రోడ్లకు అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ వాడివీ వీడివీ విగ్రహాలు ప్రతిష్టించడం ఇప్పుడు రివాజుగా మారింది. ఈ క్రమంలో గల్లీ లీడర్లు, ఖూనీకోర్లు, బడాచోర్లు కూడా చచ్చీ చావగానే విగ్రహాలై కూర్చుంటున్నారు. మరి విగ్రహాల మీద మంటనో, మతి స్థిమితం లేకనో నిన్న లండన్ నడిబొడ్డున ఒక మధ్య వయస్కుడు బట్టలు తీసేసి ఒక ముప్పై అడుగుల విగ్రహం మీదకు ఎక్కి కూర్చోవడం, రకరకాల ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం సంచలనం కలిగించింది.
సెంట్రల్ లండన్ లో బిజీగా ఉండే కూడలిలో కేంబ్రిడ్జ్ యువ రాజు జార్జ్ విగ్రహాన్ని నగ్నంగా దర్జాగా ఎక్కాడు. చరిత్రాత్మకమైన ట్రఫాల్గర్ స్క్వేర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్ళే మధ్యలో ఉండే ఈ ప్రాంతం చుట్టూ చాలా ప్రభుత్వ భవనాలు వుంటాయి. బట్టలతో విగ్రహాన్ని ఎక్కి....తర్వాత ఒకొక్కటి పీకి పారేసి అంత చలిలోనూ దాదాపు మూడు గంటల పాటు అక్కడ ఉన్నాడని పోలీసులు చెప్పారు. 'మెంటల్ యాక్ట్' కింద అరెస్టు అయిన ఆయన అసలు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో తెలియరాలేదు. చెట్లు నరకొద్దని చిప్కో ఉద్యమంలో కార్యకర్తలు చెట్లను కౌగలించుకుని నిలబడేవారట. రోడ్ల మీద ప్రతి అమాంబాపతు గాడి విగ్రహాలు పెట్టకండ్రా...అని ఏలికలకు సిగ్గు వచ్చేలా ఎలుగెత్తి చాటేందుకు మన నగ్న బాబు చేసినట్లు చేస్తే! అన్న మా అబ్రకదబ్ర ఆలోచన గురించి ఆదివారం పూట ఒకసారి ఆలోచించండి.
Photo courtesy: http://www.huffingtonpost.co.uk