తప్పును తప్పు అని ఖండించే వారు, ఒప్పును భేష్ అని అభినందించే వారు ఏ సమాజానికైనా చాలా అవసరం. ఒప్పును పొగడకపోయినా పర్వాలేదు కానీ...తప్పును ఖండించకపోతే...పెద్ద ప్రమాదం. తప్పు...తప్పని తెలిసినా మనకెందుకు వచ్చిన గొడవని...పట్టించుకోకపోతే ప్రస్తుతానికి సమాజానికి తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మనకు సమస్య ఎదురవుతుంది. ఎవడి చావు వాడు చస్తాడు...అనే భావన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ Conspiracy of Silence విడనాడడం మనందరి విధి.
చదువుకున్నవాళ్ళు, సంస్కారవంతులు తక్కువగా ఉన్న మనలాంటి దేశంలో స్పందించే హృదయాల అవసరం ఎంతైనా ఉంది. అదీ...స్వప్రయోజనాలు, రాగ ద్వేషాలకు అతీతంగా మంచిని పెంచడమే ధ్యేయంగా ఆ పని చేయడం ముఖ్యం. ఈ పనిచేయాల్సింది...కాస్త చదువుకుని, సంఘం గురించి ఆలోచించే స్వభావం ఉన్న వారు. మనం సకాలంలో స్పందిస్తే...పెను పోకడలను, విపరీత ధోరణులను మొగ్గలోనే తుంచి వేయవచ్చు. ఇందుకు ఉదాహరణ....ఫేస్ బుక్ లో మహిళలను కించపరిచే వారిపై జరుగుతున్న మంచి దాడి.
ఈ ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్క్ ల వాడకంలో చాలా జాగ్రత్తగా వుండాలి. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. గ్రూప్ యాక్టివిటి లకు FB మంచి సాధనం. అలాంటిది దీన్ని సొల్లు కబుర్ల కోసం వాడడం పరిపాటి అయ్యింది, ఇది నిజానికి అనివార్యం.
మామూలుగా మాట్లాడే దానికన్నా భిన్నంగా మనం కంపోజింగ్ సమయంలో స్పందిస్తామని గుర్తించాలి. ముఖాముఖి మాట్లాడుతూ కమ్యూనికేట్ చేసే దానికి, ఫేస్ బుక్ లో చాట్ చేసే దానికి ఉద్వేగం, మనోవికారం వంటి కనిపించని లక్షణాల మూలంగా చాలా తేడా ఉంటుందని నాకు అనుభవంలో తేలింది. మిడి మిడి జ్ఞానం, ఇతరులను ఇంప్రెస్ చేయాలన్న పిచ్చి తపన, మన మేధస్సును ప్రదర్శించాలన్న ఆతృతలతో చాలా మంది మెదడుకు తోచింది కంపోజ్ చేసి దొరికిపోతారు. తాడేపల్లి లలితా సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఇందులో ఏదో కోవకు చెందిన వారే. కాకపొతే...వీళ్ళు ఈ అభ్యాసంలో ముదుర్లు. ఇలాంటి సంస్కార హీనులు ఇంకొక అడుగు ముందుకేసి...తమ చర్యలను సమర్ధించుకుంటారు. ఇది వారి తెలివి తక్కువతనం. ఇలాంటి వారిని కనిపెట్టి ఉతకడం మన బాధ్యతగా పలువురు ఒకే సారి భావించడం మంచి పరిణామం.
ఈ ఫేస్ బుక్ ఉన్మాదం సంగతి ఎన్ టీ వీ జర్నలిస్టు సోదరి ఒకరు చెబితే తెలిసి చూసి ఆశ్చర్య పోయాను. ఈ దరిద్రులు...సిగ్గూ ఎగ్గూ లేకుండా...నోటికొచ్చింది కంపోజ్ చేసారు. ఒక రిసెర్చ్ స్కాలర్ మరింత బరితెగించి వాడికి తెలిసిన ఒక సంఘటనను ఉదహరించగా, ఇంకొకడు తొమ్మిదేళ్ళ అమ్మాయి తన మీద పడిన అంశానికి దురర్ధాలు ఆపాదించి ఆ పాడు చర్చలో పాల్గొన్నాడు. ఇది బాధాకరమైన విషయం. వీళ్ళు చేసిన కొన్ని బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చూస్తే...వీళ్ళు వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను ఎంత కంపుచేసుకుంటూ అదే గొప్పగా బతికేస్తున్నారో కదా అని జాలి కలిగింది. నా వంతుగా వెంటనే ఒక పోస్టు పెట్టాను అందుబాటులో ఉన్న వివరాలతో.
ఈ మొత్తం ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చిన అంశం...ఇతరుల స్పందన. ఎన్నడూ లేనివిధంగా బ్లాగర్లు, మహిళా సంఘాలు, జర్నలిస్టులు అంతా ఈ చెత్త చర్చను రచ్చ చేసారు. దీన్ని ఫేస్ బుక్ లో ఉతికి ఆరేసి, ఒక వార్తగా మలిచి, ప్రెస్ మీట్ పెట్టి హై లైట్ చేసారు. దీంతో గుండె జారిన నిందితులు క్షమాపణలు పంపారు. అందులో అసలు నిందితుడి క్షమాపణ కొవ్వు పట్టినట్లు ఉండడం, అది పోలీసు కేసుగా మారడం అద్భుతమైన పరిణామం. ఈ అంకాన్ని సీరియస్ గా తీసుకుని...వ్యవహరించిన మిత్రులు కత్తి మహేష్, కొండవీటి సత్యవతి, స్వరూప, వనజ, పద్మజ తదితరులకు నా హృదయ పూర్వక అభినందనలు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పలువురి పేర్లు నాకు తెలియవు. వారికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
ప్రభుత్వాలు, పోలీసులు అన్నీ పట్టించుకోవడం కుదరదు. భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా స్పందిస్తే...చాలా పెను పోకడలను నిరోధించవచ్చు. మిత్రులారా...నిజంగా నిన్నటి రోజు ఒక ఆనందదాయకమైన రిపబ్లిక్ డే. పబ్లిక్ రియాక్షన్ స్పష్టంగా, వేగంగా కనిపించిన రోజు. ఇది కొనసాగిద్దాం.