హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం చాలా కోలాహలంగా జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వివిధ ప్యానెల్స్ కు చెందిన జర్నలిస్టులను ఆచి తూచి ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా మాజీ సహచారుడు, మృదు స్వభావి రవికాంత్ రెడ్డి (ది హిందూ), సెక్రటరీ గా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు రాజమౌళి చారి (మాజీ ఈనాడు, జీ టీవీ) ఎన్నికయ్యారు.
వీరిలో రాజమౌళి (కింది ఫోటో) గత బాడీ లో జాయింట్ సెక్రటరీ గా పనిచేయగా, రవికాంత్ (ఈ పక్క ఫోటో) ఈ సీ మెంబర్ గా ఉన్నారు. మా కొత్తగూడెం అమ్మాయి సీ వనజ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికల ప్రచారం హోరెత్తింది. నేను ఓటు వేసిన వాళ్ళే చాలా మంది గెలవడం ఆనందం కలిగించింది.
విజేతలకు... ఆటుపోట్లు, అవాంతరాల మధ్య అలుగుతూనే ఎన్నికల క్రతువు ముగించిన రిటర్నింగ్ ఆఫీసర్ బండారు శ్రీనివాస రావు గారికి అభినందనలు.
ఓటు వేయడానికి నిన్న సాయంత్రం ప్రెస్ క్లబ్ లోకి వెళ్లినప్పటి నుంచి ఓటు వేసే వరకు నాకు ఒక ముఫ్ఫై మంది కరచాలనం చేయడమో, కౌగలించుకోవడమో చేసారు. ఓటు పడ్డాక ఒక్కడంటే ఒక్కడూ పలకరించ లేదు. వివిధ టీవీ లలో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళను కలిసి సానుభూతి తెలిపి బైటపడ్డాను. ఎప్పుడూ సొడ్డు మాటలు మాట్లాడే కొందరు మాజీలను కలిసే భాగ్యం కూడా ఈ ఎన్నికల మూలంగా కలిగింది. ఈ సారి ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడాలని ముందుగా అనుకున్నారు గానీ, చివరకు రంగు కాగితాలతోనే కథ నడిచింది. జర్నలిస్టుల సంఘాలను, ప్రెస్ క్లబ్ ను ఒకటి, రెండు ముఠా లు వాడుకోవడం ఇప్పటి దాకా జరిగింది. మంచి మార్పునకు ఇదొక నాంది కావాలని కోరుకునే వారే అధికం.
తాగుబోతులకు మాత్రమే స్వర్గ ధామంగా మారిన ప్రెస్ క్లబ్ పధ్ధతి మార్చి, మెంబర్స్-వారి కుటుంబ సభ్యుల క్రీడల కోసం, మానసిక ఉల్లాసం కోసం ఈ అద్భుతమైన ప్రెమిసెస్ ను కొత్త బాడీ వాడుకుంటుందని నమ్ముతున్నాం. ఆల్ ద బెస్ట్. సీనియర్ జర్నలిస్టు, డాక్యుమెంటరీ మేకర్, యాంకర్, కొత్త వైస్ ప్రెసిడెంట్ వనజ ఫోటో ఇది.
కొత్త బాడీ...

PRESIDENT- R. RAVIKANTH REDDY (THE HINDU)
VICE PRESIDENT- C. VANAJA (FREELANCER)
SECRETARY- B. RAJAMOULI CHARY (senior journalist)
JOINT SECRETARY- NEMANI BHASKAR (NTV)
TREASURER- P.V. SRINIVASA RAO (T NEWS)
EXECUTIVE MEMBERS:
M. KALYAN CHAKRAVARTHY (SAKSHI)
B. DASARATH REDDY (BUSINESS STANDARD)
DUGGU RAGHU (FREELANCER)
P. GAYATRI (FREELANCER)
KAMBALAPALLY KRISHNA (6 TV)
MARAM SRINIVAS (ANDHRA PRABHA)