేవలం 15 శాతం ఉన్న అగ్రకులాల దాష్టీకాన్ని ప్రశ్నించడమే తప్పిదమా? బడుగుల బాధలకు అక్షర రూపం ఇచ్చి, బడుగుల ముందు వాటిని ఆవిష్కరించడమే ‘సూర్య’ చేసిన తప్పిదమా? పత్రికలు కేవలం 5 శాతం ఉన్న కమ్మ-రెడ్డి వర్గం చేతిలోనే శాశ్వతంగా ఉండాలా? శతాబ్దాల పత్రికా చరిత్రలో బడుగు వర్గాల కోసం ఒక బీసీ పత్రిక పెడితే, దాన్ని భూస్థాపితం చేసేందుకు ఇన్ని కుట్రలా? అంటే రాష్ట్రంలో అగ్రకులాలకే మీడియా సంస్థలు ఉండాలా? బీసీలకు ఒక్కగానొక్క పత్రిక ఉంటే దానినీ అణగదొక్కేదాకా నిద్రపోరా? గత కొద్దికాలం నుంచి ‘ఆంధ్రజ్యోతి’-ఏబిఎన్‌ ఛానల్‌ యజమాని వేమూరి రాధాకృష్ణ ‘సూర్య’ దినపత్రికపై విషం చిమ్ముతున్న వైనం పరిశీలిస్తే బడుగు, బలహీన వర్గాల్లో వస్తున్న అనుమానాలే ఇవి." బీ.సీ.లకు ఆ వార్తకు ఏమిటి సంబంధం? అన్న అనుమానం రావచ్చు...'కొడితే ఇలాగే కొట్టాలి...' అని వేమూరి వంటి జర్నలిస్టులు జనాలకు నేర్పేసారు.


వేమూరి పై ఆరోపణలు చేస్తూ....."సూర్య’పై విషం చిమ్ముతున్న రాధాకృష్ణ రెండో వేలయిన ఏబిఎన్‌ ఛానల్‌ ఇటీవల హైదరాబాద్‌ నగరంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న జ్యుయలరీ కంపెనీపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఆ తర్వాత దానిని ప్రసారం చేయకుండా సదరు కంపెనీతో సెటిల్‌మెంట్‌ చేసుకున్న విషయం మీడియా వర్గాల్లో గుప్పుమంటోంది. అదేవిధంగా సింగరేణి గనుల్లో స్క్రాప్‌ అమ్మకాల విషయంలో కూడా ‘ఆంధ్రజ్యోతి’ బ్రోకర్లు సాగించిన బేరాల్లో విజయవంతమయ్యారని తెలుస్తోంది," అని ప్రచురించింది. 

పైగా..."టీవీ ఛానెల్స్ పై ఆంధ్రజ్యోతి కుట్ర" శీర్షికన ఒక చిన్న బిట్ వేసి...ఆసక్తి కరమైన ఈ వార్తాకథనం రేపు చదవమని సూర్య మొదటి పేజీలో చెప్పింది. 

ఇప్పటికే మసకబారిన తెలుగు జర్నలిజాన్ని ఈ ఆరోపణలు మరింతగా పలచన పడేలా చేస్తున్నాయి. మీడియా బలం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. కనీస మర్యాద లేకుండా...దాడి చేస్తే...చిరంజీవి లా కిమ్మనకుండా ఉండడానికి నూకారపు మామూలు మనిషా? ఒక పత్రికాధిపతి. విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ...ఆయన మొత్తం వ్యవహారానికి విజయవంతంగా కులం రంగు పులిమారు. విలువలు లేని మనుషుల చేతిలో మీడియా ఉంటే...ఎంత ప్రమాదమో....ఇప్పుడు జరుగుతున్న అక్షర యుద్ధం ప్రత్యక్ష సాక్షం.

15 comments:

Anonymous said...

ఆంధ్రదేశంలో అగ్రకులాల జనాభా 27 శాతానికి తగ్గదు. ఎందుకిలా వాళ్ళని 15 శాతానికి తగ్గించి చూపుతోంది సదరు సోకాల్డ్ బడుగు దినపత్రిక ? 1931 నాటి జనాభా లెక్కల ప్రకారం-

బ్రాహ్మణులు - 3 శాతం
వైశ్యులు - 3 శాతం
క్షత్రియులు - 2 శాతం మీద కొంచెం ఎక్కువ
రెడ్లు (మెయిన్ స్ట్రీమ్) - 8 శాతం
కమ్మలు - 4 శాతం
కాపులు - 4 శాతం మీద కొంచెం ఎక్కువ
వెలమలు - 2 శాతం మీద కొంచెం ఎక్కువ
మొత్తం = సుమారు 27 శాతం

అంటే ప్రస్తుత రాష్ట్ర జనాభాలో రెండుకోట్ల ముప్ఫై అయిదు లక్షల మంది అగ్రకులాల ప్రజలున్నారు. ఇంకా వీరిలో ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చి స్థిరపడిన రాజ్‌పుట్ లాంటి కులాల్ని కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటుంది అగ్రకుల జనాభా.

విషయం సరిగా తెలుసుకుని మాట్లాడాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులూ, వారి పత్రికలూ !

Anonymous said...

aavnu ..mana state lo oc lu chla ekkuva migata states tho polchukuuntae ...

BC lo about 50 or less than 50 vuntaru ...i guess muslims close 9 or 10 mala madiga together easy ga 15 percent ..
ivanni kalupu kunte bcs less than 50 .

Anonymous said...

TV channels ratings ekkada chustaru ...

Presnet top list ivvandi ..

can sakshi ever improve its rating from 5 to 2or 3.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఎనోనిమస్ గారూ భలే చెప్పారు.ఎవడో ఒకడు బీసీ కులం వాడు పెట్టిన పత్రిక సమాజంలో అందరు బడుగు బలహీన మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తుందా?అ పత్రికని కేవలం వాడి కులపోళ్ళే కొంటున్నారా?చెత్త నా కొడుకులు ప్రతిదానికీ కులం రంగే?ఎప్పుడు బాగుపడుతుందీ ఈ దేశం?

RAM SHANKAR said...

ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కులాల percentage గూర్చి కాదు,ఐనా 1930 నాటి లెక్కలుకి ఇప్పుడు లేక్కలుకి చాల తేడా వుంటుంది, ఎందుకంటే నిమ్నవర్గాలలో కుటుంబనియత్రణ తక్కువ.అగ్ర వర్ణాలలో అది చాల ఎక్కువ.సరే అసలు విషయానికి వద్దాం.ఆంధ్రజోతి పత్రికలో అబద్దాలే ఎక్కువ.ఇక చానెల్ గూర్చి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది,ఫ్యామిలీ తో abn చానెల్ చూడడం కష్టం. ఐనా ఈ విషయం లో abnఆంధ్రజోతి వార్తలు నిజం అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ ఇక్కడ నాన్నా పులి కధ మనం గుర్తు చేసుకోవాలి
ఎందుకంటే ఆంధ్రజోతి వార్తలలో సత్యం పాళ్ళు చాల తక్కువ, సొంత కూర్పు ఎక్కువ.ఏది ఏమైనా మీడియా మాఫియా ఎంత దారుణంగా ఉందో మన అందరికి తెలియచెప్పిన రాధా కృష్ణ కి మరియు నూకారపు సుర్యప్రకాస రావు కి ధన్యవాదములు.

VARA said...

కనీస మర్యాద లేకుండా...దాడి చేస్తే...చిరంజీవి లా కిమ్మనకుండా ఉండడానికి నూకారపు మామూలు మనిషా?

Idi super.....

Chiranjeevi antha clam gaa ...manchi gaa vundaru gaa anadarooo...Chiru ee roju politics ki pani ki raadu......nookaarapu lo kaneesam 10% raajakeeya lakshnaalinaa vundalai....

Anonymous said...

abba, katha chaala rasapattulo padindannamaata... telugu prajalu entha adrutam chesukunnaru

Anonymous said...

abba, katha chaala rasapattulo padindannamaata... telugu prajalu entha adrutam chesukunnaru

Srikanth said...

ఇది కూడా ఒకవంతు మంచికే. వాళ్ళిద్దరూ ఇలా పరస్పర ఆరోపణలు చేసుకోవడం వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారు.

సర్, మీడియా పెడధోరనులపై గెట్ వెల్ సూన్ లాంటి ఓ ర్యాలి ఆలోచించండి.

Anonymous said...

"చిరంజీవి లా కిమ్మనకుండా ఉండడానికి " చ్చా చిరు కిమ్మనకుండా ఉన్నాడా మీడియా ఉద్దీపకులూ?

Anonymous said...

1931 తరువాత మళ్ళీ కులాలవారీ జనాభాలెక్కలు తీయడం జరగలేదు. అందుచేత అప్పటి శాతాల మీద ఆధారపడాల్సి వస్తోంది. కుటుంబ నియంత్రణని ఆంధ్రదేశంలో ఇప్పుడు అందరూ పాటిస్తూనే ఉన్నారు కనుక పైన పేర్కొన్న అగ్రకులశాతాల్లో పెద్దగా మార్పుంటుందని అనుకోను.

Anonymous said...

Suryaa is a clear loser in the war with Andhra Jyothy. It is better for Surya to shut up to avoid getting further 'naked'.

Anonymous said...

andhra jyothi gurinchi yantha thakkuva cheppukunte antha manchidi.
ABN ante
A - ANDHRA
B - BUTHU
N - NETWORK

Anonymous said...

andhra jyothi gurinchi yantha thakkuva cheppukunte antha manchidi.
ABN ante
A - ANDHRA
B - BUTHU
N - NETWORK

Anonymous said...

ABN ante
A - ANDHRA
B - BUTHU
N - NETWORK

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి