చెంత ఉన్న వాటిని మరవడం, లేని వాటి కోసం అర్రులు చాచడం...మనం చేసే
పనే. ఎంతో పేద కుటుంబం లో పుట్టిన మా నాన్నను నేను అపుడప్పుడూ ఒక ప్రశ్న
వేసే వాడిని. సామర్ధ్యం ఉన్నా...దొరికిన చిన్న ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఆయన
రిటైర్ అయ్యారు. పశువులకు చికిత్స చేస్తూ అయన ఎంతో ఆనందం గా ఉండేవారు.
కొన్ని గ్రామాలలలో రైతులు మా నాన్నను ఇప్పటికీ మరిచిపోరు.
'నాన్నా...ఉద్యోగం చేస్తూ పల్లెటూళ్ళలో ఎందుకు ఉండి పోయారు? మా చిన్నప్పుడే పట్టణం వెళితే చదువు బాగుండేది కదా...?' అని. దానికి ఆయన ఎప్పుడూ విసుక్కోకుండా...ఒకే సమాధానం చెప్పేవారు. 'తెలివిగల వాళ్ళు ఎక్కడ ఉన్నా రాణిస్తారు. ఎక్కడ బతుకుతున్నామన్నది కాదు. ఎంత తృప్తి తో బతుకుతున్నామన్నది ముఖ్యం. తృప్తి లేకపోతే...మనశ్శాంతి వుండదు,' అని.
ఒక తొమ్మిదేళ్ళ కిందట...నల్గొండ లో
ఒక బార్ లో సర్వర్ గా పనిచేస్తున్న ఒక బెంగాలీ...మాటల సందర్భంగా మా నాన్న
చెప్పిన మాటలే చెప్పారు నాకు. పదహారేళ్ళ కిందట సొంత వూరు వదలి వచ్చి...ఒక
బార్ లో పనిచేస్తూ ఆ వచ్చే ఆదాయంతో తృప్తి పడుతూ బతుకుతున్నాడాయన. ఎప్పుడూ
నవ్వుతూ ఉంటాడు. అందరితో వచ్చీ రాని తెలుగులో మాట్లాడతారు. నాతో ఇంగ్లిష్
లో మాట్లాడే వారు. అది చక్కని ఇంగ్లిష్. 'ది హిందూ' పత్రిక అభిమాని. నేను ఆ
పత్రిక ప్రతినిధిని కాబట్టి చాలా సన్నిహితంగా వుండేవారు. తన్ను కలవడం కోసం
బార్ కు వెళ్ళే వాడిని. ఒక రోజు...అందరికీ సర్వ్ చేస్తూ మధ్యలో వచ్చి...ఆ
రోజు తాను చదువుతున్న పుస్తకంలో కొన్ని విషయాలు మంచి ఇంగ్లిష్ లో చెబితే
నేను ఆశ్చర్యపోయాను. నాకన్నా బుర్ర వున్న వ్యక్తి, ప్రతిభావంతుడాయన అని
అర్థమయ్యింది. ఆయనపై గౌరవం పెరిగింది.
నేను నల్గొండ నుంచి వచ్చే ముందు...'వెళ్ళిపోతున్నా...' అని చెప్పాను తనతో. 'Ramooji, satisfaction is very important in life. Here you are a happy soul. If you want to chase money, it will make you run. Anyway, I wish you good luck,' అని చెప్పాడు. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. కానీ...ఫిదెల్ టేబుల్ టెన్నిస్, నా పీ.హెచ్.డీ, నల్గొండ లో నాసిరకం జర్నలిజం నన్ను నగరానికి తరిమాయి. అప్పటి నుంచీ...నా బాడ్మింటన్ మిత్రులు ఎవరు బార్ కు పోయినా నా గురించి అడిగే వాడు ఆ బెంగాలీ సర్వర్. నేను అమెరికా పోయి రావడం, టీచింగ్ లోకి మారడం...ఫిదెల్ పురోగతి...అన్నీ అతనికి తెలుస్తున్నాయని అర్థమయ్యింది...మూడు రోజుల కిందట నేను నల్గొండ వెళ్ళినప్పుడు.

5 comments:
You are a sucker for sentiments!
Sir,
You are absolutely right.Most of our so called intellectuals are hallow when we compared with some ordinary persons of Other states like Tamil nadu and Bengal.Our people always enjoy kidding fellowmen for nothing.And read very less,biased with unnecessary regional and communal feelings.
.....Murthy
idi jeevitam lo nijamaina yogam
ఆ బార్ పేరు, వారి పేరు? ??
అతని పేరు, ఇతర వ్యక్తిగత వివరాలు కావాలనే ఈ పోస్టులో ఇవ్వలేదు. ఆయన అనుమతి కోరి ఇస్తాను.
రాము
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి