దొంగలు..అదో ఘనకార్యం లాగా టీవీ చానెల్స్ ను ఆశ్రయించడం ఇప్పుడు తెలుగు దేశంలో ఒక కొత్త ట్రెండ్. దొంగోడి లైవ్ షో చేయడం చానెల్స్ కూడా ఘనకార్యం లాగా భావించడం కూడా చూస్తున్నాం.
దొంగతనం చేసినోడు...నేరుగా టీవీ స్టూడియోకి వచ్చి..తానే దొంగనని దర్జాగా చెప్పడం..సారు గారిని ఆ ఛానెల్ వాళ్ళు ఇంటర్వ్యు ప్రత్యక్ష ప్రసారంలో చూపించి...పోలీసులను ఎర్రి పప్పలను చేయడం గత మూడు రోజుల్లో రెండు సార్లు జరిగింది.
తనిష్క్ ను తనవి తీరా దోచుకున్న దొంగల్లో ఒకడు టీవీ-9 దగ్గరకు, ఇంకొకడు ఎన్ టీవీ దగ్గరకు వెళ్లి...దొంగగా తనను తాను పరిచయం చేసుకుని...చేసిన ఘనకార్యం వివరించి...లైవ్ లో జాతి జనులను ఉద్దేశించి ప్రసంగించడం...వారికి యాంకర్లు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించడం చూసాం.
తెలుగు దేశం నాయకుడు పరిటాల రవిని మర్డర్ చేసిన మొద్దు శ్రీను కోసం పోలీసులు గాలిస్తుండగా...
ఆయన టీవీ-9 కు ఇచ్చిన ఇంటర్వ్యూ అప్పట్లో సంచలనం సృష్టించడం గుర్తుకు వస్తున్నది. పోలీసులకు దొరక్కుండానే..హైదరాబాద్ లో ఒక లాడ్జిలో బాంబు తయారుచేస్తూ సదరు శ్రీను దొరికి పోయి...జైల్లో హత్యకు గురయ్యాడు.
ఇలా దొంగోళ్ళు స్టూడియోలకు వెళ్ళడం, వారిని చానెల్స్ యజమాన్లు 'మనోడే... మన బాపతోడే' అని అనుకోవడం కరెక్టేనా? మీకేమనిపిస్తున్నది?