ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి డిసెంబర్ 9, 2010 నాడు మేము ఆరంభించిన గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీ.టీ.టీ.ఏ.) ప్రథమ వార్షికోత్సవం వాయిదాల మీద వాయిదాలు పడుతూ మార్చి 18 న అమీర్ పేట్ లోని "రంగ్" అనే హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోచ్ సోమ నాథ్ ఘోష్ ను, మా క్రీడాకారులను నగదు బహుమతితో సన్మానించి తర్వాత భోజనాలు చేసాం. మొదటి ఏడాది లోనే మా ఇద్దరు పిల్లలు (శ్రీజ, ఫిదేల్) నేషనల్ రాంకింగ్ పొందడం లో ఘోష్ కృషి మరువలేనిది.
ఇందులో పక్క ఫోటో...జీ.టీ.టీ.ఏ. ఏర్పడడానికి కారణమైన రాందాస్ భరతన్ (హెచ్ డీ ఎఫ్.సి. వైస్ ప్రెసిడెంట్- టీ షర్ట్), రావు (కాంట్రాక్టర్ కం లాయర్), నేను (బతకలేని జర్నలిస్టును, జర్నలిజం బోధకుడిని) కలిసి మా అకాడమీ పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సోమ నాథ్ ఘోష్ కు బోకే అందిస్తున్న దృశ్యం. ఇక రెండో ఫోటో...మా పిల్లలతో ఘోష్. నిజంగా మంచి ఫామిలీ ఫంక్షన్ లాగా బాగా జరిగింది. చిన్నప్పుడు నాతొ షటిల్ బాడ్మింటన్ ఆడిన 'సీల్' కంపెని ఎం.డీ. వంశీ, భారతీ సిమెంట్స్ సీనియర్ జనరల్ మానేజర్ శ్రీనివాస రావు కూడా ఇందులో పాల్గొన్నారు.
2 comments:
Ramu namaste..Happy Ugadi.Congrats for GTTA 1st Anniversary.meeru koncham regular ga postlu rayandi sir ji..prati roju blog chala times open chesthuna new postlu em leka niraashato close chesthuna...pls keep update the blog...thank and wish u all the best..
Good to hear about ur academy's anniversary. congrats boss!
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి