భారత దేశ చరిత్రలో ఈ రోజు ఒక మరుపురాని, మరిచిపోలేని రోజుగా మిగిలి పోయే అవకాశం అనిపిస్తున్నది. తెలంగాణా రాష్ట్రం పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేట్లున్నది. హైదరాబాద్ ఒక పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తారని గట్టిగా అనిపించేలా పరిణామాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే మనందరి జీవితాల్లో ఇదొక ప్రధాన ఘట్టం. ఒక చారిత్రక పరిణామాన్ని ప్రత్యక్షంగా చూసిన వారమవుతాం.
ఇదొక బిగ్ డే నే కానీ.. ఒక భారమైన రోజు. ఇప్పుడు ఏమి జరిగుతుందో... భవిష్యత్తు ఏమవుతుందో, అంతా సవ్యంగా సాగుతుందో లేదో, మున్ముందు తెలుగు ప్రజలు భారత్-పాకిస్థాన్ జనం మాదిరిగా కొట్టుకు చస్తారో ఏమో అన్న అనుమానాలకు తావిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ పరిస్థితులు దాపురించాయి.
తెలంగాణా నిజంగానే అత్యంత సున్నితమైన అంశం. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అన్ని వాదనలు నిజమే అనిపిస్తాయి. ఒక వేళ తెలంగాణా వస్తే ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో కదా! అనిపిస్తుంది. ఆంధ్ర కు తెలంగాణాకు మధ్యన ఉన్న మా ఖమ్మం జిల్లా పరిస్థితి ఏమిటి? అన్న సందేహం నా బోటి వాళ్లకు కలుగుతుంది. ఒంటి రంగు, ఉన్న డబ్బు, జన్మించిన కులం, పుట్టిన ప్రాంతం... బట్టి మనుషుల గుణగణాలను బేరీజు వేయడం, ముద్ర వేయడం కచ్చితంగా సంకుచితత్వమే కదా!
మా అమ్మా వాళ్ళది ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం. మా నాన్నా వాళ్ళది కృష్ణా జిల్లా తిరువూరు మండలం నెమలి గ్రామం. మా నాన్న ఉద్యోగం మొత్తం ఖమ్మం జిల్లాలో కావడం వల్లనో, నేను గొల్లపూడి లో పుట్టి ఖమ్మం జిల్లాలో పెరగడం వల్లనో, నన్ను వృత్తిలో దారుణంగా ఇబ్బంది పెట్టిన నీచ నికృష్ట దరిద్రులు అంతా ఆంధ్రా ప్రాంతం వారు కావడం వల్లనో, ఒక జర్నలిస్టుగా గ్రౌండ్ రియాలిటీస్ ను దగ్గరి నుంచి చూడడం వల్లనో...నేను తెలంగాణా వాదిని.
హేమ సంగతీ అంతే. వాళ్ళ నాన్న గారు ప్రకాశం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లా కొత్తగూడెం కు ఉద్యోగ రీత్యా వచ్చారు. హేమ పుట్టింది అమ్మమ్మ గారి ఊర్లో అయినా చదివింది పెరిగింది కొత్తగూడెం లో. మా అమ్మాయి ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో పుట్టింది. మా అబ్బాయి తాన తాత ఉద్యోగ రీత్యా ఉన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి లో పుట్టాడు. అమ్మాయి, అబ్బాయి నల్గొండ, హైదరాబాదు లలో పెరిగారు.
రాష్ట్ర విభజన మా నాన్నకు గానీ, మా మామ గారికి గానీ సహజంగానే ఇష్టం ఉండదు. నేను ప్రత్యేక తెలంగాణా గురించి మాట్లాడితే వీళ్ళిద్దరి మొహాల్లో చిరాకు కనిపిస్తుంది. ప్రాంతాల గురించి ఆలోచించకుండా మనసా వాచా కర్మణా ఉద్యోగ ధర్మం నిర్వర్తించి సేవ చేసి పదవీ విరమణ చేసిన తమను ప్రాంతాల వారీగా చూడడం వారికి ఇష్టం ఉండదు. నాకూ, హేమకు, మా అమ్మకు మాత్రం ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మంచిది అని ఉంటుంది. నేతలు, అధికారులు తెలిసి చేసారో, తెలియక చేసారో గానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, ఇక్కడి ప్రజల పట్ల చిన్న చూపు నిజమని మేము నమ్ముతున్నాం.
ఈ పరిస్థితి మా కుటుంబం ఒక్క దానికే పరిమితం అని నేను అనుకోవడం లేదు. చాలా కుటుంబాలు ఇదే వాతావరణంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన ప్రభావం కుటుంబ సంబంధాలపై కూడా పడుతుంది. ఈ రోజు వచ్చే నిర్ణయం ఏదైనా... తెలుగు ప్రజలంతా పరస్పర గౌరవంతో, బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాం. వీర తెలంగాణా సాయుధ పోరాట వారసులు, సమ సమాజం కోసం పోరాడి నేలకొరిగిన విప్లవ యోధుల వారసులపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది.
ప్రత్యేక రాష్ట్రం వస్తే బ్రహ్మాండం బద్దలై ఇక్కడి ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందన్న పిచ్చి భ్రమలు లేకపోయినా తెలంగాణా, ఆంధ్రా ప్రజల మధ్యన మానసికంగా గ్యాప్ ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. ఇది ఎప్పటికీ మంచిది కాదని నమ్ముతున్నాను. ఇవ్వాళ కాకపోయినా రేపైనా ఈ సమస్య మళ్ళీ మన ముందుకు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సభ్య సమాజంలో చాలా సవరణలు జరగాలని కోరుకుంటున్నాం.