Monday, November 21, 2011

చక్రబంధంలో తెలుగు జర్నలిస్టు...

అంతా జర్నలిస్టులను తెగ తిడతారు కానీ...జర్నలిస్టుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాంటిదని అర్ధం చేసుకోరు. ఒక పక్క యాజమాన్యాల రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు నెత్తికెత్తుకోవాల్సి రావడం, వృత్తిలో ఉండే టెన్షన్, బాసులనే  శునక మర్కాటక సంతతి విచిత్ర లీలలు...మరో పక్క చాలీచాలని జీతాలు, తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం. జర్నలిస్టులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో తెలిపే వ్యాసాన్ని ఒక పత్రిక కోసమని రాసాను. వారా వ్యాసాన్ని ప్రచురిస్తారో లేదో తెలియదు. ఆ సందర్భంగా తయారుచేసిన వృత్తాన్ని దిగువనిస్తున్నాను. 
ఇక్కడ..జర్నలిస్టుల నిర్వచనంలో...వృత్తిని అడ్డంపెట్టుకుని సంపాదించే అడ్డగాడిదలకు మినహాయింపు ఉందని గమనించగలరు. అలాగే శునక మర్కాటక సంతతి...అనే మాట మంచి బాసులకు వర్తించదని మనవి. జర్నలిస్టు మిత్రులు ఈ చిత్రానికి ఇంకా ఏమైనా యాడ్ చేయమన్నా చేయడానికి నేను సిద్ధం. దీనిమీద మీ అభిప్రాయాలకు, చర్చకు స్వాగతం పలకడం ఈ కసరత్తు ఉద్దేశం.




Graphic representation: Hema

3 comments:

dhana said...

Ram garu ,first of all its a good picture describing what is ground reality faced by a journalist.
The central theme of society is caste and politics based blessedness but the only one weapon which can change or throw spot light what it should like is idealistic JOURNALISM.

If everything is good and great going any one will perform and in order set those good conditions press should become voice of people not noise of nuisance of current day channels or papers

Chinna said...

Caste feeling is dominating media reports.

Kamma media is completely backing Babu and spewing venom at Jagan.

Sakshi is supporting Jagan and DC Chairman Venkat Rami Reddy is not supporting Jagan.

Chinna

అయితగాని జనార్ధన్ said...

అవును.. సమాజంలో జరిగే ప్రతి సమస్యనూ ప్రపంచానికి పరిచయం చేస్తాడు.. ఆదుకోరూ... అనే టైటిల్ పెట్టి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొమ్మంటారు.. కానీ వీళ్లను ఆదుకునే వారుండరు.. ఖర్మ కాలి వీళ్లకు ఏదన్నా రిస్కయితే.. పేపర్లో అయితే సింగిల్ కాలం ఐటం.. చానల్య్కలో ఐతే యాంకర్ విజువల్ పెట్టడానికి కూడా నసుగుతారు.. వీళ్లు పనిచేసే పేపర్/చానల్ వాళ్లు.. కానీ బయట ఎక్కడన్నా జర్నలిస్టు అని పరిచయం చేసుకుంటే.. దేశం మీది రాజకీయాలన్నీ అడిగి ఆఖరుకు.. మీరు సుద్దపూసలు కారు అని ఓ కామెంట్ చేసి సంబర పడతారు.. అదీ జర్నలిస్టు జీవితం..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి