Wednesday, June 26, 2013

పసుపు పచ్చ ప్రెస్ అంటే ఇదేనేమో....

తెలుగు ప్రెస్ లో ఏ పత్రిక ఎజెండా దానికుంది. సరే... 'సాక్షి' పేపర్, ఛానెల్ పుట్టుకొచ్చిందే  పచ్చ మీడియా విష ప్రచారాన్ని అడ్డుకోవడానికని ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది. పనిలో పనిగా జగన్ కుటుంబ అజెండా మోయడానికి ఆ పత్రిక, ఛానెల్ నిరంతరం కృషి చేస్తున్నాయి. 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి' పత్రికలు, వారి తాలూకు ఛానెల్స్ కూడా నిరంతరం తెలుగు దేశం   కోసం, చంద్రబాబు కోసం పాటుపడతాయన్న విమర్శ ఉంది. అది అబద్ధం కాదు సుమా...అనడానికి ఉదాహరణలు అనేకం. లేటెస్ట్ ఉదాహరణ చూద్దాం. 

ఈ మధ్యన ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి. వేల మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో... తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ చిక్కుకున్న తెలుగు వారి కోసం నడుం బిగించారు. మొన్న, అంటే సోమవారం నాడు, ఆయన డెహ్రాడూన్ వెళ్లి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహుగుణను కలిసి... తెలుగు వారి పట్ల వివక్ష వద్దు... అని చెప్పారు. ఈ మీటింగ్ కు సంబంధించి మంగళవారం మొదటి పేజీ పై భాగం లో ఈనాడు ఒక ఫోటో వేసింది. చంద్రబాబు... ఆ ముఖ్య మంత్రిని చూపుడు వేలు పైకెత్తి నిలదీస్తున్నట్లు ఉన్నదది. ఆ ఫోటో చూసిన తెలుగోళ్ళు... మన బాబు గారు... ఆ సీ ఎం ను ఎకేస్తున్నరహ... అని చంకలు గుద్దుకోవాలన్నది  ఆ పత్రిక తాపత్రయం అని కూడా అనుకోలేము. "తె దే పా ఆధ్వర్యంలో ప్రత్యేక  విమానం"... 'ఇంటికి చేరే దాకా పార్టీ దే బాధ్యత..." అన్న శీర్షికలూ మొదటి పేజీలో వచ్చాయి. ఇక 15 వ పేజీ మొత్తం తెలుగు దేశం యాక్టివిటీ కి కేటాయించారు. అందులో... బాబు గారివి రెండు ఫోటోలు వేసారు. దేశ రాజధానిలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఒకాయన బిజీ గా ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటో, పలు స్టోరీలు ప్రచురించారు. 

ఇక ఈ రోజు, అంటే బుధవారం, ఊపు పెరిగింది. తెలుగు యాత్రికుల గోడు వింటున్న బాబు గారి ఫోటోలు 'ఈనాడు' రెండో పేజీలో, మూడో పేజీలో వేసారు. ఆ పనే చేస్తున్న ముఖ్యమంత్రి ఫోటోలు రెండు వేసారని కూడా చెప్పుకోవాలి. "పనికిరాని ప్రభుత్వాలు!" అన్న శీర్షికతో ఒక ఎడిటోరియల్ రాసారు. దానికి ఆశ్చర్యార్ధకం ఎందుకు పెట్టారో తెలియదు. పదో పేజీలో అత్యంత కృతమైన ఒక ఫోటో వేసారు...''బాధితుల చేరవేతకు బాబు చొరవ" అన్న శీర్షికతో. విశాఖ విమానాశ్రయంలో ఆయన ఫొటోకు నమస్కరిస్తున్న బాధితులు అన్న పచ్చి అబద్ధపు కాప్షన్ రాశారు. నిజానికి ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఒకరే ఆ ఫొటోకు నమస్కరిస్తున్నారు. హైదరాబాద్ మినీ లో లోకేష్ బాబు ఫోటో కూడా వేసుకున్నారు. 

బుధవారం నాడు... 'ఆంధ్రజ్యోతి' ఒకడుగు ముందుకేసింది. 'దేవుడిలా వచ్చిన బాబు' అన్న శీర్షికతో వచ్చిన వార్తలో... 'తండ్రీ కొడుకులకు జీవితాంతం రుణపడి ఉంటాం.." అన్న డెక్కు కూడా పెట్టి ఒక ఫోటో వేసారు. అదే స్టోరీలో ఇంకొక బాక్స్ కొట్టి... "వాళ్ళు రాక్షసులు... ఈయన దేవుడు" అన్న శీర్షికతో మరొక సారి దడ దడలాడించారు. ఇక హైదరాబాద్ మినీ లో "చంద్రన్నకు జేజేలు" అని ఒక బ్యానర్ స్టోరీ రాసి..."ఆదరించిన మనసుకు అభినందనం" అని పత్రిక తెలియజేసింది. ఇక సెంటర్ స్ప్రెడ్ లో "చంద్రన్నా... నీ మేలు మరువలేమన్నా.." అన్న శీర్షిక పెట్టారు. ఆ శీర్షికకు పసుపు పచ్చ రంగు వేసారు. రెండు పేపర్లకు మొదలు నుంచి చివరి దాకా... పసుపు రంగు పులిమితే పోలా..... అని మా అబ్రకదబ్ర అంటుంటే షటప్...మనిషివా... గొడ్డువా.... శవాల దగ్గర నువ్వూ రాజకీయాలు చేస్తావా? అని ఆయన భార్య కసురుకుంది.   

23 comments:

Unknown said...

జగన్ను అన్యాయంగా కేసులో ఇరికించి జైల్లో వేశారని పేజీలు పేజీలు నింపేసే సాక్షి గురించి మనమేం మట్లాడొద్దు రాము గారు, చంద్రబాబు చేసే మంచి పనికి ప్రాధాన్యమిస్తే మాత్రం ఆ మీడియాని వుతికి ఆరేయండి - మీ నిష్పాక్షికతకు ఇవే తెలుగు ప్రజల నీరాజనాలు సార్ - మంచి చూడొద్దు, మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు అనే సూత్రం మీదే నిలబడండి

Unknown said...

మీ వార్త బావుంది. తెలుగు మీడియా ఎప్పుడో వాస్తవికతను కోల్పొయి,వ్యక్తులనో,పార్టీలనో భుజాన వేసుకొని ఊరేగింపు చేస్తుందని ఇంకోసారి గుర్తుచేసారు.అన్ని పత్రికలూ అంతే...అన్ని చానెల్స్ ఇంకా ముందుకెళ్ళి సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తిగత విషయాలపై విలువైన సమయాన్ని వృదాచేసి కుత్సితం ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్రసార సాధనాలు భజన సాధనాలుగా మారటం దురదృష్టకరం....నేను ఏ పత్రికనూ నిందించను..అంతా అంతే,అందరూ అందరే..ఇప్పటికే యాజమాన్యాల ధోరణికి మడుగులొత్తె మిత్రులు...బయట ప్రపంచాన్ని తమ కళ్ళతో చూడలేక మేనేజిమెంట్ కళ్ళతో చూసివాస్తవాన్ని గుర్తెరగలేక...జీవిస్తున్నారు. ఇదే పత్రికా స్వేచ్చ ముసుగు

NavaCHAITANYA Competitions said...

Hai Sir,
this is Chaitanya Kumar From Chintalapudi

s. correct sir, mana media antha alaane tagaladindhi. manchi chanel ani cheppukundaamante okkati koodaa prajala pakshaana niliche chanel lekundaa poyindi. ee madya RK News chanel lo oka breaking news choosaanu. adhi Positive HomeoClinik sambandhinchina Breaking News. appati nunchi naakoka confusion start ayindi. Breaking news ante appatikappudu jarigina taajaa samaachaaramaa leka 5 days nunchi ade samaachaaraanni breaking news perutho veyadamaa ani. yendhukante aa chanel lo nenu varusagaa adhe Same news Breaking news perutho Raavadam gamanichaanu. ademanta nisithamgaa pariseelisthene teliselaa kaadhu. just rojulo okasaari ye time lo ayinaa aa chanel choosthe tappakundaa aa news kanipinchelaa 5 days nunchi vesthunnaaru. mari yendhukoo. monnati varakoo alaage Sri medhaa gurinchi news prasaaram chesaaru. ee roju 10tv lo choosaanu. yevaro TDP MLA, Congres MP okarinokaru Delhi lo thosukunnaarata. telugu vaari paruvu poyindhantoo aa chanel ee vishayaani dadaapu rendu moodu gantalu prasaaram chesindi. naaku ardham kaaledhu. kottukunna vaalla valla paruvu poyindhaa leka maa vaallu vedhavalu ani vekiligaa navvuthu prachaaram chesthunna media valla paruvu poyindhaa naaku ardham kaavatledu. asalu ee chanels yendhuku start avthunnaayo teliyadam ledu. naaku anpisthondi. okasaari yeedhaina chinna vispotanam jarigi Dooradarsan minahaa migilina chanels anni naasanam ayipoyi marosaari aa paatha rojulu vasthe baagundu anipisthondi.

Vasthaayantaaraa aa paatha rojulu

Unknown said...

Delhi lo mana vallani evaru patichukokapoiyna evaru mataladaledhu.... kani Chandrababau Delhi velthe adagolu comments rasthunnaru ...

rams said...

prajala sommu pandi kollula masi jail lo ki velli na JAGAN ki suport ga oka artical rasaru meru GORAM JARIGIPOINDI nai (jagan jail 100 day roju)ane memmalani black media lo kalipeyamantara ? sakshi la.......cbn help chesthunnadu kanuka news paper lo vesaru okka eenadu abn kadu tv9,tv5,ntv,okka sakshi tv thappa ante anni channels lo chupincharu cbn help chesthunnaru cbn ve na....? waradallo unna mana telugu prajalaki help cheyadam rajakeyam ani meru anukunte adi me mayakthawani ki parakasta....ysr chavuni addam pettu koni simpathy tho rajakeyam chesthunna jagan di sevala rajakeyam kada..? cong govern ment ki chetha kaledu cbn chesi chupisthunnadu adi thappa...?manri ga unna me chiranjeevi ami pikuthunnadu kodi guddu meda ekala..? cbn place lo chiru kani jagan kani unte e patiki meru jana netha thokka thota kura ani boladu anni artical rasevaru.....meru oppukunna leka poina CBN is great leader....meku sayam cheyadam chetha kadu sayam chevalla meda burada jallatam maneyandi.....meku dhammu unte e coment ne display lo pettandi...

rams said...

prajala sommu pandi kollula masi jail lo ki velli na JAGAN ki suport ga oka artical rasaru meru GORAM JARIGIPOINDI nai (jagan jail 100 day roju)ane memmalani black media lo kalipeyamantara ? sakshi la.......cbn help chesthunnadu kanuka news paper lo vesaru okka eenadu abn kadu tv9,tv5,ntv,okka sakshi tv thappa ante anni channels lo chupincharu cbn help chesthunnaru cbn ve na....? waradallo unna mana telugu prajalaki help cheyadam rajakeyam ani meru anukunte adi me mayakthawani ki parakasta....ysr chavuni addam pettu koni simpathy tho rajakeyam chesthunna jagan di sevala rajakeyam kada..? cong govern ment ki chetha kaledu cbn chesi chupisthunnadu adi thappa...?manri ga unna me chiranjeevi ami pikuthunnadu kodi guddu meda ekala..? cbn place lo chiru kani jagan kani unte e patiki meru jana netha thokka thota kura ani boladu anni artical rasevaru.....meru oppukunna leka poina CBN is great leader....meku sayam cheyadam chetha kadu sayam chevalla meda burada jallatam maneyandi.....meku dhammu unte e coment ne approved cheyandi

uttam said...

సాక్షిని కరపత్రం అనుకోవటంలో తప్పు లేదు. అలాగని ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ప్రజల పక్షం వహిస్తయను కొవతమూ తప్పే. సాక్షి నేరుగా వైస్ బోమ్మ తో ధైర్యంగా వస్తుంది. కాని మీము ఎవరిపక్షం వహించము కేవలం జనం కోసమే ఉన్నాము, మా అంత నీతి, నిజాయీతి పరులు లేరు, మేము రాసిందే వార్త అన్నట్లుందే ఈనాడు, ఆంధ్రజ్యోతి లు బాబుకు బాకా గా మారటాని ఏమనాలి. ధైర్యంగా ఆ రెండు పత్రికలూ చంద్రబాబు ఫోటో వేసుకొని వార్తలు రాస్తే వాటిని ఎవరు ఏమి అనరు. యువర్ రైట్ రాము గారు.

G.P.V.Prasad said...

Journalism అర్ధం మారుస్తున్న మీకు ఇదే నా అభినందనలు, మీ సాక్షీ వ్రాసే అబద్దాలు కన్నా కొంతవరకూ ప్రజలకు ఉపయొగ పడే వార్తలు వ్రాస్తున్నా ఈనాడు ను అభినందిచడం మానేసారు, ఇక బాబుగారి పక్షాణ ఈనాడు ఉందోలేదో తెలియదు కానీ మీరు వ్రాస్తున్న పసుపు పచ్చ ప్రతులు చదివి నమ్మలేమో

Arjun said...

Ramu Gaaru, Meeru paikemo chala honest ga edho society ni udharinchetaltu matladtharu..but ABN kaani Eenadu kaani emina artical publish cheyatam alasyam, Rechipotharu mee biased analysis tho..

Chudapothe meekedho personal Grudge unnatlundhi specially RK medha..

Ramu S said...

అయ్యలారా, అమ్మలారా.....
మీరు సాక్షిని, ఈనాడు-ఆంధ్ర జ్యోతి ని సరిగా అర్థం చేసుకోవాలి. సాక్షి ఒక వ్యక్తి కర పత్రం...బహిరంగంగానే. అందులో వాళ్లకు మొహమాటం లేదు. కానీ ఆ రెండు పత్రికలూ జర్నలిజం ముసుగులో తెలుగు దేశం భజన చేస్తున్నాయన్న విమర్శ ఉంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఈ యజమానులు వారి సామాజిక వర్గానికి చెందిన నేత ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఏ జర్నలిస్టును అడిగినా చెబుతారు. అందుకే నా మీద విమర్శలు మాని... నిజా నిజాలు గ్రహించండి. చంద్రబాబు, తెలుగు దేశం తీట తప్ప మిగిలిన విషయాలలో ఈ రెండు పత్రికల జర్నలిజం పొగడ దగినదే. వరద బాధితులను కలిసి సాయం చేసిన వాడిని పొగడడం లో తప్పు లేదు కానీ ఆయన్ను దేవుడు...ఆయన లేకపోతే కొంపలు కొల్లేరు అయ్యేవి అని అబద్ధాలు ప్రచారం చేస్తే మీ లాంటి రీడర్స్ అంగీకరిస్తే నేనేమీ చేయలేను.

రాము

ganesh said...

prajala sommu pandi kokkulla masi jail lo ki velli na JAGAN ki suport ga oka artical rasaru meru GORAM JARIGIPOINDI nai (jagan jail 100 day roju) ante memmalani black media lo kalipeyamantara ? sakshi la.......cbn help chesthunnadu kanuka news paper lo vesaru okka eenadu abn kadu tv9,tv5,ntv,okka sakshi tv thappa ante anni channels lo chupincharu cbn help chesthunnaru ante anni tv chanels cbn ve na....? waradallo unna mana telugu prajalaki help cheyadam rajakeyam ani meru anukunte adi me amayakthawani ki parakasta....ysr chavuni addam pettu koni simpathy tho rajakeyam chesthunna jagan di sevala rajakeyam kada..? aa jagan ki suport chesthunna mevi sevala rajakeyam kada..? cong govern ment ki chetha kaledu cbn chesi chupisthunnadu adi thappa...? mantri ga unna me chiranjeevi ami pikuthunnadu kodi guddu meda ekala..? cbn place lo chiru kani jagan kani unte e patiki meru jana netha thokka thota kura ani boladu anni artical rasevaru.....meru oppukunna leka poina CBN is great leader....meku sayam cheyadam chetha kadu sayam chevalla meda burada jallatam maneyandi...cbn ni devudu annaru ante thappu ante.. ?akkada unna prajalu narakanni chusi wacharu(chavuthappi wacharu) naraka numdi kapadina manisini devudu nate thappu anti?.....meku dhammu unte e coment ne approved cheyandi

Unknown said...

surprised some readers dont know that Eenadu and andhra jyothi doesnt support Babu and his coterie. We're fortunate to be hearing from such innocent ppl.

vinod said...

Sakshit & their JaPans enthala edusthunnaro, meeru anthala edusthunnarantam lo sandehamledu ...

Me blog chadavagane naku kuda okati anipinchindi Edupu ante idenemo ani...

Akkada migatha state vallani fast ga move chesthunnaru ani vachhe janale chebuthunnaru.... ina meeku valla matalu vinapadavu..
endukante meeku Gajji oka range lo antukundi.. (Gajji ane likingee kaadu, oka team emi lekunda dweshinchadanni kuda gajje antaru...)


Ivvala Sakshi lo MPs godavadukunnaru adi idi ani original story ni pakkana petti vadiki ela kavalo ala anvainchukunnadu....

Ee blog post ki aa article ki pedda teda kanapdatalla

JE said...

dear ram what you post is right..no other opinion..

Kareem said...

100 కోట్లమంది భారతీయులు చుస్తున్డంగా డెహ్రాడూన్ లో ఆంధ్రప్రదేశ్ పరువు తీసింది చాలదన్నట్టు, national media కి ఎక్కి మరి సిగ్గు తీస్తున్నారు
http://www.timesnow.tv/Debate-This-is-the-limit---1/videoshow/4430689.cms

Unknown said...

నిజాన్ని నిర్భయంగా చెప్పేది జర్నలిజం.... ప్రజల పేరు చెప్పి భాక ఉదడం జర్నలిజం అనిపించుకోదు..... ఈనాడు... ఆంధ్రజ్యోతి మీ అసలు రంగు ఎప్పుడో తెలిసిపోయింది..... మీరు ఎంత చెప్పిన ప్రజలు నమ్మే స్తితిలో లేరు...

ఇక బాబుల సంగతే చెప్పనక్కరలేదు... ప్రచారం ఎక్కువ పని తక్కువ.... వీళ్ళకి పోయే కాలం వచిందని తెలిసే అమెరిక కు వెళ్లి అన్ని సర్దుకొని వచ్చారు.......

Thirmal Reddy said...

Sir jee,

I'm sure you would've received more flak than what I see on this post as well as the one on ABN-Andhrajyothi. What I'm surprised is that you've been left nearly untouched by the Yellow Gang. Or is it that you've received much flak offline and not on your posts. Anyway, could resist appreciating both your posts. It was indeed a shameless attempt by the Yellow Press to idolize a mere mortal, that too building the personality on a natural catastrophe.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

Ramu S said...

తిరుమల్ గారూ...
చాలా రోజుల తర్వాత రాసారు. నాకు వచ్చిన కామెంట్స్ అన్నీ పెడుతున్నాను. ఈ పోస్టులకు సంబంధించి ఒక్క కామెంట్ కూడా కిల్ చేయలేదు. 'దమ్ముంటే ఈ కామెంట్ పెట్టు' అని కొందరు అనవసరంగా ఆ మాట రాస్తూ నా మీద విమర్శలు చేస్తున్నా... వాటిని ఓకే చేస్తున్నాను. మన పోస్టు చదివి, కోపంగానైనా వారి అభిమతాన్ని, అభిప్రాయాన్ని తెలియజేయాలనుకునే వారిని గౌరవించడం సభ్యత అని నా అభిప్రాయం. ఇంతకూ ఎప్పుడు కలుద్దాం?
చీర్స్
డాక్టర్. రాము

web-forex said...

Sakshi oka nirakhara kukshi. That is not news paper, that is a leaflet. That is useful only for packing provisional. It is real. Once go and see scrap shop. There will be only Sakshi Paper Bundles.

ganesh said...

Krishna Reddy..garu awariki poyekalam wachi jail loki vellaro andariki theylusu....cbn usa anduku vellado meku theyliyada...? theyliyaka pothey theylusukondi....meru suport chesthunna jailu pakshi JAGAN simpathy tho unnadu aa simpathy thaggindi..simpathy thaggina ventane jagan & co guddalu udadesi kotte roju wasthadi kaskondi....cbn is great leader..cbn gelipisthey avinethi numdi kapadukowachu leda meru jagan kalisi mana prajala sommunu malli pandi kokkulla thintaru.....any dout

Unknown said...


...టీడీపీ ని విమర్శించాలని కాకపోతే ..సమయానికి బాబు ఆదుకున్నాడు ..అందుకు సంతోషించాలి ..ఎవరు పెట్టుకున్న సంస్థలు వాళ్లే కే సపోర్టు చేస్తాయి..అది మామూలేకదా..కాంగ్రేసోళ్లు పదవులకోసం తన్నుకుంటుటే బాబే కదా సమయానికి ఆదుకున్నది..ఆయనను చూసే ప్రభుత్వం స్పందించింది..లేక పోతే పట్టించుకొనే నాదుడే వుండే వాడుకాదు..సో ..విమర్శలు సరిగా వుంటే బాగుంటుంది..

Pavan Kumar Reddy said...

Sakshi ki dammu vundi anduke direct ga YS Photo pettaru jagan ki support istunnaru...Chetta EENADU Andhrajyothi ki dammu siggu eggu lanti vi levu ..... nijam chepteee eee Ramu gari meeda kukkalla morugutunnaru .... meeru enthaga digajarutharu ..Andithe juttu lekpothe kallu pattukuna rakalu

Kishor said...

పాపం బాబు.. కెరీర్ అనే దిగుడుబావిలో దిక్కులేకుండా పడి ఉన్నాడు. ఏ చిన్న తాడు దొరికినా పైకి పట్టుకు పాకాలని ఆయన తాపత్రయం. దొరికిన చిన్న తాడుముక్కని బలంగా పేనుతుంటే ... అది కాస్తా మధ్యలో కోసేస్తానంటారేంటి? మానవత్వంతో ఆలోచించండి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి