తెలుగు టెలివిజన్ ఛానళ్ళు చూడాలంటే ఈ మధ్యన ఇబ్బందిగా ఉంది నాకు. ఛానెళ్ళ యజమానులు భావదారిద్ర్యం తో సతమతమవుతున్నట్లు స్పష్టమవుతున్నది. మంచి ప్రోగ్రాం కోసం రిమోట్ బటన్స్ నొక్కలేక నేనైతే తంటాలు పడుతున్నాను. అందుకే BBC, CNN లతో సెటిల్ అవుతున్నాను.
అర్జంటుగా చంద్రబాబు అధికారంలోకి రావాలని కొన్ని టీ వీ చానెల్స్ ఉవ్విళ్ళూరుతుండగా, ఒకటి జగన్ బాబు భజన, ఒకటి రెండు చానెల్స్ కిరణ్ స్తోత్రం, ఇంకొకటి సత్తిబాబు పొగడ్త నిస్సిగ్గుగా చేస్తున్నాయి. తెలుగు జర్నలిజపు చేగు'వేరా' ఛానెల్ అయితే 'చంద్రయాన్' అనే పేరుతో బాబు గారి బాకా ఊదుతున్నది వీలున్నప్పుడల్లా. స్టూడియో ఎన్, ఈ టీవీ కుడి ఎడమగా అదే పని చేస్తున్నాయి. 'గోపీ' చానెల్స్ బాబు అనుకూల, వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూ జర్నలిజాన్ని బతికిస్తున్నాయి.
ఈ ఛానెల్స్ ఫార్ములా సింపుల్. రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పిన మూడు 'సీ' లే వాటి గాలీ నీరూ ఆహారం. సినిమా క్లిప్పింగ్స్, క్రైం హడావుడి, క్రికెట్ హంగామా లేకుండా వీటికి బతుకు లేదు. అందమైన ముద్దు గుమ్మలతో వాళ్ళ లేటెస్టు సినిమా గురించి స్టూడియోలలో చర్చ ఇప్పుడు నిత్యకర్మ. మీకు అవకాశం ఎలా వచ్చింది? హీరో బాగా చూసుకున్నాడా? మీ మధ్యన కెమిస్ట్రీ కుదిరిందా? డైరెక్టర్ తో మీ అనుభవాలు ఏమిటి? వంటి ప్రశ్నలు వేయడం... తెలుగు వచ్చినా బోడి ఇంగ్లీషులో ఆ భామలు ఒళ్ళు, పళ్ళు కనిపించేలా నవ్వుతూ తుళ్ళుతూ సమాధానాలివ్వడం. మధ్య మధ్యలో కైపు ఎక్కించే క్లిప్పింగ్లు చూపించడం. ఇలా స్టూడియో లో డ్రామా చేసినందుకు చానెల్స్ కు ఆదాయం వస్తున్నది. ఇది ఫస్టు సీ.
క్రైమ్ స్టోరీలను కొందరు భీకరాకృతులతో చెప్పించడం, భయంకరమైన బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దడదడ లాడించడం బుల్లి తెర మీద కామన్. "మీరు చచ్చి పోయాక..." అని తాటికాయంత అక్షరాలతో ఒక స్టోరీ వచ్చింది ఒక చానెల్లో. ఇది రెండో సీ.
ఇక మూడో సీ...క్రికెట్. మ్యాచుల విశ్లేషణలు, ధోనీ సచిన్ ఆదాయాలు వంటివి ఏవైనా స్టోరీ లే. ఇవి కాక ఇంకొక 'డీ' ఉంది. అదే డిస్కషన్. పరిశోధన, లోతైన విశ్లేషణ లేని లౌడ్ స్పీకర్ గాళ్ళు, ఒక ఐదారుగురు బతక నేర్చిన జర్నలిస్టులు కం యూనియన్ నేతలు, ప్రొఫెసర్ హరగోపాల్ లతో చర్చ. చర్చ పేరుతొ జరిగే రచ్చ జనానికి తాత్కాలికంగా కనువిందు కలిగించడం నిజమే అయినా ఏతావాతా వాటి వల్ల సమాజానికి జరిగే ప్రయోజనం దాదాపు శూన్యం. ఒక మోస్తరు సంసార పక్షంగా చర్చ జరిగేది... ఈ టీవీ లో వచ్చే ప్రతిధ్వని, సాక్షిలో వచ్చే లా పాయింట్. మిగిలిన దాదాపు అన్ని చర్చలూ బోరింగు దగ్గర పంచాయితీలే.
ఇవి కాక చానెల్స్ దినాలు కూడా పెడతాయి. అంతర్జాతీయ జల దినం, ఎయిడ్స్ దినం, లవర్స్ దినం....ఇలా దినం ఏదైనా మనోళ్ళు ఒకటి రెండు స్టోరీలు వదలరు. ఇది ఆటలో అరిటిపండు లాగా అన్నమాట. ఎక్కడ చూసినా ఈ సొల్లు వార్తలే ఉండడంతో బ్లాగును అప్ డేట్ కూడా చేయబుద్ధి కాలేదు. అయినా విచిత్రం. మన చానెల్స్ కు జాతీయ స్థాయి లో అవార్డుల పంట పండుతున్నది. టీవీ నైన్ కు ఎనిమిది అవార్డులు వచ్చాయట.
అలాగని అంతా బ్యాడ్ అనుకోవడం కూడా తప్పే. మొన్న 'లవ కుశ' సినిమా మీద దాదాపు అన్ని చానెల్స్ మంచి కథనాలు ప్రసారం చేసాయి. కొన్ని చానెల్స్ కాపీలు మనసుకు హత్తుకున్నాయి. అన్నింటికన్నా 10 టీవీ వాళ్ళు అప్పటి లవుడు, కుశుడు ఏమి చేస్తున్నారో వారిని స్టూడియోకి పిలిపించి ఒక కథనం ప్రసారం చేసారు. అది బాగుంది. జీ టీవీ లో పనిచేసి వచ్చిన యాంకర్ (పేరు గుర్తు లేదు) వారిని ఇంటర్వ్యూ చేసారు.
ఇవ్వాళ ఆదివారం నాడు మరి కాస్త తీరిక దొరికి మార్చి మార్చి టీవీ చానెల్స్ చూస్తె ఒక రెండు కథనాలు నాకు ముడి సరుకు అందించాయి. టీవీ నైన్ లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కుమారుడి మీద ఒక కథనం వచ్చింది. ఇందులో పరిశోధన లేదు, పాడు లేదు. నాలుగు లోకల్ బైట్స్ పెట్టి దంచికొట్టారు. అలా అడ్డంగా రాయడానికీ దమ్ములు ఉండాలి. పొన్నాల మనకొక పది, ఇరవై లక్షలు ఇస్తే... కేవలం ఈ కథనం ఆధారంగా రవి తో సహా ముగ్గురు నలుగురు జర్నలిస్టులను శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపవచ్చు..అని లా లో కొద్దిగా ప్రవేశం ఉన్న 'అబ్రకదబ్ర' అన్నాడు. అయినా... అన్ని వార్తలకు సాక్ష్యాలు కావాలంటే తెలుగు మీడియా ఎట్లా బతకాల?
ఇక ఈ రోజున... 10 టీవీ లో "డాక్టర్ ఫ్రెండ్" అనే ప్రోగ్రాం చూసి నా మతి పోయింది. ఇది శృతి లయ తప్పిన క్రియేటివిటీ కి ఉత్తమమైన ఉదాహరణ. 'ఈగ' ల వల్ల కలిగే నష్టాలు చెప్పడం ఆ డాక్టర్ గారి ఉద్దేశం. దొరికిందిరా సందు... అని...ఎస్ ఎస్ రాజమౌళి గారి 'ఈగ' చిత్రం లో క్లిప్పింగ్ లతో స్టోరీ ఆరంభించారు. డాక్టర్ గారు కూడా సినిమా గురించి వివరిస్తూ స్టోరీ లోకి తీసుకెళ్తారు. రాజమౌళి గారు తొక్కలో ఈగతో చిరులా, జూ. ఎన్టీఆర్ లా, మహేష్ బాబు లా ఎలా డాన్స్ చేయించిందీ ఈ వైద్య కార్యక్రమం లో చూపించారు. దొరికిన సినెమా క్లిప్స్ ను బట్టి కాపీ ని సాగతీసి నానా గందరగోళం సృష్టించారు.
"డాక్టర్ ఫ్రెండ్" ప్రోగ్రాంలో 'ఈగ' సినిమా గోల ఏల? అన్నిది నాకు అంతు చిక్కలేదు. ఇకపోతే... మొన్నీ మధ్యనే ఆరంభమైన ఈ 10 టీవీ ఛానెల్ మొదటి వారం లోనే టాం రేటింగ్ లో ABN, HM-TV వంటి ఛానెల్స్ తలదన్ని ఏడో స్థానం పొందడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. పైన చెప్పుకున్న 3 Cs, 1 D లను తగ్గించి మూసలో కొట్టుకుపోకుండా ఈ ఛానెల్ నిజమైన ప్రత్యామ్నాయం అందించాలని, వచ్చే వారం అన్ని ఛానెల్స్ మెరుగైన కార్యక్రమాలు ప్రసారం చేయాలని అభిలషిస్తూ... ఉంటా.