Sunday, September 30, 2012

ఆటల్లోనూ స్త్రీల పట్ల చిన్న చూపు....

నిన్న U-TV మూవీస్  లో 'బాగ్బన్' అనే హిందీ సినిమా చూసాను. ఆఖరి సన్నివేశంలో అమితాబ్ డైలాగ్, నటన చతురత చూసి గుండె ఉప్పొంగింది. ఏమి నటన, ఏమి డైలాగ్ డెలివరీ? 
ఇదే సినిమాలో..అర్థరాత్రి బాయ్ ఫ్రెండ్ కారులో దింపగా ఇంట్లోకి వచ్చిన మనుమరాలికి సుద్దులు బోధించబోతుంది హేమమాలిని. అప్పుడు ఆమె కోడలు...రోజులు మారాయి అని అన్నప్పుడు...హేమమాలిని ఇలా అంటుంది. "అమ్మా...రోజులు మారినా...ఆడదాని పరిస్థితి మారలేదు." ఈ మాట యెంత సత్యం?

గత వారంగా ఒక విషయంలో నా గుండె మండి పోతున్నది.  మహిళల పట్ల సామూహికంగా ప్రపంచానికి ఉన్న చిన్న చూపునకు ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. అందరం కలిసి దర్జాగా చేస్తున్న ఒక మహా పాపం. 

శ్రీలంకలో ఇప్పుడు ప్రపంచ కప్ టీ  ట్వంటీ టోర్నమెంట్ జరుగుతున్నది కదా. జనమంతా వెర్రెక్కినట్లు  దాని గురించి మాట్లాడుకుంటున్నారు. చర్చలతో కాలక్షేపం చేస్తున్నారు. మీడియా అదే పనిగా దాని తాలూకు వార్తలు చూపుతున్నది, రాస్తున్నది. కొన్ని చానెల్స్ ప్రతి మ్యాచ్ నూ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. కానీ..అదే శ్రీలంక లో జరుగుతున్నా మహిళల ప్రపంచ కప్ క్రికెట్ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మ్యాచ్ రిపోర్టులు కూడా మీడియా లో రావడం లేదు. వచ్చినా...స్పోర్ట్స్ పేజీలో చిన్న ముక్కలుగా వస్తున్నాయి. ఇది దారుణం, అందరం ఖండించాల్సిన విషయం. 

అంతే  కాదు....స్కూల్ స్థాయి నుంచి...ప్రపంచ స్థాయి వరకూ ప్రైజ్ మనీ లో తేడా ఉంటుంది. మహిళల విభాగంలో విన్నర్ కు, పురుషుల విభాగంలో విన్నర్ కన్నా తక్కువ ప్రైజ్ మనీ ఉంటుంది. ఇది ఎంత  అమర్యాద? ఇంత  జరుగుతున్నా....మన మేథావులు గానీ...మహిళా సంఘాలు గానీ గళం విప్పకపోవడం వింతగా ఉంది. ఇది రాస్తుంటే....'యెంత కాదన్నా...మహిళలను మనం నీగ్రోలుగా చూస్తాం....'అన్న జాన్ లెనిన్ లిరిక్ గుర్తుకు వస్తున్నది. 

Woman is the nigger of
the world
Yes she is...think about it
Woman is the nigger of
the world
Think about it...do
something about it

We make her paint her
face and dance
If she won't be slave ,we
say that she don't love us
If she's real, we say she's
trying to be a man
While putting her down we
pretend that she is above us

Woman is the nigger of
the world...yes she is
If you don't belive me take a
look to the one you're with
Woman is the slaves of
the slaves
Ah yeah...better screem
about it
We make her bear and raise
our children
And then we leave her flat for
being a fat old mother hen
We tell her home is the only
place she would be
Then we complain that she's
too unworldly to be our friend
Woman is the nigger of
the world...yes she is
If you don't belive me take a
look to the one you're with
Woman is the slaves of
the slaves
Yeah (think about it)

We insult her everyday on TV
And wonder why she has no
guts or confidence
When she's young we kill her
will to be free
While telling her not to be so
smart we put her down for being so dumb
Woman is the nigger of
the world...yes she is
If you don't belive me take a
look to the one you're with
Woman is the slaves of
the slaves
Yes she is...if you belive me,
you better screem about it.

Repeat:
We make her paint her
face and dance
We make her paint her
face and dance We make her paint her
face and dance
  

8 comments:

satya said...

Understand this simple logic.. Popularity is directly proportional to Income.

In modelling guys don't get even half of what a female model earns. If you see auto expo, even for advertising a off-roader also they keep a female model. Is this not discrimination?

Didn't you see Saina Nehwal getting front page news many times?

Think practically rather simply following bookish understanding of these discriminations which are written by job less feminists.

శ్యామలీయం said...

మీ ఆవేదన, ఆవేశం, ఆక్రోశం సరైనవే!
కాని, యిలా యెందుకు జరుగుతోందన్నది గ్రహించాలి.
ఇది పురుషాధిక్యతాకారణం వలన జరుగుతున్న అన్యాయం కాదు.
ఇది ధనప్రబావం కారణంగా జరుగుతున్న అన్యాయం.

ఒక క్రీడ ఆర్భాటంగా జరుగుతున్నదీ అంటే దాని వెనుక ధారాళంగా ఖర్చు పెట్టబడుతున్న దనం ఉంటుంది.

ఆ ధనం అంతా స్పాన్సర్ల పుణ్యమా అని సమకూరుతున్నది.

ఒక క్రీడా వార్తకు పత్రికలలో తగిన స్థలం కేటాయించబడుతున్నదీ అంటే దానికీ తగిన ధనం దన్నుగా ఉండటమే కారణం.

ఎన్ని బడాయి మాటలు చెప్పినా, పత్రికను నడిపేది ధనార్జన కోసమే. అంగుళం స్థలం కేటాయించినా పేజీలో అది పత్రిక సర్క్యులేషన్ అనేదానిని నిలపడమో పెంచటమో చేస్తుందనుకుంటేనే.

ఒక క్రీడా వార్తను ఒక విశ్లేషకుడు వ్రాయటం వెనుక కూడా దనం ప్రమేయం ఉంది. ఏ క్రీడాంశం గురించి వ్రాస్తే తనకు పరపతీ, డబ్భూ దండిగా లభిస్తాయో వాటి గురించే విశ్లేషకులు వ్రాస్తారు.

ఈ సూత్రాలు అన్ని రకాల మీడియాకూ వర్తిస్తాయి.

చివరికి క్రీడాకారులకు కూడా దనమే చోదకశక్త్రి. తమ పిల్లలు డబ్బొచ్చే క్రీడలే ఆడాలని సమాజంలో తలిదండ్రులు కోరుకుంటున్నారు. వీలైతే డబ్బొచ్చే క్రీడలకు మళ్ళాలని కొందరు క్రీడాకారులూ అనుకుంటారు.

కాలం ఒక క్రీడకు పరపతి కల్పిస్తే తప్ప, దనలక్ష్మి దాని ముఖం చూడదు. అది కటాక్షిస్తే తప్ప మనకు దాని వార్తలు మీడియాలో రావు.

అదీ సంగతి.


katta jayaprakash said...

It's a very good analysis how our media looks down the women in sports.The media is after Sanias and other glamorous sports women.

JP.

katta jayaprakash said...

It's a very good and timely observation.Our media never covers the sports events of women except the glamorous faces.Even the media covers the social activities of Sanias,Jwala guthas etc.And a section of media looks more deep into the body of the women players while playing the game with accidental exposure of body parts.Recently there were photos of some women tennis players in TOI showing the chest of women in different angles exposing the breasts.This the contribution of our media towards the women players!A shameful and sadistic mindset.

JP.

Unknown said...

Ramu,

Your analysis is meaningless. How many people watch women's cricket is the question and payment is based on that.

If your logic is correct, female tennis players who play just 3 sets, should only get 60% of what males get because males play 5 sets. But men and women are paid equally in tennis.

My above logic (how many people watch)applies here. Though females play just 3 sets their game enjoys equal/more viewership, because it is not just the game that is involved.

The logic that women should be equal to men itself is against women, because you are considering males superior.

Ramu S said...

The logic that women should be equal to men itself is against women, because you are considering males superior.
రమణా...అంతా బాగుంది కానీ ఇదేమి వాదన?
రాము

Unknown said...

Ramu,

My logic is... why don't we say men should be equal to women?

By trying to compare women with men, we are insulting them.

Anonymous said...

నాదొక ఆబ్జెక్షన్! స్త్రీ పురుష అసమానతలపై గొంతులు చించుకునేవాళ్ళలో చాలామంది తమదాకావస్తే తమ పిల్లల మద్య కూడా ఇదే తారతమ్యాలు పాటిస్తున్నారు!!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి