హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ లో ఒక లాండ్ మార్క్ గా నిలిచిన 'ఈనాడు' పత్రిక ఆఫీసు విజయ దశమి నాటికి దాదాపు ఖాళీ అయ్యింది. కొందరు రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది తప్ప జర్నలిస్టులు అంతా యాజమాన్యం నిర్ణయానికి అనుగుణంగా ఫిలిం సిటీ కి తరలివెళ్ళారు. ఈ రోజు నుంచి జర్నలిస్టులు, ఇతర సిబ్బంది... కనీసం మూడు గంటలు రాకపోకలకే చెల్లించాల్సి వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ లోకి, అక్కడి నుంచి సిటీ కి యాజమాన్యం ఏర్పాటు చేసే బస్సు టైమింగ్ కు అనుగుణంగా...జర్నలిస్టులు, ఇతర సిబ్బంది తమ జీవన గమనాన్ని, విధానాన్ని మార్చుకోవాలి.
"యాజమాన్యం నిర్ణయం మా ప్రాణం మీదికి వచ్చింది. ఇన్నాళ్ళూ 'ఈనాడు' అంటే పర్మినెంట్ జాబ్ అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు... ఒక అవకాశం వస్తే ఎప్పుడు బైట పడదామా? అనిపిస్తోంది," అని దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఒక జర్నలిస్టు చెప్పారు. జర్నలిస్టులలో నిరాశ, నిస్పృహ పెరగడానికి కారణాలు ఇలా ఉన్నాయి.
1) విధి నిర్వహణ కోసం అదనపు ప్రయాణం చేయాల్సిరావడం, దానివల్ల అదనపు గంటలు వెచ్చించాల్సి రావడం
2) వేతన సంఘం సిఫార్సు లకు అనుగుణంగా అంటూ... జీతాలు పెంచినా....సీనియర్లకు పావలా, నలభై పైసలు మాత్రమే పెరగడం. (2005 తర్వాత జాయిన్ అయిన వారికి మాత్రమే ఓకే ఐదు వేల దాకా పెరిగాయి)
3) దసరా పండక్కు బోనస్ ఇస్తూనే... పెట్టిన ఒక ఫిటింగ్. 'ఒక వేళ పాత బకాయిలు గానీ, భవిష్యత్ బకాయిలు గానీ చెల్లించాల్సివస్తే... ఈ బోనస్ ను అందులోంచి మినహాయిస్తా'మని యాజమాన్యం లిఖితపూర్వకంగా తెలియజేయడం
4) ఆదుకుంటుందని అనుకున్న తెలంగాణా రాష్ట్ర కార్మిక శాఖ అనుమాన పడిన ప్రకారం... మౌనం పాటించడం
5) ఉద్యోగ అభద్రత మున్నెన్నడూ లేనంతగా పెరగడం
6) వేజ్ బోర్డ్ పెంచిన భారానికి విరుగుడుగా... పర్మినెంట్ ఉజ్జోగాలకు మంగళం పాడుతూ...అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తారన్న ప్రచారం
7) తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వానికి, 'ఈనాడు' కు మధ్య ఒక అవగాహన కుదిరిందన్న ప్రచారం.
'ఈనాడు' ను ఉన్నపళంగా ఫిలిం సిటీ కి ఎందుకు మార్చారు? ఖైరతాబాద్ నుంచి ఇప్పుడు ఖాళీ చేస్తున్న ఆఫీసును రిలయన్స్ కు బదలాయిస్తున్నారా? అన్నవి తేలాల్సి ఉంది.

3 comments:
Salaries time ki isthu,ippudunna media houses kanna better ga unna eenadu meeda meeku enduku antha kopam?Ekkado Manikonda lo unna IT offices ki janalu vellatleda.Chala mandi transportation provide cheyyaru.I agree its a pain.But it is part of job.
శశి గారు ఎక్కడో అమెరికాలో ఉన్న మీరు ఈనాడు గురించి అలా ఆలొచించడంలో తప్పు లేదు... కాని ఇక్కడ జరుగుతున్నది ఏ మీడియాలోనూ రాకుండా మేనేజ్ చేస్తున్న ఈనాడు యాజమాన్యం దారుణాలు అన్నీ ఇన్నీ కావు
ముంబై నారిమన్ పాయింట్ నుంచి పూణె, వాషికి ఎన్నో కార్యాలయాలు తరలి పొయ్యాయి, ఎందుకట? ఖర్చులు తగ్గించుకుని, సంస్థని నడుపుకోవడనికి. ఇవేమి చెయ్యకుండా తమలాంటివారి కోసం ఆర్భాటాలకి పొయ్యి, నష్టాలు మూటగట్టుకుంటే, చక్కగా మూసెయ్యొచ్చు, అందరు రోడ్డు మీదపడతారు. ఈనాడు మూతపడింది అని మీరు హ్యాపీస్. చక్కగా ప్రభుత్వమే ఈనాడుని నడపాలి అని ధర్నాలు చేస్తూ కార్మిక సంఘాలోల్లు, రాజకీయనాయకులు, మీరుకూడ ఎంచెక్కా బోల్డు పబ్లిసిటీ తెచ్చుకోవచ్చు. గుడ్. సహ విలేఖరికి మింగ మెతుకు లేకపొతే మనకేమిలే. మనకి పబ్లిసిటి ముఖ్యం. పేపర్లో మన పొటో పడిందా, టి.విలో వచ్చామా లేదా? ఏది ఆ గ్లిజరిన్ పట్రా..
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి