136 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో నాణ్యమైన జర్నలిజానికి నికార్సైన పేరని అనుకునే 'ది హిందూ' పత్రిక యాజమాన్యం (కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్-కె. ఎస్. ఎల్. ) మొట్టమొదటి సారిగా ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. జర్నలిస్టుల వేతన సంఘం సిఫార్సులు, తమిళ భాషలో ఎడిషన్ పెట్టిన దరిమిలా వచ్చిన నష్టాల నేపథ్యంలో యాజమాన్యం ఈ ప్రకటన చేసినట్లు సమాచారం.
నలభై సంవత్సరాలకు పై బడిన వయస్సు ఉండి, పత్రికలో పదేళ్లకు మించిన అనుభవం ఉన్నవారిని ఉద్దేశించి ఈ పథకం ప్రకటించినట్లు 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక ఈ రోజు ఒక వ్యాసం ప్రచురించింది. అయితే తమకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు ఈ బ్లాగ్ బృందానికి చెప్పారు. ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలతో పాటు చాలా ఉదారంగా ప్యాకేజ్ ఉంటుందని, ఇండస్ట్రీ లో అత్యుత్తమంగా ఉండేలా చూసామని యాజమాన్యం ప్రకటించింది. అయితే... ఎంత మొత్తం ఇస్తారో స్పష్టంగా చెప్పలేదు.
2008 లో 230 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించిన కె ఎస్ ఎల్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వేతన సంఘం సిఫార్సులు అమలు చేయడం మొదలు పెట్టడంతో లాభాల్లో ఏడాదికి నలభై కోట్ల మేర కోత పడింది. ఈ లోపు 2013 లో తమిళంలో పత్రికను ఆరంభించి చేతులు కాల్చుకుంది. 2013-14 లో దాదాపు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చినా... నష్టం 64 కోట్లుగా చూపిందని 'బిజినెస్ స్టాండర్డ్' కథనం.