'నమస్తే తెలంగాణా' పత్రిక ఆధ్వర్యంలో రాబోయే ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ గా 'ది హిందూ' లో సుదీర్ఘ కాలం పనిచేసిన శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారమ్. ఆ పత్రిక పేరు 'తెలంగాణా టుడే' అంటున్నారు కానీ దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు.
'ది హిందూ' లో ఒక వెలుగు వెలిగిన శ్రీనివాస రెడ్డి గారు అనూహ్య పరిణామాల మధ్య సెప్టెంబర్ లో ఆ పత్రికకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. రాజీనామా నోటీసుకు ముందు నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు పనిచేసి డిసెంబర్ 15 న ఆయన ది హిందూ నుంచి మర్యాదగా రిలేవ్ అయ్యారు. దానికి సంబంధించి మేము ప్రచురించిన పోస్టు చదవండి.
ఈ కథనం రాస్తున్న సమయానికి శ్రీనివాస రెడ్డి 'నమస్తే తెలంగాణా' బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్ లో బోకే లు, అభినందనలు అందుకుంటున్నారు. సోషల్ నెట్ వర్క్ లు బాగా వాడతారని పేరున్న శ్రీనివాస రెడ్డి గారు ట్వి ట్టర్ లో కొత్త నియామకం గురించి ఇంకా ఏమీ రాయలేదు.
మేము అభిమానించే జర్నలిస్టులలో ఒకరైన శ్రీనివాస రెడ్డి గారు ఒక అద్భుతమైన పత్రికకు జన్మనివ్వాలని... దీనివల్ల పదిమంది మంచి జర్నలిస్టులకు ఉద్యోగాలు దొరకాలని ఆకాంక్షిస్తున్నాం. ఆల్ ద బెస్ట్.. సర్.