తెలుగు టెలివిజన్ లో తనకంటూ భయంకరమైన డిమాండ్ సృష్టించుకున్న రాజశేఖర్ కపిల్ గ్రూప్ వారి హెచ్ ఎం టీవీ ని వీడి నరేంద్ర చౌదరి గారి ఎన్-టీవీ లోకి పునఃప్రవేశం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చౌదరి గారు ఆయనకు ఏ పదవి ఇస్తారో వేచి చూడాలి.
ఇప్పటికే హెచ్ ఎం టీవీ లో రాజశేఖర్ అకౌంట్స్ సెటిల్మెంట్ కార్యక్రమం ఆరంభమయ్యిందని, డిసెంబర్ ఒకటి, రెండు వారాల్లో చౌదరి గారి పక్కన ఆయన ఉంటారని తెలిసింది.
రాజశేఖర్ సంగతి ఎలా ఉన్నా... కపిల్ గ్రూపు వామన రావు గారి ని చూస్తే... అయ్యో అనిపిస్తున్నది. గుండె నిండా నమ్మిన రామచంద్ర మూర్తి గారు ఆ ఛానల్ ను, 'ది హిందూ' స్థాయిలో నడపాలని ఆయన మొదలు పెట్టిన 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రికను వదిలి వెళ్లి పోయారు. అంతకుముందు, ఆ తర్వాత మీడియా దేవుడు గా, ఆపద్భాందవుడిగా తానూ భావించిన రాజశేఖర్ విరాట్ స్వరూపం ఆయనకు తెలిసి వచ్చింది.
బాక్ అప్ చర్యల్లో భాగంగా 6 టీవీ నుంచి వెంకట కృష్ణ ను తెచ్చుకోవడం గుడ్డిలో మెల్ల. "గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక జరుగుతున్న 'ఆపరేషన్స్' విష్ణు సిమెంట్స్, పీ వీ పీ సాక్షిగా వామనుడికి తెలిసిపోయాయట. బాబూ... ఇన్ని చిలిపి చేష్టలు చేసే నిన్ను నమ్మడం ఎలా?," అని అడిగారని అబ్రకదబ్ర ఇచ్చిన సమాచారం. అంత సాత్వికుడైన వామన రావు గారికి... జర్నలిజం మీద, ఎడిటర్ల మీద, మనుషుల మీద పరమ అసహ్యం కలిగే పరిస్థితి ఏర్పడిన్దన్నది నగ్న సత్యం. వామనుడికి చేదైనది... నరేంద్రుడికి తీపి కావడమే ఆథ్యాత్మిక పరమ రహస్యం. అదే రాజశేఖర్ గొప్పతనం.
అయితే, బ్రదర్... మీరు ఎన్ టీవీ కి వెళుతున్నట్లు తెలిసింది. నిజమేనా? అని అడిగితే... లేదని రాజశేఖర్ మెయిల్ లో సమాధానమిచ్చారు. వామన రావు గారికి, రాజశేఖర్ గారికి, నరేంద్ర నాథ్ చౌదరి గారికి మేలు జరుగు గాక!