Wednesday, October 26, 2011

జర్నలిస్టులకు నిజమైన దీపావళి ఆనందం

జర్నలిస్టు మిత్రులారా...ఇది మీకు నిజమైన ఆనంద దీపావళి. మీ జీవితాలలో వెలుగులు తెచ్చిన దీపావళి. ఈ శుభ సందర్భంలో మీకు త్రీ చీర్స్. 
జర్నలిజాన్ని పచ్చి వ్యాపారంగా మార్చి...జర్నలిజాన్ని అస్త్రంగా, రక్షణ కవచంగా చేసుకుని సమాంతర వ్యాపారాలు చేసుకుంటూ...జర్నలిస్టుల శ్రమ దోచుకుంటున్న యాజమాన్యాలకు మాత్రం ఇది చేదు కబురు. జస్టిస్ మజితియ వేజ్ బోర్డ్ సిఫార్సులను కేంద్ర కేబినేట్ ఆమోదించింది. 

దీనివల్ల దాదాపు నలభై వేల మంది జర్నలిస్టులకు, వార్తా పత్రికలూ, న్యూస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న వారికి ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. మజితియ (పక్క ఫోటో) గారి అంచనా ప్రకారం...ఇప్పుడు వస్తున్న ఒక రూపాయి జీతం రెండున్నర నుంచి మూడు రూపాయలకు పెరుగుతుంది. అంటే...పెరుగుదల 150 % కన్నా ఎక్కువే అని భావిస్తున్నారు. అయితే...జర్నలిస్టులకు జీతాలు చెల్లించడానికి నానా ఏడుపులు ఏడిచే పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు కు వెళ్ళాయి. కోర్టు తీర్పు December 7 న వస్తుంది. జూలై 2010 నుంచి ఈ సిఫార్సులు అమల్లోకి వస్తాయి. 2007 May లో మజతియ వేతన సంఘం ఏర్పడింది. 

దీనికి సంబంధించి 'ది హిందూ' పత్రికలో వచ్చిన వార్తను సంక్షిప్తంగా ఇక్కడ ఇస్తున్నాను. Photo and Text Courtesy: The Hindu

The Cabinet has approved only the recommendations related to the terms of reference of the Boards and those connected to the service conditions of the employees — like providing at least three promotions during the career, suggestion of increasing the retirement age to 65 years — have not been considered.

On the benefit if the recommendations were implemented, he said: “If an employee now gets Re.1 as total wages it may go up to Rs. 2.5 to Rs. 3 roughly.”

The Confederation of Newspaper and News Agency Employees’ Organisations (CNNAEO), that spearheaded the nationwide stir for notification of the Wage Boards reports, thanked Prime Minister Manmohan Singh and UPA chairperson Sonia Gandhi for the Union Cabinet decision which will benefit more than 40,000 newspaper employees.
CNNAEO general secretary M.S. Yadav said in a statement, “Though the decision (to approve Majithia Wage Boards) has come after 10 months of submission of the report, we appreciate the pro-worker stand of the government.”
Besides Mr. Yadav, CNNAEO leaders including Indian Journalists Union’s Suresh Akhauri, National Union of Journalists (India)’s senior leader N.K. Trikha, All India Newspaper Employees Federation general secretary Madan Talwar, Indian Federation of Working Journalists general secretary Parmanand Pandey and UNI Workers Union leader M.L. Joshi have guided the agitation for Wage Boards from the beginning.

Ashish Bagga, president of the Indian Newspaper Society (INS), on Tuesday expressed the apprehension that the Union Cabinet's decision to accept the recommendations of the Majithia Wage Boards may lead to the closure of a majority of small and medium newspaper publications, as the proposed wage hikes are very high and beyond the industry's paying capacity.
Mr. Bagga cautioned that even large publications would find it difficult to implement the hikes and said: “It is indeed unfortunate that the INS' request for re-examination of the flawed and one-sided report has not been considered by the government.”
He pointed out that a number of petitions challenging the Working Journalist and Other Newspaper Employees (Conditions of Service) and Miscellaneous Provisions Act 1955 and the Majithia Wage Boards recommendations are before the Supreme Court; the government's decision would be subject to the Supreme Court's final order.


“The gross revenue of the print media industry grew at the compound annual rate of 8.12 per cent during 2006-09 and is projected to grow at the compound annual rate of 9 per cent during 2009-14.”
During the period 2009-2014, the advertisement revenue is expected to record a compound growth rate of 11.6 per cent per annum and that of circulation revenue by 5 per cent. “The labour cost of the industry ranges from 10 to 14 per cent of the total cost.” అని మజతియ గతంలో ది హిందూ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. 

అయినా ఆయన సిఫార్సులను వ్యతిరేకిస్తూ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ పత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చింది. అలాంటి ప్రకటనను పైన చూడవచ్చు.  అయినా కేంద్ర కాబినెట్ ఆ సిఫార్సులను ఆమోదించడం శుభ పరిణామం. 

Monday, October 17, 2011

మన పాత్రికేయ వెలుగులు-అందరి దగ్గరా ఉండాల్సిన పుస్తకం

'వయోధిక పాత్రికేయ సంఘం' వారు "మన పాత్రికేయ వెలుగులు", "Our Legends of the Fourth Estate" అనే రెండు మంచి పుస్తకాలను ప్రచురించారు...తెలుగులో ఇంగ్లిషులో. తెలుగు పత్రికారంగంలో వైతాళికులు, కీర్తిశేషులు, ప్రముఖులు...చాలా వరకు ఇందులో కవర్ అయ్యారు. "This is the first-of-its-kind book. ఏడాది పాటు శ్రమకోర్చి దీన్ని తీర్చిదిద్దాం," సీనియర్ మోస్ట్ జర్నలిస్టు జి.ఎస్. వరదాచారి గారు నాతో చెప్పారు. ఆయనే ఈ పుస్తకానికి పర్యవేక్షక సంపాదకుడిగా వ్యవహరించారు. ఇంగ్లిషు ఎడిషన్ బాధ్యతలను "ది హిందూ" మాజీ బ్యూరో చీఫ్ దాసు కేశవ రావు గారు తీసుకుని చేశారు. టి.ఉడయవర్లు, కె.లక్ష్మణరావు గార్లు కూడా నలుగురు- సభ్యుల సంపాదక వర్గంలో ఉన్నారు. 

బ్లాగు కోసం సమీక్షించండని గురుతుల్యులు వరదాచారి గారు చెప్పారు. కానీ సమయాభావం వల్ల ఈ రోజు ఆ పని చేయలేకపోతున్నాను. పైపైన చూస్తే అర్థమయింది ఏమిటంటే...ఇది ఒక చక్కని పుస్తకం, జర్నలిస్టులందరి దగ్గరూ ఉండాల్సిన పుస్తకం. దాదాపు అన్ని పత్రికల మొదటి రోజు మొదటి పేజీలను, ఎక్కడా దొరకని కొన్ని ఫొటోలను ఇందులో ప్రచురించారు.

రేపు (October 18, 2011, మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు ఆ పుస్తకాలను "విక్రయానికి విడుదల" చేయబోతున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అక్కినేని నాగేశ్వర రావు, సి.నారాయణ రెడ్డి గార్లు పాల్గొనే ఒక కార్యక్రమంలో ఈ విడుదల జరుగుతుంది. ఈ పుస్తకాలను ఆగస్టు 28 న ఆ రోజే గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవిష్కరించారు.
మంగళ వారం ప్రెస్ క్లబ్ కు వచ్చి కొనుగోలు చేసేవారికి సగం ధరకే ఈ పుస్తకాలను ఇస్తామని వరదాచారిగారు ప్రకటించారు. రేపు దీన్ని మీరు మిస్ కాకూడదనే ఆదరాబాదరా ఇది రాస్తున్నా. పత్రిక కవర్ ను ఈ పోస్టులో చూడవచ్చు.
తెలుగు ప్రతి అసలు ధర- Rs.400
ఇంగ్లిషు ప్రతి అసలు ధర-Rs.300
మంగళవారం నాడు కొనుక్కొని సగం డబ్బు ఆదా చేసుకోండి.

Sunday, October 16, 2011

స్టూడియో- ఎన్ యాజమాన్యానికి లీగల్ నోటీస్

నాలుగు డబ్బులున్న ప్రతి ఒక్కడూ...బ్లాక్ ను వైట్ చేసుకోవడానికో, రాజకీయ తీటతోనో, ఇతర వ్యాపారాలకు రక్షణ కవచంగానో చానల్స్ పెట్టడంతో తెలుగు నేల మీద తీవ్రమైన దారుణం జరుగుతున్నది. దీనివల్ల జర్నలిస్టులకు విలువ లేకుండా పోవడం అలా ఉంచితే...ఈ వికృత క్రీడలో సమిధలవుతున్నది...సాధారణ జర్నలిస్టులు. గత రెండేళ్లలో కనీసం ఐదొందల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉండవచ్చన్నది కనీస అంచనా. జర్నలిస్టులను ఆదుకోవాల్సిన యూనియన్ నాయకులు టీ.వీ.స్టూడియోలలో, ప్రెస్ క్లబ్ లో, పైరవీ ప్రాంతాలలో తప్ప ఎక్కడా కనిపించరని జర్నలిస్టులు మొత్తుకుంటున్నారు. ఇదొక అరణ్యరోదన.     

చానల్స్ లో దారుణానికి ఒక పాట్రన్ ఉంది. ఈ యజమానులు...తమ గురించి తాము పెద్ద సినిమా ఊహించుకొని ఛానల్ పెడతారు. భారీగా ఉద్యోగులను తీసుకుంటారు. అప్పటికప్పుడు నాలుగు ఎక్కువ డబ్బులు వచ్చేసరికి కొందరు సీనియర్లు వీరి పంచన చేరి వీరికి బాకా కొడుతూ...చిన్నా చితకా జర్నలిస్టులను, టెక్నీషియన్లను చానెల్ లో చేరేలా పురికొల్పుతారు. బకరా జర్నలిస్టులు పోలో మంటూ ఛానల్ లో చేరతారు. ఏడాది బాగానే వుంటుంది. తర్వాత వారికి సినిమా కష్టాలు మొదలవుతాయి. యజమాని గాడు ముందు సీనియర్లను, తర్వాత వారు తెచ్చిన జూనియర్లను ఉద్యోగాల నుంచి పీకడం ఆరభిస్తాడు. ముదుర్లైన ఈ సీనియర్లు....ముందే వాసన పసిగట్టి వేరే ఛానల్ లో జంప్ చేస్తారు కానీ...జూనియర్లు, అంతకన్నా కొద్ది పెద్ద స్థాయి ఉన్నవారు బాగా ఇబ్బంది పడతారు. యజమాని ...ఫోను చిప్, ఐ.డీ.కార్డు పీక్కొని రేపటి నుంచి రావద్దని మెడపట్టి గెంటుతున్నాడు. మెజారిటీ జర్నలిస్టులు దీన్ని భరిస్తున్నారు...గుండెలు పగిలే మౌనంతో.   

చిక్కు ఎక్కడ వచ్చిందంటే....జనాలకు జరిగే అన్యాయాల గురించి తెగ స్టోరీలు చేసే జర్నలిస్టులు తమకు అన్యాయం జరిగితే...నోరు మూసుకుని భరిస్తారు. ఇక్కడ గొంతు ఎత్తితే...వేరే చానల్ లో ఉద్యోగం రాదనేది వారి భయం. అది కొంతవరకు నిజమైనా....మరీ నోరు మెదపకుండా...ఉద్యోగంపై వేటు పడగానే వెళ్ళిపోవడం దారుణం. కొందరైతే...తాము అంతవరకూ చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ గురించి కూడా పట్టించుకోరు. మన ఖర్మ ఇలా కాలిందని కుమిలిపోతారు.

జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి పీకడంలో ఏ చానెల్ తక్కువ తినలేదు. బైటి ప్రపంచానికి గొప్ప ఎడిటర్లు గా కనిపించే వారు సైతం...ఉద్యోగులను తీసేయడంలో నిర్దాక్షిణ్యంగా ఉంటున్నారు. ఇలా చేసిన వాళ్ళు...ఆరోగ్య సమస్యలతోనో, కుటుంబ ఇబ్బందులతోనో నరకం చూస్తున్నారనడానికి నా దగ్గర కేస్ స్టడీ లు వున్నాయి. అవన్నీ....ఎప్పటికైనా...ఒక పుస్తక రూపం పొందుతాయి.   

అసలు విషయానికి వస్తే...చంద్రబాబు నాయుడు గారి స్టూడియో- ఎన్ చానెల్   జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేయడంలో చాలా ముందు ఉందని ఇంతకు ముందు పోస్టులలో చెప్పాను. ఉద్యోగాలు పోయిన జర్నలిస్టులు...వారి ఆఫీసు దగ్గర టెంట్ వేసారు, మానవ హక్కుల సంఘాన్ని కలిసారు. అయినా...ఏమీ జరగలేదు. ఈ చానెల్ వారు ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారు. నార్నే శ్రీనివాస రావు అనే ఆయన యాజమాన్యం వేరట...ఆయన అల్లుడు నారా లోకేష్ బాబు వేరట. ఇప్పుడు యాజమాన్యం మారిందని చెప్పి...చాలా మందిని ఇంటికి పంపారు. కొందరికైతే...జీతాలైనా ఇవ్వలేదు. వాడి పాపం వాడిది...అని కొందరు సీనియర్లు వేరే చానల్స్ లో చేరగా... కొండబోలు లక్ష్మీ ప్రసన్న కుమార్ అనే యువ జర్నలిస్టు దీన్ని సీరియస్ గా తీసుకుని యాజమాన్యానికి లీగల్ నోటీస్ పంపాడు.

తనకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వకపోతే...ఊరుకోనని కుమార్ అంటున్నాడు. సమాచార హక్కు చట్టాన్ని సమర్ధంగా వినియోగించి సమాచారం సేకరించిన అతి కొద్ది మంది జర్నలిస్టులలో ఒకరైన కుమార్...గతంలో జీ-టీ.వీ.లో చేసినప్పుడు నాకు తెలుసు. 

ఉద్యోగాలు పోయిన జర్నలిస్టు మిత్రులారా....ముందుగా మీ హక్కులు మీరు తెలుసుకోండి. యాజమాన్యాలను అంత తేలిగ్గా వదలకండి. మీ హక్కులు పరిరక్షించుకోలేని మీరు జనం హక్కులు ఎక్కడ రక్షిస్తారు? కుమార్ లాగా...న్యాయ పోరాటం చేయండి. దానికి సీనియర్లు సహకారం తీసుకోండి. కావాలంటే...మీ కోసం ఒక సదస్సు ఏర్పాటు చేయడానికి ఈ బ్లాగు సిద్ధంగా ఉంది. మీ బాధలు వివరంగా నాకు రాయండి.

కుమార్ పంపిన లీగల్ నోటీసు ఇక్కడ చదవండి.

Friday, October 14, 2011

తెలుగు మీడియా----సంకుల సమరం

ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే, భారతీయ సమాజంలో పోషించే పాత్రనే తెలుగు మీడియాలో కూడా కులం పోషిస్తున్నది. తమ కులానికి చెందిన వారిని దగ్గరకు తీయడం, కులాలవారీగా గ్రూపులు కట్టడం, కుల రాజకీయాలు చేయడం మీడియాలో విపరీతమైపోయింది. సామాజిక కార్యకర్తలుగా ఉండాల్సిన జర్నలిస్టులు చాలా వరకు సొంత కులం వాళ్లతో కలివిడిగా ఉండటం, ఇతర కులస్థులను పనికిరానివారిగా చిత్రీకరించడం పెరిగిపోయింది. 
"ఈనాడు" గ్రూపులో కమ్మ కులస్థులకు ప్రాముఖ్యం ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. బుర్రలో గుజ్జుతో నిమిత్తం లేకుండానే యూనిట్ల మేనేజర్లుగా కమ్మవారినే నియమిస్తారని నిరూపించే ఒక డాక్యుమెంటు గతంలో నా దగ్గరకు వచ్చింది. అది చూస్తే...ఒక పద్ధతి ప్రకారం కులాన్ని పోషించే కార్యక్రమం అవగతమయింది. నిజం చెప్పాలంటే...అంతా ఆంధ్రా కమ్మలే.
పెద్దగా ప్రావీణ్యంలేనివారికి కూడా ఆ కులానికి చెందితే పెద్ద పదవులే కట్టబెడతారన్న ఆరోపణను నేను ఖండించలేను. ఎందుకంటే...అలాంటి వారిని నేను హైదరాబాద్ ఆఫీసులో దగ్గరి నుంచి చూశాను. పదవి వచ్చాక మీడియాలో మెయిన్ టైన్ చేయడం పెద్ద కష్టం కాదు. 

"సీహెచ్" అని ఇంటిపేరున్న ఒక బ్రాహ్మణ జర్నలిస్టు...తనింటిపేరు చెరుకూరి (రామోజీరావుగారి ఇంటిపేరు) అని చెప్పుకుని ఆ పేపర్లో చాలా రోజులు సకల మర్యాదలు పొందాడని చెబుతారు. "మీరు ఎన్.రామ్ కు చుట్టాలంట గదా...అందుకె మీకు 'ది హిందూ'లో ఉజ్జోగం వచ్చిందంట గదా..." అని ముందు 'ఈనాడు'లో పనిచేసి ఆ తర్వాత 'ది హిందూ'లో చేరి పనిచేస్తున్న ఒక చలాకీ పిల్ల అడగడం నాకు గుర్తుకువస్తున్నది. మా ఇంటి దగ్గర తొమ్మిదేళ్ల పిల్ల ఒకతి...టేబుల్ టెన్నిస్ ఆడటానికి వచ్చి...."అంకుల్...మీదేమి క్యాస్టు?" అని అమాయకంగా అడిగింది. తురకోళ్లం అని చెబితే నమ్మలేదు. "రాం నారాయణ చౌదరి...పెద్దగా ఉందని రాము అంటారు..." అని చెబితే..."నేనప్పుడే అనుకున్నా..." అని ఎంతో ఆనందంగా చెప్పిందీ మధ్యన. 

రామ్ సింగ్ అని పేరు ఉంటే ఎంతబాగుండని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. నా పుత్రుడి పేరు...ఫిదెల్ రఫీక్ స్నేహిత్ అని పెట్టడం, కులం పేరు చెప్పకుండా పెంచడం గర్వంగా అనిపిస్తుంది...కానీ ఈ కులాల పెంట వల్ల భావితరం ఎంత ఇబ్బంది పడుతుందో...అని భయమేస్తుంది. 

నా ప్రియ మిత్రుడు రఫీ (సన్ నేమ్ లో మధ్య పేరు వీడిదే) గత వారం ఫోన్ చేశాడు. "అరే...అన్నా...మనం  కులానికి అతీతంగా ఫ్రెండ్ షిప్ చేస్తున్నాం...ఏ ఆఫీసు చూసినా కులాల కంపేరా...నాయనా...నువ్వు ఎలా బతుకుతున్నావ్...." అని అడిగాడు. వాడు, నేను, రమేష్ డిగ్రీలో ఒక కంచం, ఒక మంచం టైపుగా బతికాం. హ్యూమనిజం తప్ప మాకింకేమీ తెలియదు. ఒక ఇరవై ఏళ్ల కిందటితో పోలిస్తే సమాజంలో కులాల వారీ డివిజన్ స్పష్టంగా కనిపిస్తూ ప్రమాదకర స్థితికి చేరింది. పాపం...మా రఫీకి మతంతో అవస్థ వచ్చి పడింది. నా దృష్టిలో మా వాడంత సెక్యులర్ వాది లేడు. అయినా...వాడికి రీసెర్చ్ లో గైడ్ దొరకడం లేదట. బాధేసింది. 

ఇప్పుడు ఒక కమ్మ యజమాని ఛానెల్ లో పనిచేస్తున్న వివాదాస్పద జర్నలిస్టు ...తన కులం పేరు పొరపాట్న  అయినా చెప్పడు. తాను క్షురకుడిననీ...ఎవరైనా తన ముందు తల వంచాల్సిందే అని వెకిలి నవ్వు నవ్వుతూ చెబుతాడు. ఏదిఏమైనా కులం పేరు చెప్పుకుని చాలా మంది కమ్మగా బతికేస్తున్నారు...నిస్సిగ్గుగా ఈ మీడియాలో.
మనం మనం బరంపురం అని అంటకాగలేని ఏ కులస్థులైనా మీడియాలో అవస్థలు పడతారనేది అక్షర సత్యం.

అలాగే సాక్షి పేపర్, ఛానల్ పెట్టగానే రెడ్డి కులస్థులకు రెక్కలు వచ్చాయి. ఏ పేపర్లో ఉన్న రెడ్డి జర్నలిస్టులు అయినా సాక్షి ఆఫీసువైపు చూడడం ఆరంభించారు. యజమాని కులానికి చెందినవారికి ఆ మీడియా హౌజులో ప్రాముఖ్యత పెరగడం ఈ మధ్యన విపరీతమైంది. బీసీ లు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు గానీ ఈ క్రమంలో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ లు ముందుకు దూసుకుపోలేకపోతున్నారు. 

ఈ నేపథ్యంలో...మీడియాలో పెరిగిపోతున్న కమ్మ ప్రాబల్యాన్ని నిరూపించే ఒక మెయిల్ నాకు వచ్చింది. ఇందులో అన్నీ నిజాలే అని చెప్పలేం. అది ఇక్కడ ఇస్తున్నాను. ముసుగులో గుద్దులాట ఎందుకు? మీ మీ సంస్థల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు చేసే వారి జాబితాలు పంపితే వాటిని పరిశీలించి ప్రచురిస్తాం. 

Wednesday, October 5, 2011

కోలుకుంటున్న పెసింగి భాస్కర్

భాస్కర్ పెసింగి ఎవరో...నేనెవరో. ఇద్దరం కలిసి కూడా పనిచేయలేదు. ఎందుకో ఆయనంటే...నాకు ప్రత్యేకమైన అభిమానం. డెక్కన్ క్రానికల్ రిపోర్టర్ గా విజయవాడలో పనిచేస్తూ ఏదో పనిమీద చెన్నై వెళ్లిన ఆయనను పెరాలసిస్ స్ట్రోక్ దారుణంగా దెబ్బతీసింది..రెండేళ్ల కిందట. అప్పటి నుంచీ ఆయన ఇంటికే పరిమితమయ్యారు. జర్నలిస్టు కమ్యూనిటీ ఆయనకు ఏమీచేయలేకపోయింది. రెండేళ్ల కిందట నేను రాసిన పోస్టు "గౌస్, భాస్కర్ లకు అనారోగ్యం" ఇక్కడ చదవండి. ఈ ఏడాది సెప్టెంబర్ లో గౌస్ గారు మరణించారు...చాలా రోజులు ఆసుపత్రిలో ఉండి. ఈ రోజు భాస్కర్ గారికి సంబంధించి నాకు చేరిన ఒక తప్పుడువార్త నన్ను ఎంతగానో కుంగతీసింది. ఒక రెండు గంటల పాటు సతమతమయ్యాను. ఫోన్లమీద ఫోన్లు చేసి భాస్కర్ గారి ఫోన్ నంబర్ పట్టుకుని ఆయనతో మాట్లాడేదాకా నేను మనిషిని కాలేకపోయాను. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసి చాలా ఆనందించాను. థాంక్ గాడ్.

చాలా మంది జర్నలిస్టులను చిన్నచూపు చూస్తారు గానీ, వారి జీవితాల్లోకి తొంగిచూస్తే విచారం, విషాదం, అనిశ్చితి స్పష్టంగా కనిపిస్తాయి. రిపోర్టర్లు పొద్దున్నపోయి...తిరిగితిరిగి సాయంత్రం ఆఫీసుకు వెళ్లి తెచ్చిన వార్తలు పంపిస్తారు. రేపటికి మేత ఏమిటని వెతుక్కుంటారు. రోజుకో స్టోరీ, ఒకటి రెండు ప్రెస్ మీట్లు కవర్ చేసుకుని వచ్చేసరికి ప్రాణం పోతుంది...నిజంగా రాసే రిపోర్టర్లకు. తమకు కేటాయించిన బీట్లలో ఏదీ మిస్ కాకుండా ఉండటానికి వీళ్లు పడేపాట్లు అన్నీఇన్నీ కాదు. ఏదైనా వార్త మిస్ అయితే బ్యూరో చీఫ్ తిడతాడు, మొడతాడు. 

ఇక సబ్ ఎడిటర్ల సంగతి ఇంకా దారుణం. పిల్లలు స్కూలు నుంచి వచ్చే సమయానికో, వారు ఆడుకునే టైంకో ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పేజీలకు సరిపడ వార్తలు సిద్ధంచేసుకోవడం, వార్తలు దిద్దుకోవడం, పేజీలు పెట్టించడం, తప్పులు లేకుండా చూడడం, ముఖ్యమైన వార్తలు మిస్ కాకుండా జాగ్రత్తపడడం...చేసేసరికి డెడ్ లైన్ ముంచుకొస్తుంది. అర్ధరాత్రి పేజీలు మరొకసారి సరిచూసుకుని ఇంటికి వెళ్లాక...పేజీలో ఏదో తప్పు గుర్తుకు వస్తే...అక్కడి నుంచి అనుమాననివృతి కోసమో, పొరపాటు సవరించడానికో ఫోన్ చేయాల్సి వస్తుంది. 

ఇలా అర్ధరాత్రి ఇళ్లకు చేరి...వీలుంటే భార్యతో కాసేపు మాట్టాడి పడుకుంటారు. వేధించే తుక్కు వెధవ ఇన్ ఛార్జిగా ఉన్నాడా...ఇక నిద్ర కూడా రాదు. నిజానికి చాలా మంచి ఇన్ ఛార్జిలు వేయించుకుతినే బాపతేనట. దొంగ డబ్బో, దొర డబ్బో...ఈ సాక్షి సంస్థ రాకపోతే...ఈనాడు సాక్షిగా జర్నలిస్టు సోదరులు మాడిమసైపోయి ఉండేవారనేది వేరే విషయం. అలా పొద్దున ఈ జర్నలిస్టులు నిద్రలేచే సమయానికి బిడ్డలు స్కూలుకు వెళతారు. నిద్రలేచి...రాత్రి పెట్టిన పేజీ ఎలా వచ్చిందో ఆందోళనగా లేచి చూసుకుని  టిఫిన్ చేసే సమయానికి లంచ్ టైం తన్నుకు వస్తుంది. తిన్నాక మరో కునుకు తీసేసరికి డ్యూటీ టైం ముంచుకువస్తుంది. లేటుగా వెళితే...అర దినం కోత పడుతుంది.
ఇలా కుటుంబ జీవితాన్ని దారుణంగా కోల్పోతున్నారు...జర్నలిస్టులు. మీరు అనవచ్చు....ఓస్...ఇందులో ఏముంది..ఏ ఉద్యోగికి అయినా ఇలాంటి సమస్యలు ఉండవా? అని. అది అనుభవించేవాడికే తెలుస్తుంది. 

నేను "ఈనాడు" లో ఇరగదీసి పనిచేస్తూ...ఉద్యోగాన్ని రక్షించుకుంటూ....ఇలానే సాయంత్రాలు మిస్ అవుతుంటే...నా నాలుగేళ్ల కూతురు...హేమను అడిగింది..."మమ్మీ...సాయంత్రం ఆడుకోవడానికి నాకు ఇంకో  డాడీ కావాలని." ఇది భరించలేని, వర్ణనాతీతమైన వ్యవహారం.

భాస్కర్ గారు కూడా కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. అప్పట్టో ఆయన నాతో చాలా విషయాలు పంచుకునేవారు. తను క్షేమంగా ఉన్నారని తెలియడానికి పట్టిన రెండు గంటలు నేను దు:ఖాన్ని దిగమింగుకున్నాను. జర్నలిస్టుల భద్రత, కుటుంబాలు, కీలక పదవుల్లో ఉన్నవారి ధోరణిలో వచ్చే ప్రమాదకర మార్పులు పంచుకునేవారు నాతో.  తనకు ఆరోగ్యం బాగుంటే....ఒక మంచి పత్రికలో హైదరాబాద్ రిపోర్టర్ గా వచ్చేవారు. అందుకోసం మేమిద్దరం వేసిన కొన్ని పథకాలు ఆయన అనారోగ్యం వల్ల దెబ్బతిన్నాయి. ఒకటి మాత్రం నేను చెప్పగలను...తనకు ఆ పరిస్థితి రావడానికి డెక్కన్ క్రానికల్ లో ఇంగ్లిషు రాకపోయినా వార్తలు రాస్తూ కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్న ఒక దుర్మార్గుడు. భాస్కర్ కు పూర్తిగా అన్నీ గుర్తుకు రావడం లేదు. అవన్నీ ఆయన రీ కలక్ట్ చేసుకుని జరిగిందేమిటో నాతో పంచుకుంటే బాగు. ఆ రోజు కోసం ఎదురుచూస్తాను. 

సారీ...భాస్కర్...ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను తరచూ కలుస్తాను. మీకు, మీకు మనోధైర్యమిస్తూ బతుకు నావను నడుపుతున్న మేడమ్ కు, మీ పిల్లలకు నా విజయ దశమి శుభాకాంక్షలు.


భాస్కర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ...తాను 2008 డిసెంబర్ 26 న ఆయన నాకు మెయిల్ చేసిన ఒక వార్తను ఇక్కడ ఇస్తున్నాను.  ఇది డీ.సీ.లో ప్రచురితమయింది.
Mr Ramu,
 I filed this story yesterday, trouble started on the next day!
VIJAYAWADA
Dec. 25: Is city in for group rivalries which rocked two decades ago and devowed number of lives and crippled the families of many?

With the one-up-manship-game now going on between Congress Kankipadu MLA Mr Devineni Rajasekhar (Nehru) and Mr Vangaveeti Radhakrishna who switched over his loyalties recently to Praja Rajyam from Congress, is any indication that denizens apprehend revival of old rivalries in the city?

The families of Nehru and Vangaveeti Radha were at loggerheads for many years, loosing their kith and kin in the process. After the killing of Mr Vangaveeti Ranga, the gap still widened between the two families.

The gang rivalry took a toll of dozens of people on both sides. Rowdies ruled the roost during those 10 years, while Devineni brothers operated from Gunadala as headquarters, Ranga held sway over the Raghavaiah park and Gandhinagar.

The clashes which began between Mr Nehru and Mr Ranga from college elections led to the death of Nehru's brothers-Gandhi and Murali, and finally led to the killing of Ranga.

After prolonged legal battle, both the groups  settled the issue out of court. After Ranga's death, his wife Ratna Kumari, came to the politics as his inheritor.

Mr Nehru, who was in Telugu Desam Party till 1998, switched over to Congress, Ms Ratna Kumari immediately joined TD from Congress. Though, Ms Ratna and Mr Nehru were in politics, the city did not witness group clashes.

When Ms Ratna Kumari failed to get TD ticket in 1999, she kept away from active politics from the same time. Later, she met AICC president Ms Sonia Gandhi and rejoined Congress.

During the 2004 elections, differences broke out between Ms Ratna Kumari and
her son Mr Radhakrishna over the party ticket. Finally, Mr Radha had the last laugh, as the party choose him as candidate in Vijayawada East.
With the two main groups- Vangaveeti and Devineni- came on to single platform, the group rivalries also have come down. Suddenly, there is a change in Mr Radha's attitude for the last one year. The cold war between the two families again
surfaced.
At one stage, Mr Radha went to the extent of resigning from MLA post over the alleged allotment of costly land to Mr Nehru. Recently, after he joined PRP, he made sweeping remarks against Mr Nehru, bringing to the fore his father's murder.

Now corporators owing allegiance to Mr Nehru, started mounting counter attack on Mr Radha. The supporters of MP Mr  Lagadapati Rajagopal are also chipping in countering the PRP return.

If all the leaders failed to follow restraint, the present peaceful atmosphere may get vitiated.
.......
eom//

Tuesday, October 4, 2011

స్టూడియో-ఎన్ చానెల్ లో భారీ మార్పులు-దారుణకాండ

ఫక్తు రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్న పసుపు పచ్చ "స్టూడియో-ఎన్" చానెల్ లో జర్నలిస్టుల జీవితాలకు భరోసా లేకుండా పోయింది. చంద్రబాబు గారు ఆస్తులు ప్రకటించేందుకు ముందు దాకా నారా లోకేష్ చక్రం తిప్పిన ఈ ఛానల్ లో యాజమాన్యం మారిందట...అందుకే పెద్ద స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తున్నారట. యాజమాన్యాల ఈ డ్రామాతో పాపం సీనియర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజూ...దొరికిన ప్రతి వేదిక మీదా...అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు కళ్ళకు ఈ జర్నలిస్టులు కనిపించడం లేదు. స్టూడియో-ఎన్ చానెల్ దాష్టీకాలు కనిపించడం లేదు. 

నాలుగు డబ్బులు ఇస్తున్నారు కదాని...ఇలాంటి తొక్కలో చానల్స్ లో చేరడమే జర్నలిస్టులు చేసే పెద్ద తప్పు. ప్రశాంతంగా Times-Now లో పనిచేసే సునీల్ పాటిల్ పోయి పోయి ఇందులో చేరాడు. టీ.వీ.-నైన్ బెంగళూరు నుంచి వచ్చి నాలుగు ఎక్కువ డబ్బులు వచ్చేసరికి ఇక్కడ జర్నలిజం అంటే ఏమిటో కూడా తెలియని తుక్కు వెధవలతో కలిసి పనిచేసాడు. ఆయనకు ఇచ్చిన పోస్టు...అసైన్మెంట్ ఎడిటర్. ఇప్పుడు 'యాజమాన్యం' మారడంతో ఆయన మరో చానెల్ కోసం చూస్తున్నాడు...పాపం. మంచి సరుకున్న జర్నలిస్టు ఇబ్బంది పడడం బాధాకరం. 

గొర్రె కసాయిని నమ్మినట్లు అనవసరంగా రాజశేఖర్ ను గుడ్డిగా నమ్ముకుని టీ.వీ-నైన్ నుంచి ఐ.-న్యూస్ కు వెళ్ళి, ఆ తర్వాత తప్పు తెలుసుకునీ...ఏమీచేయలేక ఎన్.-టీ.వీ.లో చేరి జీవిత సత్యం బోధపడి ఉన్నపళంగా స్టూడియో-ఎన్ లో చేరిన శ్యాం కూడా ఇబ్బంది పడ్డాడు. తను మళ్ళీ ఐ.-న్యూస్ కు వెళ్ళిపోయాడు. ఐ.న్యూస్ లో  ఇమడలేక స్టూడియో-ఎన్ లో చేరిన కందుల రమేష్ బాబు కూడా చాలా రోజులుగా ఐ-న్యూస్ లో భీకరంగా చర్చలు నిర్వహిస్తున్నారు.

'ఈనాడు'లో ఉండగా కరెంట్ కరీం గా పేరుపొందిన కరీం మొన్నటిదాకా స్టూడియో ఎన్ లోనే ఉన్నారు. 'కొత్త మానేజ్మెంట్' సెగ తగిలిన ఆయన ఏ.బీ.ఎన్.-ఆంధ్రజ్యోతి లో చేరినట్లు సమాచారం. పాపం...కందుల రమేష్ లాంటి వాళ్లకు ప్రతిభ వల్లనో, కులం వల్లనో, ప్రాంతం వల్లనో ఓపెనింగ్స్ చాలా ఉంటాయి కానీ...కరీం గారి లాంటి వాళ్ళే చాలా అవస్థలు పడాల్సి వస్తుంది..అందులో మధ్య కారణం వల్ల. కందుల రమేష్ లాంటి వాళ్ళను నమ్ముకున్న బుడన్ లాంటి వాళ్లకు సమస్యలు వస్తాయి. టీ.వీ.-ఫైవ్ లో హాయిగా ఉండే బుడన్ కందుల రమేష్ ను నమ్ముకుని రెండు చానెల్స్ మారి ఇబ్బంది పడినట్లు నాకున్న సమాచారం. చెత్త జర్నలిస్టు గాళ్ళతో విసిగిపోయిన బుడన్ సొంతగా వెబ్ సైట్ నడుపుతున్నారు. 

"స్టూడియో- ఎన్ లో ఈ సో కాల్డ్ కొత్త యాజమాన్యం పోయిన నెల జీతమైన ఇవ్వలేదు. దరిద్రులు...చాలా ఇబ్బంది పెడుతున్నారు," అని ఒక జర్నలిస్టు కోపంగా చెప్పారు. జర్నలిజం అంటే....ఎదుటి వాడిని ఇష్టంవచ్చినట్లు అడ్డ దిడ్డమైన ప్రశ్నలు అడగటం అని  ఫిక్స్ అయిపోయిన రామచంద్ర ఇప్పుడు స్టూడియో-ఎన్ లో మంచి పొజిషన్ లో ఉన్నారట. బాబూ...రామచంద్రం గారూ...మీరైనా ఈ యాజమాన్యానికి చెప్పి ఈ జర్నలిస్టులకు జీతాలు ఇప్పించండి. మీకూ ఎప్పుడో ఒకప్పుడు తప్పదు కదా!

Monday, October 3, 2011

రమేష్, నగేష్, రాజేష్, నరేష్...

రమేష్, నగేష్, రాజేష్, నరేష్
రమేష్=రమేష్ బాబు ('ఈనాడు' లో నేను పనిచేసినప్పుడు న్యూస్ టుడే మానేజింగ్ డైరెక్టర్)
నగేష్=సుసర్ల నగేష్ ('ది హిందూ' లో నేను పనిచేసినప్పుడు, ఇప్పుడు బ్యూరో చీఫ్)
రాజేష్=రాజేష్ రామచంద్రన్ ('మెయిల్ టుడే' లో నేను పనిచేసినప్పుడు, ఇప్పుడు నేషనల్ బ్యూరో చీఫ్)
నరేష్=నరేష్ నున్న (మొన్నటి దాకా నేను పార్ట్ టైం రిపోర్టర్ గా పనిచేసిన 'ది సండే ఇండియన్' సీనియర్ ఎడిటర్)

నా పూర్వజన్మ సుకృతమో, కర్మఫలమో గానీ జర్నలిజం లో ఉన్నన్ని రోజులూ "ష్" అనే అక్షరంతో ముగిసే పేర్లున్న వారి ఆధ్వర్యంలో పనిచేసాను. ఇది నాకు విచిత్రంగా తోచే అంశాలలో ఒకటి. 

సూర్యదేవర శ్రీకాంత్ అనే ఒక చురుకైన జర్నలిస్టు ప్రోత్సాహం వల్ల 1988 చివర్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో నా మజిలీ ప్రారంభమయ్యింది. అప్పటికే షటిల్ బాడ్మింటన్ లో కాకతీయ యూనివెర్సిటీ లెవెల్లో ఇంటర్ కాలేజియేట్ పోటీల్లో మొట్టమొదటి సారి మా రామచంద్రా కాలేజ్ కి విన్నర్ షీల్డ్ తెచ్చిన టీం లో ఉన్న నేను స్పోర్ట్స్ కంట్రిబ్యూటర్ గా చేరాను 'ఈనాడు' యాజమాన్యం మినీలు పెట్టిన కొత్తల్లో. కాలేజి వెళ్ళడం, సాయంత్రం మైదానాల చుట్టూ తిరిగి స్పోర్ట్స్ వార్తలు రాయడం, రాత్రికి ఇండోర్ లో మనం సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న షటిల్ కాక్ లతో పడి పడి షటిల్ ఆడడం...ఇదీ దినచర్య. అప్పుడే కొత్తగూడెం లో పెట్టిన ఆలిండియా రేడియోలో క్యాజువల్ ప్రొడక్షన్ అసిస్టంట్ గా కూడా పనిచేసేవాడిని. అక్కడి ప్రోగ్రామ్స్ హెడ్ సుమనస్పత రెడ్డి గారు చాలా బాగా ప్రోత్సహించేవారు. నేను విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో తను అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేందుకు వస్తున్నారాయన.   

శ్రీకాంత్ గారు జిల్లా రిపోర్టర్ గా ఖమ్మం వెళ్ళిపోవడం తో నాకు ఒక చిక్కు వచ్చి పడింది 'ఈనాడు' లో. ఆయన స్థానంలో వచ్చిన శివ రామకృష్ణ అనే రిపోర్టర్ నంజుకు తినడం మొదలు పెట్టాడు. బాసు అన్న వాడి మీద అసహ్యం మితిమీరి పగ పెరగడం మొదలయ్యింది తనను చూశాకే. ఒకటి రెండు సార్లు తన బట్టలు ఇచ్చి ఇస్త్రీ చేయించుకు రమ్మంటే...ఆ పనిచేసాను. నన్ను ఇబ్బంది పెట్టాలని...నేను కవర్ చేసిన స్పోర్ట్స్ స్టోరీ ని నేను కాలేజ్ నుంచి వచ్చే లోపు టెలిప్రింటర్లో పంపేవాడు. తన ఆగడాలు భరించలేక...తాను పెడుతున్న అవమానాలతో ఒక పది పేజీల కంప్లైంట్ రాసి చుట్టుపక్కల కంట్రిబ్యూటర్ల తో కూడా సంతకాలు పెట్టించి యాజమాన్యానికి పంపాను. నేను కష్టపడి పనిచేసే జర్నలిస్టు నని అందరూ చేరదీసే వారు. స్పోర్ట్స్ లోనే చిత్ర విచిత్రమైన కథనాలు రాస్తూ..చాలా మంది కంట్రిబ్యూటర్ల కన్నా ఎక్కువ సంపాదించే వాడిని. 

శ్రీకాంత్ పలుకుబడి కూడా పనిచేసి శివ రామకృష్ణ ను బదిలీ చేసారు. నరకాసుర వధ జరిగినంత సంబరం చేసుకున్నారు...కంట్రిబ్యూటర్ లు. ఏ మాటకామాటే...అతను తెలుగులో భలే ప్రతిభావంతుడు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు బదిలీ మీద వచ్చి నాతో పాటు హైదరాబాద్ లో జనరల్ డెస్క్ లో అనువాదంతో సతమతమవుతూ పనిచేసాడు. అప్పటికే జనరల్ డెస్క్ లో నేను మంచి ఊపులో వున్నాను కాబట్టి...అతను నాతో చాలా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. నేను కూడా...పాత విషయాలు మరిచిపోయి సాధ్యమైనంత కలుపుకుపోయే వాడిని. 

'ఈనాడు జర్నలిజం స్కూల్' లో సీటు పొంది బూదరాజు గారి పుణ్యాన కొన్ని అక్షరం ముక్కలు నేర్చుకుని జనరల్ డెస్క్ లో చేరాను. అప్పటి వరకూ ఒక్క పుస్తకం చదివితే ఒట్టు. హమ్మయ్య..ఉద్యోగం దొరికింది...ఇక హేమను జీవిత భాగస్వామిని చేసుకోవడానికి ఇబ్బందులు ఉండవని సంబర పడ్డాను. 
బాగా పుస్తకాలు చదవాలి..అనే కోరికతో...సాయంత్రం ఉద్యోగం ఉంటే...ఉదయమంతా 'ఈనాడు' వారి గ్రంథాలయం ఆర్.ఆర్.జీ.లో వుండే వాడిని. ఈ లోపు... ఇంచార్జ్ గా ఉన్న శర్మ నరకం అంటే ఎలా ఉంటుందో చూపనారంభించారు. నన్నే కాదు...సీనియర్లను...వివిధ సెక్షన్ల ఉద్యోగులను పదునైన మాటలతో చంపేవాడు. ఆ బాధ భరించలేక...తనతో ఒక్క మాటైనా పడకూడదని పుస్తకాలు చదవడం ఆపేసి...అనువాదాల్లో ఆరితేరడానికి నానా కుస్తీలు పట్టేవాడిని. ఖమ్మం జిల్లా వాళ్ళంటే..."బుర్ర మోకాలులో కాదు..అరికాలులో ఉంటంది ...." అని మనసా వాచా నమ్మే మా ఎం.డీ.రమేష్ బాబు తన ప్రతాపం తాను చూపేవాడు. శర్మను, రమేష్ ను చూసాక...'ఈనాడు' లో ఉద్యోగం గ్యారెంటీ లేదని అర్థమై....ముందుగా రామకృష్ణా మఠం లో ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్స్ లో చేరాను. రాత్రంతా డ్యూటీ చేసి నిద్ర సరిగా లేక...ఉదయాన్నే లేచి అప్పట్లో బస్సు సౌకర్యం పెద్దగా లేనందున లిబర్టీ నుంచి ఇందిరా పార్క్ వరకూ నడిచి ఇంగ్లిష్ క్లాసులు విని వచ్చే వాడిని. అది భలే మంచి కోర్సు. నాకు చాలా ఉపకరించింది. యూనివెర్సిటీ డిగ్రీ ఉండకపోతే ఎట్లా అని ఉస్మానియా జర్నలిజం లో చేరి రెండు గోల్డ్ మెడల్స్ కొట్టాక బతుకు మీద భరోసా వచ్చింది. 

సరే...హేమ, తమ్ముడు మూర్తి ఇచ్చిన మనోధైర్యంతో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం కు వెళ్లి కోర్సు పూర్తి చేసి నల్గొండ లో 'ది హిందూ' పత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా చేరాను. నన్ను నిజానికి విశాఖపట్నం డెస్క్ లో వేసారు కానీ...తెలంగాణా జిల్లాలలో రిపోర్టింగ్ చేయాలన్న ఆసక్తితో అప్పటి ఎడిటర్ మాలినీ పార్థసారథి మేడం దగ్గర పట్టుబట్టి మరీ రిపోర్టింగ్ లో చేరాను. 'ది హిందూ' లో అప్పటి మా బ్యూరో చీఫ్ దాసు కేశవరావు గారు మనిషి రూపం లో ఉన్న దేవుడు. ఒక అద్భుతమైన మనిషి. బాసులు ఒట్టి యాసులు (గాడిద కొడుకులు) అని అనుకునే నేను...కేశవరావు గారిని చూసి నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇంతలో ఆయన రిటైర్ అయి...సుసర్ల నగేష్ కుమార్ అనే ఆయన బ్యూరో చీఫ్ అయ్యారు. కేశవరావు గారు ఒక్కరే మినహాయిపు...నా పూర్వాభిప్రాయంలో తప్పులేదని అనుకున్నాను. ఇప్పుడు ఆ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ లను ఎవ్వరిని అడిగినా ఇదే మాట చెబుతారు. 

నగేష్ December 25, 2007 న ఫోన్ లో నా మీద అవినీతి ఆరోపణలు చేసారు. నల్గొండ లో ఎథికల్ జర్నలిజం ఇనిషియేటివ్ ప్రారంభించిన నేను ఆ మాటలు తట్టుకోలేక...తనెన్నిరోజులు ఆ పదవిలో ఉంటాడని కనుక్కున్నాను. కనీసం పదేళ్ళు ఉంటాడని తెలిసి నా ప్రయత్నాలు నేను ఆరంభించాను.  ఇంతలో ఫిదేల్ టీ.టీ.కోచింగ్, పెండింగ్ లో పడిన పీ.హెచ్.డీ.ల కోసం హైదరాబాద్ రావాలని ప్రయత్నాలు చేస్తే...'అవుట్ లుక్' లో 'మెయిల్ టుడే' లో వచ్చాయి. ఈ రెండో పేపర్ టాబ్లాయిడ్ అని తెలియక...చేరాను. అక్కడి బాసు పేరు...రాజేష్ రామచంద్రన్. తానో పనికిమాలిన జర్నలిస్టు అని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టలేదు. దేశ రాజధానిలో కూర్చుని ఇక్కడి స్టోరీలకు యాంగిల్ ఇచ్చేవాడు. తన సోర్సుల ప్రకారం నన్ను వార్తలు రాయమనే వాడు. తనను 'సార్' అని పిలవాలని ఒక రోజు చెప్పాడు. అప్పటికే వాడితో, టాబ్లాయిడ్ తరహా జర్నలిజం తో విసిగిపోయి...ఒక చిన్న అవకాశం వస్తే...అమెరికా వెళ్లి వచ్చి...జర్నలిజం పాఠాలు చెప్పడం ఆరంభించాను. టీచింగ్ లో రాణిస్తానని చిన్నప్పటి నుంచి నాకుండేది. 

రాత తీట తీర్చుకోవడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుంది...అని అనుకుంటున్న సమయంలో నరేష్ నున్న తో పరిచయం అయ్యింది. వారి దగ్గర పార్ట్ టైం రిపోర్టర్ గా పనిచేయడం ఆరంభించాను. నేను అడగ్గాన్నే 'రాం బాణం' అనే పేరుతొ ఒక కాలం రాయడానికి ఆయన అంగీకరించి ప్రోత్సహించారు. అక్కడ రిపోర్టింగ్ వరకూ బాగానే ఉంది కానీ...అర్థరాత్రి అనువాదాల ఫిటింగ్ మొదలయ్యింది. నేను నిద్ర అస్సలు కాయలేను. 'ది సండే ఇండియన్' ఇంగ్లిష్ పత్రికకు నేను రాసిన పాపా లాల్ స్టొరీ, ఒక రెండు మూడు 'రాం బాణం' కాలమ్స్ తప్ప అక్కడ నాకు పెద్దగా తృప్తి అనిపించలేదు. ఇంతలో తుది దశకు చేరుకున్న పీ.హెచ్.డీ., రాయాలనుకున్న పుస్తకం పని ఉంచుకుని...డబ్బు కక్కుర్తి తో అరకొరగా పనిచేయడం భావ్యం కాదని చెప్పి మరొకరిని నా స్థానంలో చూసుకోమని నరేష్ కు చెప్పాను. ఆయన మొన్ననే దిగ్విజయంగా ఆ పనిచేసినట్లు తెలిపారు. ఇంతటితో అక్కడ కథ ముగిసింది.

రమేష్, నగేష్, రాజేష్ ల సరసన నరేష్ పేరు పెట్టడం నిజానికి తప్పు. ఏదో ప్రాస కలిసిందని పెట్టానంతే.  నరేష్  చాలా సాత్వికుడు, తనతో పనిచేసే వారికి విపరీతమైన స్వేఛ్చ ఇచ్చే ప్రజాస్వామిక వాది. పైగా కవి. "ఇండియన్ ఎక్స్ ప్రెస్" యాజమాన్యంపై హక్కుల కోసం పోరాడిన జర్నలిస్టు కనక నాకు ఆయనంటే ఒక గౌరవం ఉంది. 
తనతో కొన్నాళ్ళు ఉంటే...కవితా తపన, స్త్రీ సౌందర్య  ఆరాధనా భావం ("జాడ్యం" అని నేనంటాను)  పెరుగుతాయని చెప్పవచ్చు. ఆఫీసుకు వెళ్ళగానే ఎంతో ఆప్యాయంగా 'హాయ్' అని పలకరించే నరేష్ లో నేను గమనించిన వివిధ కోణాల గురించి మరొక పోస్టులో రాస్తాను. 

Saturday, October 1, 2011

తెలంగాణాపై జాతీయ మీడియా మౌనం: MSO లు

తెలంగాణా కోసం మునుపెన్నడూ లేని విధంగా ఉద్యమం జరుగుతున్నా...జాతీయ మీడియా పట్టించుకోవడం లేదని Federation of Telangana Multi System Operators (MSOs) ఆరోపిస్తున్నారు. వారి ఆవేదనను, వాదనను ఈ మెమొరాండం లో చూడవచ్చు. ఇది పంపిన జీ-టీ.వీ. లో ఉన్న తెలంగాణా సోదరుడికి థాంక్స్...రాము