మొన్నీ మధ్యన మేము చెన్నై వెళ్ళినప్పుడు 'ది హిందూ' సీనియర్ జర్నలిస్టు ఒకరు ఒక మాట అన్నారు: "మా ఈ ఎడిటర్ (మాలినీ పార్థసారధి) ఎప్పుడు ఎవర్ని ఆకాశానికి ఎత్తుతుందో, ఎప్పుడు ఎవర్ని సాగనంపుతుందో చెప్పలేం. అందరం భయపడి చస్తున్నాం... "
అప్పుడు వెంటనే మేము అన్నాం... "మరి ఈ విషయం తెలిసి తెలిసి ఈ శ్రీనివాస రెడ్డి గారు చెన్నై ఎందుకు చేరారు? పులి నోట్లో తలపెట్టడం ఎందుకు?" అని. ఇప్పుడు అనుకున్నంతా అయ్యింది.
యాజమాన్యం (అంటే మేడం నోటి దురుసు) ధోరణి కి విసిగి శ్రీనివాస రెడ్డి గారు నిన్న (సెప్టెంబర్ 9, 2015) రాజీనామా చేసినట్లు అధికారిక సమాచారం. ఈ విషయాన్ని చెన్నై వర్గాలు దృవీకరించాయి. మాలిని గారి ధోరణి (తిట్టడం, నసగడం) నచ్చక శ్రీనివాస రెడ్డి రాజీనామా చేసారని కొందరు అంటుంటే... ఆయన 'నమస్తే తెలంగాణా' ఇంగ్లిష్ పత్రిక చీఫ్ ఎడిటర్ పదవికి వెళుతున్నారని తెలిసి మాలినే రాజీనామా చేయడంగానీ, సెలవు మీద వెళ్ళడం గానీ చేయమని కటువుగా ఆదేశించినట్లు మరొక వర్గం సమాచారం. మొత్తం మీద జనవరి లో 'ది హిందూ' కో-ఆర్డినేటింగ్ ఎడిటర్ గా చెన్నై వెళ్ళిన శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ రాబోతున్నట్లు స్పష్టమయింది.
ఆయన నియామకం గురించి "బోనస్ రాకపాయే... ధోతులు ఆగిపోయే' అన్న శీర్షికతో మేము ఈ బ్లాగులో జనవరిలో రాసిన పోస్టు చదవండి.
శ్రీనివాస రెడ్డి గారు అద్భుతమైన జర్నలిస్టు అని నమ్మే వాళ్ళలో ఈ బ్లాగ్ బృందం ఒకటి. 'ఇది నిజంగా దుర్వార్త. శ్రీనివాస రెడ్డి గారు అద్భుతమైన ప్రొఫెషనల్. అంతకన్నా మంచి మనిషి. నేను ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆయన తో కాస్త సాన్నిహిత్యం ఉండేది. ఆయన పూర్తి స్వేచ్చగా పనిచేసే మరొక అసైన్మెంట్ దొరక్కపోదు," అని ఈ బ్లాగు స్థాపకుల్లో ఒకరైన ఎస్. రాము మా బృందంతో వ్యాఖ్యానించారు. All the best, Sir!
(Note: Photo has been taken from Mr.Srinivasa Reddy's twitter handle.)