"ఛీ...ఛీ...అదొక (మొత్తం వ్యవహారం) రొచ్చు," అని ఒకరు..."జర్నలిజాన్ని మరీ దిగజార్చారు," అని మరొకరు, "ఈ రాజశేఖర్ ఉన్న చోట ఇలాంటి కంపే జరుగుతుంది," అని ఇంకొకరు...ఇలా పలు వ్యాఖ్యలు చేశారు. కొందరు మాజీ సన్నిహిత సహచరులు...పెళ్ళికి వచ్చిన కొమ్మినేనిని...'మీరు లైవ్ లోకి అలా విమర్శలు చేయడం అవసరమా?' అని ప్రశ్నించారు.
ఎన్-టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి నిన్న సాయంత్రం తనను పిలిచి....'మీరు రంగ ప్రవేశం చేయకపోతే....నా పరువు దెబ్బతినేట్టు ఉంది,' అన్న మీదటనే కొమ్మినేని లైవ్ లో రాధాకృష్ణ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
'మీడియా యజమానులైన కమ్మోళ్ళు ఇలా చొక్కాలు పట్టుకోవడం అరుదు. అది ఒకందుకు మంచిదే కానీ...మరీ ఇంత దారుణమా?' అని ఒక సీనియర్ అంటే, 'థాంక్ గాడ్....నాకు ABN చానెల్ రాదు కాబట్టి బతికిపోయా,' అని ఢిల్లీ పత్రికకు ఇక్కడ విలేకరిగా పనిచేస్తున్న ఒక సీనియర్ మిత్రుడు అన్నారు. లోపల పెళ్లి జరుగుతుంటే...జర్నలిస్టులు ఈ అంశంపైనే ఎక్కువగా చర్చ జరిపారు. ఈ పెళ్ళికి...నరేంద్రనాథ్ వెంట...రాజశేఖర్ కూడా వచ్చి వెళ్ళాడు. రాధాకృష్ణ వచ్చారో లేదో కనిపించలేదు.
"నా పత్రికలో ఉన్నప్పుడు నరేంద్ర చౌదరికి వ్యతిరేకంగా ఆయన (కొమ్మినేని) రెండు వార్తలు రాసారు. ఒకటి...జూబ్లీ హిల్స్ సొసైటీ భూములను నరేంద్ర చౌదరి అక్రమంగా అమ్ముకుంటున్నారు, సంపాదిస్తున్నారని. రెండు, గులాం నబిఆజాద్ కోసం గానా బజానా ఏర్పాటు చేసి, అమ్మాయిల సరఫరాతో సహా అన్ని కార్యక్రమాలు నిర్వహించారని, ఇతను, షబ్బీర్ అలీ చేసారని రాసారు. కొమ్మినేని కి కనీస స్థాయి నైతికత వుంటే...రేప్పొద్దున వాళ్ళ ఛానల్ లో చెప్పమనండి. అవి నేను రాయమన్నానా...తను రాసారా? అలాంటి నరేంద్ర చౌదరి వద్ద ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కొమ్మినేని పనిచేస్తున్నారు?," అని వేమూరి నిన్న రాత్రి లైవ్ లోకి వచ్చి చెప్పడంతో కొమ్మినేని కంగు తిన్నట్లు కనిపించారు.
ఈ ఉదయం....N-TV లో వార్తా విశ్లేషణ కార్యక్రమంలో కొమ్మినేని మాట్లాడుతూ...దీనిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాను సత్యసంధుడిని కాబట్టే...ఒక ఇల్లు ఉన్నందున హౌసింగ్ సొసైటి లో జాగా తీసుకోలేదని...తనకు, చౌదరికి మధ్య పుల్ల పెట్టడానికి రాధాకృష్ణ ప్రయత్నం చేస్తున్నారని....స్పష్టం చేశారు. ఏది ఏమైనా...తాను నీతిపరుడినని తెలిపారు.
తమ సామాజిక వర్గానికి చెందిన రెండు ఛానెల్స్ ఇలా వీధికెక్కి పరువు పంచనామా చేయడంపై కమ్మ సంఘం నాయకులు నొచ్చుకున్నట్లు భోగట్టా. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేసి...ఇకపై ఒక రకంగా పోనివ్వాలని వారు తెరవెనుక నుంచి సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకే...ఎన్-టీ.వీ. పై ఆంధ్రజ్యోతి ఒక పేజీ మొత్తం వార్తలు వేసినా...చౌదరి శిబిరం కిమ్మనలేదని అనుకుంటున్నారు. అంతేనా...లేక...చౌదరి బృందం రాధాకృష్ణ ను బద్నాం చేసేందుకు ఇంకా ఏమైనా పథకం పన్నుతున్నదా? వేచి చూడాల్సిందే.
-------------------------------------------------------------------
టైల్ పీస్:
1) కొమ్మినేని నిజంగానే నిబంధనలకు లోబడే హౌసింగ్ సొసైటీ స్థలం వద్దని త్యజించారా? లేక....రామోజీ భయానికి అప్లై చేసుకోలేదా?
ఒక దశలో రామోజీ తన ఉద్యోగులను సొసైటీ స్థలాల కోసం అప్లై చేసుకోనివ్వలేదట. రాహుల్ లాంటి సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంలో నిజాలు నిగ్గు తేల్చాలి. ఇప్పుడసలే మన కొమ్మినేని గారి మీద మచ్చ పడే పరిస్థితి వచ్చింది.
ఒక దశలో రామోజీ తన ఉద్యోగులను సొసైటీ స్థలాల కోసం అప్లై చేసుకోనివ్వలేదట. రాహుల్ లాంటి సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంలో నిజాలు నిగ్గు తేల్చాలి. ఇప్పుడసలే మన కొమ్మినేని గారి మీద మచ్చ పడే పరిస్థితి వచ్చింది.
మాటి మాటికీ దొరికిపోతున్న మన రాజశేఖర్ కూడా దీనిపై ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి మరి...తన సత్య సంధత నిరూపణ కోసం.
"స్వామీ...మీరెక్కడున్నారు స్వామీ? వచ్చి కలిస్తా,"..."ఇలాంటివి ఆపడం...నాకు తెల్సు...డేప్యుటి సీ.ఈ.ఓ.గా TV-9 లో ఇలాంటివి చేసేవాడ్ని," అని రాజశేఖర్ చెప్పడం బట్టి చూస్తే...ఇక్కడేదో మతలబు ఉన్నట్లు అనిపిస్తున్నది. "నిజంగా తాను రాజశేఖర్ కు ఆ పని అప్పగించానా?" అని చౌదరి గారు, "నాకు చెప్పే మనోడు అలాంటి పనులు చేసాడా?" అన్న దానిపై రవి ప్రకాష్ అర్జంటుగా గుర్తుకు తెచ్చుకోవాలి.
11 comments:
Ramu,
what is the point of mentioning the cast here?
is it related in any way to the matter or has its importance ?
అయ్యా అజ్ఞాతగారూ,
మీడియాలో అంతా కులాల రెఫరెన్సులతోనే మాట్లాడుకుంటారు. అంత బాధపడక్కరలేదు.
రాము గారు,
ఒకప్పుడు నార్లా గారి ని చూసి గర్వించిన మనం(తెలుగు వారు)ఇప్పుడు ఆ కమ్యునిటికి చెందిన వారు ఈ పత్రికా రంగాన్ని ఎలా బ్లాక్ మైల్ వ్యాపారాం గా మార్చారో చదువుతుంటె మతి పోతున్నాది.ఇటువంటి వారా విలువలు నీతి గురించి మాట్లాడేది? వీరందరు వారిని వారే సంస్కరిచు కోవాలి ఎందుకంటె ఈ రోజులలో పెద్ద వారి మాటలు వినటం పోయింది . అలా సంస్కరిచుకోక పోతె ప్రజల లో వీరి పైన నమ్మకం, అభిమానం అనేవి లేకుండా పోతాయి.
So it is clear that N tv boss and CEO are together in cooperating with each other and understanding each other. IPPUDU RAJASEKHAR DORIKINAA DONGA KAADU.
ఇలాంటి సంఘటనలవల్లే, మీడియా విశ్వసనీయత కోల్పోతుంది. అయినా ఈ రోజుల్లో మీడియాని గుడ్డిగా నమ్మేవాళ్ళూ లేరులెండి.
* అయినా ఈ రోజుల్లో మీడియాని గుడ్డిగా నమ్మేవాళ్ళూ లేరులెండి.*
అని మీరను కుంట్టున్నారు. బ్లగులలో జరిజే చర్చంతా మీడియా చూపిన ఘటన ల ఆధారం గా జరుగుతున్నాది అంటె దిని అర్థం మనం మీడియా చూపిస్తున్నదానికి నిజమో అబద్దమో మొదట బాగా ప్రతిస్పందిస్తున్నాము. అది చాలు మీడియా వారికి. కాని అసలు చిక్కేమిటంటె ఇందులో ఉన్న కొంతమంది ప్రముఖులు ఒకప్పుడు సంస్కరణ వాదులలా పోజులు కొట్టారు కాని ఇప్పుడు వీరి భండారం బయట పడింది. ఇప్పుడు 60సం|| క్రితం తో పోలిస్తె వాగటానికి స్వెచ్చ తప్ప ప్రతి రంగం లో ప్రజల పై ఇబ్బందులు,అన్యాయాలు, ఎన్నోరేట్లు పెరిగాయి కాని సదరు అభ్యుదయ వాద వర్గం డబ్బులు చేసుకుంట్టూ చాలా బిజీగా ఉంది. ఎక్కడ వీటి మీద నోరు మెదపటం లేదు.
* అయినా ఈ రోజుల్లో మీడియాని గుడ్డిగా నమ్మేవాళ్ళూ లేరులెండి.*
అని మీరను కుంట్టున్నారు. బ్లగులలో జరిజే చర్చంతా మీడియా చూపిన ఘటన ల ఆధారం గా జరుగుతున్నాది అంటె దిని అర్థం మనం మీడియా చూపిస్తున్నదానికి నిజమో అబద్దమో మొదట బాగా ప్రతిస్పందిస్తున్నాము. అది చాలు మీడియా వారికి. కాని అసలు చిక్కేమిటంటె ఇందులో ఉన్న కొంతమంది ప్రముఖులు ఒకప్పుడు సంస్కరణ వాదులలా పోజులు కొట్టారు కాని ఇప్పుడు వీరి భండారం బయట పడింది. ఇప్పుడు 60సం|| క్రితం తో పోలిస్తె వాగటానికి స్వెచ్చ తప్ప ప్రతి రంగం లో ప్రజల పై ఇబ్బందులు,అన్యాయాలు, ఎన్నోరేట్లు పెరిగాయి కాని సదరు అభ్యుదయ వాద వర్గం డబ్బులు చేసుకుంట్టూ చాలా బిజీగా ఉంది. ఎక్కడ వీటి మీద నోరు మెదపటం లేదు.
ee blog chadvuthunte unte Ramoji entha great oo artham avuthundii.....
okappudu ETV2 biased anevallu...ippudu migitha channels anni chusakaa....ETV2 ganjayivanam lo tulasi mokka la kanipisthundi..
రాము గారూ,
’ఒకప్పుడు నార్లా గారి ని చూసి గర్వించిన మనం(తెలుగు వారు)’, ఇప్పుడు నరేంద్ర చౌదరి గట్రాలు ’ఈ పత్రికా రంగాన్ని ఎలా బ్లాక్ మైల్ వ్యాపారాం గా మార్చారో’ చదివి మతిపోగొట్టుకోవాలండి. అంతేగానీ..
’ఆ కమ్యునిటికి చెందిన వారు’ ఈ పత్రికా రంగాన్ని ఎలా బ్లాక్ మైల్ వ్యాపారాం గా మార్చారోనని మతి పోగొట్టుకోకూడదు.
-ఎంచేతంటే మనం ’నార్లా గారి ని చూసి’ గర్వించాం. ’ఆ కమ్యూనిటీ వాళ్ళని’ చూసి గర్వించలా. అంచేత ఇప్పుడు ’ఆ కమ్యూనిటీని చూసి’ మతి పోగొట్టేసుకోకూడదు.
కత్తి గారు. వేమూరి గారు కులం గురించి ఆలోచించకుండానే తన కులానికి చెందినవాడి చానెల్ పై స్టింగ్ ఆపరేషన్ చేశారు. కనుక కులం గురించి ఇక్కడ అనవసరం.
ramu garu me blog naku baga nachindhi.nizanni chala nirbhayam ga vunnadi vunnatlu ga rasthunaru.monna abn chupinchina phone record lo rajshekhar garu naku dabbulisthey prblm solve chestha ani analedhukada.okasari kaludham aney mata prati manishi using word.danni pattukuney edo thappuchesesadu donga ani deside chesthey ela.thanu direct ga dabbulem thesukunatlu visuals em lev ga.. deenikey rajasekhar cheddavadaipoyada.. naku aa recording lo thappuga em anipinchaledhu. kani abn ki ntv meedha entha edupo baga kanipinchindhi ina abn ratings kosam kastapadithey bhaguntundemo. ila donga dharlu kakunda.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి