కార్టూనిస్ట్ గా అత్యున్నత ప్రమాణాలు సృష్టించిన ప్రముఖ కార్టూనిస్టు, సగటు బడుగు జీవిని (కామన్ మ్యాన్) ను తన కార్టూన్లలో నిత్య అంతర్భాగం చేసిన 94 సంవత్సరాల రాసిపురం కృష్ణస్వామి (ఆర్ కే) లక్ష్మణ్ భారత గణతంత్ర దినోత్సవం రోజు పూణే లో దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో కన్నుమూసారు. ఆయనకు "తెలుగు మీడియా కబుర్లు" బృందం భక్తి శ్రద్ధలతో నివాళులు అర్పిస్తోంది.
యూరినరీ ఇన్ఫెక్షన్ తో నెల రోజుల కిందట ఆసుపత్రిలో చేరిన లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించి వివిధ కీలక శరీర అంగాలు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులకు సునిశితంగా చురకలు అంటించడం లో దిట్ట అయిన లక్ష్మణ్ 'యూ సెడ్ ఇట్' అనే శీర్షికతో ద టైమ్స్ ఆఫ్ ఇండియా లో యాభై ఏళ్ళపాటు పాకెట్ కార్టూన్లు వేసారు. ఎమర్జెన్సీ రోజుల్లో సైతం ఇందిరా గాంధీ మీద కూడా కార్టూన్లు వేసిన ఘనత ఆయనదని చెబుతారు.
మైసూర్ లో తమిళ కుటుంబం లో 1924 లో పుట్టిన లక్ష్మణ్ ముందుగా 'బ్లిట్జ్' లో తరవాత 'ఫ్రీ ప్రెస్ జర్నల్' లో పనిచేసారు. ఆ తర్వాత ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా లో చేరారు. లక్ష్మణ్ కు దక్కని ఆవార్డులు లేవు.
ప్రముఖ నవలా రచయిత ఆర్కే నారాయణ్ తమ్ముడు లక్ష్మణ్.