నలభై ఏళ్ళు దాటాక... క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకొని చేతి చమురు వదిలించుకోవాలన్న సూత్రం ప్రచారంలో ఉన్న కాలమిది. మొన్న జనవరి ఫస్టున నాకు 43 నిండాయి. నూరేళ్ళు నిండడానికి ఇంకా 57 ఏళ్ళు ఉన్నాయి. ఐటీ లో ఉన్న చాలా మంది క్రమం తప్పకుండా చెకప్ లు చేయిస్తూ, ఆసుపత్రులను పోషిస్తూ... రిపోర్టులను బట్టి వాకింగ్ పెంచడం, తిండి తగ్గించడం చేస్తున్నారు. ఈ క్రమంలో మెడికల్ చెకప్ అవకాశం వస్తే.. వదులుకోవడం ఇష్టం లేక నిన్న రాత్రి నుంచే సిద్ధమై పచ్చి నీళ్ళైనా తాగకుండా పద్ధతిగా ఒక ప్రముఖ ఆసుపత్రిలో హాజరయ్యాను ఉదయం తొమ్మిది గంటలకల్లా.
నవ్వులు పంచే ఒక అమ్మాయి...నా సొంత కూతురిలా దగ్గరుండి పరీక్షలు చేసే ఆయా గదులకు తీసుకు వెళ్ళింది. రక్తం బాగానే తీసారు వివిధ పరీక్షల కోసం. బ్లాడర్ నిండాక చేసే ఒక టెస్టు నిమిత్తం ఒక లీటరు నీళ్ళ బాటిల్ కూడా ఇచ్చిందామె. రక్తపరీక్షలు అయ్యాక... నీళ్ళు తాగమన్నారు. కొద్దిసేపు ఆగాక ఒక అమ్మాయి వచ్చి బ్లాడర్ నిండిందా? అని అడిగింది. నిండక పోయి ఉంటుందా... అని తలూపాను. ఒక టెక్నీషియన్ మంచం మీద పడుకోమని బొడ్డు కింద ఒక పరికరం పెట్టి... నిండలేదని తేల్చి.. కాసేపు కూర్చోబెట్టి పావు గంట తర్వాత ఒక డాక్టర్ ను పిలిచి అనుకున్న పరీక్ష చేయించింది. 'పొట్టలో నొప్పా?' అని డాక్టరు గారు మధ్యలో అడిగారు... చేస్తున్న పరీక్ష ఆపి. నేను రోగినని అయన అనుకున్నట్లున్నారు. లేదని... ఒళ్ళు బలిసి చేయించుకుంటున్న పరీక్ష ఇదని సౌమ్యమైన పదాలతో చెప్పి బైటపడ్డాను.
తర్వాత ఉండేది ట్రెడ్ మిల్ పరీక్ష కాబట్టి... బ్రేక్ ఫాస్ట్ చేస్తారా? అని అడిగారు. పొద్దటి నుంచి... ఆ అమ్మాయి ఇచ్చిన మంచి నీళ్ళు తప్ప పొట్టలో ఏమీ లేవు కాబట్టి.. తింటానని చెప్పాను. మూడు ఇడ్లీలు, చెట్నీ, చారు లాంటి సాంబారు ఒక ప్లేటులో పెట్టి ఒక రూంలో ఇచ్చి కూర్చుని తినమన్నారు. తిన్నాను. టీ అడుగుదామంటే... ఆ అమ్మాయి కనిపించలేదు. వాళ్ళంతా హాస్పిటల్ మానేజ్మెంట్ చేసిన పిల్లలు. రెండో అమ్మాయి బొఖారొ లో ఒక కోర్సు చేసి ఇక్కడ ఉంటుందని, కో ఆర్డినేటర్ పేరుతో తనలా 30 మంది ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని, అందరూ ఆ పక్కనే ఉండే హాస్టల్ లో ఉండి ఉద్యోగం చేస్తామని... నేను బుద్ధి కొద్దీ చేసిన చిన్నపాటి ఇంటర్వ్యూ లో చెప్పింది.
ఇక ట్రెడ్ మిల్ కు ముందు... "మీకు ఛాతి మీద జుట్టు ఉందా?" అని సొగసైన ఇంగ్లీషులో ఒక అమ్మాయి వచ్చి అడిగింది. పెద్దగా లేదని చెబితే... ఏమీ అనుకోకపోతే తాను చూడవచ్చా? అని అడిగింది. దాన్దేముందని... తాను తీసుకెళ్ళిన ఒక రూం లోకి వెళ్లి చూపించాను. కుదరదు....రిమూవ్ చేయాల్సిందేనని చెబితే... కాదని ఎలా అంటాం? ఇంతలోనే... ఒక క్షురకుడు ప్రత్యక్షమై వేరే గదిలోకి తీసుకెళ్ళి కార్యక్రమం పూర్తి చేసారు. వద్దని... మొహమాటానికి ఆయన అంటున్నా.... నేనొక వంద చేతిలో పెట్టాను.... రెండు యాభై ల చిల్లర మా ఇద్దరి దగ్గరా లేక. పుట్టి బుద్ధి ఎరిగాక... ఎప్పుడూ గొరిగించుకోని ప్లేసు, కలగని అనుభూతి ఇది.
ఇక ట్రెడ్ మిల్ మీద నా నడక సాగింది. టెక్నీషియన్ ఒక ముస్లిం సోదరుడు, కొత్తగా ఆ సెక్షన్ లో చేరిన (ఛాతి మీద జుట్టు సైజు చూసిన) ఒక సోదరి... ఆ కార్యక్రమం నిర్వహించారు. చక్కగా మాట్లాడే ఆ సోదరుడు...ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనిపించింది. ఆమె నేర్చుకోవడానికి మన గుండె వేదికన్న మాట. ఇంత ముఖ్యమైన టెస్టు దగ్గర ఒక డాక్టర్ ఉంటే బాగని అనుకున్నాను. మొత్తానికి టెస్టు పూర్తయ్యింది. అంతా బాగున్నట్లు ఆ టెక్నీషియన్ చెప్పారు. అదే తడవుగా... నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అనీ, కాలేజ్ రోజుల్లో చచిన్దాకా ఆడే వాడినని, ఒంటి పట్ల బాల్యం నుంచే చాలా శ్రద్ధ ఉన్న వాడిననీ, నా లాంటి వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ముందే తెలుసనీ వాగాను. పనిలో పనిగా...అంతా ఓకే అని భార్యకు ఒక ఎస్ ఎం ఎస్ కూడా పంపాను... చిలిపి వాక్యంతో.
రిపోర్ట్ కోసం బైట కూర్చొని అక్కడిబాధాసర్పద్రస్టులను జాలిగా చూస్తూ కూర్చున్నాను. ఎంత కాదన్నా ఆసుపత్రి ఒక నరకం. అ టెక్నీషియన్ అటు వెళ్ళగానే... ఆ రిపోర్ట్ పట్టుకుని ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. టెస్టు పాజిటివ్ గా వచ్చిందని, ఆ టెక్నీషియన్ అబ్సర్వేషన్ కు, దాన్ని చూసిన డాక్టర్ అబ్సర్వేషన్ కు మధ్య తేడా ఉందని ఆమె చెప్పింది. అంటే... వామ్మో... నా గుండెలో ఏదో తేడా ఉందన్న మాట. అప్పుడు ఒక క్షణం పాటు నాకు కాళ్ళ కింది భూమి కదలాడింది. బుర్ర తిరగాడింది. కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్.
ఈ క్షణాన మెడ తిప్పి చూడగానే... ఆక్సిజన్ మాస్క్ తో ఒక టెస్టు కోసం వచ్చిన ఒక పెద్దాయన కనిపించారు. బంధువుల్లో ఒకటే విషాదం. ఇక లాభం లేదని... ఒక కుర్చీలో కూలబడ్డాను. గుండెలో తేడా ఉన్న విషయం అందరికీ ఎలా చెప్పాలా? అని ప్లాన్ చేసుకుంటున్నాను. అప్పుడు నా ముందు... రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అంతా బాగున్నట్లు నటించి ధైర్యంగా చచ్చే దాకా బతకడం. రెండు, టెస్టులు చేయించుకుని, చమురు వదిలించుకుని గుండె ను కాపాడుకోవడం. సరే... ఏది అయితే అది అవుతుందని అనుకుని... ముందు కొన్ని మందులు ఇప్పించే ఏర్పాటు చేయండని, కన్సల్టేషన్ ఫీజు ఇస్తానని ఆ మహిళకు చెప్పాను... తడారుతున్న గొంతుతో... మాటలు తడబడుతుండగా. ఈ లోపు ఎన్నో ఆలోచనలు.
జీవితంలో అనుకున్నవి అన్నీ సాధించాం పొల్లు పోకుండా. దేవుడి దయవల్ల మంచి మనుషుల మధ్య బతుకుతున్నాం. వ్యవస్థ సక్రమంగానే ఉంది. పిల్లోడు ఇండియా నంబర్ 3 అయ్యాడు. వాడు ఒలింపిక్స్ ఆడడానికి వెడుతుంటే... 'డూ వెల్ బాబా.. అల్ ద బెస్ట్' అని గర్వంగా చెప్పడం ఒక్కటే పెద్ద ఆశ. అమ్మాయి కాలేజ్ లో ఉంది. బతుకు లెస్సన్స్ దాదాపు నేర్పాను. తానీ మధ్యన రాసిన పోయెమ్ లో హోప్ మీద రాసిన ఒక వాక్యం గుర్తుకు వచ్చింది. "So terrific thing this hope is."
ప్రస్తుతం వచ్చిన రిపోర్టు లెక్కన మనం ఒక రాత్రి ఉన్నట్టుండి బాల్చీ తన్నేస్తాం. నో ప్రాబ్లం. పోయాక... ఈ పైన పోస్టు చేసిన ఫోటో ఎన్లార్జ్ చేసి ఫ్లెక్సీ గా పెట్టి మా శంకర్, సోమనాథ్ నా మెమోరియల్ టీ టీ టోర్నమెంట్ ఒకటి పెడతారు...లాంటి వెర్రి మొర్రి ఆలోచనలు బుర్రలో గిర్రు గిర్రున తిరుగుతుండగానే... ఆ ముస్లిం టెక్నీషియన్ దేవుడిలా అటు పోతూ కనిపించాడు.
రిపోర్ట్ లో విషయానికి, డాక్టర్ అభిప్రాయానికి ఉన్న అంతరం చెబితే తనూ అవాక్కు అయ్యాడు. "సబ్ ఠీక్ హై.." అని ఆ రిపోర్ట్ పట్టుకుని డాక్టర్ ను కలిసాడు. రిపోర్ట్ మార్చమని డాక్టర్ తనను ఆదేశిస్తే... తను అంతటితో ఊరుకుని అలా మార్చకుండా... నిపుణుడైన మరొక డాక్టర్ కోసం వేచి చూసి... చూపించాడు. ఆ తర్వాత చెప్పాడు... తన నిర్ణయాన్నే నిపుణుడైన డాక్టర్ సమర్ధించాడని.
"ఈ ఆలోచన బుర్రలో పెట్టుకోకండి... మీకు ఏమీ లేదు..." అని హిందీలో ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. హమ్మయ్య.. అనుకుని...బతికి బాగుంటే ఖైరతాబాద్ చౌరస్తాలో ఇరానీ చాయ్ తాగొచ్చు అనికుని ఆసుపత్రి నుంచి వేగంగా బైట పడి... ఇక మీద ఎవ్వడు చెప్పినా ఈ మెడికల్ టెస్టులకు పోకూడదని మనసులో అనికుని ఇంటికి చేరి ఒంటరిగా 'లైఫ్ సెలెబ్రేషన్' ఆరంభించా. అందులో భాగంగా ఈ పోస్టు రాసా.

8 comments:
ఈ టపా రాసారు కాబట్టి బతికే ఉన్నట్టు లెక్ఖ !
టపా చదివి మీకు కామెంటు కొట్టాము కాబట్టి మేమూ బతికే ఉన్నట్టు లెక్ఖ !
టపా లో కామెంటు కనడితే దాన్ని చూస్తే అప్పటి దాకా ఉన్నట్టు లేక్కః !
జిలేబి
బాబోయ్, మీ వెనకే మేమున్నాం.. అందులోనూ దిక్కుమాలిన మెడికల్ కండిషన్లు ఉన్న దేశం లో ఉన్నాం! మీరు కంగారు పడి మమ్మల్ని హడల గొట్టకండి రాము గారూ!
ఇది మీ లేటెస్ట్ ఫొటో అయితే..మీరు బాగా తగ్గి పోయారు సుమండీ!
మెడికల్ టెస్టులకు పోతే ఏదో ఒక వార్త వినక తప్పదు. పాపం వాళ్ళూ బతకాలి కదా!
డయాబెటిస్ వచ్చాక , (ఎలాగూ అటేపో ఇటేపో ఫామిలీ హిస్టరిలో ఉండక పోతుందా? లేదంటే ఆ చరిత్ర మనతోనే మొదలెడితే పోలా....) అప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చులే అనుకుంటూ అలా ముందుకు పోతూ ఉంటే సరిపోతుందనుకుంటా!!
ఎందుకంటే ఏదొచ్చినా, ఫేస్ చేయడం తప్ప చేసి చచ్చేదేమీ లేదు గనుక!
ఏమంటారు?
ఆమధ్య పనిలేక బ్లాగులో డాక్టర్ గారు వ్రాసినట్లుగా
మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా కాలం వస్తే చెప్పాపెట్టకుండా బాల్చీతన్నేస్తాం ఎలాగూ! ఈలోపల సాధారణంగా శరీరంలో వచ్చే మార్పులను చూసి కంగారుపడి మరికొంత అనారోగ్యం కొనితెచ్చుకోవటం వైద్యవ్యాపారుల ఆదాయం పెంచే వనరులుగా మారకుందుముగాక .
చంపేశారు ఉత్కంఠభరితమైన శైలీ విన్యాసంతో... Thank God. All is well.
-sreedhar babu pasunuru
నేను పనిచేసిన సంస్ద్ధలో కూడా "ఎక్జిక్యుటివ్ హెల్త్ చెకప్" సదుపాయం ఉన్నది. దీంట్లో మా సీనియర్ ఒకాయనది భయంకరమైన అనుభవం. ఆయన ఈ చెకప్ చేయించుకోవటానికి హాస్పిటల్ కి వెళ్ళాడు. టెస్ట్లు అయిన తర్వాత వాళ్ళు ఆయనతో - మీ ఆరోగ్యం చాలా ప్రమాదకర పరిస్ధితిలో ఉంది, మీరు ఇప్పుడు హాస్పిటల్ వదిలి బయటకు వెళ్ళటం కూడా ప్రమాదమే, వెంటనే అడ్మిట్ అయిపోవాలి - అన్నారట. ఆయన అప్పటికి సరే అని, ఒక అరగంటలో అవకాశం చిక్కగానే హాస్పిటల్ వాళ్ళకి చెప్పకుండా అక్కడ నుంచి దాదాపు పారిపోయినట్లుగా తన ఇంటికి వెళ్ళిపోయాడట. మర్నాడు మా ఆఫీస్ లో చెప్తుంటే తెలిసింది. ఆ తర్వాత ఆయన తన ఫామిలీ డాక్టర్ తో చెకప్ చేయించుకున్నాడు, చాలా కాలమే బతికాడు. అందువల్ల, అయ్యా, అదీ సంగతి.
కాకపోతే సుజాత గారు చెప్పినట్లు "పాపం వాళ్ళూ బతకాలి కదా!"
రామూ గారూ. టెస్టుల వలయంలో చిక్కుకున్నట్టె చిక్కుకుని బయటపడినందుకు హృదయపూర్వక అభినందనలు.
2012 సెప్టెంబరులో నాకూ ఇలాంటి అనుభవమే. ఆఫీసులో లంచి టైముకు బాగా జ్వరం అనీజీగా ఉండి ఇంటికి బయలుదేరి, కారిడార్లో లిఫ్ట్ కోసం నుంచోలేక కింద కూచుండిపొయ్యాను. అది చూసి మా కొలీగ్స్ నన్ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు లాక్కుపొయ్యారు. ఆరోజు మూడు హాస్పిటల్సులో (ఒకటి మా ఆఫీసు దగ్గర్లో నా సహచరులు నా పరిస్థితి చూసి తీసుకు వెళ్ళినది, రెండోది నేను సామాన్యంగా చిన్న చిన్న రొంపలకు వాటికి వెళ్ళే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే కంటే వైద్యుల షాపు అనటం మంచిది) డాక్టర్లు ఇ సి జి తీసి అందులో ఇద్దరు నన్ను వెంటనే హాస్పటల్లో చేరిపొమ్మని, నా గుండె కు ఏదో అయిపోయిందని చెప్పారు. అందులో ఒకడైతే నా కొలీగ్ ను ఆవతలి తీసుకెళ్ళి (నేను చూస్తుండగానే అతన్ని పక్కకు పిలిచి!) నా గుండె 40 శాతం పాడయిందని చెప్పాడుట. నేను శుభ్రంగా రెండంతుస్తులు మెట్లు ఎక్కి ఏమీ ఆయాసపడకుండా నీ దగ్గరకు వచ్చానయ్యా స్వామీ నా గుండెకు ఏమన్నా అవటం ఏమిటి సరిగ్గా చెప్పు అని గద్దించినా ఆ ఆక్టర్ ముఖంలో నా మీద జాలి భంగిమను చెరగనివ్వలేదు. వెధవది ఆస్కార్లు వాళ్ళకు వీళ్ళకు ఇస్తారు కాని, ఇలాంటి వాళ్ళు ఆ పోటీలోకి వస్తే హాలీవుడ్ కాదు ఏ వుడ్ ఐనా బలాదూరే. నాకు తెలియకుండా నా గుండెకు ఏమవుతుంది అన్న మొండితనంతో ఆఫీసు నుంచి ఇంటికి 30 కిలోమీటర్లు, టాక్సీ తీసుకుని, మా ఇంటి దగ్గర్లో ఉన్న హీరానందాని హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ను సంప్రదిస్తే ముఖ్యంగా మూడోసారి నాకు ఇ సి జి ఇంకా అలాంటివి ఏవేవో తీసి ఒక సి డి కూడా నా చేతిలో పెట్టి, గుండె దిటవుగానే ఉన్నది (దిటవు గుండెలు అనేకసార్లు చదివిన వాడిని కదా!), కాకపోతే మీకు బాగా పడిశం పట్టింది అని మరొక స్పెషలిస్టు వేరో ప్లోర్ లో ఉన్నవాడికి రిపర్ చేశాడు. అక్కడ మళ్ళి ఫీజులు, లైను, వగైరా వగైరా. గుండె బాగానే ఉన్నదన్న ఆనందంతో నాకు వాళ్ళు తొడిగిన ఫీజుల మొత్తం బాధ అనిపించలేదు, ఆపైన అంత ఫీజు తీసుకున్నాము కదా అని వాళ్ళు వ్రాసిన వందల రూపాయల ఖరీదు చేసే (ఒక్కో మాత్రా 20 రూపాయల పైన) యాంటీ బయాటిక్స్ ట వాళ్ళ మెడికల్ షాపులోనే కొన్నా కూడా నెప్పి పెట్ట లేదు. చివరకు అది మామూలు పడిశం అని దాని వల్ల చెస్ట్ పైన్ జ్వరం వచ్చాయని తేలిచి చెప్పి పుణ్యం కట్టుకున్నారు. ఈ భాగోతం పుణ్యమా అని రెండ్రోజులు శెలవు పెట్టి ఇంట్లో కూచుని నాకు కావలిసిన ఈ పబ్ పుస్తకాలు అనేకం డౌన్లోడ్ చేసుకున్నాను.
అసలు రోగం కంటె రోగం ఉందేమో అనే విషయం మనకు ఎక్కువ కంగారు, భయం, బాధ కలిగిస్తుంది. ఈ విషయంలో నాకు తెలిసి ఈ హాస్పిటల్ మానేజిమెంట్ వాళ్ళకు, ఆపైన ఈ టెస్టులు వగైరా చేసే డాక్టర్లకు వాళ్ళ చదువులో భాగం గా సైకాలజీ పాఠాలు కూడా చెప్తారు. అంటె, తమ టెస్ట్ రిజల్ట్స్ రోగికి వారి బంధువులకు ఎలా, ఎప్పుడు చెప్పాలి, అలా చెబుతూ వాళ్ళను భయభ్రాంతులను చెయ్యకుండా ఎలా ఉంచాలి అన్న విషయం ఉంటుంది.
కాని, డబ్బు మీద వ్యామోహంతో నన్ను ఇ సి జి గీతలు మొదటి రెండంగుళాలు చూసి వెంటనే బెడ్ ఎక్కమన్న డాక్టర్లను నేను ఎప్పటికీ క్షమించలేను, శపించటం మానను. వాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళ చేతుల్లో పడి నశింతురు గాక!
మీ సమయం వెచ్చించి పోస్టు చదివి... రాసినందుకు కృతఙ్ఞతలు. మీ అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు.
రాము
హాస్పిటళ్ళ ప్రస్తావన సందర్భంగా ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకొకటి గుర్తొస్తోంది.
ఓ పెద్దమనిషి కన్సల్టేషన్ కోసం హాస్పిటల్ కి వెడతాడు. అక్కడ కొద్ది సేపయిన తర్వాత విసురుగా లేచి నిలబడి వెళ్ళిపోబోతుంటే పక్కవాళ్ళు ఏమయిందని అడుగుతారు. దానికి ఆ పెద్దమనిషి, ఇంతకంటే ఇంటి దగ్గర సహజమైన చావు చస్తాను అంటాడు.
(గుర్తున్నదాన్ని బట్టి వ్రాసాను. ఈ జోక్ చదివి చాలా సంవత్సరాలయింది.)
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి