మిత్రులందరికీ.... నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మిగిలిన బ్లాగర్లు ఎట్లా మ్యానేజ్ చేస్తున్నారో తెలియదు కానీ, క్రమం తప్పకుండా పోస్టులు రాయడం చాలా కష్టమండీ! దానికి చాలా దృఢ సంకల్పం, సమయం, తీట అవసరం. నాకైతే కాస్తంత అర్థవంతమైన పోస్టులు రాద్దామంటే కుదరడం లేదు, మాల్ మసాలా బుర్రను తొలుస్తున్నా.
ఈ మధ్యన ఒక పనిమీద హోరా నుంచి ఖరగ్పూర్ రైల్లో వెళ్ళినప్పుడు... ఎందుకో గానీ... ఈ బ్లాగ్ ఎందుకు నడపడం లేదు మనం? అన్న ప్రశ్న చాలా సేపు తొలిచింది. మీడియా, దాని పోకడ, తీరు తెన్నులు, ఇక్కడ రాజ్యమేలుతున్న మేథావులు, వారి ఘన కార్యాలు, చాటుమాటు కార్యక్రమాలు... వీటి గురించి రాయడానికి చాలా వున్నాయి. మనకెందుకు వచ్చిన గొడవ? 'సత్యమే వ జయతే..' అన్న దుర్భ్రమతో మనం చిత్తశుద్ధితో రాయడం, నచ్చిన కొందరు వ్వావ్వా అంటే మనం భుజాలు చరుచుకోవడం, ఈ క్రమంలో శత్రువులను పెంచుకోవడం దేనికి? అనిపించి కొంత వెనకడుగు వేసిన మాట వాస్తవమే.
ఈ రైలు ప్రయాణంలో ఎదురైన కొన్ని అనుభవాలను రాసుకుంటే బాగుండు కదా... టైటిల్ తో సంబంధం లేకపోయినా అని అనిపించింది. పైగా, ఆఫీసులో ఇంగ్లిష్ మాత్రమే డీల్ చేస్తుండడం వల్ల... రాయకపోవడం వల్ల కొద్దో గొప్పో నాలుగు వాక్యాలు రాసేలా వచ్చిన తెలుగు కాస్త పోతుందనే భయం వల్ల... ఇకనుంచి బ్లాగు కోసం రాద్దామన్న అభిప్రాయం దృఢ పడింది. అందుకే... ఈ పోస్టు. చూద్దాం-ఈ సోకు ఎన్నాళ్ళో.
మీకు, మీ కుటుంబ సభ్యులకు, అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా అంతా శుభం కలగాలని కోరుకుంటాము.