కమిటీ ఏమిచెప్పినా, దాని అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒక్క ప్రాణమైన పోవడానికి వీల్లేదు. ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. ముఖ్యంగా మీడియా సొంత అజెండాలు మాని...శాంతిని కాపాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో మీడియాను నియంత్రించడం చాలా కష్టం కాబట్టి...ఎడిటర్లు, జర్నలిస్టులు స్వీయనియంత్రణ పాటించాలి. యాజమాన్యాలను రెచ్చగొట్టి అగ్గికి ఆజ్యం పోయకుండా...శాంతిని కాపాడడమే అందరి కర్తవ్యం కావాలి.
'ఆచితూచి వ్యవహరించండి' అని పిలుపునిచ్చిన న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపును తు.చ.తప్పకుండా పాటించాలని ఛానెల్స్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. నాగరికంగా ఎలా మెలగాలో...మనకు మనం నిరూపించుకోవడానికి...ఇది మంచి తరుణం. ప్రజాస్వామ్యయుతంగానే గళం విప్పి...సామరస్యంతో మెలుగుదాం. శాంతి భద్రతలను కాపాడుకుందాం.
---------------------------------------------------------------------------
ఈ పోస్టు పెట్టిన తర్వాత...ప్రముఖ బ్లాగర్ (సాహిత్యాభిమాని) శివ గారు ఈ కింది సూచనలు పంపించారు...రాము
మీరుచేప్పే స్వయం నియంత్రణకు నాకు తోచిన పది సూత్రాలు.
1. న్యూస్ లైవ్ కార్యక్రమాలను పూర్తిగా మానెయ్యాలి. ఈ లైవ్ కార్యక్రమాల వల్ల అదుపులేని వాగుడు ప్రసారం అవుతున్నది. కొన్నిసార్లు ఈ వాగుడే ఉద్రిక్తలకు దారి తీస్తాయి.
2. ఏమాత్రం కూడ అపార్ధం చేసుకోవటానికి వీలులేని భాషలోనే వార్తలను వ్రాయాలి చదవాలి. ఈపని లైవ్ లో మన వాళ్ళకు చేతకాదు. నోటికొచ్చినట్టు వాగుతారు. అందుకని లైవ్ ఉండకూడదు. నిష్ణాతులైన సంపాదకుల ఆధ్వర్యంలోనే వార్తలను ప్రసారం చెయ్యాలి.
3. విలేఖరి తన వార్తను లేదా రిపోర్టరుగా పిలవబడుతున్న అతని/ఆమె మాటలను రికార్డుచేసి అప్‌లింక్ ద్వారా పంపితే అందులో అతను/ఆమె చెప్పిన విషయాలు చూసి ప్రసారం చెయ్యోచ్చా లేదా నిర్ణయించి సంపాదకులు అనుమతించినాకే ప్రసారం చెయ్యాలి.
4. బ్రేకింగు న్యూస్ అనే మాట వాడకాన్ని, పదే పదే బ్రేకింగు న్యూస్ అంటూ ఏదో జరిగిపొయ్యింది అన్న భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రసారాలు చెయ్యటం నిషేధించాలి.
5. పొరబాటున ఏ ప్రాంతలోనైనా ఏదైనా సంఘటన జరిగితే, ఆ విషయం వెనువెంటనే రాష్ట్రం అంతా చాటింపు వెయ్యక్కర్లేదు. అక్కడకు వెళ్ళి నిజానిజాలు కనుక్కుని, ఒక సమగ్రమైన వార్తగా రూపొందించి, ఎడిట్ చేసి, ఎంతవరకూ చూపించాలో అంతవరకే చూపించాలి. ఎంతవరకు అన్న విషయం అంభువజ్ఞులైన సీనియర్ సంపాదకులకు తెలుసు. వాళ్ళకు వదిలెయ్యాలి. యాజమాన్యం తరఫున ఉండే కుర్ర ఎం బి ఏలు మానెజర్లుగా పిలవబడే వాళ్ళు ఈ ప్రొఫెషనల్ విషయాల్లో తల దూర్చకూడదు. వితండవాదం చేస్తూ తా బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే జర్నలిస్టులకు ఈ సంపాదకత్వం ఇవ్వటం మానాలి.
6. పోలీసులను మాటి మాటికి చూప కూడదు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు, ఎక్కడ ఉంటున్నారు వంటి విషయాలు చూపే ప్రయత్నాలు మానాలి. టివి లు అసాంఘిక శక్తులకు గూఢచారులు కాదు, కాకూడదు కదా!
7. ఎక్కడన్నా విధ్వంసం జరుగుతుంటే ఆ పని చేస్తున్న వ్యక్తుల ముఖాలు స్పష్టంగా చిత్రీకరించి చూపాలి. టి.వి రిపోర్టింగులో వీళ్ళకి ఉన్న నైపుణ్యమంతా ఇలాంటి విధ్వంసకారులను పట్టుకోవటానికి వీలుగా వీరి కవరేజి ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాని ఊరికే మండుతున్న బస్సులు, పగిలిపోయిన షాపు అద్దాలు చూపించటాలు మానాలి. ఈ ఊళ్ళొ ఇన్ని బస్సులు, ఆ ఊళ్ళొ ఇన్ని బస్సులు అని లెక్కలు కట్టి ప్రసారం చెయ్యకూడదు. రాయలసీమలో ఒక ఫ్యాక్షనిస్టు(2005 జనవరిలో అనుకుంటాను)హత్య జరిగినప్పుడు ఇలాంటి భాధ్యతలేని అనవసరపు లైవ్ టెలికాస్ట్ వల్ల అనేక సంబంధం లేని ప్రదేశాల్లో హింస చెలరేగింది.
8. ఒక నాయకుడో, మంత్రో ఒక మాట అనంగానే, అది పట్టుకుని పరుగులు పెట్టుకుంటూ ఆ వ్యక్తి ప్రతిపక్షం దగ్గరకు వెళ్ళి చూడండి అతను ఇలా అన్నాడు, మీ అభిప్రాయం ఏమిటి? మీ స్పందన ఏమిటి అని అడుగుతూ తంపులు పెట్టే జర్నలిజం మానాలి. మీడియా వార్తలను రిపోర్టుచెయ్యాలికాని, వార్తలను తమకు తామే వండకూడదు, తయారుచెయ్యకూడదు.
9. ఎజెండాలు పెట్టుకుని ఒక వర్గం వైపో లేదా ఒక పార్టీ వైపో వాలిపొయ్యి ప్రసారాలు, వ్రాతలు లేకుండా చూసుకోవాలి. ఇది చేస్తే దాదాపు అన్ని పేపర్లు మూసెయ్యాలి, అన్ని చానెళ్ళు భక్తి గీతాలు చూపాలి ఇవ్వాళ. ఖర్మ!
10. నాయకులు అని చెప్పుకునేవాళ్ళు బాధ్యత లేగుండా గాలిగా, చెత్త వాగుడు వాగుతుంటే, అమాయక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంగా ఉన్నవి లేనివి కల్పించి విద్వేషాలు చెలరేగేట్టుగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకు కవరేజీ ఏమాత్రం ఇవ్వకూడదు.
ఇవన్ని నాకు అనిపించిన కొన్ని సూత్రాలు. ఒక్క తెలంగాణా ఉద్యమం, శ్రీ కృష్ణా కమిషన్ రిపోర్టు సమర్పణ సమయం దగ్గరపడేప్పుడు మాత్రమే కాకుండా, మీడియా అని పిలవబడుతున్న ఈనాటి కాయితాల మీద అక్షరాలు ప్రింటుకొట్టే యాజమాన్యాలు, సాటిలైటు సమయం కొనుక్కుని, తమ చిత్తం వచ్చినట్టు ప్రసారాలు చేస్తూ ఇవ్వే వార్తలు అని చెప్పుకునే చానేళ్ళు సదా పాటించాలి. భారత దేశంలో మీడియా ఇంత గొప్పగా ఉన్నది, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించటంలో ఎంతో కృషి చేసింది అన్న పేరు తెచ్చుకోవాలి కాని, వాళ్ళే గొడవలకు కారణం అయ్యారు, గొడవలని ఇంకా ప్రేరేపించి పెంపొందించారు తద్వారా వాళ్ళు టి ఫి ఆర్ రేటింగులు పెంచుకున్నారు అన్న ఆరోపణలకు గురికాకూడదు.