పైశాచిక ఆనందం కోసమో, పైత్యం ప్రకోపించో, పిచ్చి ముదిరో, బీ పీ పెరిగో, అదే గొప్పనుకొనో భర్తలు పెట్టే హింసలను కుటుంబ వ్యవస్థ కోసం మౌనంగా నెగ్గుకొస్తున్న గృహిణులకు...
కల్చర్ లేని పంది కొక్కుల్లాంటి బాసుల చేతిలో వివిధ రకాలైన సెక్సువల్ హింసకు గురవుతూ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం తపిస్తోన్న ఉద్యోగినులకు....
ప్రేమ పేరుతో రిలేషన్ లోకి దింపబడి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నా పరువు కోసం, ప్రతిష్ట కోసం బాధలు దిగమింగుకుని బతుకుతున్న యువతులకు...
'మగ' అనే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ తో స్కూళ్ళలో, కాలేజీల్లో, విశ్వ విద్యాలయాల్లో చెలరేగి చులకన చేసే పిచ్చి కుక్కలను భరిస్తూ చదువుల తల్లుల్లా వెలిగిపోతున్న విద్యార్థినులకు...
వెకిలి చూపులను, నీచ కామెంట్లను, తడిమి కుతి తీర్చుకోవాలానుకునే జులాయి వెధవలను వీధుల్లో, బస్సుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో కామ్ గా భరిస్తూ బతుకు సమరం సాగిస్తున్న విద్యార్థినులకు, యువతులకు, ఉద్యోగినులకు, గృహిణులకు...
అడుగడుగునా లింగ వివక్ష, ఇతరేతర అవాంతరాలు ఎన్ని ఉన్నా...అద్భుత విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్న అక్క చెల్లెళ్ళకు....
పరిస్థితుల ప్రభావం వల్ల... సెక్స్ వర్కర్లుగా, ఫ్యాక్టరీ లలో కార్మికులుగా, పని మనుషులుగా బతుకు బండి లాగిస్తూ నిత్య సమరం చేస్తున్న స్త్రీ మూర్తులకు....
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
(ఇదే రోజు పుట్టిన మా కూతురు మైత్రేయికి ఈ పోస్టు అంకితం)
(ఇదే రోజు పుట్టిన మా కూతురు మైత్రేయికి ఈ పోస్టు అంకితం)
1 comments:
స్పూర్తిదాయకమైన మీ శుభాకాంక్షలకి అభివందనాలండీ..
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి