Thursday, February 28, 2013

నా బుజ్జి పావురం చచ్చిపోయింది

25వ తేదీ (సోమవారం) నాడు యూనివర్సిటీ ఆఫ్ వియన్నా, చెక్ రిపబ్లిక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరిని గెస్ట్ లెక్చర్ కు పిలిచాను. వారి కన్నా ముందే వెళ్లి నా రూం ఓపెన్ చేశాను. నా సీట్లో కూర్చుందామని అనుకునే లోపు రెండు పావురాళ్ళు నా బల్ల పక్కనున్న రాక్ మీద కనిపించాయి. నా అలికిడితో అందులో ఒకటి తాము వచ్చిన కిటికీ గుండా తుర్రున ఎగిరి పోయింది. శరీరం మీద చక్కని చుక్కలతో సన్నని మెడతో ఉన్న ఒక పావురం మాత్రం రూం లో చిక్కుకుంది. దాని కోసమని ఫ్యాన్ వేయకుండా బైటికి వెళ్లి కూర్చున్నాను. రూం క్లీన్ చేసే వాళ్ళు ఇద్దరు, సెక్యూరిటీ గార్డు, ఆఫీస్ బాయ్ అందరూ.. ఆ పావురాన్ని బైటికి పంపేందుకు దాదాపు అర్ధ గంట ఇబ్బంది పడ్డారు. బూజు కర్ర, మామూలు కర్ర తో దాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే వచ్చిన గెస్టులు కూడా ఈ కసరత్తు ను వింతగా చూస్తుండగా...వారి ప్రయత్నం వల్ల పావురం ఇంకా బెదురుతుండడాన్ని గమనించి వారిని "వద్దులే... ఉండనివ్వండి..." అని చెప్పి బైటికి పంపాను. తర్వాత క్లాసుకు వెళ్ళాము.  

క్లాసు ముగిసింది. గెస్టు లు మళ్ళీ నా రూం కు వచ్చారు. "ఏమిటి సార్ గెస్టులకు ఫాన్ అయినా వేయలేదు...చెమటలు కారుతున్నాయి..." అని వారితో మాట్లాడడానికి వచ్చిన ఒక ఒక స్టూడెంట్ అంటే అప్పుడు మళ్ళా ఆ పావురం గుర్తుకు వచ్చి వెతికాను. అది లేదు. ఎప్పుడో వెళ్ళిపోయింది. ఫ్యాన్ వేసిందా ఆమ్మాయి. 
మర్నాడు ఉదయం యూనివర్శిటీ కి వెళ్లి తలుపు తీసి చూస్తే... నా ర్యాక్ మీద గూడు కనిపించింది. అది ఇంకా పూర్తి కాలేదు. సో... నా రూంలో గూడు పెట్టడానికి అవి నిశ్చయించుకున్నాయని అర్థమయ్యింది. మళ్ళా నిన్న (బుధవారం) వెళ్ళే సరికి గూడు కింది భాగం పూర్తయ్యింది. అది నాకు అద్భుతంగా తోచింది. ఒకే రకమైన వేళ్ళు తెచ్చి చక్కగా అమర్చి గూడు కట్టుకుంటున్నాయి. ఆ వేళ్ళు ఎండాకాలంలో మంచివేమో అనుకుని... ఈ పావురాళ్ళు రూంలో ఉన్న గూట్లో గుడ్లు పెట్టి పిల్లలను పొదిగితే కిలకిలా రావాలు ఎలా ఉంటాయో కాసేపు ఊహించుకుని...వాటి అద్భుత కళా సృష్టిని నా సెల్ ఫోన్ లో బంధించి క్లీనింగ్ సెక్షన్ వాళ్లను పిలిచాను, గూడు చెదరడానికి వీల్లేదని చెప్పాను. నేను లేనప్పుడు కూడా దాన్ని కాపాడమని ఒకామెకు చెబితే... ఆమె గమ్మత్తు గా నవ్వింది. ఫోటోగ్రఫీ ప్రాక్టీస్ చేస్తున్న ఒక స్టూడెంట్ దగ్గరకు వెళ్లి... అ గూడు సీక్వెన్స్ ఫోటోల కోసం రోజూ ఉదయాన్నే నా గదికి వెళ్లి ఫోటోలు తీసి ఉంచమని చెప్పాను. తను వెంటనే వచ్చి ఒక ఫోటో (పై ఫోటో) కూడా తీసుకున్నాడు. 

సరే... సరోజినీ నాయుడు ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నా స్టూడెంట్స్ స్పెషల్ ఎడిషన్ తెచ్చే హడావుడి లో ఉన్నారు. వారికి కొత్త ప్లాన్స్ అందిస్తూ... పురమాయించే పనిలో తలమునకలై ఉన్నాను. రూం లో ఫ్యాన్ వేసే ఉంది. నేను చాలా సేపు కంప్యూటర్ లాబ్ లో గడిపి రాత్రి ఏడున్నర ప్రాంతంలో నా రూం లోకి వచ్చాను. మళ్ళీ గూడు నిర్మాణం పనిలో భాగంగా అనుకుంటా... కిటికీ సందులోంచి రివ్వున వచ్చింది బుజ్జి పావురం. మూడు రోజుల కిందట నేను చూసింది దీన్నే.
సృష్టి భలే గమ్మత్తైందని నేను అనుకుంటూ ఉండగానే అది రివ్వున వెళ్లి ఫ్యాన్ రెక్కను కొట్టుకుంది. అ బలమైన తాకిడికి.... రెక్కలు చిందర వందర కాగా రక్తం చిమ్ముతుండగా ర్యాక్ మీద తానూ కట్టుకుంటున్న గూడు పక్కన దబ్బున విసిరేసినట్లు పడింది. ఫ్యాన్ వేసి ఉంచినందుకు పశ్చాత్తాప పడుతూ...నేను ఒక్క ఉదుటున పావురం దగ్గరకు వెళ్లాను... "ఓహ్ గాడ్..." అని అప్రయత్నంగా అనుకుంటూ. మెడకు బలంగా తగిలిన గాయం వల్ల ఒళ్ళు జలదరించిన దానిలా వణుకుతూ అప్పుడే అది కన్ను మూసింది. నా చివుక్కు మంది. ఫ్యాన్ కు కొట్టుకోవడం... తగలగానే అది కచ్చితంగా వెళ్లి తన గూడు పక్కనే పడడం.. అక్కడే కన్నుమూయడం! 

మళ్ళీ స్టూడెంట్ ఫోటోగ్రాఫర్ కు వెళ్లి ఈ విషయం చెబితే... వెంటనే వచ్చి ఈ రెండో ఫోటో తీసాడు. 'అయ్యో... దీన్ని పాతి పెడదాం సార్..." అని చెప్పి వెళ్లి తన పనిలో తాను మునిగి పోయాడు. కాసేపు ఆగి ఆ పావురాన్ని తీసుకువెళ్ళి ఒక చోట ఖననం చేసి ఇంటికి వచ్చాను నిన్న రాత్రి. కొన్ని చిన్న సంఘటనలు సైతం మనసుల మీద ప్రభావం చూపుతాయి కదా! ప్చ్.             

Wednesday, February 27, 2013

మీడియా టెర్రర్ ఆపండి: ప్రెస్ కౌన్సిల్ కు లేఖ

దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ళ తర్వాత మీడియా ఊహాగానాలతో, అవాస్తవాలతో ముస్లింలలో టెర్రర్ సృష్టిస్తున్నదని, దీన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీ సీ ఐ) ను సివిల్ లిబర్టీస్ మోనిటరింగ్ కమిటీ కోరింది. పీ సీ ఐ చైర్మన్ మార్కండేయ ఖట్జూ కు ఈ మేరకు ప్రముఖ హక్కుల నేత లతీఫ్ మొహమ్మద్ ఖాన్  లేఖ రాసారు. దాని పూర్తి పాఠం ఇది: 

URGENT MATTER

To,
Hon’ble Justice Markandey Katju,
Chairman,
Press Council of India,
New Delhi.

Sir,

Sub: Hyderabad Bomb blasts - Issue direction to the Media houses to stop Media Investigation and Trial – To stop terrorizing Muslim community and hatred among people – Reg.

With the reference to the subject cited above in the evening of 21st February 2013 an unfortunate incident of bomb blast took place in Dilsukhnagar area of Hyderabad in which almost 16 people were killed and hundreds injured. The dead belonged to all the religions and sections.

Immediately after the blast, electronic media both regional (Telugu) and national (Hindi & English) reached the spot and started live coverage along with their expert comments. Telugu channels which telecast both Telugu and Urdu news bulletin are completely different. In the Telugu bulletins they spread hatred against Muslims where in Urdu bulletin they are very cautious in reporting such hatred. So, the Telugu and Urdu news bulletin are completely different from each other. When the whole city was under shock, media and people arising out of their caste & religion were enquiring the safety of each other. The common people came into immediate action and were trying to help injured and dead to shift to the nearby hospitals. The thought of who carried the blasts never came to the minds of the common people but they were very much concerned about saving the lives of the blast victims. But the media without showing any such concern was carrying out their own style of reporting.

At the same time, media was reporting live along with speculations which diverted towards one community and as usual that was nothing but towards Muslims. The media started investigation and jumped on the conclusions and media room trial started. By giving their own sources they named the organizations behind the blast and also the names of Muslim youths. They even said that the planning of these blasts took place in October itself. The media is diverting and linking these blasts to the revenge of Afzal Guru and Ajmal Kasab. The media also said that it is the revenge of Akbaruddin Owaisi’s arrest.

Before the state investigating agencies and central investigating agencies reached the spot, the media and Hindutva elements gathered due to which the evidence of bomb blasts lost. Though the police personnel reached there but did not try to control the Hindutva elements and media mob. The Hindutva elements raised the slogans of anti-Muslim slogans.

The first thing which the media announced is that the actual target of bomb blast was not the present place but it was the Saibaba Mandir (how media got this report no one knows). Then the media started explaining how the preparations of bomb blast took place. They even said that two days before the blasts the bomb planters were roaming in that area. Media even declared the names of the persons involved in the blast. The number of channels, that number of investigation and trial was going on and all the channels had same conclusions. The target of all these channels was Muslims. The matter of concern is that the media houses do not have any evidence or any information of this incident but had only speculations. But with the type of their reporting it seemed that they knew everything in advance. The media is even showing an injured Muslim youth in the blast as main suspect and unfortunately this person named Mirza Abdul Wasey became the victim of bomb blast for the second time. He was injured even in the Makkah Masjid blast as well. A person injured two times in the blast i.e. in Makkah Masjid bomb blast and Dilsukhnagar bomb blast became a crime, only because he is a Muslim.

The common people wondered that if at all the media houses knew all the facts then why didn’t they inform the police? And if they did not alert the police then it means that they have indirectly helped the terrorists. Without any evidence targeting of one particular community is to increase their TRP ratings then that is nothing but helping the terrorists. Because in this country where plural society exists, these type of incidents are carried out only to propagate the hatred and division among the people and in the society. Such type of reporting of media is making the plans of terrorists easier. This type of reporting is nothing but act of terror. Because of this type of reporting, one particular community is completely isolated, traumatised and terrorized.

This committee wants to draw your attention towards this type of reporting of media houses which is propagating hatred among the people and isolating the Muslim community. The majority community is seeing them with suspect in every walk of life. The attitude of media has become the biggest threat to Muslim community and their life and liberty is at stake.

Dear sir, we want to say clearly that at this time, Muslims are the victims of bomb terror, police terror, media terror and mob terror. This is the ground reality.

Therefore, we request you to issue the direction to the media houses to stop their own investigation and media room trial against the Muslim community which is aimed at targeting Muslim community.
  
We request you to collect all the reporting of the media both electronic and print and investigate the news on this issue by forming a team of experts. Take against those media houses that have not spared a single minute to show and target Muslim community as terrorists.

Dear Sir, you are the chairman of Press Council of India, on behalf of common Muslims of India I question you, don’t Muslims have right to life with dignity which is guaranteed by the constitution and is it crime to live this country as Muslims with their identity.

At this high time, I want to ask you, the media houses telecasting such news just to increase their TRP ratings in not an act of terror? As far as we know there are some rules and regulations to be followed by Media in reporting the news. But that is not applied while reporting on terror issues.

Hope this will be taken seriously, positively. We request you to intervene and stop it immediately so that our plural society of India can exist without any threat.

Thanking you,

Yours faithfully,
Lateef Mohammed Khan,
Gen. Secretary

Monday, February 25, 2013

V6 లో అద్దిరిపోయిన 'తీన్మార్ వార్తలు'

టెలివిజన్ మీడియాలో పొలిటికల్ ఫన్ పండిస్తూ ప్రోగ్రామ్స్ చేస్తున్న వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది TV 9 లో కిషోర్ దాస్ గారు, సాక్షి ఛానెల్ లో ధర్మవరపు సుబ్రమణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు తన 300 వ ఎపిసోడ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఆటలో అరటి పండుగా...వీరి ప్రోగ్రామ్స్ వీనుల విందుగా, కనువిందుగా, హృదయ రంజకంగా అనిపిస్తాయి...నా మటుకు నాకు. హెచ్ ఎం టీ వీ లో హాస్య రచయిత రాజ గోపాల్ గారు ఆర్ కే లక్ష్మణ్ గారి 'కామన్ మాన్' టైపులో సృష్టించిన పాత్ర కూడా చాలా సార్లు బాగుంటుంది. ఈ టీ వీ లో ఇలాంటివి వస్తాయో లేదో నాకు తెలియదు. 

ఇప్పుడు ఎన్ టీ వీ ని ఏలుతున్న రాజశేఖర్ బుర్ర నుంచి పుట్టుకొచ్చిన ఒక ఐడియాను దాదాపు అన్ని ఛానెల్స్ పాటిస్తున్నాయి. యానిమేషన్ పాత్రతో సరదా యాసతో రాజకీయ నేతలకు మొట్టి కాయలు వేయించి ప్రజాభిమానం పొందిన ఘనత రాజశేఖర్ దే. తాను ఐ న్యూస్ లో ఉండగా ఆ పాత్ర సృష్టించిన రాజశేఖర్ తర్వాత ఎన్ టీ వీ లో చేరిన తర్వాతా తనదే పేటెంట్ హక్కు అయినట్లు ఆ ప్రోగ్రాం ను కొనసాగించాడు. 

రాజకీయ నేతల మీద బాణాలతో చక్కని మరొక ప్రోగ్రాం చూశానన్న తృప్తి కలిగింది ఆదివారం రాత్రి.. వీ సిక్స్ చానెల్ లో "తీన్మార్ వార్తలు" చూశాక. రచ్చ రాములమ్మ పేరుతో తెర మీద కనిపించిన అమ్మాయి కుందనపు బొమ్మలా అద్భుతంగా యాంకరింగ్ చేశారు. ఆమె డైలాగులు, మాటల స్వచ్ఛత, కొంటె విరుపులు చాలా బాగున్నాయి. నిన్నటి ఐదారు బిట్స్ కు కాపీ అందించిన జర్నలిస్టు ఎవరో కానీ... భలే చక్కగా రాసారు. ఈ అమ్మాయికి, ఆ రచయితకు అభినందనలు. రచయిత పరిశీలనా సామర్ధ్యం నాకు ముచ్చటేసింది. 

కాంగ్రెస్ పార్టీని స్కూల్ తో పోలుస్తూ వేసిన కామిడీ బిట్ అదిరిపోయింది. అందులో కిరణ్ ను తెలుగు మాస్టారు గా, పొన్నాలను పీ ఈ టీ గా వర్ణిస్తూ రచయిత చాలా తెలివితో కాపీ రాసారు. అంకం రవి గారు ఈ ప్రోగ్రాం ను మరొక సారి ప్రైమ్ టైం లో ప్రసారం చేస్తే బాగుంటుంది. మిత్రులారా... మన దగ్గర టాలెంట్ కు కొదవ లేదు. ఒక్క అవకాశఇవ్వండి. మనోళ్ళు చించేస్తారు. ఆల్ ద బెస్ట్.  

Sunday, February 24, 2013

విచారం... విచారణ: ఇదే మన బతుకు గ్రహచారం?

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లతో మా అబ్రకదబ్ర గుండె మండింది, బుర్ర చెడింది. రెచ్చిపోయి ఆవేశం తో ఇది పంపాడు..... రాము 
------------------------------------
ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పుట్టినందుకు ఆనంద పడాలో, ఏడవాలో ఒకొక్కసారి అర్థం కాదు. మనది డెమోక్రసీ కాబట్టి... మనం ఒక పధ్ధతి ప్రకారం పోవాలని, లా బుక్కు ను తు.చ. తప్పకుండా అనుసరించాలని అనుకోవడం తప్పు కాదు. కానీ... మనం ఇలా మడి కట్టుకుని కూర్చుంటే...మత పిచ్చితో బాంబులు పెట్టి నిండు ప్రాణాలను తీస్తున్న వారు వారి పని వారు చేసుకు పోతున్నారు! ఎన్ని సార్లు సాధారణ జనం దారుణమైన బాంబు దాడులకు  బలి కావాలి? ఎంత కర్మ దేశమైతే మాత్రం... ఎన్నాళ్ళు ఇలా మన ఖర్మ అనుకుని కూర్చోవాలి? దీనికేమైనా వినూత్న పరిష్కారం ఉన్నదా? 

దిల్ సుఖ్ నగర్ లో ఉగ్రవాదులు బాంబులు పెట్టారు. హిందువులతో పాటు  ముస్లిం లు కూడా నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వంద మంది అమాయకులు గాయపడ్డారు. చచ్చీ చెడీ ఒకరిద్దరు తుగ్లక్ వెధవలను పట్టుకుంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి...వారి ముఖాలకు నల్లటి తొడుగులు తొడిగి వారిని విలేకరులకు చూపిస్తారు. ఆ తర్వాత వారిని కోర్టులకు అప్పగిస్తారు. పరమ పవిత్రమైన న్యాయ వాదులు... వృత్తి ధర్మం ప్రకారం వారి తరఫున వకాల్తా పుచ్చుకుంటారు. ఇక కోర్టుల్లో డ్రామా మొదలవుతుంది. 

ఇంతలో..ఆ దొరికిన వారు చచ్చేంత అమాయకులని, పోలీసులు పనిలేక పట్టుకున్నారని వాళ్ళ మతానికి చెందిన గ్రూపులు వాదిస్తాయి. అప్పుడు హక్కుల గ్రూపులు రంగంలోకి దిగుతాయి. దేశ రాజధానిలో టీ వీ స్టూడియోలలో కూర్చున్న సుసంపన్నమైన, విద్యావంతులైన అయ్యలు అమ్మలక్కలు "రాజ్య హింస", "రాజ్యం దరిపే దాడి" మీద ఎడతెగని డిబేట్లు జరుపుతారు. అలా జరపకపోతే మేధావి కింద లెక్క కాదు మన పుణ్య భూమిలో. మత పరమైన ఓట్ల కోసం వారి మత నేతలు ఆ నిందితుల కోసం పోరాటాలు చేస్తారు... కోర్టు బైటా లొపలా. ఇంతలో కోర్టు కేసులు మొదలవుతాయి. వాయిదాల మీద వాయిదాలు పడతాయి. జనం ఎర్రి పప్పల్లా తుది తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాల చక్రం గిర్రున తిరుగుతుంది. మన కర్మ బాగోలేకపోతే.... ఈ లోపు మరొక బాంబు పేలుతుంది. 

చూశారా... నోట్లో వేలుపెట్టినా కొరకలేని వారిని తీవ్రవాదులుగా ముద్ర వేశారని దేశభక్తి లేని చచ్చు పుచ్చు గాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు. దానికి ప్రభావితులయ్యే వర్గం మతోన్మాదం తో రగిలిపోయి పిచ్చి పిచ్చి వాదనలు చేస్తుంది. వారు నిజమైన యుద్ధ వీరులుగా నీరాజనాలు అందుకుంటారు. నిందితులకు భద్రత పేరిట కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేస్తాం. ఇలా ఒక ఐదు లేదా ఆరేళ్ళు జరిగాక... నేరం రుజువు కాక వదలడమో, కింది కోర్టు శిక్ష వేయడమో అవుతుంది. నిందితులు పై కోర్టులకు వెళతారు. స్టే తెస్తారు. ఇలా మరి కొద్ది పుణ్య కాలం గడుస్తుంది. దొరికిన వాళ్ళు ముదుర్లయితే... వారి బాసులు ఏ విమానమో హైజాక్ చేసి...వారి విడుదలకు డిమాండ్ చేస్తారు. మన ప్రభువులు వారిని రాజ లాంఛనాలతో విడుదల చేసి పచ్చని తీరాలకు సాగ నంపుతారు. ఇదీ... అతి పెద్ద ప్రజాస్వామ్యంలో జరిగే తంతు. 

ప్రభువుల్లారా... మిగిలిన నేరాలకు లా బుక్కు ప్రకారం పొండి. ఇలా బాంబులు పెట్టే బద్మాష్ గాళ్ళ విషయంలో మాత్రం ఇంత పధ్ధతి పాటించాల్సిన అవసరం ఉందా, ఒక్క సారి ఆలోచించండి. మన మెతకతనం వల్ల, చేతగాని తనం వల్ల, మీ లుచ్చా రాజకీయాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెడదాం. 

ఆంధ్రా పోలీసులు తెలివిగా నేరాన్ని నిరూపించలేరు గానీ... నిజమైన నిందితులను పట్టుకోగలరు, ఆ సత్తా వారికి వుంది. అలా దొరికిన వారిని ఆ దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ దగ్గర చెట్టు కొమ్మలకు కట్టేసి జనాలకు వదలండి. "ఒక్క పది హేను నిమిషాలు" అక్కడ పోలీసులు లేకుండా చూడండి. 

ప్లీజ్...ఒక్క సారి ఈ పని చేయండి. మళ్ళీ హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు జరిగితే అడగండి. ఒక్క సారి ఇట్లా చేయడం వల్ల మన ప్రజాస్వామ్యానికి ముప్పు రాదు. ప్లీజ్ బాధితులకు ఒక్క చాన్సివ్వండి.          

Tuesday, February 19, 2013

బీ బీ సీ లో జర్నలిస్టుల సమ్మె...

లెక్కాపత్రం లేదు కానీ.. తెలుగు చానెళ్ళలో గడిచిన మూడేళ్ళలో ఐదారు వందల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగం పోయిన అభాగ్యులు నెత్తీనోరూ బాదుకోవడం, ఇకటి రెండు సార్లు రాష్ట్ర మానవ హక్కుల సంఘం దగ్గరకు పోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఈ రోజు ఉద్యోగానికని వెళ్ళిన జర్నలిస్టులు, టెక్నీషియన్లను హెచ్ ఆర్ డిపార్టుమెంటు వాళ్ళు పిలిచి సిమ్ కార్డు, ఐ.డీ. కార్డు తీసుకుని అటు నుంచి అటే ఇంటికి పంపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ తంతు ఆ కుటుంబాలలో సంక్షోభం సృష్టించింది, జర్నలిస్టు విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది.    

ఇప్పుడు గొడవ చేస్తే... వేరే ఛానెల్ లో ఉద్యోగం రాదేమోనన్న బతుకు భయంతో జర్నలిస్టులు మూసుకుని కూర్చోవాల్సి రాగా... చేవలేని జర్నలిస్టు సంఘాల నేతలు సుఖంగా తమ పని తాము చేసుకుంటూ ప్రెస్ క్లబ్ లో సేద తీరారు. ఉద్యోగ భద్రత గురించి వీళ్ళు ఒక్క నిరసన ప్రదర్శన అయినా తీయలేదు. ఈ దారుణంపై కనీసం ఈ మహానుభావులు స్పందించిన దాఖలాలు లేవు. 

దీనికి భిన్నంగా... ఉద్యోగాలపై వేటు వేసి డబ్బు ఆదా చేయాలన్న బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ (బీ బీ సీ) ఆలోచనను నిరసిస్తూ... నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నేతృత్వంలో సోమవారం నాడు సమ్మె జరిగింది. సెంట్రల్ లండన్ లోని బీ బీ సీ స్టూడియోతో పాటు బ్రిటన్ లోని వివిధ ప్రాంతాలలో జర్నలిస్టులు నిరసన నిర్వహించారు. ఉదయం వచ్చే రేడియో న్యూస్ ప్రోగ్రాం 'టుడే' తో పాటు వివిధ కార్యక్రమాలపై ఈ సమ్మె ప్రభావం పడింది. పలు ముఖ్యమైన షో లు రద్దయ్యాయి.  



రెండు వేల ఉద్యోగాలు పోయేలా ఉన్నాయని, ప్రస్తుతానికి ఒక ముప్ఫై మందిని సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని యూనియన్ వాదిస్తున్నది. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.... 

National Union of Journalists general secretary Michelle Stanistreet said poor decisions by the BBC leadership were leading to quality journalism being compromised. The union says 2,000 jobs are at risk in BBC cost-cutting. Many will be eliminated through attrition, but about 30 jobs are targeted for compulsory layoffs.


'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం.... 

The union said jobs were set to be axed across the corporation, including BBC Scotland, Five Live, the Asian Network and the World Service.

The union has asked the BBC for a moratorium on all job cuts for a six-month period, to allow for talks and negotiation with the new Director-General.

The NUJ said 7,000 jobs had been cut at the BBC since 2004, while a further 2,000 are being lost under cost-saving plans.


బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ ప్రజల నుంచి వచ్చే డబ్బులతో నడుస్తూ ప్రజాదరణ పొందింది. కలర్ టీ వీ ఉన్న ప్రతి కుటుంబం ఏడాదికి 145.50 పౌండ్లు (దాదాపు 228 డాలర్లు) చెల్లించే లెవీ తో బీ బీ సీ నడుస్తోంది. 2010 లో ప్రభుత్వం ఈ లేవీని స్తంభింప చేయడంతో ఆ సంస్థకు నిధుల కొరత ఏర్పడి, ఆదా లో భాగంగా ఉద్యోగాలపై వేటు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. బీ బీ సీ స్టూడియో ఎదుట నిరసన తెలుపుతున్న ఒక జర్నలిస్టును ఈ చిత్రంలో చూడవచ్చు. 

ఎన్ యూ జే స్ఫూర్తితో జర్నలిస్టు సంఘాలు పనిచేయకపోతే... తెలుగు మీడియాలో జర్నలిస్టులు, టెక్నీషియన్లు వారి కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి మరింత పెరుగుతుంది. ఇకనైనా తమ పక్షాన నిలబడే జర్నలిస్టు సంఘాల ఆవశ్యకతను ప్రతి జర్నలిస్టు గుర్తించాలి. జర్నలిస్టు నేతలను నిలదీయడం నేర్చుకోవాలి. యువరక్తం వస్తే తప్ప జర్నలిస్టులకు రాష్ట్రంలో బతుకు లేదు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడి జర్నలిస్టులకు చాలా కాలం పడుతుంది.   
Photo courtesy: Press Association.
    

Monday, February 18, 2013

వేమూరి రాధాకృష్ణ: ఇంగ్లిష్ వింగ్లిష్

తెలుగు ఛానెల్స్ లో సంచలనాత్మకైన, ప్రజాదరణ గల ప్రోగ్రామ్స్ లో ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (వే రా) నిర్వహిస్తున్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఒకటి అనడంలో సందేహం లేదు. ఎంతటి మొనగాడినైనా ఏ భాషలోనైనా స్టూడియోకి వచ్చిన వారిని వే రా వీర లెవెల్లో చెడుగుడు ఆడుకుంటారు అనడంలో కూడా సందేహం లేదు. మొదట్లో అయితే...'చిన్నప్పుడు మీరు ఫాస్టంట గద...ఎవరితో నడిపారేంటి?' అని తన మోచేయి గీక్కుంటూ మొహమాటం లేకుండా అడిగేవారాయన. గెస్టుల చీకటి కోణాలు వెలికి తీయడానికి ఆయన నవ్వుతూ చేసే ప్రయత్నం కొందరికి అసహ్యంగానూ మరికొందరికి పర్లేదులే...'మనోడు మనోడే. చానా బాగా అడుగుతుండు..." గానూ అనిపిస్తాయి.  

నిన్న (ఆదివారం) రాత్రి వే రా గెస్టు, ఎం.ఐ.ఎం.నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ. వారాంతపు ఈ ప్రోగ్రాం లో భాగంగా అసదుద్దీన్ ను స్టూడియోకి పిలిచారు, ఇంటర్వ్యూ చేసారు. అసదుద్దీన్ తమ్ముడి అరెస్టు నేపథ్యంలో అది టైమ్లీ ప్రోగ్రాం కాబట్టి నేను రెండు రోజుల నుంచి దాని కోసం వెయిట్ చేసి చూసాను. ఎంతో కష్టమైన ప్రశ్నలను వే రా ఎంతో చాకచక్యంగా తనదైన శైలిలో అడిగి రక్తి కట్టించారు. నాకు తెలిసి....అసదుద్దీన్ ను "నీకు పిల్లలు యెంత మంది?" అని సూటిగా అడిగి సమాధానం రాబట్టిన దమ్మున్న మొనగాడు ఇంతవరకూ వే రా ఒక్కరే అయి ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నా.

ముస్లింలు ఇంతమంది పిల్లలను కనకుండా పరిమిత కుటుంబంతో ఉంటే బాగుంటుందన్న ప్రమాదకరమైన సూచన నవ్వుతూ చేయడం మన వే రా కే చెల్లింది. చైనా వాళ్ళు ఇప్పుడు స్ట్రిక్టు గా ఇద్దరిని మించి కనొద్దని చెబుతున్నారని వే రా వాదించగా దాన్ని విద్యావంతుడైన అసదుద్దీన్ తోసిపుచ్చారు. ఎక్కువ మంది పిల్లలను కనమని అక్కడ కోరుతున్నారని, ఎక్కువ మంది జనాభాతో మరింత ఎక్కువ అభివృద్ధి సాధించవచ్చని ముస్లిం నేత వాదనకు దిగబొయ్యెలోపే..తనదైన శైలిలో నవ్వుతూ..."Lets agree to disagree," అని వే రా కట్ చేశారు సున్నితంగా. తమ తాత ముత్తాతలు కూడా ఆరేడుగురిని కనేవారని, ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమిత కుటుంబానికి ఫిక్స్ అయ్యారని కూడా ఆయన చెప్పారు మాటల మధ్యలో. "అది సరే...ఇన్నేళ్ళ బట్టి ఉన్నారు గద...మీకు తెలుగెందుకు రాలేదు?" అని కూడా వే రా సూటిగా అడిగి అసదుద్దీన్ నుంచి సమాధానం రాబట్టారు. తెలుగు నేర్చుకుని తీరతానని ఆయన అన్నప్పుడు...టూషన్ పెట్టించుకుంటారా? అని కూడా వే రా అడిగారు.   

అసదుద్దీన్ కేమో తెలుగు బిల్ కుల్ రాదు, మన వే రా కేమో ఇంగ్లిష్ ఫుల్ గా రాదు. దీనివల్ల సునిశితంగా ఈ ఓపెన్ హార్ట్ ను చూసిన వారికి చాలా చోట్ల వినోదం లభించింది. మచ్చుకు ఒకటి: 

అసదుద్దీన్ ఏదో చెప్పబోతుండగా...మీరేమో 'స్కీమర్' అని వే రా గబుక్కున అన్నారు. 'ఓర్నాయనో...ఇట్లా అంటాడేమిటి?' అని నేను గాబరా పడ్డాను. మన వే రా ఉద్దేశంలో...స్కీమర్ అన్న మాటకు అర్థం...'ఒక పథకం ప్రకారం ముదుకు వెళ్ళే రకం' అని. ఈ మాట విని...అసదుద్దీన్ ఒక క్షణం నోరెళ్ళబెట్టి ...'నో నో సార్...అయాం ఏ హానెస్ట్ పర్సన్," అని చెప్పుకున్నారు. నిజానికి Schemer  అంటే 
A person who is involved in making secret or underhanded plans అని అర్థం. 
దాని సమార్ధకాలు plotter - designer - intriguer - intrigant.

అయినా సరే...మన వే రా సరదాగా 'ఓపెన్ హార్ట్' నడిపారు. 
 
        

Sunday, February 17, 2013

ప్రజా ఛానెల్ 10-టీవీ ప్రసారాలకు సర్వం సిద్ధం

ఇన్నాళ్ళూ మీడియా బారెన్లో, పారిశ్రామికవేత్తలో, భూ కబ్జాదారులో టెలివిజన్ ఛానెల్స్ పెట్టారు. ఆర్ధిక లాభాలో, వ్యక్తిగత ప్రయోజనాలో, కుల ప్రయోజనాలో, కార్పోరేట్ లాభాలో, రాజకీయ ప్రయోజనాలో ధ్యేయంగా ఈ ఛానెల్స్ ఆపరేట్ చేస్తున్నాయి. 
ఏదో సొంత వ్యాపారాలు, తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడుకుంటూ సంసార పక్షంగా రామోజీ రావు గారు ఊరి బైటి నుంచి ఈ-టీ వీ వ్యాపారం సాగిస్తుండగా...నవ యువకుడు రవి ప్రకాష్ గారు నగరం నడిబొడ్డున ఆధునిక ఆలోచనలతో దూసుకుపోయి తెలుగు టీ వీ చానెల్  లో కాస్త మంచిని పంచి పలు పెడ ధోరణులకు శ్రీకారం చుట్టారన్న అపవాదు మూటగట్టుకున్నారు. 

ఆనక తెలుగు నేల మీద డబ్బున్న మారాజుల్లో ఒక సిద్ధాంతం బలపడింది. ఒక టీ వీ ఛానెల్ ఉంటే ఒక సెజ్ కొట్టేయవచ్చన్న సంకల్పం బలపడి దగాకోర్లు, బ్రోకర్లు, కబ్జాదార్లు రెచ్చిపోయి ఛానెల్స్ పెట్టే సాహసం చేశారు. ఇది జర్నలిస్టులకు మేలు చేసినా...జర్నలిజానికి చెప్పరాని చేటు చేసింది. ఈ క్రమంలో సమాజ హితాన్ని గాలికి వదిలి నెలకు ఒక లక్షో, లక్షన్నరో వస్తే చాలన్న గాలి జర్నలిస్టుల హవా మొదలయ్యింది. అలాగని...సదుద్దేశంతో రంగప్రవేశం చేసి చేతులు కాల్చుకున్న యాజమాన్యాలూ లేకపోలేదు. మొత్తంమీద ఈరోజున మీడియా అంటే...నెగిటివ్ ధోరణులు ప్రచారం చేసి పబ్బం గడుపుకునే యంత్రాంగం అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడి, జర్నలిస్టుల పట్ల నీచమైన చులకన భావన ఏర్పడింది. జర్నలిస్టులు కనిపిస్తే జనం రాళ్లతో కొట్టే దారుణమైన పరిస్థితుల్లో ప్రజల సేవింగ్స్ నుంచి పుట్టుకొస్తున్నది 10 టీవీ. 

అంగన్ వాడీ వర్కర్లు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, టీచర్లు, వైద్యులు, న్యాయ వాదులు, రైతులు, వ్యవసాయ కార్మికులు...తాము కూడబెట్టుకున్న డబ్బుతో కోటి ఆశలతో ఈ ఛానల్ కు ధనబలం చేకూర్చారు.  
ఇది రాష్ట్రంలో మీడియా రంగంలో "మొదటి కో ఆపరేటివ్ వెంచర్" అని ఈ ఛానెల్ ఎం డీ కె.వేణుగోపాల్ ప్రకటించగా, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలన్న సంకల్పం పెట్టుకుని "న్యూస్ ఈజ్ పీపుల్" అన్న స్లోగన్ తో 'క్రిటికల్ అడ్వర్ టోరియల్" భావనతో పనిచేస్తామని ఈ ఛానెల్ చైర్మన్ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ స్పష్టం చేసారు. ఈ ఛానెల్ సామాజక ఉద్యమాలకు పెట్టుబడి కావాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆకాంక్షించారు. టీ వీ నైన్ అభ్యున్నతిలో ప్రముఖ పాత్ర వహించిన కవి, జర్నలిస్టు అరుణ్ సాగర్ దీనికి సీ ఈ ఓ గా వ్యవహరిస్తున్నారు. 

నిజానికి సీ పీ ఎం, దాని అనుబంధ సంఘాలు ఉద్యమ స్ఫూర్తితో ఈ ఛానల్ కోసం నిధులు సేకరించాయి. అధికంగా నల్గొండ, గుంటూరు లలో ఐదు కోట్ల రూపాయిలకు పైగా ప్రజల నుంచి సేకరించి, షేర్లు విడుదల చేసి సహకార రంగంలో దీన్ని నెలకొల్పుతున్నారు. ప్రజల పెట్టుబడి ఒక కోణం కాగా...వార్తల్లో, చర్చల్లో స్వచ్ఛత కోసం ఒక సలహా మండలిని ఏర్పాటు చేయడం ఈ ఛానెల్ ప్రత్యేకతగా నాకు అనిపించింది. 

ఖమ్మం జిల్లా వాళ్ళు, టీ వీ నైన్ బ్యాచు, కమ్యూనిస్టు నేపథ్యం గల వారికి ఛానెల్ లో పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో నిజానిజాలు తెలియవుగానీ...నిజానికి ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల యువకుల రక్తంలో సామాజిక, రాజకీయ  కారణాల రీత్యా జర్నలిజం ఉంటుంది. ప్రముఖ ఛానెల్ టీ వీ నైన్ నుంచి సత్తా ఉన్న వారిని తీసుకోవడం కూడా తప్పు కాదు. నిస్వార్ధంగా సమ సమాజం కోసం బతకాలనుకునే కమ్యూనిస్టులు జర్నలిజంలో రాణిస్తారు. అయితే...ప్రజల విశ్వాసం పెట్టుబడిగా వస్తున్న ఈ ఛానెల్ కేవలం కమ్యూనిస్టు సిద్ధాంత ప్రచారమే ధ్యేయంగా, ప్రజాశక్తి వార్తాపత్రికకు ఎలక్ట్రానిక్ రూపంగా వస్తే మాత్రం తప్పు. వీరి వెబ్ సైట్ 10tv.in లో మరికొన్ని వివరాలు, ఒకటి రెండు వీడియ క్లిప్స్ లభిస్తాయి.         

అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకున్న ఈ ఛానెల్ సంస్థాగతంగా ప్రసారాలు ఆరంభించింది. మార్చిలో పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు రాబోతున్నది. ఈ ఛానెల్ ను ఒక కేస్ స్టడీ గా అధ్యయనం చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్న వారిలో నేనూ ఒకడిని. లోగో ఆవిష్కరణ రోజున ముఖ్యమంత్రిలో చైర్మన్ ప్రొ.నాగేశ్వర్, సీ ఈ ఓ అరుణ్ సాగర్ ఈ పై చిత్రంలో ఉన్నారు. 
నోట్: అంతకు ముందు జీ టీ వీ, ఎన్ టీ వీ లలో పనిచేసిన హేమ (ఈ బ్లాగు ఎడిటర్లలో ఒకరు) 10 టీ వీ లో పనిచేస్తున్నారు. అయినప్పటికీ...రాగ ద్వేషాలకు అతీతంగా ఈ పోస్టు రాసాను. దీనిపై మీ నిర్మాణాత్మక అభిప్రాయాలకు స్వాగతం.

Saturday, February 16, 2013

మీడియా ప్రక్షాళన బాధ్యత పాఠకులు, వీక్షకులదే!

భారత దేశంలో మీడియా ఆడింది ఆట, పాడింది పాట అయ్యింది. 
భావప్రకటన స్వేఛ్చ పేరుతో...బాధ్యత మరిచి మీడియా సమాజంలో పెడ పోకడలకు ఊతమిస్తున్నది. మెజారిటీ సంఖ్యలో పత్రికలూ, టీ వీ చానెళ్ళు, సినిమాలు, వెబ్ సైట్లు  ఈ పాపంలో భాగం పంచుకుంటున్నాయి. భావ ప్రకటన హక్కు, సృజనాత్మకత పేరుతో విశృంఖలంగా చెలరేగి పోతున్న మీడియాకు ముకుతాడు ఎవరు వేయాలి? అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇది ఆన్సర్ లేని పెద్ద ప్రశ్న. 

మీడియా అంటే భయపడి చచ్చే ప్రభుత్వాలు, మీడియాతో పెట్టుకోవడం అంటే...కొరివితో తలగోక్కోవడం అనుకుంటున్న రాజకీయ నేతలు, అధికారులు మీడియాలో పెడ ధోరణులను నిలువరించలేరు. మీడియాకు స్వీయ నియంత్రణ లేదు, మీడియాను నియంత్రించే సంస్థలే లేవు. ప్రెస్ కౌన్సిల్ ఉన్నా...పళ్ళులేని టైగర్ లాగా ఉంది. దీన్ని మీడియా కౌన్సిల్ గా మార్చాలని మొత్తుకుంటున్న ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ ను ప్రెస్ ఒక విలన్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. మీడియా విచ్చలవిడితనానికి వ్యతిరేకంగా గళం ఎత్తాల్సిన గురుతర బాధ్యత మేధావులు, ప్రజలదే. 

ఇందుకు ఒక ఉదాహరణ మీతో పంచుకోవడం ఈ పోస్టు ఉద్దేశ్యం. పారా ఒలంపిక్ రన్నర్ (బ్లేడ్ రన్నర్) పిస్తొరియస్, మోడల్ అయిన తన గర్ల్ ఫ్రెండ్ ను కాల్చి చంపాడని అభియోగాలు ఎదుర్కుంటున్నాడు. ఆ వార్తను ప్రపంచ ప్రఖ్యాతి గడించిన 'ది సన్' వివిధ కోణాలలో ప్రచురించింది. కానీ మొదటి పేజీలో...చనిపోయిన మోడల్ ఫోటోను దీన్ని వాడింది. 
హత్యకు గురైన మహిళ ఫోటోలో అందాల ఆరబోతను 'ది సన్' వాడుకోవాలని చూడడం ఎంత దారుణం? ఎంత బాధ్యతారాహిత్యం? బ్రిటన్లో ప్రజలు  దీన్ని ఛీత్కరించుకున్నారు. కమ్మగా బొమ్మను చూస్తూ కామ్ గా కూర్చోకుండా...తమ నిరసనను వ్యక్తం చేసారు. ఆ పత్రికకు లేఖలు రాసారు. దీనికి సోషల్ నెట్ వర్క్ ట్విట్టర్ ను వాడుకున్నారు. ప్రైవేట్ రేడియో చానెల్స్ లోఈ ఫోటో మీద దుమ్మెత్తి పోశారు. 'ది గార్డియన్' కథనం ప్రకారం....

Among those who condemned the paper were former deputy prime minister Lord Prescott and Labour MP Chris Bryant, who tweeted: "This is a simply despicable front page. It glories in domestic violence. @rupertmurdoch apologise."
Prescott's tweet said: "I really hope every member of the shadow cabinet thinks twice before writing for the Sun after that front page."
Among the feminist complainants was the newspaper columnist Suzanne Moore who argued that the Sun had hit "a new low". She called it"lechery over a corpse," adding: "A woman just murdered? I hope mass boycott."
Bryant continued his attack in further tweets, urging his followers to complain to the Sun's editor, Dominic Mohan.
మన దగ్గర నేతలకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి లేవు. ఫెమినిస్టు 
మేథావులుగా చెలామణి అవుతున్నవారు వ్యూహాత్మక మౌనం 
పాటిస్తూ...బూతు చానెల్స్ నిర్వహించే పిచ్చి చర్చల్లో పావులవుతున్నారు. 

కాబట్టి...ప్రజలారా...మనమే స్పందించాలి. మూడు లేదా నాలుగు 
రూపాయలు పెట్టి పత్రిక కొన్నందున, రెండు వందలో మూడు వందలో పెట్టి
కేబుల్ కనెక్షన్ పొందిన మనకు మీడియా చెడు, పెడ ధోరణుల పట్ల 
నిరసన గళం వినిపించే హక్కు ఉందని గుర్తించండి. కాస్త స్పందించే
గుణాన్ని అలవరుచుకోండి. మన ఒక్కరి వల్ల ఏమీ కాదని, నిరసన తెలిపితే 
కంటు అవుతామని భావించకండి. వర్షం పడుతుంటే...దున్నపోతు ఏమీ 
చేయలేదు, మనుషులమైన మనం ఒక గొడుగు పట్టుకుందాం.

Thursday, February 14, 2013

ఏంట్రా నాయనా....ఈ ఆడపిల్లల దుస్థితి?

ఈ హడావుడి జీవిత చక్రంలో ఇరుక్కుని గిర్రుగిర్రున తిరుగుతున్న నాకు ఈ రోజు వాలెంటైన్స్ డే అని గుర్తుకు రాలేదు. ప్రేమికులకు ప్రత్యేకించి ఒక రోజు ఉండడం పట్ల నాకు మాదిరిగానే...మా మేడం గారికీ ఇష్టం లేదు కాబట్టి తనూ ప్రస్తావన తేలేదు. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ఇచ్చిన టైం కు వెళ్లి ఆధార్  కార్డు పని ముగించుకోవడం కన్నా మించిన అతి ముఖ్యమైన పని నాకు మరొకటి కనిపించలేదు. ఆధార్...తీసుకోకపోతే...మనకు ఫ్రీగా ప్రకృతిలో లభించే ఆక్సిజన్ ను కూడా పీల్చుకోనివ్వరన్నంత సీన్ క్రియేట్ చేసారు. 
     
అలా...సెంట్రల్ యూనివర్సిటీలో క్లాసు ముగియగానే...ఒక స్టూడెంట్ వచ్చి నాతో పర్సనల్ గా మాట్లాడాలని, కొంత సమయం కేటాయించమని అడిగింది.  
తమ కాలనీలో ఉండే ఒక అబ్బాయితో లవ్ లో పడిన తాను వాడి నిజ స్వరూపం తెలిసినప్పటి నుంచి దూరంగా ఉండటాన్ని, అది భరించలేని వాడు మొన్నీ మధ్యన చేయి చేసుకోవడంతో మెడ కింద అయిన  గాయాన్ని చూపింది. బాగానే తెగువ ఉన్న ఆ అమ్మాయి పోలీస్ కేసు పెట్టడం, వాడిని రిమాండుకు పంపడం, వాడు బైటికి రావడం కూడా అయిపోయాయి. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే...కసితో రగులుతున్న వాడు ఈ అమ్మాయి ఇంటికి వెళ్లి అమ్మాయి చెల్లిని, తల్లిని బెదిరించాడట...కేసు విరమణ కోసం. తను మాత్రం బ్యాగులో పెప్పర్ స్ప్రే పెట్టుకుని క్యాంపస్ లో బిక్కుబిక్కున బతుకుతున్నది. తనకు నేను ధైర్యం నూరిపోసి...మనో నిబ్బరంతో పోరాడమని, ఇలాంటి దారుణాలను మౌనంగా భరించవద్దని చెప్పి వచ్చాను.      

ఆధార్ పోరాటంలో భాగంగా మా వాడిని తీసుకురావడానికి స్కూలుకు వెళ్లాను. అక్కడ ఎంతో ఉత్సాహంగా తిరుగుతున్న పిల్లలను చూస్తే...ముచ్చటేసింది. జోకులేసుకుంటూ నవ్వుతూ...తుళ్ళుతూ తిరుగుతున్న ఆడ పిల్లలు ఎంతో లైవ్లీ గా కనిపించారు. వారు నిజంగా మన భారతమాతలు. ఆధార్ సమరం ముగిసాక...'ది హిందూ' తిరగేశాను. మొదటి పేజీలో గిటార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ కూతురు అనౌష్క్ I was sexually abused as a child అంటూ ఇచ్చిన ప్రకటన షాక్ కు గురిచేసింది. తన తల్లిదండ్రులు బాగా నమ్మే ఒక వ్యక్తి వల్ల బాల్యంలో మౌనంగా తను ఎంత నరకం అనుభవించిందీ తను వివరించారు. అంత ఉన్నత విద్యావంతుల కుటుంబంలోనూ ఇదేమి దారుణమని అనిపించింది. 'ది హిందూ' లోపలి పేజీలో 5 class X students held for rape అన్న ఏలూరు వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పిల్లలు స్కూల్లోనే ఒక సహచర విద్యార్ధినిని ఏమిచేసిందీ చదివితే...ఒళ్ళు కంపరమెక్కింది. ఈ మూడు ఘటనలతో మనసు బరువెక్కి The Sun వెబ్ సైట్ చూస్తే...ఆఫ్రికాలో బ్లేడ్ రన్నర్ ఆస్కర్ పిస్తోరియస్ తన గర్ల్ ఫ్రెండ్ (లా గ్రాడ్యుయేట్ మోడల్) రీవా స్టీన్ కెంప్ ను కాల్చిచంపిన నేరంపై అరెస్టు చేయడం చూసి అద్దిరిపోయాను. 

సర్లే మనమేమి చేస్తామని అనుకుని...డైలీ మెయిల్ తిరగేశాను. అక్కడ ఇంకొక వార్త ఉంది: Schoolgirl, 14, sent messages to her family on Facebook begging for help as she was raped by stranger in woods అన్న శీర్షికతో. అందులో మొదటి మూడు పేరాలు ఇవి: 
A schoolgirl sent messages to her family via Facebook pleading for help while she was being raped in woods near her home.
The 14-year-old used her mobile phone to write ‘help’ and ‘raping me’ on her sister’s profile page on the site, a court was told.
But although the messages alerted her mother and sister, who eventually discovered her collapsed by the roadside, they were too late to stop her ordeal.

ఇది చదివాక...మనమేమి సమాజంలో బతుకుతున్నాంరా నాయనా? ఈ ఆడపిల్లల పరిస్థితి హైదరాబాద్ లో అయినా...ఏలూరులో అయినా...దక్షిణాఫ్రికా లో అయినా....లండన్ లో అయినా ఒక్కటే కదా!  అనిపించింది. మన కూతుళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అమ్మల తోబుట్టువులైన ఈ చిట్టి తల్లులకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో కదా!
Sketch courtesy: artamaze.wordpress.com

'ఈనాడు' మిత్రులారా...ఒక్కసారైనా స్పందించరా?

జర్నలిస్టులకు, ముఖ్యంగా....'ఈనాడు' లో పనిచేసే మిత్రులకు, ఒక గమ్మత్తైన అలవాటు ఉంటుంది. అదే...తమ చాప కిందికి నీళ్ళు వచ్చే దాకా స్పందించకపోవడం. అన్యాయాలకు వ్యతిరేకంగా వారు రాస్తారు కానీ...తమకు జరిగే అన్యాయాల గురించి పట్టించుకోరు. ఎందుకంటే బతుకు భయం, ఉద్యోగ అభద్రత. 'ఈనాడు' లో పనిచేసే కమ్మ కులస్థులు, 'సాక్షి' లో పనిచేసే రెడ్డి కులస్థులు తమ యాజమాన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడరన్న ఒక వాదన ఉంది. అది నిజమేనేమో అనిపిస్తుంది. స్పందించే గుణం అనేదే జర్నలిస్టులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. స్పందించడానికి కులం, గోత్రం, ప్రాంతం, లాభ నష్టాలు బేరీజు వేసుకునే జర్నలిస్టులు ఎక్కువ కాబట్టే తెలుగు జర్నలిజంలో నాణ్యత ఇలా ఏడ్చింది. ఇది ఎందుకు రాస్తున్నానంటే... మల్లికార్జున్  ఇంతగా ఇబ్బందులు ఎదుర్కుని  ఫైట్ చేస్తున్నా...జర్నలిస్టులు పెద్దగా స్పందించకపోవడం. 
 
తన ఆర్ధిక ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. జర్నలిస్టుల కోసం ఎన్నో కష్టాలు  అనుభవిస్తున్నారాయన. "మనం కేసు గెలిస్తే...ఈనాడులో ప్రతి ఉద్యోగికి లాభం సార్. ఎలాగైనా సరే ఈ పోరాటాన్ని ఒక కొలిక్కి తేవాలి," అని ఆయన ఎంతో ఆశాభావంతో నాతో అన్నారు. ఆయనపై భౌతిక దాడికి ఒక ప్రయత్నం కూడా జరిగింది. ఈ కేసుల వల్ల తనకు జరిగిన, జరుగుతున్నఅవమానాలకు లెక్కే లేదు. "పిల్లలు బ్రెడ్ అడిగినా కొనివ్వలేని పరిస్థితి," అని ఆయన మాటల సందర్భంగా చెబితే చాలా బాధ అనిపించింది. ప్రస్తుతం 'ఈనాడు' తో కేసు గొడవలో ఉన్నందున మరొక ఉద్యోగం చేసే అవకాశం లేదు తనకు. ఇలాంటి సహోద్యోగిని ఆదుకోవాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది.
ఆయనకు చేతనైన ఆర్ధిక, మానసిక సహాయం చేయడం మన విధి, తక్షణ కర్తవ్యం.
మల్లికార్జున్ ఫోన్ నంబర్:  9441550300
 మల్లికార్జున్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక మిత్రుడు రామోజీ రావు గారి కుమారుడు సుమన్ దుర్మరణం గురించి ప్రస్తావన తెచ్చాడు. జర్నలిస్టులను ఇబ్బంది పెట్టి సంపాదించింది...చివరకు కొడుకునైనా కాపాడుకోలేక పోయింది...అని. తప్పులకు శిక్షలు ఇక్కడే ఉంటాయనే వాదన నిజమో కాదో తెలియదు. 
ప్రస్తుతం 'ఈనాడు' వ్యవహారాలూ చూస్తున్న కిరణ్ కూ పిల్లలు ఉన్నారు. కుటుంబ బాధలు ఆయనకూ తెలుసు. ఈ బ్లాగ్ కిరణ్, ఆయన సలహాదార్లూ చదువుతారు. వారైనా స్పందించి మల్లికార్జున్ ను మానవత తో ఆదుకోవాలి. కోర్టుకెక్కిన వారు తమకు వ్యతిరేకులు, వారిని నాశనం చేయాలన్న పిచ్చి భావనను వదలాలి.    

Wednesday, February 13, 2013

జర్నలిస్టు మిత్రులారా...కాస్త స్పందించండి...

రాతలతో ప్రపంచానికి సుద్దులు చెప్పే 'ఈనాడు' యాజమాన్యం చేతలలో పచ్చి కార్మికవ్యతిరేకి, ఉద్యోగవ్యతిరేకి అన్న విమర్శ నిజమే అనిపిస్తున్నది. హక్కుల కోసం నినదించిన వారిని ఇబ్బందులు పెట్టడంలో భాగంగా ఈటానగర్ బదిలీ చేసి కక్ష సాధించే 'ఈనాడు'.... పోరాట యోధుల కుటుంబాలలో సృష్టించే సంక్షోభం అంతా ఇంతా కాదు. అందుకు పెద్ద  ఉదాహరణ గడియారం మల్లికార్జున శర్మ (జీ.ఎం.ఎస్.).

వేతనాలు, ఇతర విషయాల్లో 'ఈనాడు' పై ఎలుగెత్తిన జీ.ఎం.ఎస్.ఏడాదిగా జీతం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. భువనేశ్వర్ నుంచి ఈటానగర్ బదిలీకి గురైన ఈయన 'ఈనాడు' పై  కేసులు దాఖలు చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం కోసం లేబర్ డిపార్టుమెంటు ను ఆశ్రయించినందుకు 'ఈనాడు' యాజమాన్యం తనపై కక్ష కట్టిన విషయం మీకు తెలిసిందే. తను భువనేశ్వర్ లో ఉండగా...జీ.ఎం.ఎస్. వేతన సంఘాన్ని కూడా ఆశ్రయించారు

'న్యూస్ టుడే' కింద ఉద్యోగులను నియమించి వారిని ప్రత్యక్షంగా 'ఈనాడు' కోసం వాడుకుంటున్నారన్న విషయంలో నేను కూడా మొన్నామధ్యన లేబర్ కమిషనర్ ఆఫీసులో సాక్ష్యం ఇచ్చాను. 'ఈనాడు' జర్నలిస్టులు అందరి బాగు కోసం జీ.ఎం.ఎస్. పడుతున్న శ్రమను, పోరాట పటిమను అభినందిస్తూ పలువురు జర్నలిస్టులు కూడా సాక్ష్యాలు సమర్పించారు. దానికి సంబంధించి 'ఈనాడు' కు నోటీసులు వెళుతున్నాయి. 

ఈ పనిలో భాగంగా హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున్ ను నిన్న రాత్రి నా అడ్డా (ఖైరతాబాద్ చౌరస్తా లోని ఇరానీ కఫె) లో కలుసుకున్నాను. తన ఆర్ధిక ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. జర్నలిస్టుల కోసం ఎన్నో కష్టాలు  అనుభవిస్తున్నారాయన. "మనం కేసు గెలిస్తే...ఈనాడులో ప్రతి ఉద్యోగికి లాభం సార్. ఎలాగైనా సరే ఈ పోరాటాన్ని ఒక కొలిక్కి తేవాలి," అని ఆయన ఎంతో ఆశాభావంతో నాతో అన్నారు. ఆయనపై భౌతిక దాడికి ఒక ప్రయత్నం కూడా జరిగింది. ఈ కేసుల వల్ల తనకు జరిగిన, జరుగుతున్నఅవమానాలకు లెక్కే లేదు. "పిల్లలు బ్రెడ్ అడిగినా కొనివ్వలేని పరిస్థితి," అని ఆయన మాటల సందర్భంగా చెబితే చాలా బాధ అనిపించింది. ప్రస్తుతం 'ఈనాడు' తో కేసు గొడవలో ఉన్నందున మరొక ఉద్యోగం చేసే అవకాశం లేదు తనకు. 

'ఈనాడు' లో ఉన్న వారే కాకుండా జర్నలిజం లో ఉన్న మనసున్న మిత్రులు అంతా వెంటనే స్పందించాల్సిన సమయమిది. యాజమాన్యాలు హింసిస్తున్నా...చస్తూ బతకడమో...నిస్సహాయంగా వేరే పత్రిక లేదా చానెల్ లో చేరడమో చేస్తున్నాం. మనలాంటి వారికి ఆశాదీపం, స్ఫూర్తి ప్రదాత మల్లికార్జున్. ఆయన చేస్తున్న పోరాటం ఒక కొలిక్కి వస్తే...అది జర్నలిస్టుల వేతన హక్కుల పోరాటంలో ఒక పెద్ద ఘట్టం అవుతుంది. మనం చేయలేని పనిని ఎన్నో కష్టనష్టాలనోర్చి చేస్తున్న మన సహచారుడ్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? ఆయనకు చేతనైన ఆర్ధిక, మానసిక సహాయం చేయడం మన విధి, తక్షణ కర్తవ్యం. జర్నలిస్టులకు నయా పైసా సహాయం చేయకుండా...పదవులు అనిభవిస్తున్న...పేరు గొప్ప జర్నలిస్టు నాయకులారా....మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మల్లికార్జున్ కు చేయూతనివ్వండి.

న్యాయం కోసం పోరాడుతున్న ఒక వ్యక్తి పిల్లలు ఈ న్యాయ పోరాటం వల్ల ఇబ్బంది పడడం మనకు అవమానం. దయచేసి మీరు స్పందించండి. మీకు తోచిన సహాయం చేయండి. మనసున్న ప్రతి జర్నలిస్టు దయచేసి స్పందించాల్సిందిగా విజ్ఞప్తి. ఆయన ఈ రోజు రాత్రి వరకు హైదరాబాద్ లో ఉంటారు. మీరు కావాలనుకుంటే...తనను కలవవచ్చు. 
మల్లికార్జున్ ఫోన్ నంబర్:  9441550300

Monday, February 11, 2013

మమత ఆవేశం అర్థం చేసుకోదగినదే!

పదవుల్లో ఉన్నవారు బీ పీ పెంచుకోకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు...అన్నవి నిజమే అయినా...ఒకొక్కసారి జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల విషయంలో కొందరు నేతలు నిగ్రహాన్ని కోల్పోయి ఆగ్రహం కనపరిచి మీడియా దాడికి గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న ఫోటోగ్రాఫర్లపై కనబరిచిన కోపం ఈ కోవలోనిదే. 

'మాతి ఉత్సవ్' పేరిట పభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో Panaragh అనే చోట ఇది జరిగింది. అక్కడ వంట ఏర్పాటు ఎలా వుందో చూడడానికి దీదీ వంటశాలకు వెళ్ళినప్పుడు...భద్రతా వలయాన్ని చేదించుకుని ఒక ఫోటోగ్రాఫర్ మంట మీద ఉన్న పాత్రకు అవతలి వైపు వెళ్లి కింద వున్న వస్తువులను తొక్కుతూ...ఆ యాంగిల్ నుంచి  మమత ఫోటో తీయాలని ప్రయత్నించినప్పుడు ఆమెకు ఒళ్ళు మండింది. "ఒక్కటి చరుస్తా. బుద్దిలేదా? ఒక పక్క మంట మీద అన్నం వుడుకుతున్నది కనపడడం లేదా?" అని మమత అన్నారట. ఆమె తన మాతృభాషలో అన్న మాటలు ఇలా వున్నాయి. 
"Ek thappar debo. Ashabhyagulo. Dekhchen na agune ranna hochhe (I will give you a tight slap. You are all uncivilized. Can't you see that food is being cooked on the fire?)."

ఈ ఘటనతో ఒళ్ళు మండిన పత్రికలు మమతపై దాడి ఆరంభించాయి. నా లెక్క ప్రకారం...ఒకటి రెండు రోజుల పాటు బెంగాల్లో జర్నలిస్టులు ప్రదర్శనలు కూడా చేస్తారు. ఆమె 'దురహంకారాన్ని దునుమాడుతారు. తన కారు తీసుకు రావడంలో జరిగిన జాప్యానికి కోపగించుకుని..."ఏమిటీ లేటు? తోలు తీస్తా..." అని తన భద్రతా సిబ్బందిని అన్న ఒక వారం తిరగక ముందే మమత ఇలా జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారని కొన్ని పత్రికలు విమర్శలు మొదలు పెట్టాయి.  కనిపించిన అందరినీ కరవడం జబ్బు కిందకు వస్తుంది కానీ...నిన్నటి ఘటనలో మమతను తప్పు పట్టలేం. ఫోటో జర్నలిస్టు ప్రవర్తనను మాత్రం ఖండించక తప్పదు. 

పాపం...మంచి ఫోటోలు తీయాలని, ఇతర పత్రికల కన్నా మంచి యాంగిల్స్ కావాలని ఫోటో గ్రాఫర్లు తాపత్రయ పడతారు. దానివల్ల  అధికారిక కార్యక్రమాలలో ఫోటో జర్నలిస్టులు తోపులాటకు, తగువులాటకు దిగక తప్పని పరిస్థితి. ఒకొక్కరు వందల కొద్ది ఫోటోలు తీసుకోక తప్పడం లేదు. 

మొన్నీ మధ్యన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగితే....డాక్టరేట్ పట్టా తీసుకోవడానికి నేను తెల్లబట్టలు వేసుకుని 
టాగోర్ ఆడిటోరియం కు వెళ్లాను. అక్కడ నా సీటు నంబర్ ఏడు. అంటే..ముందు వరసలో వుంటుంది. అక్కడి నుంచి స్టేజ్ మీద ఉన్న వారిని చూడడం కుదరలేదు. కారణం...మన ఫోటో జర్నలిస్టు మిత్రులు...చాలా సేపటి వరకూ...వాళ్ళ ముడ్లు చూస్తూ గడపటంతోనే  సరిపోయింది. వాటిని నిరంతరం చూస్తూ...అపుడప్పుడు నిలబడి గెస్టులను చూస్తుంటే...చాలా ఇబ్బంది అనిపించింది. నా పక్కనే కూర్చున్న..అరబిక్ లో పట్టా పొందిన ఒక మహిళ వాటిని చూడలేక మొహం వేరే వైపు తిప్పుకుని అవస్థ పడింది. ఇక్కడ ఎవ్వరినీ తప్పుపట్టలేని దుస్థితి. ఎవళ్ళ డ్యూటీ వాళ్ళది. 

ఈ రోజుల్లో వివిధ ప్రోగ్రాంలు కవర్ చేస్తున్న జర్నలిస్టుల సంగతి దారుణంగా ఉంది. గొట్టాలు (చానెల్స్) ఎక్కువయ్యాయి, మంచీ మర్యాద తగ్గిపోయాయి. స్టేజ్ మీద ఉన్న నేతలు/ అధికారులు/ ముఖ్యుల ఎదురుగా వీడియో గ్రాఫర్లు, పోటో గ్రాఫర్లు ఒక దడి కడుతున్నారు. వాళ్ళు నిలబడతారు. దాంతో స్టేజ్ మీద ఏమి జరుగుతుందే తెలియడం....అభిముఖంగా కూర్చున్న వారికి కష్టం. 

"బ్రదర్...ఒక రెండు ఫోటోలు తీసుకుని జరగవచ్చు కదా..." అని ఎవరైనా అంటే...వాళ్ళంతా కలిసి గయ్యిన లేస్తారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే...మీడియా స్వాతంత్ర్యంను దెబ్బ తీస్తున్నారని ధర్నా చేస్తారు. ఇదొక క్లిష్ట సమస్య. జర్నలిస్టుల ఉద్యోగాలు పోతున్నా...దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉన్న జర్నలిస్టు సంఘాలు పలువురికి (జర్నలిస్టులకు కూడా) అసౌకర్యంగా ఉన్న ఈ సమస్యపై ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది.

Saturday, February 9, 2013

అఫ్జల్ గురు ఉరిపై రభస అవసరమా?

ఒకొక్కసారి ఈ టీ వీ చానెల్స్ లో కొన్ని వాదనలు వింటుంటే...మన బుర్ర ఎదగాల్సి ఉందా? లేక ఎదుటివాడి బుర్ర చెడిందా? అన్న సందేహం కలుగుతుంది. పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారిగా సుప్రీంకోర్టు నిర్ధరించిన అఫ్జల్ గురును ఈ ఉదయం గుట్టుచప్పుడు కాకుండా తీహార్ జైల్లో తీసిన ఉరి మీద ఇంగ్లిష్ చానెల్స్ లో జరుగుతున్న చర్చలు వింటే మరొక సారి ఈ సందేహం కలిగింది.

ఏ మాటకు ఆ మాటే...మన తెలుగు ఛానెల్స్ వాళ్ళు ఇలాంటి లోతైన చర్చలు పెట్టరు, రాద్ధాంతం చేయరు. పైగా మనకు అంత లాజిగ్గా విషయ పరిజ్ఞానంతో వాదన వినిపించే మేధావులు లేరు.  ఉన్నదల్లా...ఆస్థాన కామెంటేటర్లు. ఛానల్ యజమాని స్టూడియోకి పిలిస్తే చాలని, వాళ్ళు అడిగింది తాము చెబుతుండగా...మన భార్యా పిల్లా జెల్లా బంధువులు, అంతే వాసులు చూసి పొగిడితే చాలనుకునే బ్యాచ్ ఇక్కడ వర్ధిల్లుతున్నదని జర్నలిస్టులే చెబుతారు. కాకపోతే...కుక్కల్లా స్టూడియోల్లో మొరిగి సదరు చర్చను రక్తి కట్టించాలనుకునే సెక్షన్ ఉంది. లేకపోతె...జర్నలిజం పేరుచెప్పుకుని పైరవీలు చేసి సంపాదించుకున్న వర్గం హవా నడుస్తున్నది...స్టూడియోల్లో. పైగా...ప్రశ్నలు అడిగే మహానుభావుల్లో కూడా చాలా వరకు మిడిమిడి జ్ఞానంతో... లోతైన ప్రశ్నలు వేయకుండానే...ఈ రోజుకు డ్యూటీ అయ్యిందని అనిపించుకుని చేతులు దులుపుకుని పోయే వాళ్ళే ఎక్కువన్న అపవాదు ఉంది. దీని మూలంగా...మనకు పెద్దగా చికాకు లేదు. ఒక అర్థగంట పాటు వీళ్ళు చర్చ పేరుమీద హడావుడి చేసి వెళ్ళిపోతారు. కాసేపు రణగొణ ధ్వని తప్ప చర్చ లోని అంశాలు మన బుర్రలను వెంటాడవు.  

ఇంగ్లిష్ చానెల్స్ లో మేధావులు మాత్రం అద్భుతంగా వాదన చేసి...తప్పును ఒప్పుగా, ఒప్పును పరమ తప్పుగా ప్రొజెక్ట్ చేసి మన బుర్ర చెడగొడతారు. రాజ్దీప్ సర్దేశాయ్, అర్ణబ్ గోస్వామి, బర్ఖా దత్ లు వాళ్ళ రాగ ద్వేషాల ను బట్టి పానెల్ డిస్కషన్ జరిపి మనలను గందరగోళ పరుస్తారు. 

ఇవ్వాళ చర్చలోని పలువురు మేధావులు అఫ్జల్ గురు ఉరి దారుణమన్నట్లు మాట్లాడారు. కసబ్ ను చంపకూడదు, అఫ్జల్ ను చంపకూడదు. మైనారిటీ లకు వాళ్ళు నిజమైన ప్రతినిధులు అన్నట్లు కొందరు, ఉరి ఘోరమైన పాపం అని మరి కొందరు...అద్భుతంగా వాదించారు. ఆడపిల్లలు బురఖాలు ధరించాలి, పాటలు పాడకూడదు అని మత సంప్రదాయాలు వల్లెవేసేవారు తప్పును తప్పుగా మాట్లాడడం లేదు. దేశభక్తి తో తప్పును తప్పు అని మేధావులు చెప్పకపోతే....సొంత మతం, సొంత మనుషులు, సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే....ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది?  

నా వరకు అఫ్జల్ ఉరి ఏ మాత్రం తప్పు అనిపించలేదు. క్షమాభిక్ష కోసం ఇన్నేళ్ళు జైల్లో పెట్టకుండా ఎప్పుడో ఈ పనిచేస్తే అయిపోయేది. సమయం సందర్భం గురించి రచ్చ కూడా అనవసరం. నన్ను అడిగితే...ఈ మత పిచ్చతో దేశంలో ప్రశాంతతకు భగ్నం కలిగించే వాళ్ళను, మతోన్మాద ప్రసంగాలు చేస్తూ ఇతర మతస్థుల మనోభావాలను గాయపరిచే వారిని (హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా) కూడా అర్జెంటుగా కసబ్, అఫ్జల్ దగ్గరకు పంపాలి. పైన వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఇలా...చట్టం తన పని చేసుకుపోతుండగానే...ఉరి మంచిదా కాదా అన్న అంశంపై ఒక నిర్ణయం జరగాలి.  ప్రజాభ్యున్నతి ధ్యేయంగా సమ సమాజం కోసమంటూ అడవులు పట్టుకు తిరుగే వారిని పట్టుకుని పిట్టలను కాల్చినట్లు కాల్చి కథలు చెప్పే ప్రభుత్వాలు...దేశంలో శాంతిని ఖతం చేసే మతోన్మాదులను ఓట్ల కోసమో, మరే ప్రయోజనం కోసమో క్షమిస్తే కష్టం.   

అందరికన్నా....ఉగ్రవాదంపై పోరాడుతున్న మణీందర్ సింగ్ భిట్టా వాదన నాకు బాగా నచ్చింది. "భాయీ సాబ్...అఫ్జల్ కు ఉరి తీయడం గురించి ఈ బాధిత కుటుంబాలను అడగండి. మొహానికి ఇంత మేకప్ వేసుకుని మీ స్టూడియోలలో కూర్చొని మాట్లాడే వారికి ఈ బాధ తెలియదు," అని భిట్టా భాయ్ అన్నాడు. ఈ మాటలు నిజం కాదంటారా?     

Thursday, February 7, 2013

జర్నలిజంలో PhD- నెరవేరిన ఒక కల

బ్లాగ్ మిత్రులారా...ప్రియమైన పాఠకులారా...ఆత్మ బంధువుల్లారా....

ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు... 2013 ఫిబ్రవరి ఏడో తేది...ఎప్పుడూ తియ్యగా, తడి ఆరని కలలా గుర్తుండిపోతుంది. ఏడేళ్ళ కిందట 'ది హిందూ' పత్రిక రిపోర్టర్ గా ఉండగా చరిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్టుమెంటు లో PhD రిజిస్టర్ చేసుకున్నాను...ఎన్.రామ్ గారి లిఖితపూర్వక అనుమతితో. 'జర్నలిస్టులు-నైతిక విలువలు' అన్న అంశంపై పరిశోధన అనుకున్నంత సులువు కాలేదు. అప్పటి నుంచి కష్టపడి, కలతపడి, దుఃఖపడి, మదనపడి, బాధపడి, బద్ధకం వల్ల కిందపడి మీదపడి  ఎలాగోలా పరిశోధన పూర్తయి ఈ రోజున డిగ్రీ ప్రధానం జరిగింది. ఈ పరిశోధన పని ఒత్తిడి కారణంగా బ్లాగింగ్ కు కొద్దిగా దూరం కూడా అయ్యాను. 



ఒక పన్నెండేళ్ళ కిందట జర్నలిజం లో నేను రెండు గోల్డ్ మెడల్స్ తీసుకున్నటాగోర్ ఆడిటోరియం లో జరిగిన ఉస్మానియా 79 వ స్నాతకోత్సవం లో ఇద్దరు ప్రొఫెసర్లు ఎస్.సత్యనారాయణ (వైస్ చాన్సలర్), గోవర్ధన్ మెహతా (ప్రముఖ రసాయన శాస్త్ర నిపుణుడు) చేతుల మీదుగా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో PhD పట్టా అందుకున్న ఇద్దరిలో నేను ఒకడిని. మొత్తం 279 మందికి ఈ పట్టాలు అందించారు. ఇంతవరకూ ఉస్మానియా నుంచి ఒక అరడజను మందిమి మాత్రమే పట్టాలు పొందగలిగాము. 
బాధ కలిగిన విషయం ఏమిటంటే...విశ్వవిద్యాలయం చాన్సలర్ అయిన గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి రాకపోవడం. తెలంగాణా కు వ్యతిరేకిగా ముద్ర పడిన ఆయన రావడానికి వీల్లేదని విద్యార్ధి సంఘాలు హెచ్చరించడం, హడావుడి చేయడంతో ఆయన రాలేదని చెప్పారు. ఇది డిగ్రీలు పొందిన వారికి  సమంజసంగా తోచలేదు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల వ్యతిరేకత ఉండవచ్చుగానీ...ఎందరో తెలంగాణా విద్యార్థులకు కలలాంటి స్నాతకోత్సవానికి, ఆయన అభిప్రాయాలకు సంబంధం ఏముందని పలువురు ప్రశ్నించారు. తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం సోనియా, మన్మోహన్, రాహుల్ చేతిలో ఉంది, ఈ గవర్నర్ మాట విని తెలంగాణా ఇవ్వడం లేదనుకోవడం సమంజసంగా తోచడం లేదు. 

కాస్త అనారోగ్యం తో ఉన్న మా అమ్మ, పిల్లలను తీసుకు రావద్దని యూనివర్సిటీ ప్రత్యేకించి చెప్పడం వల్ల నా పుత్రుడు ఫిడేల్ ఆర్ స్నేహిత్ ఈ స్నాతకోత్సవానికి రాలేదు. మా నాన్న ప్రత్యేకించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని..."I am proud of you..." అని నాతో గర్వంగా చెప్పారు. మా కుటుంబం లో ఇది మొట్టమొదటి PhD. పరిశోధనకు అడుగడుగునా ప్రోత్సాహం అందించిన నా జీవిత భాగస్వామి హేమ రిపోర్టింగ్ గొడవలో పడి కాస్త లేట్ గా వచ్చింది స్నాతకోత్సవానికి. 

మొత్తం మీద మా అమ్మకు చిన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ అయినందుకు ఆమె, నేను ఆనందించాము. నా గైడ్ ప్రొఫెసర్ పద్మజా షా, ఈ టాపిక్ కు ఒక రూపం ఇచ్చిన నా మొదటి గైడ్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్, నేను నిస్పృహకు గురైనప్పుడు ఓదార్చిన ప్రొఫెసర్ బాలస్వామి-ప్రొఫెసర్ నరేందర్ లకు కృతఙ్ఞతలు. నా వెన్నంటి ఉండి సాంకేతిక సహకారం అందించిన నా కూతురు మైత్రేయి, నా ఆప్త మిత్రుడు బలుసూరి శంకర్ లకు థీసిస్ లో విధిగా థాంక్స్ తెలిపాను. వివిధ భంగిమల్లో ఫోటోలు తీసిచ్చిన నా మాజీ సహచరుడు, మాకు ఇంకో కొడుకు లాంటి గోపాల్ కు థాంక్స్. 

ఈ డిగ్రీ ఇచ్చిన అదనపు బాధ్యతతో సమాజ హితం కోసం మరింత పాటుపడతానని గట్టిగా హామీ ఇస్తూ...ఈ ఇకిలించే ఫోటో తో సెలవు తీసుకుంటాను. 

Wednesday, February 6, 2013

"మారిటల్ రేప్" మీద చర్చోపచర్చలు

ఒక రెండు దశాబ్దాల పాటు మీడియాలో పనిచేసినా...వివిధ అంశాలలో మీడియా చిత్తశుద్ధి పట్ల నాకు పెద్దగా నమ్మకం కుదరదు. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఐతే మరీ. వీళ్ళ కథనం లేదా చర్చనీయాంశం మహిళ (అదీ ఒక అందమైన మహిళ లేదా బాలిక) అయితే...దాన్ని సాగతీసి పీల్చిపిప్పిచేసి ఆనందిస్తారు. తెలుగు చానెల్స్ లో పలు చానెల్స్ ఈ విద్యలో ఆరితేరాయి. ఈ మీడియానే సర్వరోగ నివారిణి అని భ్రమించి ఎవరి భార్యో ఏ తెలుగు చానెల్ ఆఫీసుకు వెళ్లి 'మా ఆయన నన్ను రకరకాలుగా హింసిస్తున్నాడు. లైవ్ ఏర్పాటు చేయండి' అని అడిగితే...వాళ్ళు ప్రత్యక్ష ప్రసారానికి వెనుకడుగు వేయరని నాకు నమ్మకం. ఇలాంటి కేసులు తెలుగు ప్రేక్షకులు ఎన్ని వీక్షించలేదు? 

ప్రేక్షకులను కట్టి పడేసే మసాలా దినుసులు ఇలాంటి స్టోరీ లలో, చర్చలలో బోలెడు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని టీ వీ ఛానెల్స్ వదలవు. "అన్నా...టీ వీ వినోదం కోసం ఉన్నది. ఇలాంటి ఎలిమెంట్లు  వినోదానికి ముఖ్యం," అని అబద్ధాలే జీవితంగా ఈ విద్యలో ఆరితేరిన ఒక సీ ఈ ఓ నాతొ అన్నాడు ఒక రెండేళ్ళ కిందట. సమస్య పరిష్కారం కోసం మీడియా ప్రయత్నించాలి లేదా సమస్యను ప్రొజెక్ట్ చేసి సమాజ అంతరాత్మను కదిలించాలి తప్ప టీ ఆర్ పీ కోసం కక్కుర్తి పడడం బాధ్యతను మరవడమే.  పైగా ఇప్పటికే అడుగడుగునా దారుణ వివక్షకు గురవుతున్న మహిళలు, బాలికల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుంది. 

సరే...నా ఈ ఏడుపు ఎలా ఉన్నా...నాకు కాస్త తీరిక దొరికి పొద్దుపోక నిన్న (ఫిబ్రవరి ఐదో తేదీ) రాత్రి ఇంగ్లిష్ చానెల్స్ చూసాను. ND-TV, CNN-IBN, TIMES-NOW, BBC మార్చి మార్చి చూసాను.  ఇందులో మొదటి రెండు చానెల్స్ లో "marital sex" అనే అంశం మీద సుదీర్ఘ చర్చలు జరిగాయి. మామూలుగా జరిగే రేప్ ల సంగతి అలా ఉంచితే...సమ్మతి లేకుండా భర్త భార్యను సెక్స్ కోసం బలవంతం చేస్తే అదీ రేపే అవుతుందని, అందుకు గానూ అతన్ని శిక్షించాలని ND TV బర్ఖా దత్ వాదించారు. ఒక పదేళ్ళు కాపురం చేసాక.. 'మా ఆయన నన్ను నిన్న రాత్రి రేప్ చేసాడు' అని భార్య కేసు పెడితే...పోలీసులు దీన్ని ఎలా నిరూపిస్తారని CNN-IBN సాగరిక అనుమానం వ్యక్తం చేసారు. చర్చలో పాల్గొన్న వాళ్ళు తమ వాదనలను బలంగా వినిపించారు. నిజంగా ఇలాంటి చట్టం అవసరం ఎంతైనా ఉందని వాదిస్తూ..'మహిళ మగవాడిని రేప్ చేసిన ఘటనలు ఉన్నాయా?' అని ఒక విద్యావంతురాలు ఆవేశంగా ప్రశ్నిస్తే....'మేడం...మహిళలు రేప్ చేసిన కేసులు  అనేకం ఉన్నాయి....' అని ఒక పురుషుడు కౌంటర్ వేసాడు. భర్త మీద రేప్ కేసు వేసే వెసులుబాటు భార్యకు ఇస్తే...కొంప కొల్లేరు అవుతుందని, సంసారాలు గుల్ల అవుతాయని ఇంకొక బాధితుడు బలంగా వాదించాడు. ఈ చర్చతో నా మతి పోయింది. 

రెండేళ్ళ లోపు వయసున్న తన కూతురును తన భర్త (ఫ్రెంచ్ దౌత్యవేత్త) లైంగికంగా ఎలా వేధించిందీ ఒక మహిళ వివరించే ఏర్పాటు మొదటి చానెల్ లో కలిగించింది. చర్చకు దూరంగా అనిపించినా ఈ ఘటన చాలా ఆవేదన కలిగించింది. ఈ సమయంలోనే...TIMES-NOW లో అర్ణబ్ గోస్వామి కాశ్మీరీ బాలికలు గాన కచేరీలు ఇవ్వకుండా ఫత్వా జారీ చేసిన అంశం మీద అందరినీ కడిగి పారేస్తుండగా...BBC లో స్వలింగ సంపర్కుల పెళ్లిని అంగీకరించే బిల్లు మీద బ్రిటన్ పార్లమెంటులో జరుగుతున్న చర్చ మీద మంచి కథనం ప్రసారమయ్యింది.

మొత్తం ND-TV, CNN-IBN చర్చలలో ఎంతసేపటికీ 'మారిటల్ సెక్స్' గురించి పలు కోణాలలో ఆసక్తికరమైన చర్చ జరిపారు తప్ప...అద్భుతమైన కుటుంబ, వివాహ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ నవీన మానవుడు ఏమి చేయవచ్చో మాటమాత్రంగా నైనా ప్రస్తావించలేదు. సెక్స్ విద్యలేకుండా, సెక్స్ జీవితం ప్రాముఖ్యం తెలియకుండా బతుకుతున్న సమాజానికి కావాల్సిన చర్చలు ఇవేనా? ఏమో? 

అయ్యలారా...అమ్మలారా...ముందుగా పరమ హేయమైన రేప్ లను నిరోధించేలా ప్రభుత్వాలు నడుం బిగించేట్లు ఒత్తిడి తెండి. ఆడపిల్లల మీద అనుక్షణం జరుగుతున్న దాడుల నిరోధానికి ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేయండి. మన ఆడపిల్లలు, మహిళలు జంకూ గొంకూ లేకుండా రోడ్ల మీద హాయిగా తిరిగే పరిస్థితి కల్పించండి. ఇది తక్షణావసరం. 

Sunday, February 3, 2013

బిజీ హైదరాబాద్ టూ కూల్ ఖమ్మం

నిన్న హైదరాబాద్  నుంచి బస్సులో ఖమ్మం వస్తుంటే...ఆదివారం నాడు తిరుపతి వెంకన్న దర్శనం కోసం ఒక ఎనిమిది గంటలు క్యూలో నరకయాతన పడి ఎలాగోలా దర్శనం ముగించుకుని బైటికి వచ్చి ఫ్రీ గా ఇచ్చిన తియ్యటి చక్రపొంగలి ప్రసాదం తింటున్న అనుభూతి కలిగింది. హడావుడి జీవితం, ఎవడి గొడవ వాడిది. కర్ణభేరి పగిలిపోయేలా వాహనాల శబ్ద కాలుష్యం. పొగ, మోసం, దగా, గజిబిజి గందరగోళం. కానీ దారిపొడుగునా మనసు ఆందోళనతో  స్థిమితం లేకుండా పోయింది. 

మొన్న గురువారం నాడు భారతీయ విద్యా భవన్ దగ్గర ఫిదెల్ ను దింపి...ఎప్పుడూ నవ్వుతూ ఉండే ప్రిన్సిపాల్ రమాదేవి మేడం తో గేటు దగ్గరే కాసేపు మాట్లాడి యూనివెర్సిటి ఆఫ్ హైదరాబాద్ వైపు వెళుతుంటే...ఎదురుగా ఒక టాటా సుమో ను ఓవర్ టేక్ చేయబోయిన మారుతి వాన్ వాడు నా టూ వీలర్ మీదికి రాబోయాడు. ప్రమాదం గ్రహించి బండి స్పీడు తగ్గించకుండానే బ్రేకు కొట్టిన ఫలితంగా రోడ్డు పక్కన బండ రాళ్ళ మీద పడ్డాను. అదృష్టవశాత్తూ హెల్మెట్ ఉండబట్టి మన బుర్ర పగలకుండా బతికిపోయింది. బట్టలు చినిగి చేటలయ్యాయి. అయినా...టైం కు క్లాసుకు వెళ్లాలని...ఆటోలో వెళ్లి క్లాసు ముగించుకుని డాక్టర్ ను కలిసి ఫస్ట్ ఎయిడ్ కానించి ఇంటికి వచ్చాను. బండి మీద నుంచి పడడం..జీవితంలో ఇదే మొట్ట మొదది సారి. ఈ బంజారా హిల్స్ లో ఒక ప్రమాదం ఉందండోయ్. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగి రక్తం కారి కాళ్ళూ చేతులూ కొట్టుకుని గిలగిల లాడుతున్నా సహాయపడడానికి ఒక్కడూ ముందుకు రాడు. డబ్బున్న మారాజులు ఇలాంటి పనులకు దూరం మరి. అందుకే పడిన నా బండిని నేనే లేపి మళ్ళీ భారతీయ విద్యా భవన్ గేటు దగ్గర పెట్టి నా మిత్రుడు శంకర్ కు ఫోన్ చేసి రమ్మన్నాను.


నాకు జ్వరం వచ్చినా...ఏమైనా..పక్కన అమ్మ ఉండాలని అనిపిస్తుంది. అందుకే ఖమ్మంలో ఉన్న అమ్మకు హేమ ఫోన్ చేసి  రమ్మని చెప్పింది. నేనూ వెంటనే రమ్మని అడిగాను. పాపం...శనివారం ఉన్నపళంగా బయలుదేరిన అమ్మ ఖమ్మం బస్టాండ్ లో అదుపు తప్పి కంకర రాళ్ళ మీద పడి పోయింది. తనకు 63 సంవత్సరాలు, కాళ్ళ నొప్పులు. విషయం తెలియగానే నేను భుజం నొప్పిని పక్కన పెట్టి సాయంత్రం కల్లా ఖమ్మం చేరుకున్నాను. హైదరాబాద్ దాటి ఖమ్మం చేరి...మొహం అంతా చిన్న చిన్న గాయాలతో రక్కుకుపోయిన అమ్మను చూస్తే చాలా బాధేసింది. నాకు తగిలిన గాయాల కన్నా ఎక్కువ అమ్మకు అయ్యాయి. దాంతో ఒక మూడు  రోజులు ఇక్కడే మకాం వేయాలని నిర్ణయించుకుని స్థిరపడ్డాను.

దాంతో హైదరాబాద్ లో చేయించుకోవాలనుకున్న వైద్య పరీక్షలు ఖమ్మలో చేయించాను. ఇక్కడ డాక్టర్ గారిని కలిసినప్పుడు, టెస్టులకు వెళ్ళినప్పుడు మనుషులతో డీల్ చేస్తున్నాం అన్న భావన కలిగింది. విసుగు లేకుండా ప్రశాంతంగా మాట్లాడడం, మరీ దోచుకోకుండా వదిలెయ్యడం వంటివి అలా ఉంచితే....ఖమ్మం వస్తున్నప్పుడు సాయంత్రం వేళ హాయిగా ఒక కునుకు తీస్తున్నట్లు ఉన్న పల్లెలు మనసుకు ఆనందాన్ని ఇచ్చాయి. హైదరాబాద్ బిజీ జీవితానికి దూరంగా...అమ్మ, అన్నయ్య వదిన, పిల్లలు, ఇతర బంధువుల మధ్యన గడుపుతుంటే అనిపించింది దేవుడు ఇక్కడి గడియారాల ముల్లుల వేగం తగ్గించాడని.