Thursday, February 7, 2013

జర్నలిజంలో PhD- నెరవేరిన ఒక కల

బ్లాగ్ మిత్రులారా...ప్రియమైన పాఠకులారా...ఆత్మ బంధువుల్లారా....

ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజు... 2013 ఫిబ్రవరి ఏడో తేది...ఎప్పుడూ తియ్యగా, తడి ఆరని కలలా గుర్తుండిపోతుంది. ఏడేళ్ళ కిందట 'ది హిందూ' పత్రిక రిపోర్టర్ గా ఉండగా చరిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్టుమెంటు లో PhD రిజిస్టర్ చేసుకున్నాను...ఎన్.రామ్ గారి లిఖితపూర్వక అనుమతితో. 'జర్నలిస్టులు-నైతిక విలువలు' అన్న అంశంపై పరిశోధన అనుకున్నంత సులువు కాలేదు. అప్పటి నుంచి కష్టపడి, కలతపడి, దుఃఖపడి, మదనపడి, బాధపడి, బద్ధకం వల్ల కిందపడి మీదపడి  ఎలాగోలా పరిశోధన పూర్తయి ఈ రోజున డిగ్రీ ప్రధానం జరిగింది. ఈ పరిశోధన పని ఒత్తిడి కారణంగా బ్లాగింగ్ కు కొద్దిగా దూరం కూడా అయ్యాను. 



ఒక పన్నెండేళ్ళ కిందట జర్నలిజం లో నేను రెండు గోల్డ్ మెడల్స్ తీసుకున్నటాగోర్ ఆడిటోరియం లో జరిగిన ఉస్మానియా 79 వ స్నాతకోత్సవం లో ఇద్దరు ప్రొఫెసర్లు ఎస్.సత్యనారాయణ (వైస్ చాన్సలర్), గోవర్ధన్ మెహతా (ప్రముఖ రసాయన శాస్త్ర నిపుణుడు) చేతుల మీదుగా కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లో PhD పట్టా అందుకున్న ఇద్దరిలో నేను ఒకడిని. మొత్తం 279 మందికి ఈ పట్టాలు అందించారు. ఇంతవరకూ ఉస్మానియా నుంచి ఒక అరడజను మందిమి మాత్రమే పట్టాలు పొందగలిగాము. 
బాధ కలిగిన విషయం ఏమిటంటే...విశ్వవిద్యాలయం చాన్సలర్ అయిన గవర్నర్ నరసింహన్ ఈ కార్యక్రమానికి రాకపోవడం. తెలంగాణా కు వ్యతిరేకిగా ముద్ర పడిన ఆయన రావడానికి వీల్లేదని విద్యార్ధి సంఘాలు హెచ్చరించడం, హడావుడి చేయడంతో ఆయన రాలేదని చెప్పారు. ఇది డిగ్రీలు పొందిన వారికి  సమంజసంగా తోచలేదు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల వ్యతిరేకత ఉండవచ్చుగానీ...ఎందరో తెలంగాణా విద్యార్థులకు కలలాంటి స్నాతకోత్సవానికి, ఆయన అభిప్రాయాలకు సంబంధం ఏముందని పలువురు ప్రశ్నించారు. తెలంగాణా ఇవ్వడం ఇవ్వకపోవడం సోనియా, మన్మోహన్, రాహుల్ చేతిలో ఉంది, ఈ గవర్నర్ మాట విని తెలంగాణా ఇవ్వడం లేదనుకోవడం సమంజసంగా తోచడం లేదు. 

కాస్త అనారోగ్యం తో ఉన్న మా అమ్మ, పిల్లలను తీసుకు రావద్దని యూనివర్సిటీ ప్రత్యేకించి చెప్పడం వల్ల నా పుత్రుడు ఫిడేల్ ఆర్ స్నేహిత్ ఈ స్నాతకోత్సవానికి రాలేదు. మా నాన్న ప్రత్యేకించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని..."I am proud of you..." అని నాతో గర్వంగా చెప్పారు. మా కుటుంబం లో ఇది మొట్టమొదటి PhD. పరిశోధనకు అడుగడుగునా ప్రోత్సాహం అందించిన నా జీవిత భాగస్వామి హేమ రిపోర్టింగ్ గొడవలో పడి కాస్త లేట్ గా వచ్చింది స్నాతకోత్సవానికి. 

మొత్తం మీద మా అమ్మకు చిన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ అయినందుకు ఆమె, నేను ఆనందించాము. నా గైడ్ ప్రొఫెసర్ పద్మజా షా, ఈ టాపిక్ కు ఒక రూపం ఇచ్చిన నా మొదటి గైడ్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్, నేను నిస్పృహకు గురైనప్పుడు ఓదార్చిన ప్రొఫెసర్ బాలస్వామి-ప్రొఫెసర్ నరేందర్ లకు కృతఙ్ఞతలు. నా వెన్నంటి ఉండి సాంకేతిక సహకారం అందించిన నా కూతురు మైత్రేయి, నా ఆప్త మిత్రుడు బలుసూరి శంకర్ లకు థీసిస్ లో విధిగా థాంక్స్ తెలిపాను. వివిధ భంగిమల్లో ఫోటోలు తీసిచ్చిన నా మాజీ సహచరుడు, మాకు ఇంకో కొడుకు లాంటి గోపాల్ కు థాంక్స్. 

ఈ డిగ్రీ ఇచ్చిన అదనపు బాధ్యతతో సమాజ హితం కోసం మరింత పాటుపడతానని గట్టిగా హామీ ఇస్తూ...ఈ ఇకిలించే ఫోటో తో సెలవు తీసుకుంటాను. 

29 comments:

venkat said...

Congratulations sir.

satyam said...

ప్రియమైన రాము గారూ,
మీకు మనసారా అభినందనలు....
జర్నలిజంలో విలువల పట్ల అమితమైన తాపత్రయాన్ని, ధర్మాగ్రహాన్ని చూపే మీరంటే నాకు అభిమానం, గౌరవం.
జర్నలిజంలో మీరు డాక్టరేట్ పొందటం చాలా సంతోషం కలిగిస్తోంది. మీ పరిశోధన గ్రంథం జనంలోకీ రావాలి. ఇప్పుడు చాలా అవసరం కూడా.
"ఈ డిగ్రీ ఇచ్చిన అదనపు బాధ్యతతో సమాజ హితం కోసం మరింత పాటుపడతానని గట్టిగా హామీ ఇస్తూ... సెలవు తీసుకుంటాను. " అన్న మాట ఆనందాన్నిచ్చింది. శుభాకాంక్షలతో .... సెలవు...

Sai Kiran said...

Congrats Sir...

Unknown said...

డాక్టర్ రామూ శుభాకాంక్షలు.

Unknown said...

డాక్టర్ రామూ, శుభాకాంక్షలు.
జిలాని.

bhaskars blog said...

డాక్టర్ రాము గారికి అభినందనలు.

Mr Gali said...

"డా." రాము అయినందుకు శుభాకాంక్షలు !

Mr Gali said...

"డా." రాము అయినందుకు శుభాకాంక్షలు !

ఈతరం said...
This comment has been removed by a blog administrator.
ఈతరం said...

అభినందనలు

శ్రీరామ్ said...

Congratulations Dr.Ramu garu.

K V V S MURTHY said...

Congrats Ramuji.

anrd said...

అభినందనలండి.

చంద్ర said...

డాక్టర్. రాము గారికి హృదయపూర్వక అభినందనలు.

సుజాత వేల్పూరి said...

ఎంత సంతోషంగా ఉన్నారో!

డాక్టర్ రాము గారూ, మనఃపూర్వక అభినందనలు సర్

Ramu S said...

Thank you very much for your wishes.
ramu

Jai Gottimukkala said...

రాము గారూ, అభినందనలు.

మీరు ఎంచుకున్న సబ్జెక్టు చాలా బాగుంది. కనుమరుగవుతున్న విలువలను (ethics) కాపాడడానికి మీరు చేస్తున్న కృషికి ఈ డాక్టరేటు గుర్తింపు ఇచ్చింది.

నాదో సలహా. మీ థీసిస్ పుస్తకరూపంగా ప్రచురిస్తే ఎదుగుతున్న జర్నలిస్టులకు & జర్నలిజం విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అదే మాదిరిగా క్రియాశీలకంగా మీరు చేస్తున్న కృషికి సిద్దాంత బలం (theoritical foundation) సమకూరుతుంది.

Unknown said...

Hi Ramu,

Congratulations. Wish you god speed in all your endeavours.

w.chandrakanth
new delhi, feb 8

Ramu S said...

Chandrakanth sir,
Thank your very much. Thanks a ton.
Ramu

srikanth said...

congrats doctors saab
ippatikaina NRIs ki J classes ki plan cheyandi

Sreekanth

Sri said...

డాక్టర్ రాము గారికి మనఃపూర్వక అభినందనలు.

cbrao said...

అభినందనలు. మీ థీసిస్ ను సంక్షిప్తంగా పుస్తకరూపంగా వెలువరిస్తారా?

cbrao said...

Not for publishing-for follow up comments only.

Bendalam KrishnaRao said...

మీకు మనసారా అభినందనలు....

జర్నలిజంలో మీరు డాక్టరేట్ పొందటం చాలా సంతోషం కలిగిస్తోంది. మీ పరిశోధన గ్రంథం జనంలోకీ రావాలి. ఇప్పుడు చాలా అవసరం

venu said...

Congratulations sir.

worthlife said...

రామూ గారూ.. మీకివే నా హృదయపూర్వక అభినందనలు. ఒక పక్క మీ అబ్బాయిని జాతీయస్థాయిలో ఉత్తమ క్రీడాకారునిగా తీర్చిదిద్దుతూనే మీ వంతుగా మరో విజయాన్ని మీ ఖాతాలోనూ వేసుకుని పరస్పర స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. మీ తండ్రీ కొడుకులిద్దరూ ఎందరికో ఆదర్శవంతులయ్యారు. మీ విజయాల్లో ఇద్దరికీ తోడై నిలిచి నేపథ్యంలో కీలకపాత్ర పోషించిన మీ శ్రీమతిగారికి ప్రధాన అభినందనలు.

katta jayaprakash said...

Hearty congratulations.The hard work,dedication and sincerity paid rich dividends.Hope you become a role model in journalism with constructive approach bringing out good,bad and ugly of the journalistic trends in these days.Sorry for late response as I opened the blog just now.

JP.

Ramu S said...

Thank you very much JP sir.
Thanks a ton for everyone who sent their congratulatory messages.
ramu

arunkumar.marapatla said...

congratulations Ramu garu..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి