సమాచార సేకరణ, వ్యాప్తి కోసం అహరహం శ్రమించే జర్నలిస్టులు అప్రజాస్వామిక శక్తుల చేతిలో బలవుతున్నారు. వ్యక్తిగత పగ, ఇతరత్రా ద్వేషాలతో 2017లో 67 మంది జర్నలిస్టులను అత్యంత క్రూరంగా అంతమొందించారని 'రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్' సంస్థ ప్రకటించింది.
మొత్తం హతుల్లో 60 శాతం మందిని వ్యక్తిగత కక్షతోనే హతమార్చినట్లు నివేదిక తెలిపింది. మరో 202 మంది జర్నలిస్టులను బెదిరించడం, నిర్భంధించడం జరిగాయని తన వార్షిక నివేదికలో తెలిపింది. మరో 54 మంది పత్రికా విలేకరులను ఉగ్రవాదులు నిర్భంధించారని సంస్థ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. విధుల్లో ఉన్న 26 మంది జర్నలిస్టులు హత్య చేశారు. బాంబుదాడులు, వైమానికదాడుల్లో పదుల సంఖ్యలో జర్నలిస్టులు మృత్యువాత పడ్డారని తెలిపింది. సిరియా, మెక్సికో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్ వంటి అత్యంత ప్రమాదకర దేశాల్లో జర్నలిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి.. వార్తలను ప్రపంచానికి అందిస్తున్నారు. నివేదిక కథనం ప్రకారం... చైనా, వియాత్నం, సిరియా, ఇరాన్లలో జర్నలిస్టులపై విపరీత ఆంక్షలు ఉన్నాయి. ఈ దేశాల్లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయడం అంటే ప్రాణాన్ని పణంగా పెట్టడమేనని సంస్థ పేర్కొంది.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వారు 2017 సంవత్సరంలో జరిగిన హత్యలపై పేర్కొన్న గణాంకాలు ఇలా ఉన్నాయి: